క్రమమైన వేదాంత శాస్త్రానికి మూలాలు
11/03/2025
యేసు పాపం చేయగలిగి ఉంటాడా?
18/03/2025
క్రమమైన వేదాంత శాస్త్రానికి మూలాలు
11/03/2025
యేసు పాపం చేయగలిగి ఉంటాడా?
18/03/2025

ఎక్లేసియా: పిలువబడిన వారు

  1. ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి (Mark 3:13).

    బహుశా మార్కు పేర్కొన్న ఐదుగురు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే కాకుండా యేసును అనుసరిస్తున్న చాలామంది అక్కడ ఉన్నారు. ఆ గుంపులో నుండి, ఆయన పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, మత్తయి, మరియు ఇతరులను పిలిచాడు. “ధర్మశాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, లేదా వ్యాపారము” గురించి అధ్యయనం చేయమని ఆయన వారిని పిలవలేదు; దానికి బదులుగా, ఆయన వారిని తనతో ఉండుటకు పిలిచాడు. తనకు కావాల్సిన వారిని పిలిచాడు, మరియు ఆయన పిలుపు సార్వభౌమాధికార్యమైనది, ఎందుకంటే ఆయన తన కార్యానికి పిలిచిన ప్రతి ఒక్కరూ ఆ కార్యానికై వచ్చారు, ఆయన భాగమైన ఆ మనుష్యుల బృందంలో చేరడానికి వారు ఇష్టపూర్వకంగా వచ్చారు.

    ఒక విధంగా చెప్పాలంటే, ఇది దేవుని రాజ్యమంతటికి యేసు ఏమి చేస్తాడో అనగా అతను కోరుకున్న వారిని పిలుస్తాడు అనే దానిని సూక్ష్మ రూపములో చూసినట్లుగా అర్ధం. “సంఘము” అనే పదానికి బైబిల్లో అనువదించబడిన గ్రీకు పదం ఎక్లేసియా. ఈ పదం ఉపసర్గ మరియు మూలంతో రూపొందించబడింది. “ఏక్ లేదా ఎక్స్” అనేది ఉపసర్గ మరియు దానికి “ఒక దాని నుండి లేదా ఒకదానిపై ..” మూల క్రియ పదం కాలియో, దీని అర్థం “పిలుచుట”. కాబట్టి, ఎక్లేసియా అంటే “వెలుపలకు పిలివబడిన వారు” అని అర్థం. తేలికగా చెప్పాలంటే, అదృశ్య సంఘము, నిజమైన సంఘము, దేవునిచే బాహ్యంగా మాత్రమే కాకుండా అంతర్గతంగా పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడే వారితో కూడి ఉంటుంది. యేసు ఒకరిని శిష్యత్వానికి పిలిచినప్పుడు, ఆయన ఆ వ్యక్తిని ఆయన యొద్దకు పిలుసుకుంటున్నాడు, ఆయనకు  చెందినవాడు మరియు ఆయనను వెంబడించడానికి, ఆయన యొద్దనుండి మరియు ఆయన గురించి నేర్చుకోవడానికి పిలుసుకుంటున్నాడు.

    ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చగల ఏకైక విశ్వాసం తన సొంత విశ్వాసమే. జీవిత భాగస్వామి విశ్వాసం, అతని తల్లిదండ్రుల విశ్వాసం, అతని పిల్లల విశ్వాసం, లేదా ఇతరుల విశ్వాసం ద్వారా ఎవరు నీతిమంతుడుగా తీర్చబడరు. చివరి తీర్పులో ప్రతిఒక్కరూ దేవుని ఎదుట ఒంటరిగా నిలబడతారు మరియు వారి హృదయంలో ఉన్న దాని బట్టి మాత్రమే తీర్పు ఇవ్వబడుతుంది.

     అయితే, క్రీస్తు ఒక వ్యక్తిని రక్షించిన ప్రతిసారీ, ఆయన అతన్ని ఒక గుంపులో ఉంచుతాడు. మనం అలక్ష్యం చేయకుండా ఉండేందుకు దేవుని రాజ్యానికి సామూహిక కోణం ఉంది. నేను ఇటీవల ఒక మహిళతో మాట్లాడాను. ఆమె వెళ్లే సంఘానికి కొత్త పాస్టర్ నియమించబడ్డాడు. ఆమె క్రొత్త పాస్టర్ తో సంతోషంగా లేదు, కాబట్టి ఆమె సంఘాన్ని విడిచిపెట్టింది. ఆరాధన కోసం మీరు ఏమి చేస్తున్నారని నేను అడిగినప్పుడు, ఆదివారం ఉదయం టీవీల్లో మతపరమైన కార్యక్రమాలను చూస్తుందని ఆమె బదులిచ్చారు. స్పష్టమైన సమస్య ఏమిటంటే, ఆమె ఆదివారం ఉదయం సంఘములో లేదు అనగా ఆమె సమూహముగా ఆరాధనలో, పవిత్రమైన సభలో దేవుని ప్రజలతో ఆరాధన చేయడం లేదు. క్రైస్తవ జీవితం అనేది సమాజంగా కూడుకునే విషయం, ఎందుకంటే విమోచించబడిన ప్రజలు కలిసి నేర్చుకోవడానికి, కలిసి ఎదగడానికి, కలిసి సేవ చేయడానికి మరియు కలిసి ఆరాధించడానికి క్రీస్తు వారిని సంఘములో ఉంచుతాడు.

  1. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.