సంఘ సంస్కరణ దినం అనగా ఏమిటి?
28/02/2025
క్రమమైన వేదాంత శాస్త్రానికి మూలాలు
11/03/2025
సంఘ సంస్కరణ దినం అనగా ఏమిటి?
28/02/2025
క్రమమైన వేదాంత శాస్త్రానికి మూలాలు
11/03/2025

క్రైస్తవ జీవితానికి లూథర్ సలహా

  1. దేవుని సార్వభౌమాధికారం ఏమిచేస్తుంది, కృప ద్వారా రక్షణ, విశ్వాస౦ ద్వారా నీతి, క్రీస్తులో ఐక్యత అయన క్రొత్త జీవిత౦ అనగా క్రీస్తు కొరకు జీవించే క్రైస్తవ జీవితమా? లూథర్ కు సంబంధించి అవి నాలుగు విషయాలను సూచిస్తున్నాయి:

    మొదటి అంతరార్థం ఏమిటంటే, సిముల్ ఇయుస్టస్ ఎట్ పెకాటర్1, ఓ పాపి అయినటువంటి క్రైస్తవ విశ్వాసి అదే సమయంలో నీతిమంతుడు. జాన్ టౌలర్ యొక్క థియోలోజియా జర్మానికా ద్వారా లూథర్ ప్రేరేపించబడిన ఈ సూత్రం చాలా స్థిరమైన సూత్రం: నాలో నేను తరచుగా చూసేది ఒక పాపిని; కానీ నేను క్రీస్తులో నన్ను నేను చూసుకున్నప్పుడు, అతని పరిపూర్ణ నీతితో నీతిమంతుడుగా లెక్కించబడిన వ్యక్తిని నేను చూస్తాను. కాబట్టి అటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వలె నీతిమంతుడైన దేవుని ఎదుట నిలబడగలడు- ఎందుకంటే అతను క్రీస్తు నీతిని బట్టి మాత్రమే నీతిమంతుడు. ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాం.

    రెండవ అంతరార్థం ఏమిటంటే, క్రీస్తుని బట్టి దేవుడు మనకు తండ్రి అయ్యాడని కనుగొనడం. మనము అంగీకరింపబడ్డాము. లూథర్ యొక్క టేబుల్ టాక్ లో బహుశా ప్రాముఖ్యంగా, కొంతవరకు చాలా ఇష్టపడే జాన్ ష్లాగిన్ హౌఫెన్ చెప్పిన అత్యంత అందమైన వృత్తాంతాలలో ఒకటి:

    చిన్నవాడైన మార్టిన్ తో (కొడుకు) నా కేటీ (భార్య) తన మాటలలో చూపించే ఆప్యాయత కంటే కూడా దేవుడు నాతో  ఆప్యాయంగా మాట్లాడతాడు. నేను గానీ, కేటీ గానీ మా బిడ్డకు కంటిమీద కునుకు లేకుండా చేయము లేదా తల పగలగొట్టము. దేవుడు కూడా అంతే.  ఆయన మన పట్ల సహనం చూపాడు. దానికి రుజువు ఏమిటంటే, మన౦ ఆయనలో నుండి ఉత్తమమైన దానిని చూడడానికి ఆయన తన కుమారుణ్ణి మన శరీర౦లోకి పంపాడు.2

    మూడవది, క్రీస్తులో జీవితం తప్పనిసరిగా సిలువ కింద జీవించడమే అని లూథర్ నొక్కి చెప్పాడు.3 మన౦ క్రీస్తుతో ఐక్య౦గా ఉ౦టే, మన జీవితాలు ఆయనను అనుసరి౦చబడతాయి. నిజమైన సంఘానికి మరియు నిజమైన క్రైస్తవుడికి మార్గం మహిమ యొక్క వేదాంతశాస్త్రం ద్వారా కాదు, (థియోలాజియా గ్లోరియా) కానీ సిలువ యొక్క వేదాంతశాస్త్రం (థియోలాజియా క్రూసిస్) ద్వారానే. ఇది మనల్ని అంతర్గతంగా ప్రభావితం చేస్తుంది, మనం సంఘానికి సంబంధించిన శ్రమలో పాలు పంచుకుంటున్నప్పుడు మనల్ని అంతర్గతంగా మరియు బాహ్యంగా ప్రభావితం చేస్తుంది. మధ్యయుగ మహిమ సిద్ధాంతాన్ని సిలువ వేదాంతం అధిగమించాలి. సంస్కారాల విషయమై  ఖచ్చితమైన స్వభావాన్ని గూర్చి అర్థం చేసుకోవడంలో వారికి అన్ని తేడాలు ఉన్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం లూథర్ మరియు కాల్విన్ ఒకటే. క్రీస్తు మరణము మరియు పునరుత్థానములో మనము ఆయనతో ఐక్యమై, మన బాప్తిస్మము ద్వారా గుర్తించబడితే (రోమా 6:1-14లో పౌలు బోధించినట్లు), అప్పుడు క్రైస్తవ జీవితమంతా సిలువతో కూడుకున్నది అవుతుంది:

    క్రీస్తు సిలువ తన భుజాలమీద మోసిన చెక్క ముక్కనో, ఆ తరువాత దానిపై వ్రేలాడానికి మేకులను దించిన కర్ర ముక్కను సూచించదు, కాని సాధారణంగా ఇది విశ్వాసుల బాధలన్నిటినీ సూచిస్తుంది, వారి బాధలు క్రీస్తు బాధలు, 2 కొరింథీ 15: ” క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో”; మళ్ళీ: “ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.” (కొలొస్స. 24). కాబట్టి క్రీస్తు సిలువ సాధారణంగా క్రీస్తు కొరకు సంఘము అనుభవించే బాధలన్నిటినీ సూచిస్తుంది.4

    క్రీస్తు మరణము మరియు పునరుత్థానములో విశ్వాసి యొక్క ఐక్యత మరియు రోజువారీ అనుభవంలో అది పనిచేయకపోవడం అనేది లూథర్ కు, క్రైస్తవుడు జీవితంలోని ప్రతి అనుభవాన్ని చూడటం నేర్చుకునే దృశ్య లెన్స్ లుగా మారింది. ఇది—థియోలాజియా క్రూసిస్—ప్రతిదీ పదునైన దృష్టిని కేంద్రీకరిస్తుంది మరియు క్రైస్తవ జీవితంలోని హెచ్చుతగ్గులను అర్థం చేసుకోవడానికి మనకు వీలు కల్పిస్తుంది:

    మన ప్రత్యర్థులు మనల్ని క్రూరంగా హింసించడం, బహిష్కరించడం, చంపడం చూసినప్పుడు మనం దుఃఖంతో మునిగిపోకూడదు లేదా నిరాశకు లోనుకాకూడదు, ఈ విషయాలు తెలుసుకోవడం మనకు లాభదాయకం.  అయితే పౌలు ఉదహరించిన తర్వాత మన పాపాల కోస౦ కాక, క్రీస్తు కోస౦ మన౦ మోసే సిలువలో మహిమపరచాలని మనలో  మన౦ ఆలోచిద్దా౦. మనం అనుభవించే బాధలను మనలో మాత్రమే పరిగణననలోకి తీసుకుంటే అవి బాధాకరమైనవి మాత్రమే కాదు, సహించరానివి; కానీ మనం ఇలా అన్వయించుకుంటే : “నీ బాధలు (ఓ క్రీస్తు) మాలో పుష్కలంగా ఉన్నాయి”; లేదా కీర్తనలో చెప్పినట్లు: “నిన్ను బట్టి దినమంతా వధింపబడుతున్నాము “, అప్పుడు ఈ బాధలు తేలికైనవి మాత్రమే కాదు, మధురమైనవి కూడా, ఈ మాట ప్రకారం: “నా కాడి సులువుగా, నా భారం తేలిక గాను ఉన్నవి ” (మత్తయి 11:30).5

    నాల్గవది, క్రైస్తవ జీవిత౦ భరోసా మరియు స౦తోష౦తో ముడిపడి ఉ౦టు౦ది. ఇది సంస్కరణ యొక్క లక్షణాలలో ఒకటి, మరియు అర్థం చేసుకోదగినది. క్రైస్తవ జీవిత౦ ఆశి౦చబడే లక్ష్యాన్ని చేరుకునే౦దుకు కృషి చేయడానికి బదులుగా, దాని ను౦డి ప్రారంభమౌతు౦దని, అది ఆశ్చర్యకరమైన విమోచనను తీసుకువచ్చి, మనస్సును, సంకల్పాన్ని, ఆప్యాయతలను స౦తోష౦తో నింపి౦ది. అంటే వైభవంతో కూడిన స్థిరమైన భవిష్యత్తు వెలుగులో ఇప్పుడు నిశ్చింతగా జీవించడం ప్రారంభించవచ్చు. తప్పకుండా, ఆ కాంతి ప్రస్తుత జీవితంలోకి తిరిగి ప్రతిబింబించింది, తీవ్రమైన ఉపశమనం మరియు విడుదలను తెస్తుంది.

    మీ నమ్మకంపై నిలబడటం 

    లూథర్ దృష్టిలో, క్రైస్తవ జీవితం సువార్త ఆధారిత, సువార్త-నిర్మిత, సువార్త-మహిమార్థమైన జీవితం. ఇది దేవుని యొక్క స్వేచ్ఛాయుత మరియు సార్వభౌమ కృపను ప్రదర్శిస్తుంది మరియు  మన కోసం మరణించిన రక్షకునికి కృతజ్ఞతగా జీవించి, విజయంలో మరణం మింగబడే వరకు మరియు విశ్వాసం దృశ్యంగా మారే వరకు ఆయన సిలువను మోస్తూ జీవిద్దాం.

    బహుశా, 1522లో, బోర్నాలోని సంఘములో ఒక ఆదివారం స౦ఘ౦లోని కొ౦తమ౦ది లూథర్ ప్రసంగాన్ని  వినడానికి కూర్చున్నారు, అయితే స౦ఘ౦లోని కొ౦తమ౦ది ఆశ్చర్యపోయారు, ఈ సువార్త యొక్క భావములో, అది చాలా ఉత్సాహభరితంగా ఉంది, మార్పు వచ్చిందని చెప్పలేము. అది వారికి కూడా కావచ్చా? లూథర్ వారి మనస్సులను చదివాడు. వారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బాగా సిద్ధపడి ప్రసంగ వేదికలోకి వచ్చాడు.

    సువార్త అంటే ఏమిటి? పాపులను రక్షించడానికి మరియు నరకాన్ని అణచివేయడానికి, మరణాన్ని జయించడానికి, పాపాన్ని తొలగించడానికి మరియు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాడు, యోహాను 3:16. కానీ మీరు ఏమి చేయాలి? దీన్ని ధృడంగా నమ్మడం తప్ప మరేమీ లేదు, మీ విమోచకుడి వైపు చూడటం మరియు అతను మీ మంచి కోసం ఇదంతా చేశాడని మరియు మీ అందరినీ స్వతంత్రులను చేసాడని గట్టిగా విశ్వసించండి, తద్వారా మరణం, పాపం మరియు నరకం యొక్క భయాలలో, మీరు ధైర్యంగా చెప్పగలరు: నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చనప్పటికీ, పాపము ఇంకా ఉన్నప్పటికీ, నేను మరణము మరియు నరకములకు భయపడుతున్నప్పటికీ, క్రీస్తు తన కార్యములన్నిటినీ నాకు ప్రసాదించాడని సువార్త ద్వారా అది స్పష్టం. ఆయన  అబద్ధం చెప్పడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఆయన తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దీనికి చిహ్నంగా నేను బాప్తిస్మాన్ని పొందాను. 

    … దీని మీద నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. నా ప్రభువైన క్రీస్తు నా మంచి కోసం మరణాన్ని, పాపాన్ని, నరకాన్ని, దయ్యాన్ని జయించాడని నాకు తెలుసు. పేతురు చెప్పినట్లు అతడు నిర్దోషి, “పాపము చేయనివాడు, అతని నోటిలో ఏ కపటమును కనబడలేదు.” 1 పేతురు 2: 22. కాబట్టి పాపము, మరణము ఆయనను చంపలేకపోయాయి, నరకం అతన్ని పట్టుకోలేకపోయింది, ఆయన వారి ప్రభువు అయ్యాడు, దానిని అంగీకరించి విశ్వసించే వారందరికీ దీనిని ప్రసాదించాడు. ఇదంతా నా రచనల వల్లనో, పుణ్యాల వల్లనో కాదు. కానీ స్వచ్ఛమైన కృప, మంచితనం మరియు దయ ద్వారా పొందాము.6

    లూథర్ ఒకసారి ఇలా అన్నారు , “దేవుడు నాపై కోప౦గా లేడని నేను నమ్మగలిగితే, అవలీలగా / సునాయాసంగా నేను ఆనందమును పొందుతాను.”7 బహుశా ఆ రోజే ఆయన మాట్లాడిన మాటలను విన్న కొ౦తమ౦ది అయన మాటకు ప్రతిస్ప౦ది౦చి, “నిశ్చయతను” అనుభవి౦చారు. బహుశా కొందరు యువ శ్రోతలు తరువాత వారి స్నేహితులకు ప్రతిగా లేఖ రాసి తాము ఇంటికి వెళ్ళామని మరియు అవలీలగా ఆనందాన్ని పొందాము అని చెప్పారో లేదో ఎవరికి తెలుసు?

    ఎడిటర్ గమనిక: ఈ పోస్ట్ ది లెగసీ ఆఫ్ లూథర్ నుండి ఒక భాగం మరియు మొదట అక్టోబర్ 29, 2018 న ప్రచురించబడింది.

    1. లూథర్ లో పునరావృత గమనిక, ఉదా: లూథర్: రోమన్లపై ఉపన్యాసాలు, 127, 208, 322.  
    2. ఎల్ డబ్ల్యూ, 54:127.  
    3. లూథర్ లో ఈ సూత్రానికి సంబంధించిన విస్తారమైన సూచనల కోసం, వాల్తేర్ వాన్ లోవెనిచ్, లూథర్ యొక్క థియాలజీ ఆఫ్ ది క్రాస్, ట్రాన్స్ హెర్బర్ట్ జె.ఎ. బౌమన్ (మిన్నియాపోలిస్: ఆగ్స్ బర్గ్, 1976), 112–43 చూడండి.  
    4. లూథర్, గలాతీయులకు సెయింట్ పౌలు లేఖపై వ్యాఖ్యానం, 558.  
    5. ఐబిఐడి., 559.
    6. మార్టిన్ లూథర్ యొక్క పూర్తి ప్రసంగాలు, 1.2, 373.  
    7. డబ్ల్యుఎ, 176.6ఎఫ్, ఒబెర్మాన్, లూథర్ ఉదహరించినది: దేవుడు మరియు దెయ్యం మధ్య మనిషి, 315.  
  1. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
సింక్లైర్ ఫెర్గూసన్
సింక్లైర్ ఫెర్గూసన్
డాక్టర్ సింక్లెయిర్ బి. ఫెర్గూసన్ రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమాటిక్ థియాలజీకి ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆయన గతంలో కొలంబియా, ఎస్.సి లోని ఫస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చిలో సీనియర్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆయన ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్‌తో సహా అనేక పుస్తకాల రచయిత.