మా విశ్వాస ప్రకటన

లిగోనియర్ మినిస్ట్రీస్ విశ్వాసం యొక్క పురాతన విశ్వాస ప్రామాణికలకు (అపోస్తలుల విశ్వాస ప్రామాణిక, నైసెన్ విశ్వాస ప్రామాణిక మరియు చాల్సెడాన్ యొక్క విశ్వాస ప్రామాణిక) కట్టుబడి ఉంది మరియు సంస్కరణ యొక్క ఐదు సోలాలలో వ్యక్తీకరించబడిన చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసాన్ని మరియు చారిత్రాత్మక సంస్కరణ ఒప్పుకోలులను (వెస్ట్ మినిస్టర్ ప్రమాణాలు, మూడు రూపాల ఐక్యత, మరియు 1689 లండన్ బాప్టిస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్) ధృవీకరిస్తుంది.

బైబిలు

బైబిలు, పూర్తిగా,  న్ఫాలిబుల్, ఇన్నెరెంట్ మరియు ప్రేరేపితమైన దేవుని వాక్యము; ఇది దైవిక ప్రత్యక్షత, దేవుని అధికారం యొక్క పరిపూర్ణతను మోస్తుంది మరియు దానికి మనం లోబడటానికి బధులమై ఉన్నాము.

త్రిత్వము

దేవునీలో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే మూడు మైనప్పటికిని సంపూర్ణ దైవిక వ్యక్తుల ఐక్యత ఉంది; ఈ ముగ్గురూ ఒకటే నిజమైన, నిత్య దేవుడు, పదార్థంలో ఒకటే, శక్తిలో, మహిమలో సమానం.

దేవుడు

దేవుడు ఆత్మయైవున్నాడు, ఆయన అనంతుడు, శాశ్వతుడు, ఆయన ఉనికి, జ్ఞానం, శక్తి, పవిత్రత, న్యాయం, మంచితనం మరియు సత్యంలో మార్పులేనివాడు. దేవుడు పూర్తిగా సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు మరియు సర్వవ్యాపి, అభ్యాసానికి లేదా “బహిరంగతకు” ఇవ్వబడడు.

యేసు ప్రభువు

యేసుక్రీస్తు నిజంగా దేవుడు మరియు నిజంగా మానవుడు, గందరగోళం, మిశ్రమం, వేరుతనం  లేదా విభజన లేకుండా ఒకే దైవిక వ్యక్తిలో రెండు స్వభావాలను విడదీయలేని విధంగా ఐక్యత కలిగి వున్నాడు. ప్రతి స్వభావం తన స్వంత లక్షణాలను నిలుపుకుంటుంది. ఆ దేహధారిలో, యేసు కన్యయైన మరియుకు జన్మించాడు, మన మధ్య పరిపూర్ణ జీవితం జీవించాడు, శిలువ వేయబడ్డాడు, మరణించాడు మరియు సమాధి చేయబడ్డాడు, మూడవ రోజున లేచాడు, పరలోకానికి ఆరోహణమైయ్యాడు మరియు మహిమలో ఇంకా తీర్పుకొరకు తిరిగి వస్తాడు. ఆయనే దేవునికి, మనిషికి మధ్య ఏకైక మధ్యవర్తి.

పరిశుద్ధాత్మ

పరిశుద్ధాత్మ త౦డ్రి కుమారులతో ఒకే పదార్థాని కలిగి ఉంటాడు. ఆయన నిత్యము తండ్రి మరియు కుమారుని నుండి వస్తాడు, మరియు ఆయన విశ్వాసుల హృదయాలలో నివసిస్తాడు, వారి పునరుత్పత్తిని సున్నితంగా ప్రభావితం చేస్తాడు మరియు వారి పవిత్రీకరణలో కలిసి పనిచేస్తాడు.

సృష్టి

దేవుడు తన తన మహత్తుగల మాట ద్వారా, ఆకాశములను, భూమిని మరియు వాటిలో ఉన్న సమస్తమును శూన్యము నుండి సృష్టించాడు. ఆయన తన అత్యంత పవిత్రమైన, వివేకవంతమైన మరియు శక్తివంతమైన ప్రొవిడెన్స్ ప్రకారం తన సృష్టిని మరియు వాటి చర్యలన్నిటిని పరిరక్షిస్తాడు మరియు పరిపాలిస్తాడు.

మనిషి

దేవుడు ఇతర జీవులను సృష్టించిన తరువాత, అతను నరులను తన స్వరూపమందు, స్త్రీనిగాను పురుషునిగాను, సృష్టించాడు, కాని ఆదాము పాపం చేసి తన బాధ్యతలో ఘోరంగా పతనమైపోవడం వల్ల, అతను మరియు అతని వంశస్థులు నైతిక అవినీతి మరియు నైతిక అసమర్థత స్థితిలోకి ప్రవేశించారు మరియు వారి సృష్టికర్త నుండి దూరమయ్యారు, తద్వారా పాపానికి శిక్షగా మరణానికి అర్హత పొందుకున్నారు.

ప్రాయశ్చిత్తం

అందరూ పాపం చేశారు కాబట్టి, మానవుడు దేవునితో సమాధానపడటానికి ప్రాయశ్చిత్తము అవసరము. యేసుక్రీస్తు సిలువపై తన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త మరణము ద్వారా తన ప్రజలకు పూర్తి ప్రాయశ్చిత్తం చేశాడు. పాపానికి పశ్చాత్తాపపడి, రక్షణ కొరకు ఆయనపై మాత్రమే విశ్వాసం ఉంచే వారందరికీ పూర్తి విమోచనను సంపాదిస్తూ ఆయన తన నీతిని విశ్వాసులందరికీ ఆపాదిస్తాడు.

ధర్మశాస్త్రము

నైతికమైన ధర్మశాస్త్రం దేవుని యొక్క మారని స్వభావాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది మరియు ప్రజలందరినీ, విశ్వాసులను మరియు అవిశ్వాసులను ఎల్లప్పుడూ బంధిస్తుంది.

సంఘము

క్రీస్తు ఒక దృశ్యమైన సంఘాన్ని స్థాపించాడు, అది క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, సంస్కారాలను నిర్వహిస్తూ మరియు క్రమశిక్షణను పాటిస్తూ, పరిశుద్ధ లేఖన అధికార నియంత్రణలో పరిశుద్ధాత్మ శక్తిలో జీవించడానికి పిలువబడింది.

క్రైస్తవ్యం మరియు సంస్కృతి

లేఖనము యొక్క అంతిమ అధికారాన్ని మరియు యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వమును అంగీకరించే క్రైస్తవ వ్యవస్థలు మరియు సంస్థల పనికి లిగోనియర్ మద్దతు ఇస్తుంది మరియు మానవుని మరియు అతని పర్యావరణ శ్రేయస్సు కొరకు దేవుని ఆజ్ఞల యొక్క సామాజిక మరియు సాంస్కృతిక అంతరార్థమును అమలుకు కట్టుబడి ఉన్నారు. రక్షించుకోలేని మానవులను వారి అభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో హత్య చేయడాన్ని ఖండించే మరియు లింగం, లైంగికత మరియు వివాహం యొక్క అవాంఛనీయ నిర్వచనాలను తిరస్కరించే సంస్థలకు లిగోనియర్ ప్రత్యేకంగా మద్దతు ఇస్తుంది.

 

క్రీస్తుశాస్త్రంపై లిగోనియర్ స్టేట్మెంట్ కూడా చూడండి.