టీచింగ్ ఫెలోస్
టీచింగ్ ఫెలోలు లిగోనియర్ మినిస్ట్రీస్ కు ప్రత్యేకమైన వారలు, విస్తృత అనుభవం మరియు సహాయక దృక్పథాన్ని తీసుకువస్తారు. వారు మా వ్యవస్థాపక ఉద్దేశ్యానికి కట్టుబడి ఉండటానికి మాకు సహాయపడటం ద్వారా మరియు మా భవిష్యత్తు పరిధిని తెలియజేయడం మరియు వ్యక్తీకరించడం ద్వారా లిగోనియర్కు సేవ చేస్తారు. డాక్టర్ ఆర్.సి. స్ప్రౌల్ మరియు బోర్డు ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిచర్యలో సహాయపడటానికి ఈ వ్యక్తుల బృందాన్ని సమీకరించారు. బైబిలు, వేదాంత విశ్వసనీయత (2 తిమోతి 2:2) కొరకు దేవుని నమ్మి, ఈ ప్రతిభావంతులైన బోధకుల సమూహానికి మేము కృతజ్ఞులము.
సింక్లైర్ బి. ఫెర్గూసన్
డాక్టర్ సింక్లైర్ బి. ఫెర్గూసన్ లిగోనియర్ మినిస్ట్రీస్ టీచింగ్ ఫెలో మరియు రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమేటిక్ థియాలజీ యొక్క ఛాన్సలర్ ప్రొఫెసర్. అతను గతంలో కొలంబియా, ఎస్.సి.లోని మొదటి ప్రెస్బిటేరియన్ చర్చికి సీనియర్ పరిచారికుడిగా పనిచేశాడు మరియు అతను ది హోల్ క్రైస్ట్, ది హోలీ స్పిరిట్, ఇన్ క్రైస్ట్ అలోన్ మరియు దేవోటెడ్ టు గాడ్ తో సహా రెండు డజనుకు పైగా పుస్తకాలను వ్రాశాడు.
డబ్ల్యు. రాబర్ట్ గాడ్ ఫ్రే
డాక్టర్ డబ్ల్యు. రాబర్ట్ గాడ్ ఫ్రే కాలిఫోర్నియాలోని వెస్ట్ మినిస్టర్ సెమినరీలో చర్చి చరిత్ర యొక్క ఫెలో మరియు ప్రెసిడెంట్ ఎమెరిటస్ మరియు ప్రొఫెసర్ ఎమెరిటస్. అతను లిగోనియర్ ఆరు భాగాల బోధనా సిరీస్ ఎ సర్వే ఆఫ్ చర్చ్ హిస్టరీకి ప్రత్యేక ఉపాధ్యాయుడు. ఆయన రాసిన అనేక పుస్తకాలలో గాడ్స్ పాటర్న్ ఫర్ క్రియేషన్, రిఫుర్మేషన్ స్కెచెస్, అనెక్సపెక్టడ్ జర్నీ, లెర్నింగ్ టు లవ్ ద సామ్స్ ఉన్నాయి.
స్టీఫెన్ జె.నికోల్స్
డాక్టర్ స్టీఫెన్ జె. నికోల్స్ రిఫార్మేషన్ బైబిల్ కాలేజ్ అధ్యక్షుడు, లిగోనియర్ మినిస్ట్రీస్ కు చీఫ్ అకడమిక్ ఆఫీసర్ మరియు లిగోనియర్ మినిస్ట్రీస్ టీచింగ్ ఫెలో. 5 మినిట్స్ ఇన్ చర్చ్ హిస్టరీ అండ్ ఓపెన్ బుక్ అనే పాడ్ కాస్ట్ లకు ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అతను ఫర్ అస్ అండ్ అవర్ సాల్వేషన్, జోనాథన్ ఎడ్వర్డ్స్: ఎ గైడెడ్ టూర్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ థాట్, పీస్, ఎ టైమ్ ఫర్ కాన్ఫిడెన్స్ తో సహా అనేక పుస్తకాల రచయిత, మరియు అతను ది లెగసీ ఆఫ్ లూథర్ మరియు క్రాస్ వే యొక్క క్రిస్టియన్ లైఫ్ సిరీస్ కు సహ సంపాదకుడు. @DrSteveNichols ఆయన ట్విట్టర్ లో ఉన్నారు.
బర్క్ పార్సన్స్
డాక్టర్ బర్క్ పార్సన్స్ ఫ్లా.లోని శాన్ఫోర్డ్లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్ యొక్క సీనియర్ పాస్టర్, లిగోనియర్ మినిస్ట్రీస్ చీఫ్ పబ్లిషింగ్ ఆఫీసర్, టేబుల్టాక్ మ్యాగజైన్ ఎడిటర్ మరియు లిగోనియర్ మినిస్ట్రీస్ టీచింగ్ ఫెలో. అతను అమెరికాలోని ప్రెస్బిటేరియన్ చర్చిలో ఆర్డేయిన్డ్ పరిచారకుడు మరియు చర్చ్ ప్లాంటింగ్ ఫెలోషిప్ డైరెక్టర్. అతను వై డూ వి హావ్ క్రీడ్స్?, అస్యూర్డ్ బై గాడ్ మరియు జాన్ కాల్విన్: ఎ హార్ట్ ఫర్ డివోషన్, డాక్ట్రిన్ అండ్ డోక్సాలజీ యొక్క సంపాదకుడు మరియు జాన్ కాల్విన్ రచించిన ఎ లిటిల్ బుక్ ఆన్ ది క్రిస్టియన్ లైఫ్ యొక్క సహ అనువాదకుడు మరియు సహ సంపాదకుడు. @BurkParsons ఆయన ట్విట్టర్ లో ఉన్నారు.
డెరెక్ డబ్ల్యు.హెచ్. థామస్
డాక్టర్ డెరెక్ డబ్ల్యు.హెచ్.థామస్ ఎస్, సి., కొలంబియాలోని మొదటి ప్రెస్బిటేరియన్ చర్చి యొక్క సీనియర్ పరిచారకుడు మరియు రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమేటిక్ అండ్ పాస్టోరల్ థియాలజీక యొక్క ఛాన్సలర్ ప్రొఫెసర్. అతను ఒక లిగోనియర్ మినిస్ట్రీస్ బోధకుడు మరియు అనేక పుస్తకాల రచయిత, వీటిలో హౌ ద గాస్పెల్ బ్రింగ్స్ అస్ అల్ ద వె హోమ్, కెకాల్విన్స్ టీచింగ్ ఆన్ జోబ్, మరియు డాక్టర్ సింక్లైర్ బి. ఫెర్గూసన్ తో, ఇక్తుస్: జీసస్ క్రైస్ట్, గాడ్స్ సన్, ద సేవియర్.