సంస్కరణ ఇప్పటికీ ఎందుకంత ప్రాముఖ్యం 
19/02/2025
సంఘ సంస్కరణ దినం అనగా ఏమిటి?
28/02/2025
సంస్కరణ ఇప్పటికీ ఎందుకంత ప్రాముఖ్యం 
19/02/2025
సంఘ సంస్కరణ దినం అనగా ఏమిటి?
28/02/2025

ప్రొటెస్టంట్ క్రీడ్స్ మరియు ఒప్పుకోలు 

  1. సంస్కరణ అనేది విశ్వాసం యొక్క ఆవశ్యకతలపై పోరాటం. మొదట లూథర్ తో, ఆ తర్వాత ఇతర ప్రొటెస్టంట్ సంప్రదాయాలతో, సంస్కర్తలు రోమన్ కాథలిక్ బోధనలు మరియు పేపల్ మెజిస్టీరియంకు వ్యతిరేకంగా బైబిల్ విశ్వాసాన్ని పెట్టారు. బైబిలును సిద్ధాంతానికి ప్రత్యేకమైన ఆధారముగా చూపిస్తూ, ప్రొటెస్టెంట్లు బైబిలు బోధనపై తమ అవగాహనను వ్యక్తపరచవలసి వచ్చింది. ఈ అర్థ౦లో, బైబిలుపట్ల ప్రొటెస్టంట్ నిబద్ధతకు ఈ సంస్కరణ ఒప్పుకోలు సహజంగా పుష్పించినది.ఒప్పుకోలుల(confessions) అవసరాన్ని ప్రొటెస్టెంట్లు తయారుచేయలేదు. శతాబ్దాలుగా, సంఘము  ఎల్లప్పుడూ గందరగోళం లేదా సంక్షోభం మధ్య విశ్వాసాన్ని అంగీకరించింది. ఒక క్రీడ్ లేదా ఒప్పుకోలు యొక్క పాత్ర లేఖనాన్ని భర్తీ చేయడం కాదు, దానికి బదులుగా తప్పుకు వ్యతిరేకంగా లేఖనంలోని సత్యానికి సంఘము యొక్క సాక్ష్యాన్ని క్రోడీకరించడం.

    ఈ ప్రేరణకు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణలు మూడవ మరియు ఐదవ శతాబ్దాల మధ్య వ్రాయబడిన నైసీన్ మరియు చాల్సెడోనియన్ క్రీడ్స్ వంటి చారిత్రాత్మక క్రీడ్స్. తరువాతి ప్రొటెస్టంట్ ఒప్పుకోలుగా అదే క్రీడ్స్ వలన ఉద్భవించాయి—అనగా, సిద్ధాంతపరమైన విషయాల్లో సంఘము ఏది ప్రాధమికమైనదిగా భావిస్తుందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

    అయితే ప్రొటెస్టంట్ ఒప్పుకోలులలో భిన్నమైన విషయం ఏమిటంటే, మూల-శాఖ సంస్కరణ కోసం సంస్కరణ కర్తల కోరిక. సంస్కరణ యొక్క సమస్యలు కేవలం ఒక సిద్ధాంతం లేదా ఒక సిద్ధాంతాల సమూహంపై వివాదాలు మాత్రమే కాదు, సంఘాన్ని పూర్తిగా సంస్కరించాల్సిన ఆవశ్యకతపై ఆధారపడి ఉన్నాయి. త్రిత్వం వంటి కొన్ని సిద్ధాంతాలు వాఖ్యానుసారంగా  నిలుపుకోబడ్డాయి, మరికొన్ని, విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థించడం వంటివి జాగ్రత్తగా వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది. తమ సంప్రదాయాలలో సంఘాల్ల కోసం, ప్రొటెస్టంట్ నాయకులు విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం లేదా పేపల్ మెజిస్టీరియంను తిరస్కరించడం వంటి సిద్ధాంతాలను ఆమోదించడం వెనుక ఉన్న ఆలోచనను రోజువారీ భాషలో రాయడానికి ప్రయత్నించారు.

    కాబట్టి, ప్రొటెస్టంట్ ఒప్పుకోలు కూడా ప్రారంభ క్రీడ్స్ మాదిరిగానే ఉంటాయి, కానీ వాటి ఆలోచన లోతుగా, మరింత వివరంగా ఉంటుంది. ఒక క్రీడ్ వలె, అవి లేఖనాన్ని భర్తీ చేయవు, లేదా అవి లేఖనానికి సమానంగా పెట్టబడవు. దానికి బదులుగా, అవి ప్రొటెస్టెంట్లు లేఖన౦లో కనుగొన్న దానిని వివరించడమే.

    లూథరన్ ఒప్పుకోలు ప్రొటెస్టంట్ నమ్మే దానిలో ఈ ధోరణికి మొదటి ఉదాహరణ లూథర్ యొక్క ప్రారంభ సంస్కరణ సమయంలో కనుగొనబడింది. 1517 నుండి 1519 వరకు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అనే దానికోసం పోరాడిన లూథర్ డైట్ ఆఫ్ వార్మ్స్ (1521) లో చట్టవిరుద్ధుడుగా మరియు మతవిద్రోహిగా ప్రకటించబడ్డాడు, లూథర్ వెంటనే తన సందేశం యొక్క ప్రాథమికాంశాలను ఒప్పుకోలు పత్రాలలో రాయడానికి పనిచేశాడు. వాటిలో రెండు చర్చ్ కోసం, ఒకటి లూథర్ సందేశాన్ని బహిరంగంగా సమర్థించడం కోసం రాశాడు.

    మొదటి రెండు సందర్భాల్లో, అనగా లూథర్ 1529లో పెద్ద మరియు చిన్న క్యాటకిజం వ్రాశాడు, మొదటిది పెద్దవారిని శిష్యులుగా చేయుటకు, మతాధికారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు రెండవది పిల్లలు లేదా కొత్తగా మార్పుచెందిన వారికి శిక్షణ ఇవ్వడానికి రాసాడు. ఒప్పుకోలుల యొక్క అవసరాన్ని సమర్థించడానికి అదే సంవత్సరం అతను కన్ఫెషన్ కు ఒక ఉపదేశం కూడా వ్రాశాడు. సంఘము కేవలం లేఖన౦ మీద మాత్రమే ఆధారపడి ఉన్నప్పటికీ, బహిరంగమైన ఒప్పుకోలు అవసర౦ అని లూథర్ వాది౦చాడు. ఈ ప్రారంభ క్యాటకిజం కూడా ఒప్పుకోవడం యొక్క లక్షణాలలో ఒకదాన్ని సూచిస్తాయి: అవి సంఘ జీవితానికి అవసరమైనవి మరియు శిష్యత్వానికి సాధనాలు.

    మూడవ ఒప్పుకోలు లూథర్ మరియు ఫిలిప్ మెలాంక్తాన్ రచించిన ప్రసిద్ధ ఆగ్స్బర్గ్ కన్ఫెషన్ (1530), సంఘము కోసం కార్పొరేట్ కన్ఫెషన్ (బహిరంగ ఒప్పుకోలు) స్ఫూర్తితో కాదు, కానీ దానిని చక్రవర్తి ఐదవ చార్ల్స్ మరియు ఐరోపా రాకుమారుల ముందు ఉంచడానికి జరిగింది. ఇది లూథరన్ సందేశానికి సమర్ధిందిచేదిగా అనగా  కొన్నిసార్లు దాని స్వరంలో లేదా కనీసం దాని పర్యవసానాలలో ప్రతిఘటించేదిగా ఉంటుంది. జర్మన్ కాథలిక్కులు తమపై మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా లూథరన్లు వాస్తవంగా ఏమి నమ్మారో ఇది స్పష్టం చేస్తుంది.

    అప్పుడు లూథరన్ క్యాటకిజం, ఒప్పుకోలు మరియు సంస్కరణ యుగంలో ఒప్పుకోలు ఉపయోగించిన మార్గాల యొక్క సూక్ష్మరూపాన్ని ఏర్పరుస్తాయి: ఒకటి సంఘ జీవితానికి, మరొకటి ప్రొటెస్టంట్ సంప్రదాయవాదం గురించి తప్పుడు వాదనలకు వ్యతిరేకంగా బహిరంగ వివాదానికి; ఇంకొకటి సంఘంలో విశ్వసించే ప్రతి విశ్వాసికి, రెండవది దాని నాయకులు తాము సనాతన బోధగా భావించే వాటిని స్పష్టం చేయడానికి ఉపయోగించారు.

    సంస్కరించబడిన(రిఫార్మ్డ్) ఒప్పుకోలు విస్తరిస్తుంది

    సంస్కరణ సంప్రదాయం ఒప్పుకోలు విషయంలో సమానంగా కట్టుబడి ఉంది. 1520 మరియు 1650 మధ్య కాలంలో వ్రాయబడిన సుమారు నలభై నుండి యాభై సంస్కరణ (లేదా సంస్కరణ-ప్రభావిత) అంగీకారపత్రాలు ఉన్నాయి- ఇది ఏ ప్రొటెస్టంట్ సంప్రదాయంలోనైనా అత్యధికం. 1523లో, సంస్కరణ సంప్రదాయం ప్రారంభమైన వెంటనే, జ్యూరిచ్‌లో ప్రమాదంలో ఉన్న అంశాల ఉచ్చారణను అందించడానికి హల్డ్రిచ్ జ్వింగ్లీ అరవై ఏడు వ్యాసాలను తీసుకొచ్చారు. దీని తరువాత పది థీసెస్ ఆఫ్ బెర్న్ (1528), ఫస్ట్ కన్ఫెషన్ ఆఫ్ బాసెల్ (1534) మరియు నగరాలు సంస్కరణ దృక్పథాన్ని అవలంబించడం ప్రారంభించాయి. ఫ్రెంచ్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ (1559) మరియు స్కాట్స్ కన్ఫెషన్ (1560)లతో ఇతరులు ఇతర దేశాలలో అనుసరించారు.

    అనేక సంస్కరణాత్మక ఒప్పుకోలు రావడానికి కారణం వాటి సందర్భం ఫలితమే. సంస్కరించబడిన విశ్వాసం ఎల్లప్పుడూ సహోదరుల బృందంచే నడిపించబడింది (జాన్ కాల్విన్ మాత్రమే సంస్కరించబడిన సంప్రదాయవాదాన్ని సృష్టించాడనే ఆధునిక అభిప్రాయం ఉన్నప్పటికీ). కానీ సంస్కరణ సంప్రదాయం దాదాపు ఒకేసారి అనేక నగరాలు మరియు దేశాలలో పుట్టింది. 1520 నుండి, నగరం వెంబడి నగరం సంస్కరణను స్వీకరించాయి, మరియు కొన్ని సంస్కరణలు జెనీవాకు రాకముందే ఉన్నాయి. అందువలన, సంస్కరించబడిన ఒప్పుకోలు యొక్క ప్రాధమిక పత్రాలను రూపొందించడానికి లూథర్ వలె ఏక స్వరం లేదు.

    తత్ఫలితంగా, సంఘము తరువాత సంఘము, సమాజం తరువాత సమాజం వారి శక్తిలో గణనీయమైన భాగాన్ని వారి స్థానిక సంఘాల కోసం ఒక అంగీకారాన్ని క్రోడీకరించడానికి వెచ్చించాయి. అందుకే చాలా సంస్కరించబడిన కన్ఫెషన్లు వారి మూల నగరంతో గుర్తించబడతాయి: ఇది ఈ నగరానికి, ఈ సంఘానికి, అన్ని సంస్కరించబడిన సంఘాలకు ఒకటిగా స్వీకరించడానికి ఒప్పుకోలు కాదు.

    అయినప్పటికీ, చరిత్రకారులు మరియు వేదాంతవేత్తలు ఎత్తి చూపినట్లుగా, ఈ సంస్కరణాత్మక ఒప్పుకోలు యొక్క సమ్మేళనం ఉంది, ఇది వారి విభిన్న స్వరాలను ఏకవచన సంస్కరణ స్వరంగా ఏకం చేస్తుంది. మోక్షం, ఆరాధన, ఆచరణ వంటి విషయాల్లో వారి ఐక్యతను మనం చూడలేనంతగా వారి విభేదాలు పెద్దవి కావు. నేడు, అనేక సంఘాలు ఐక్యత యొక్క మూడు రూపాలు అని పిలువబడే దాని యొక్క ప్రాథమిక సామరస్యాన్ని గుర్తిస్తున్నాయి- బెల్జిక్ కన్ఫెషన్, కానన్స్ ఆఫ్ డోర్ట్ మరియు హైడెల్బెర్గ్ క్యాటకిజం- ఇవి గ్రంధకర్తల యొక్క ఐక్యత గురించి కాదు కానీ సంస్కరించబడిన సూత్రాలకు సాక్ష్యం.

    సంస్కరించబడిన ఒప్పుకోలుకు సంబంధించినవన్నీ ఒకేలా ఉన్నాయని దీని అర్థం కాదు. సంస్కరించబడిన విశ్వాసం స్విస్ కంటోన్మెంట్ల నుండి జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మరియు తరువాత ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్లకు వ్యాపించినప్పుడు, ప్రాముఖ్యత లేదా అనువర్తనంలో గుర్తించదగిన తేడాలు ఉన్నాయి. ఈ గుర్తింపులు నేడు మనకు తెలిసిన సంస్కరణ వర్గాలు మరియు సమాజాల వైవిధ్యానికి దారితీసే ప్రారంభ దశలను రూపొందించాయి.

    ప్రతివాదులు మరియు డార్ట్

    ఉదాహరణకు, నెదర్లాండ్స్ లో, సినాడ్ ఆఫ్ డార్ట్ (1618–19) సందర్భం అనేది సంస్కరించబడిన సంఘాలలో ఆర్మినియానిజం యొక్క పెరుగుదలకు ప్రతిస్పందనగా జాకబ్ ఆర్మినియస్ యొక్క సవాళ్లకు సంస్కరణ సూత్రాల యొక్క ప్రత్యేక అన్వయింపు. జెనీవాలో కాల్విన్ వారసుడు థియోడర్ బెజా వద్ద చదువుకున్న ఆర్మినియస్ పాస్టర్ గా పనిచేయడానికి నెదర్లాండ్స్ కు తిరిగి వచ్చాడు. (ఒక పెద్ద విడ్డూరం ఏమిటంటే, బెజా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అర్మినియస్ కోసం సిఫార్సు లేఖ రాశాడు.) అయితే, ఆర్మినియస్ కు సంస్కరణ విద్యావిధానం గురించి, దాని బోధల గురించి సందేహాలు ఎక్కువగా ఉండేవి. కాలక్రమేణా, అతని బోధలు కాల్వినిస్ట్ స్థాపనకు వ్యతిరేకంగా అనేక ఇతర నాయకుల సంఘటిత నినాదంగా మారాయి.

    1609 లో అర్మినియస్ మరణం తరువాత, ఆర్మినియన్ స్థానం -రెమోన్ స్ట్రాంట్ విశ్వాసం అని కూడా పిలుస్తారు- త్వరలోనే నెదర్లాండ్స్ లోని స్పానిష్-నియంత్రిత కాథలిక్ ప్రాంతాల నుండి విడిపోవడానికి డచ్ యుద్ధ నాయకులకు సమర్పించిన ఐదు అంశాలను క్రోడీకరించింది. దీనికి ప్రతిస్పందనగా డార్ట్ యొక్క సినోడ్ సమావేశమై  ప్రతి ఐదు పాయింట్లను తిరస్కరించింది. ఈ విధంగా కాల్వినిజం యొక్క ఐదు పాయింట్లు అని పిలువబడేవి పుట్టుకొచ్చాయి, అయితే సినాడ్ యొక్క ఉద్దేశ్యం విశ్వాసాన్ని ఐదు పాయింట్లకు తగ్గించడం కాదు కానీ అర్మినియానిజం యొక్క ఐదు అంశాలకు సమాధానాలు ఇవ్వడం మాత్రమే.

    పదిహేడవ శతాబ్దం చివరి వరకు వెళ్తూ, లండన్ బాప్టిస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ (1689) లో సంస్కరించబడిన సూత్రాల యొక్క ఇదే వ్యక్తిగత వ్యక్తీకరణను మనం చూస్తాము. ప్యూరిటన్ బాప్టిస్టులు లేదా ప్రీమిటివ్ బాప్టిస్టుల సృష్టిగా, సంస్కరణ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవారు ఈ అంగీకారాన్ని రాశారు, అయినప్పటికీ ప్రెస్బిటేరియన్లు, ఆంగ్లికన్లు మరియు డచ్ కాల్వినిస్టులతో వారి రాజనీతి మరియు పీడోబాప్టిజం(చిన్నపిల్లల బాప్తిస్మం) తిరస్కరణ విషయంలో విభేదించారు. ఆ తరంలో ఉన్న బాప్టిస్టులు శతాబ్దాలుగా రిఫార్మ్డ్ బాప్టిస్టు అభిప్రాయాలను నిర్వచించడం వలన ఇంగ్లాండులో ఈ ఒప్పుకోలు ఆవిర్భవించింది. 

    వెస్ట్ మినిస్టర్ ప్రమాణాలు

    అయితే, వెస్ట్ మినిస్టర్ ప్రమాణాలలో, వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, చిన్న మరియు పెద్ద క్యాటకిజమ్స్, బహిరంగ ఆరాధన మరియు చర్చ్ గవర్నమెంట్ గురించి ఉన్నాయి. ఈ ఒప్పుకోలు సంస్కరించబడిన సంప్రదాయవాదం యొక్క కొత్త వ్యక్తీకరణగా పనిచేశాయి, అయితే రెండు క్యాటకిజమ్స్ అనగా మతాధికారులు లేదా పెద్దలు (పెద్ద క్యాటకిజమ్) మరియు పిల్లలు (చిన్న క్యాటకిజమ్) ఇద్దరికీ ఒక నమూనాను అందించడంలో లూథర్ యొక్క నిబద్ధతను అనుకరిస్తాయి. పొడవు మరియు లోతు పరంగా, ఏ సంస్కరణ లేదా సంస్కరణానంతర ప్రమాణం వెస్ట్ మినిస్టర్ అసెంబ్లీకి పోటీగా లేదు. అయితే, ఇంగ్షీషు చర్చ్లో ప్యూరిటనిజం గురించి పోరాటం నుండి దీని చరిత్ర వచ్చింది.

    ఎనిమిదవ హెన్రీ కాలం (1509-47) నుండి, ఇంగ్షీషు సంఘము ఒక ముఖ్యమైన అంగీకారాన్ని మాత్రమే స్వీకరించింది-మొదట నలభై-రెండు ఆర్టికల్స్ (1552), తరువాత ముప్పై-తొమ్మిది ఆర్టికల్స్ (1563) వరకు వెళ్లింది. ఈ వ్యాసాలు వేదాంతశాస్త్రంలో పూర్తిగా ప్రొటెస్టంట్ గా ఉన్నప్పటికీ, అవి ఆరాధనా సూత్రాల పట్ల సంఘము యొక్క నిబద్ధతను స్పష్టం చేయలేదు మరియు సంఘ నాయకత్వ నిర్మాణాలు లేదా సంఘర్షణలో క్రీస్తు ఉనికి వంటి వివాదాస్పద సిద్ధాంతాలపై ఒక వైఖరిని పేర్కొనలేదు. ఇంగ్షీషు సంఘములో మరింత సమగ్రమైన ఒప్పుకోలు రాయడంలో విఫలం కావడానికి సంకోచం కారణం కాదు, కానీ హెన్రీ యొక్క ఇద్దరు పిల్లలు ఆరవ ఎడ్వర్డ్ మరియు మొదటి మేరీ ఆధ్వర్యంలో ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ విధేయతల మధ్య హింసాత్మక ఊగిసలాటల వల్ల ఏర్పడిన అసమర్థత కారణం. పదహారవ శతాబ్దంలో ఎక్కువ భాగం, ఆంగ్లికన్ చర్చ్కి సుదీర్ఘమైన, ఏకీకృత అంగీకారాన్ని రాసే వెసులుబాటు లేదు.

    మొదటి ఎలిజబెత్ కాల౦ నాటికి, ఇ౦గ్లా౦డ్లో కొ౦తమ౦ది మాత్రమే పరిమితంగా ఒప్పుకోవడ౦ అనే మునుపటి అవసరాన్ని సద్గుణ౦గా నమ్మలేదు. ఉదాహరణకు, ఐరోపాలో సంస్కరణ మరియు లూథరన్ నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక తగాదాల సంఖ్యను సంక్షిప్త అంగీకారం తగ్గించవచ్చు. మాథ్యూ పార్కర్ వంటి బిషప్ లు సంస్కరించబడిన  విశ్వాసానికి కట్టుబడి ఉన్నప్పటికీ, ఆరాధన, దుస్తులు, సిద్ధాంతం మరియు ఇతర ప్రార్థనా పద్ధతులపై ఇంగ్షీషు చర్చ్ తన వైఖరిని మార్చాలని పెరుగుతున్న స్వరం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

    ఈ ఉద్రిక్తత ఫలితంగా మొదట ఎలిజబెత్ హయాంలో, ఆ తర్వాత జేమ్స్ 1 హయాంలో ప్యూరిటనిజం ఆవిర్భవించింది. స్పష్టంగా నిర్వచించబడిన ఉద్యమానికి బదులుగా మరింత సంస్కరణను కోరుకునే ప్రేరణకు ఈ లేబుల్ వర్తిస్తుంది. అయినప్పటికీ ఇంగ్షీషు సంఘాన్ని మరింత సంస్కరించడానికి బిషప్ లు మరియు రాజకీయ నాయకులు సంకోచించడం పట్ల ప్యూరిటన్లందరూ నిరాశను పంచుకున్నారు.

    మొదటి చార్ల్స్ సమయానికి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలిజబెత్ మరియు జేమ్స్ ల పాలనలో, ప్యూరిటన్ల దుస్థితి తరచుగా విస్మరించబడింది, అయినప్పటికీ వారు చాలా అరుదుగా హింసించబడ్డారు. అయితే, చార్ల్స్ ప్యూరిటన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంబించాడు. చివరికి ఆంగ్ల అంతర్యుద్ధం (1642-51)లో పార్లమెంటుకు, రాజుకు మధ్య కలహాలు తలెత్తాయి.

    ఆలివర్ క్రోమ్ వెల్ యొక్క వీరోచిత ప్రయత్నాల నాయకత్వంలో ప్యూరిటన్లు ఈ పోరాటంలో విజయం సాధించారు- అతని విగ్రహం నేటికీ పార్లమెంటు ముందు ఉంది. యుద్ధ సమయంలో, పార్లమెంటులో ప్యూరిటన్ నాయకులను (మరియు కొంతమంది స్కాటిష్ కన్సల్టెంట్లను) ముప్పై తొమ్మిది ఆర్టికల్స్ ను ఐరోపాలోని ఇతర ఒప్పుకోలులతో సరిపోయే పూర్తి అంగీకారంగా విస్తరించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించింది. వెస్ట్ మినిస్టర్ అసెంబ్లీ ముప్పై తొమ్మిది ఆర్టికల్స్ ఆధారంగా తమ పనిని ఆధారం చేసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నించింది, కాని త్వరలోనే ఈ నమూనా చాలా సంకుచితంగా ఉందని భావించింది, అలా మొదటి నుండి ప్రారంభమైంది.

    చార్ల్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నేపథ్యం మరియు మరిన్ని సంస్కరణల ఆవశ్యకత వెస్ట్ మినిస్టర్ స్టాండర్డ్స్ యొక్క పొడవు మరియు లోతును వివరిస్తుంది. అన్ని సిద్ధాంతాలను సంక్షిప్తీకరించే ప్రయత్నంగా కాకుండా, ఆంగ్ల సంస్కరణ సిద్ధాంతం మరియు ఆచరణను నిర్వచించడానికి ప్యూరిటనిజంలోని శక్తుల విస్ఫోటనంగా ప్రమాణాలను చూడాలి. రక్తం చిందింది, గొంతులు నిశ్శబ్దమయ్యాయి. ఇప్పుడు ఆ స్వరాలు తమ పరిధుల నుంచి విడదీయబడ్డాయి. తమ సైద్ధాంతిక స్థితిగతులనే కాకుండా, ఆరాధన, శిష్యరికం, సంఘజీవితంలో ఇతర విషయాలను వివరించడం తమ కర్తవ్యంగా వారు భావించారు.

    ప్రస్తుతం ఒప్పుకోలు

    నేడు, ప్రొటెస్టంట్ సంఘాలలో కన్ఫెషన్లు వివిధ విధాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఎవాంజెలికల్ సంఘాలలోని అన్ని ధోరణులు ఒప్పుకోలులకు స్వీకారం ఇవ్వవు. పరిశుద్ధంగా ఉండాలనే ఆకాంక్ష మరియు (Second Great Awakening) రెండవ గొప్ప మేల్కొలుపు అనేవి విశ్వాసం యొక్క మరింత తక్షణ వ్యక్తీకరణకు అనుకూలంగా బహిరంగ మరియు వ్యక్తిగత ఒప్పుకోలు యొక్క పాత్రపై క్షీణించిన ప్రభావాన్ని చూపాయి. కొన్నిసార్లు, ఒప్పుకోలు ప్రామాణిక విశ్వాసానికి అవరోధాలుగా చూడబడతాయి.

    ఈ ధోరణులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, పదహారు, పదిహేడవ శతాబ్దాలకు చెందిన ఒప్పుకోలు గతించి పోలేదు. వాటిని అనేక సంఘాలలో, ఆరాధన సందర్భంలో మరియు క్రొత్త విశ్వాసులను మరియు పిల్లలను ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తారు. వివిధ వర్గాలలో పాస్టర్లు మరియు పెద్దల విశ్వసనీయతను ధృవీకరించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ అర్థ౦లో, విశ్వాస౦ గురి౦చిన ఒప్పుకోలు సనాతనతను నిర్ధారి౦చడానికి సహాయపడే సరిహద్దు కంచెను ఏర్పాటు చేయడమే కాక, క్రైస్తవ శిష్యుల రోజువారీ నడకను మార్పు చేసే సజీవ పత్రాలుగా కూడా ఉపయోగి౦చబడతాయి.

  1. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
డాక్టర్ ర్యాన్ రీవ్స్
డాక్టర్ ర్యాన్ రీవ్స్
డాక్టర్ ర్యాన్ రీవ్స్ ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలోని గోర్డాన్-కాన్వెల్ థియోలాజికల్ సెమినరీకి చారిత్రక వేదాంతశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ డీన్.