
ప్రొటెస్టంట్ క్రీడ్స్ మరియు ఒప్పుకోలు
21/02/2025
క్రైస్తవ జీవితానికి లూథర్ సలహా
28/02/2025సంఘ సంస్కరణ దినం అనగా ఏమిటి?

- ఒకే రోజు జరిగిన ఒక్క సంఘటన ప్రపంచాన్నే మార్చేసింది. అది అక్టోబర్ 31, 1517. పండితుడు మరియు సన్యాసియైన సహోదరుడు మార్టిన్, రోమాలో తన సంఘముతో ఎన్నో స౦వత్సరాలు కష్టపడ్డాడు. ఊహించని విధంగా పాప పరిహారపు పత్రికలు అమ్మకాలు జరగడం అతనిని తీవ్రంగా కలచివేసింది. ఈ కథలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు కావలసినవన్నీ ఉన్నాయి. ఇందులో పాత్రలను తెలుసుకొందాం.
- మొదటిది, సంఘ నియమాల ప్రకార౦ చాలా చిన్నవాడైన మైంజ్ కు చెందిన ఆల్బర్ట్ అనే యువ బిషప్ ఉన్నాడు. అతను ఇద్దరు బిషప్ లకు పైగా బిషప్ గా ఉండటమే కాకుండా, అదనంగా మైంజ్ కే మతపెద్దగా ఉండాలని కోరుకున్నాడు. ఇది కూడా సంఘ నియమాలకు విరుద్ధం. కాబట్టి ఆల్బర్ట్, రోమ్ లోని పోప్, పదవ లియోకు విజ్ఞప్తి చేశాడు. డి మెడిసి కుటుంబానికి చెందిన పదవ లియో తన అభిరుచులను తన ఆర్థిక వనరులను మించిపోయేలా చేశాడు. కళాకారులు మరియు శిల్పకారులు, రాఫెల్ మరియు మైఖేలాంజిలియో వంటివారు.మైంజ్ కు చెందిన ఆల్బర్ట్ పోప్ పాలన కోసం విజ్ఞప్తి చేసినప్పుడు, పదవ లియో దానికి సిద్ధంగా ఉన్నాడు. పోప్ ఆశీర్వాదంతో భూత, వర్తమాన మరియు భవిష్యత్తు గురించిన పాప పరిహార పత్రాలను ఆల్బర్ట్ అమ్మేవాడు. ఇవన్నీ మార్టిన్ లూథర్ కు కోపం తెప్పించాయి. పరలోకానికి వెళ్ళే దారి కొనుక్కోగలమా? అని లూథర్ మాట్లాడాల్సి వచ్చింది.
-
కానీ అక్టోబర్ 31 ఎందుకు? ఎందుకనగా నవంబర్ 1న సకల పరిశుద్ధుల దినోత్సవం గా సంఘ క్యాలెండర్ లో ప్రత్యేక స్థానం ఉంది. నవంబర్ 1, 1517న, లూథర్ యొక్క స్వంత నగరమైన విట్టెన్ బర్గ్ వద్ద కొత్తగా సంపాదించిన అవశేషాల భారీ ప్రదర్శనకు ఉంచారు. యాత్రికులు నలుమూలల నుంచి వచ్చి, అవశేషాల ముందు గుమిగూడి, ప్రక్షాళనకు వందలు లేదా వేల సంవత్సరాలు సమయం తీసుకుంటారు. లూథర్ ఆత్మ మరింత కలత చెందింది. ఇవేవీ సరైనదిగా అనిపించలేదు.
పండితుడైన మార్టిన్ లూథర్, చేతిలోకి కలము తీసుకుని తన సిరాలో ముంచి 1517 అక్టోబర్ 31న తన తొంభై ఐదు సిద్ధాంత పత్రాలు రాశాడు. సంఘములోని తోటి సహోదరుల మధ్య కొంత ఆత్మాన్వేషణను రేకెత్తించడానికి, ఒక సంఘమును రేకెత్తించడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి. తొంభై అయిదు సిద్ధాంత పత్రాలు సంఘము కంటే కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి మరియు సంఘం పునరావాసానికి మించినదని కూడా వెల్లడించాయి. దానికి సంస్కరణ అవసరం. సంఘము, లోకము ఎప్పటికీ ఒకేలా ఉండవు.
లూథర్ యొక్క తొంభై అయిదు సిద్ధాంతాలలో ఒకటి సరళంగా ప్రకటిస్తుంది, “సంఘం యొక్క నిజమైన నిధి యేసుక్రీస్తు సువార్తయే.” సంస్కరణ దినానికి అర్థం అదే. దేవుని వాక్యపు పేజీల మీద సంప్రదాయపు కాగితాలు రాయడం వల్ల సంఘం ఎప్పుడో సువార్త పట్ల దృష్టని కోల్పోయింది. దేవుని వద్దకు వెళ్ళే మార్గాన్ని సంపాదించే కర్మల వ్యవస్థలను తరచుగా సంప్రదాయం మాత్రమే తెస్తుంది. ఇది పరిసయ్యుల విషయంలోనూ, మధ్యయుగ రోమన్ కాథలిక్కుల విషయంలోనూ వర్తిస్తుంది. “నా కాడి సుళువుగాను, నా భారం తేలిక గాను ” అని క్రీస్తు స్వయంగా చెప్పలేదా? సంస్కరణ దినోత్సవం యేసుక్రీస్తు యొక్క విముక్తి సువార్త యొక్క ఆనందకరమైన అందాన్ని జరుపుకుంటుంది.
సంస్కరణ దినం అంటే ఏమిటి? చీకటి నుంచి సువార్త వెలుగు వెలిగిన రోజు ఇది. ప్రొటెస్టంట్ సంస్కరణ ప్రారంభమైన రోజు అది. మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, జాన్ నాక్స్ మరియు అనేక ఇతర రిఫార్మర్స్ విశ్వాసానికి మరియు జీవితానికి ఏకైక సర్వోన్నత అధికారంగా దేవుని వాక్యానికి తిరిగి వెళ్ళడానికి సంఘానికి సహాయపడటానికి మరియు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తు మాత్రమే, కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం యొక్క మహిమాన్విత సిద్ధాంతాలకు సంఘాన్ని నడిపించడానికి దారితీసిన రోజు అది. మిషనరీ ప్రయత్నాల మంటలను అది రగిలించింది, కీర్తన రచనకు, స౦ఘమంతా కలసి పాడటానికి దారితీసింది, అది దేవుని ప్రజలకు ప్రకటి౦చడ౦లో కేంద్రబిందువుగా ఉ౦డడానికి దారితీసింది. ఇది ఒక వేదాంత, సంఘ మరియు సాంస్కృతిక పరివర్తన యొక్క వేడుక.
అందుకే మనం సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు మన గతానికి మరియు సంస్కరణ కర్తగా మారిన మార్టిన్ లూథర్ గారికి కృతజ్ఞతతో ఉండాలని గుర్తు చేస్తుంది. ఇంకా ఏమిటంటే, సువార్త యొక్క వెలుగును మనం చేసే ప్రతి పనిలో కేంద్రబిందువుగా ఉంచే మన కర్తవ్యాన్ని, బాధ్యతను ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.
- ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో ప్రచురితమైంది.