క్రైస్తవ జీవితానికి లూథర్ సలహా
28/02/2025
ఎక్లేసియా: పిలువబడిన వారు
12/03/2025
క్రైస్తవ జీవితానికి లూథర్ సలహా
28/02/2025
ఎక్లేసియా: పిలువబడిన వారు
12/03/2025

క్రమమైన వేదాంత శాస్త్రానికి మూలాలు

  1. సిస్టమాటిక్ (క్రమబద్ధమైన) వేదాంతవేత్తకు ప్రధానమైన మూలం బైబిల్. వాస్తవానికి, బైబిలు ఈ మూడు వేదాంత క్రమశిక్షణలకు ప్రాథమిక మూలం. అవేవనగా బైబిల్ వేదాంత శాస్త్రం, చారిత్రక వేదాంత శాస్త్రం మరియు సిస్టమాటిక్ (క్రమబద్ధమైన) వేదాంత శాస్త్రం.

    బైబిల్ వేదాంత శాస్త్రం (బిబ్లికల్ థియాలజీ)

    బైబిల్ వేదాంత శాస్త్రం (థియోలజీ) యొక్క పని సమయం గడిచేకొద్దీ లేఖనం బయలుపరిచే సమాచారమును పరిశీలిస్తుంది మరియు ఈ పని సిస్టమాటిక్ (క్రమబద్ధమైన)వేదాంతికి మూలంగా పనిచేస్తుంది. బైబిల్ పండితుడు లేఖనాలను అధ్యయనం చేస్తూ, పాత మరియు క్రొత్త నిబంధనలోని పదాల, భావాల, ఇతివృత్తాల ప్రగతిశీల అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తూ అవి ఎలా ఉపయోగించబడ్డాయి మరియు ఎలా అర్థం చేసుకొన్నారు అనేదానిని గమనిస్తారు.

    ఈ రోజు సెమినరీలో ఒక సమస్య, “అటోమిజమ్ ” అని పిలువబడే బైబిల్ వేదాంతాన్ని చేసే పద్ధతి, దీనిలో గ్రంథం యొక్క ప్రతి ఒక్క లేఖనపు “అణువు” ఒంటిగా నిలుచును. ఒక విద్వాంసుడు తాను గలతీయులలో పౌలు యొక్క రక్షణ సిద్ధాంతం గురించి మాత్రమే అధ్యయనం చేయడానికి తనను తాను పరిమితం చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు, మరొకడు ఎఫెసీయులలో రక్షణపై పౌలు చేసిన బోధపై  ప్రత్యేకంగా దృష్టిని పెట్టవచ్చును. ఫలితంగా, ప్రతి ఒక్కరూ రక్షణ విషయంలో విభిన్న దృక్పథంతో ఉంటారు – ఒకటి గలతీయుల నుండి మరొకటి ఎఫెసీయులు నుండి, కానీ రెండు అభిప్రాయాలు ఎలా సామరస్యంగా ఉన్నాయో పరిశీలించడంలో వైఫల్యం ఉంది. పౌలు గలతీయులు, ఎఫెసీయులు వ్రాసినప్పుడు దేవునిచేత ప్రేరేపించబడలేదు కాబట్టి సమగ్ర ఐక్యత, పొత్తు లేదా దేవుని వాక్యం పట్ల పొందిక లేదని కూడా ఊహిస్తారు. ఇటీవలి సంవత్సరాల్లో, దైవశాస్త్రంలోని “ఆరంభంలో ” పౌలుకు, “ఆఖరిలో” పౌలుకు అనే మాటలకూ మధ్య ఉన్న వ్యత్యాసాలు మాత్రమే కాక, బైబిల్ లోని అనేక రచయితలు ఉన్నారు కాబట్టి చాలా వేదాంతలు ఉన్నాయని వేదాంతపరులు చెబుతున్నారు. పేతురు యొక్క వేదాంత శాస్త్రం, యోహాను యొక్క వేదాంత శాస్త్రం, పౌలు యొక్క వేదాంత శాస్త్రం మరియు లూకా యొక్క వేదాంత శాస్త్రం వంటివి ఉన్నాయి. ఇది లేఖన క్రమబద్ధతపై  ప్రతికూల దృక్పథం, అదే సమయంలో బైబిల్ ప్రకటన యొక్క మొత్తం చట్రాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బైబిల్ యొక్క ఇరుకైన భాగంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం ప్రమాదం.

    చారిత్రక వేదాంత శాస్త్రం

    రెండవ క్రమశిక్షణ, క్రమబద్ధమైన వేదాంతానికి మరొక మూలం ఏదనగా చారిత్రక వేదాంతం. చారిత్రాత్మకంగా సంఘ జీవితంలో సిద్ధాంతం ఎలా అభివృద్ధి చెందిందో ప్రధానంగా సంక్షోభం కలిగిన సమయాలలో సంఘం ఎలా ప్రతిస్పందించిందో చారిత్రక వేదాంతపరులు గమనిస్తారు. సంఘాలు, సెమినరీలో సరిక్రొత్త వివాదాలు తలెత్తినప్పుడు నేడు వేదాంతపరులు నిరాశ చెందుతున్నారు, ఎందుకంటే సంఘం ఈ క్రొత్త వాతావరణ వివాదాల కాలాన్ని సంఘం గతంలో అనుభవించింది. సంఘం చారిత్రాత్మకంగా కౌన్సిల్ ఆఫ్ నైసియా (AD 325), కౌన్సిల్ ఆఫ్ చాల్సిడాన్ (AD 451) అనేవి వివాదాలను పరిష్కరించడానికి కౌన్సిల్ లో సమావేశం జరిగింది. ఈ సంఘటనలను అధ్యయనం చేయడం చారిత్రక వేదాంతపరుల బాధ్యత.

    క్రమబద్దమైన వేదంతశాస్త్రం (సిస్టమాటిక్ థియాలజీ)

    మూడవ దశ – క్రమబద్దమైన సిద్ధాంతం. బైబిల్ సమాచారం యొక్క మూలాలను పరిశీలించడం, వివాదాలను, చర్చి కౌన్సిల్స్, వారి తదుపరి నమ్మకాలు, కన్ఫెషన్స్ ద్వారా వచ్చే చారిత్రక పరిణామాల మూలాలు, శతాబ్దాలుగా సంఘము ఆశీర్వదించిన గొప్ప మనస్సుల అంతర్దృష్టి వంటి వాటిని పరిశీలించడం సిస్టమాటిక్ థియాలజీ బాధ్యత. దేవుడు తన కృపలో సంఘానికి బోధకులను ఇచ్చాడని కొత్త నిబంధన మనకు చెబుతోంది (4:11-12). బోధకులందరూ అగస్టీన్, మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, జానథన్ ఎడ్వర్డ్స్ వంటి మేధావులు కాదు. అలాంటి పురుషులకు అపొస్తలత్వపు అధికారం లేదు, కానీ వారి పరిశోధన యొక్క తీవ్ర పరిమాణం, వారి అవగాహన యొక్క లోతు ప్రతి యుగంలో సంఘానికి లాభదాయకంగా ఉంటాయి. థామస్ ఆక్వినియస్ ను “డాక్టర్ ఏంజెలికస్ ” లేదా“ ఏంజిలిక్ వైద్యుడు ” అని రోమన్ క్యాథలిక్ సంఘము పిలిచింది. రోమన్ క్యాథలిక్కులు ఆక్వినియస్ కు ఏమాత్రం తప్పులు లేని వ్యక్తి నమ్మరు, కానీ ఏ విధమైన రోమన్ క్యాథలిక్ చరిత్రకారుడైన లేదా వేదాంత వేత్త ఐనా ఇతడి సేవలను విస్మరించరు.

    సిస్టేమెటీసియన్ అనేవాడు బైబిల్, క్రీడ్స్ మరియు సంఘం యొక్క ఒప్పుకోలు మాత్రమే కాకుండా, చరిత్ర అంతటా దేవుడు ఇచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుల ఆలోచనలను కూడా అధ్యయనం చేస్తాడు. సిస్టేమెటీసియన్, డేటా అంతటిని అనగా -బైబిల్, చారిత్రక మరియు క్రమబద్ధమైన వాటిని పరిగణనలోకి తీసుకొని దానిని ఒకచోట చేరుస్తాడు.

  1. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.