నిజమైన సంస్కరణ 
15/02/2025
ప్రొటెస్టంట్ క్రీడ్స్ మరియు ఒప్పుకోలు 
21/02/2025
నిజమైన సంస్కరణ 
15/02/2025
ప్రొటెస్టంట్ క్రీడ్స్ మరియు ఒప్పుకోలు 
21/02/2025

సంస్కరణ ఇప్పటికీ ఎందుకంత ప్రాముఖ్యం 

  1. 2016 అక్టోబర్ 31న,  పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ..  ఐదు వందల సంవత్సరాల తరువాత  ప్రొటెస్టంట్లు మరియు కాథలిక్కులు “ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తరచుగా నిరోధించిన వివాదాలు మరియు విభేదాలను దాటి మన చరిత్రలో ఒక క్లిష్టమైన క్షణాన్ని సరిచేయడానికి ఇప్పుడు ఒక అవకాశం ఏర్పడింది” అని ప్రకటించారు. ఇంకను సంస్కరణ అనేది చిన్న విషయాలపై దురదృష్టకరమైన మరియు అనవసరమైన గొడవలా అనిపిస్తుంది, మనమిప్పుడు పెద్దవారయ్యాము గనుక ఇట్టి పిల్లతనంతో కూడిన అల్లరిని ప్రక్కన పెట్టవలసిన వారమై ఉన్నాము. విశ్వాసం వలననే నీతిమంతుడుగా తీర్చబడుటను గూర్చి  తన పునః పరిశీలనలో కనుగొని గొప్ప స్వేఛ్చ ఆనందాన్ని అనుభవిస్తూ “నేను పూర్తిగా తిరిగి జన్మించి తెరవబడిన ద్వారాల గుండా పరదైసులో ప్రవేశించాను” అని వ్రాసిన మార్టిన్ లూథర్ కి చెప్పండి, ఇది గొప్ప ఉల్లాసముతో కూడిన  సంతోషకరమైన వార్తగా వుండి నేను  యెగిరి గంతులు వేసి సంతోషముతో నాట్యమాడేందుకు ప్రేరేపించిందని చెప్పిన  విలియం టిండేలుకు చెప్పండి, ఇది నాకు “అద్భుతమైన ఓదార్పును, ప్రశాంతతను ఇచ్చింది, గాయపడిన నా ఎముకలు ఆనందంతో ఊగిపోయాయి” అని తెలియచేసిన థామస్ బిల్నీకి చెప్పండి,  వాస్తవానికి ఆ మొదటి సంస్కర్తలు తాము బాల్య పోరాటాన్ని ఎంచుకుంటున్నామని అనుకోలేదు. వారు దానిని కనుగోనినప్పుడు అది మహా గొప్ప ఆనందముతో కూడిన శుభవార్తగా గుర్తించారు. 

    1517లో శుభవార్త

    పదహారవ శతాబ్దం ప్రారంభంలో, ప్రజలు చదవగలిగిన బైబిల్ ను యూరొపా కలిగి లేకుండా వెయ్యి సంవత్సరాలు వుండెను. అందుచేత థామస్ బిల్నీకి  “పాపులను రక్షించుటకు  క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను” (1 తిమో. (1:15) అనే వాక్యం ఎన్నడు తటస్థించలేదు. వాక్యానికి బదులుగా, ప్రజలు తమ సొంత రక్షణను సంపాదించడానికి దేవుడే వారికి వీలు కల్పిస్తాడనే అవగాహనకు విడిచిపెట్టబడ్డారు. ఆనాటి ఉపాధ్యాయులలో ఒకరు “తమ వంతు కృషి చేయువారి పట్ల దేవుడు కృపను నిరాకరించడు” అని చెప్పాడు. ఇది సంతోషకరమైన వార్తలను ప్రాముఖ్యముగా తీసుకున్న ప్రతి ఒక్కరికి పుల్లని రుచిని మిగిల్చింది. మీరు నిజంగా మీ వంతు కృషి చేశారని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? రక్షణ పొందుటకు నీవు అర్హుడవైన నీతిమంతుడవుగా మారావని ఎలా చెప్పగలవు? 

    మార్టిన్ లూథర్ గట్టి ప్రయత్నం చేసాడు. తాను వ్రాస్తూ.. “ “నేను మంచి సన్యాసిని, నా ఆజ్ఞను ఎంత కఠినంగా పాటించానంటే, ఒక సన్యాసి సన్యాసి క్రమశిక్షణ ద్వారా పరలోకానికి చేరుకోగలిగితే, నేను కూడా పరలోకానికి ప్రవేశించి ఉండేవాడిని” అని ఆయన రాశారు. అతడు ఇంకా పరిశీలిస్తూ:

    నా మనస్సాక్షి నాకు ఖచ్చితత్వాన్ని ఇవ్వడం లేదు. నేనెల్లప్పుడు అనుమానముతోనే నిండి వున్నాను. అది  “నీవు ఆ పని సరిగ్గా చేయలేదు. నీకు తగినంత పశ్చాత్తాపం లేదు. నీవు దానిని నీ ఒప్పుకోలు నుండి వదిలివేశావు” అంటున్నది. నేను అనిశ్చియతను, బలహీనతను, పోరాటముతో కూడిన మనసాక్షిని మానవ సంప్రదాయాలతో పరిష్కరించాలనే ప్రయత్నం చేసేకొలది, అది ప్రతిరోజు నన్ను మరింత అనిశ్చియత, బలహీనత, సమస్యల లోనికి నెట్టివేస్తున్నట్టు అనిపించింది.

    రోమన్ కాథలిక్కుల ప్రకారం, లూథర్ పరలోకమును గురించి అనిశ్చితంగా ఉండటం చాలా సరైనది. పరలోకంలో ఒక చోటు లభిస్తుందనే నమ్మకం తప్పుడు అంచనాగా పరిగణించబడడమే కాక 1431 లో దాని విచారణలో జోన్ ఆఫ్ ఆర్క్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలలో ఇది ఒకటిగా ఎంచబడింది. అక్కడ, న్యాయమూర్తులు ప్రకటిస్తూ, 

    ఇది నిశ్చయముగా పరలోకాన్ని స్వతంత్రించు కొనినట్లు, ఇప్పటికే మహిమలో పాలి భాగాస్తురాలైనట్లుగా చెప్పుట వలనను పాపము చేసేదిగా వున్నది. ఒక వ్యక్తి మహిమకు అర్హుడో లేక శిక్షకు అర్హుడో అనేది సార్వభౌమ న్యాయమూర్తి నిశ్చయించే వరకు ఈ భూమి మీద యాత్రికులలో ఏ ఒక్కరికి తెలియదు.

    ఆ తీర్పు వితర్క పద్ధతిలో ఒక పూర్తి అర్ధాన్ని సమకూర్చింది: కేవలం అర్హమైన (దేవుడు కృప ద్వారా సాధ్యపరిచే) కార్యాల ద్వారా మాత్రమే మనం పరలోకమునకు చేరకలిగితే ఏ ఒక్కరికి కూడా నిర్ధారణ అనేది వుండదు. ఈ తర్కాన్ని బట్టి, నా స్వంత పాపరహితతపై నాకు ఎంత నమ్మకం ఉంటుందో పరలోకముపై కూడా అంతే నమ్మకం వుంటుంది. 

    యవ్వనస్తుడైన మార్టిన్ లూథర్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఉరుములతో కూడిన మెరుపుల తాకిడికి గురైనంత పనైనప్పుడు భయంతో కేకలు వేసిన సంఘటన ఇలాటిదే. ఆ సమయములో క్రీస్తు కృప ద్వారా కలిగే సంపూర్ణ రక్షణను గూర్చిన జ్ఞానం, విశ్వాసము ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడుదుననే గ్రహింపు, పరలోకమును గూర్చిన నిరీక్షణ వంటివి లేకపోవుట అతనిని మరణ భయానికి గురి చేసాయి. 

    అందుకే విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడుటను గూర్చి లేఖనాలలో పునః పరిశీలన చేసినప్పుడు, తెరువబడిన ద్వారాల గుండా పరలోకములో ప్రవేశించిన అనుభూతి చెందాడు. అంటే తనకున్న భయము దిగులును తొలగించుకొని ఇప్పుడు ఇలా వ్రాయగలిగాడు: 

    సాతాను మన పాపాలను మనపైకి విసిరి, మనం మరణానికి నరకానికి అర్హులమని నిర్దారించినప్పుడు, మనం ఇలా పలకాలి: “నేను మరణానికి, నరకానికి అర్హుడనని అంగీకరిస్తున్నాను. అయితే ఏంటి? దీని అర్థం నాకు శాశ్వత శిక్ష విధించబడుతుందా? అస్సలు కానేకాదు. నా తరపున బాధలు అనుభవించి, నా పక్షమున ప్రాయశ్చత్తం జరిగించిన వ్యక్తిని నేను ఎరుగుదును. ఆయన పేరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన ఎక్కడ ఉంటాడో, నేను కూడా అక్కడే ఉంటాను.”

    అందుచేతనే సంస్కరణలు ప్రజలకు ప్రసంగాలు మరియు బైబిలు పఠనం పట్ల సంతృప్తిని కలిగించాయి. ఎందుకంటే, దేవుని మాటలను చదవడం మరియు దేవుడు పాపులను రక్షించే సువార్తను అందులో చూడటం, వారు ఎంత పశ్చాత్తాపం పడ్డారనే దానిని ఆధారం చేసుకొనక అది సంపూర్తిగా ఆయన కృపపై ఆధారపడి వున్నదనే విషయం, అపరాధ మతపరమైన చీకటి లోకంపై  ప్రకాశించే మధ్యదార సూర్యోదయం వాలె వున్నది. 

    2017లో శుభవార్త 

    సంస్కరణ అంతర్దృష్టుల నాణ్యత లేదా ఖచ్చితత్వం ఏదీయు గత ఐదు వందల సంవత్సరాలలో ఎక్కడ క్షీణించలేదు. ఇప్పటికీ మానవ నిస్సహాయత మరియు ఆనందం మధ్య విభేదాలను కలిగించే కీలక ప్రశ్నలకు ఇంకను అవే సమాధానాలుగా వున్నాయి.  నేను మరణించినప్పుడు నాకేం జరుగుతుంది? అది నాకెలా అర్ధమవుతుంది? నీతిమంతునిగా చేయబడుట (సంస్కర్తలు వాదించినట్లుగా) నీతిపరమైన బహుమానానికి సంభందించినదా లేదా అది మరింత పవిత్రంగా (రోమ్ నొక్కిచెప్పినట్లుగా) మారే ప్రక్రియ లాంటిదా? నేను కేవలం నా రక్షణ కోసం క్రీస్తుపై మాత్రమే నమ్మకం ఉంచవలెనా? లేదా నా రక్షణ కేవలం పవిత్రతను సాధించడంలో నా స్వంత ప్రయత్నాలు మరియు విజయంపై ఆధారపడి ఉందా?

    సంస్కరణ అనునది మనం దాటి వచ్చిన చరిత్రలో ఆ నాడు తలెత్తిన సమస్స్యలకు ఒక చిన్న పరిష్కారం మాత్రమేనని మనుష్యులను కలవరపరిచే ఆలోచనగా వున్నది. అయితే దానిని తీక్షణంగా చూసినప్పుడు, దానిలో కనిపించే మరింత స్పష్టత ఏమిటంటే, సంస్కరణ అనేది ప్రధానంగా రోమ్ మరియు దాని అవినీతి నుండి దూరంగా వెళ్లడం గూర్చిన ప్రతికూల ఉద్యమం కాదు; ఇది సువార్త వైపునకు నడిపించే  సానుకూలమైన  ఉద్యమముగా వున్నది. అదే ఈనాటి సంస్కరణ యొక్క ప్రామాణికతను ఖచ్చితంగా కాపాడేదిగా వున్నది. సంస్కరణ అనేది కేవలం ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక సంఘటన అని తలంచు కొనినట్లయితే అది ఎప్పుడో ముగించబడింది అనుకుంటారు. కానీ సువార్త వైపునకు దగ్గరగా వెళ్ళే కార్యక్రమంగా వున్నట్లైతే, అది ముగించదు.

    మరో అభ్యంతరం ఏమిటంటే, నేటి సానుకూల ఆలోచన మరియు ఆత్మగౌరవం యొక్క సంస్కృతి పాపి నీతిమంతుడుగా తీర్చబదాలనే ముఖ్య అవసరతను పూర్తిగా తుడిచి వేసింది. ఈ రోజుల్లో దేవుని కృప కొరకు స్వెట్టర్లు ధరించి గడ్డకట్టే చలిలో రాత్రంతా ప్రార్థన జాగరణలను చేసేవారు బహు అరదుగా వున్నారు. మొత్తంమీద, పరలోక న్యాయాధిపతి ఎదుట అపరాధ భావనతో  హింసించబడ్డ లూథర్ సమస్య పదహారవ శతాబ్దపు సమస్యగా కొట్టివేయబడింది, అందువల్ల విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతునిగా తీర్చబదుటను గూర్చిన సమస్య యొక్క అతని పరిష్కారం నేడు మనకకు అనవసరమైనదిగా కొట్టిపారేస్తున్నారు.  

    కానీ వాస్తవానికి ఈ సందర్భంలోనే లూథర్ యొక్క పరిష్కారం అటువంటి సంతోషకరమైన మరియు సంబంధిత వార్తగా నిలుస్తుంది. ఎందుకంటే, అది దేవుని ముందు మనం ఎప్పుడైనా దోషిగా ఉండవచ్చనే ఆలోచనను తొలగించి, ఆయన ద్వారా నీతిమంతునిగా తీర్చబదుట అవసరమై ఉన్నందున, మన సంస్కృతి పాత అపరాధ సమస్యకు సూక్ష్మమైన మార్గాల్లో లొంగిపోయెలా చేసింది. ఇక దీని విషయమై సమాధానం అవసరం లేదు. మనల్ని మనం మరింత ఆకర్షణీయంగా మార్చుకున్నప్పుడు మనం మరింత ప్రేమించబడతాము అనే సందేశంతో నేడు హడలెత్తించ బడుతున్నాము.  ఇది దేవునికి సంబంధించినది కాకపోవచ్చు, అయినప్పటికీ ఇది ఇప్పటికీ మత సంబధమైన కార్యాలుగా వున్నది. మరియు లోతుగా పాతుకుపోయిందిగా వున్నది. దీని విషయమై  సంస్కరణ అత్యంత ప్రకాశవంతమైన శుభవార్తను అందించేదిగా వున్నది. లూథర్ మాటలు,  మన ఊహకు అందనటువంటి అద్భుతమైన మేఘాందకారాన్ని చేధించే సూర్యకాంతి వలె  వున్నాయి:

    దేవుని ప్రేమ దానికి ఇష్టానుసారమైనదాన్ని కనిపెట్టదు కానీ సృష్టిస్తుంది … దేవుని ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకునేదిగా ఉండక, మేలులను అందించే ఒక ప్రవాహముగా వున్నది. కాబట్టి పాపులు, వారు ఆకర్షణీయంగా ఉన్నందున ప్రేమించబడలేదు గాని, వారు ప్రేమించబడుట చేత ఆకర్షించ బడ్డారు.   

    మరోసారి కోతకు సమయమొచ్చింది 

    ఐదు వందల సంవత్సరాల తరువాత కూడా రోమన్ కాథలిక్ సంఘము ఇంకా సంస్కరించబడలేదు. చాలా మంది ప్రొటెస్టంట్లు మరియు రోమన్ కాథలిక్కులు ఉపయోగించే అన్ని వెచ్చని క్రైస్తవ భాషలకును, రోమ్ ఇప్పటికీ విశ్వాసం వలననే నీతిమంతునిగా తీర్చబడుటను తిరస్కరించేదిగా వున్నది. పోప్స్, కౌన్సిల్స్ మరియు సిద్ధాంతం కట్టుబడి ఉండాల్సిన అత్యున్నత అధికారంగా లేఖనాలు పరిగణించబడనందున అది అలా చేయవచ్చని తలంచుచున్నది. లేఖనాలు అంతగా బహిష్కరించబడినందున, బైబిలును గూర్చిన జ్ఞానం పెంపొందించుకోవడం ప్రోత్సహించబడలేదు. అందుచేత లక్షలాది పేద రోమన్ కాథలిక్కులు ఇప్పటికీ దేవుని వాక్య వెలుగునకు దూరంగా ఉంచబడ్డారు.

    రోమన్ కాథలిక్కుల వెలుపల, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుట అనే ఈ సిద్ధాంతం అల్పమైనదిగాను, తప్పు భావనగాను, గందరగోళానికి గురయ్యేదిగా నివారించబడినది. ఆపోస్టులడైన పౌలు చెప్పిన సమర్థనను గూర్చి కొన్ని కొత్త దృక్పధాలు ప్రజలను గందరగోళానికి గురిచేశాయి, ముక్యంగా వ్యక్తిగతమైన మార్పు యొక్క అవసరత గూర్చిన ఆలోచన నుండి తొలగిపోయినప్పుడు – ఆలా ఏ వ్యాసాన్ని లూథర్ వదలకూడదు లేదా రాజీపడకూడదు అన్నాడో దానిని  వదిలేశాయి లేదా రాజీపడ్డాయి.

    నీతిమంతునిగా తీర్చబడుటను గురించి లేదా దానిని ప్రకటించే లేఖనాల అత్యున్నత అధికారం గురించి సిగ్గుపడాల్సిన సమయం ఇది కాదు. విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతునిగా తీర్చబడుటను అనేది చరిత్ర పుస్తకాల స్మారక గుర్తు కాదు; ఇది అంతిమ విముక్తి యొక్క ఏకైక సందేశంగా, మానవులను ప్రకాశవంతం చేయడానికి మరియు అభివృద్ధి చెందించడానికి లోతైన శక్తితో కూడిన సందేశంగా నేటికీ మిగిలిపోయింది. ఇది మన పరిశుద్ధ దేవుని ఎదుట భరోసా ఇస్తుంది మరియు దేవుణ్ణి కొనుగోలు చేయడానికి ప్రయత్నించే పాపులను ఆయనను ప్రేమించే మరియు భయపడే సాధువులుగా మారుస్తుంది.

    ఓహ్, ఈ శుభవార్తను వ్యాప్తి చేయడానికి ఈ రోజు మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి! ఐదు వందల సంవత్సరాల క్రితం, గుటెన్బర్గ్ కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ వంటి వాటి ద్వారా మునుపెన్నడూ చూడని రీతిగా సువార్త వెలుగు బహు వేగంగా వ్యాప్తి చెందేదిగా వున్నది. టిండేల్ యొక్క బైబిళ్లు మరియు లూథర్ యొక్క కరపత్రాలు వేల సంఖ్యలో బయటకు వెళ్ళగలిగాయి. ఈ రోజు డిజిటల్ టెక్నాలజీ మనకు మరో గుటెన్బర్గ్ వలె అందుబాటులో వున్నది. ఇప్పుడు అదే సందేశాన్ని మనం లూథర్ ఊహించలేని వేగంతో వ్యాప్తి చేయవచ్చు.

    అవసరాలు మరియు అవకాశాలు ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నంత కంటే ఇప్పుడు మరి ఎక్కువగా వున్నాయి. ఇవి అత్యంత అవసరమైనవి. కాబట్టి సంస్కర్తల విశ్వాస్యత నుండి మనం ధైర్యాన్ని తెచ్చుకొని, ఆ అద్భుతమైన సువార్తనే ఉన్నతంగా ఉంచుదాం, ఎందుకంటే అందులో మన చీకటిని పారద్రోలే శక్తి మహిమలు ఇంకను నిలిచే వున్నవి.

  2. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
డాక్టర్ మైఖేల్ రీవ్స్
డాక్టర్ మైఖేల్ రీవ్స్
డాక్టర్ మైఖిల్ రీవ్స్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనియన్ స్కూల్ ఆఫ్ థియాలజీలో వేదాంతశాస్త్ర అధ్యక్షుడు మరియు ప్రొఫెసర్. ఆయన యూరోపియన్ థియోలాజియన్స్ నెట్‌వర్క్ డైరెక్టర్ కూడా. ఆయన డిలైటింగ్ ఇన్ ది ట్రినిటీతో సహా అనేక పుస్తకాల రచయిత. ఆయన లిగోనియర్ బోధనా సిరీస్ రిఫార్మేషన్ ట్రూత్స్‌కు ఫీచర్డ్ టీచర్.