
సంస్కరణ ఎందుకు అవసరం?
12/02/2025
సంస్కరణ ఇప్పటికీ ఎందుకంత ప్రాముఖ్యం
19/02/2025నిజమైన సంస్కరణ

- క్రైస్తవ విశ్వాసమునకు కేంద్రంగా వున్నది మేల్కొలుపు మరియు దాని కారణం వలెనే మనము క్రైస్తవులము. మేల్కొలుపు అనేది సార్వభౌమ మరియు కృపగల దేవుని యొక్క శక్తివంతమైన పని. ఆయన మనలను మేల్కొల్పినప్పుడు, ఊరికే నిద్రనుండి మేల్కొల్పుట లేదు కానీ మరణము నుండి మేల్కొల్పుతున్నాడు. మేల్కొలుపు అనేది పునర్జీవం, ఉజీవము, మరియు సంస్కరణ యొక్క మహిమానీయమైన పని. దేవుడు మనలను మేల్కొలిపినప్పుడు ఆయన మన హృదయాలను పునర్జీవిస్తాడు, నూతన జన్మ అనే వరమును మనకు ప్రసాదిస్తాడు, మరియు మనలను జీవింపజేస్తాడు. “జీవించు!” (యేహిఙ్కేలు 16:6) అని మనతో ఆయన చెబుతాడు. పరిశుద్దత్ముడు మన మీదకి వస్తాడు, మనలను జయిస్తాడు, మనలను ఒప్పిస్తాడు. ఆయన మన మొండి, స్వీయ-నమ్మకం కలిగిన రాతి హృదయాలను చీల్చివేసి, నూతనమైన, సజీవమైన హృదయాలను (అనగా విశ్వసించడానికి ఇష్టపడే మరియు సామర్థ్యం కలిగిన హృదయాలను; మన తండ్రి చేతిలో మృదువైన, సౌకర్యవంతమైన హృదయాలను, ఐక్యతతో మరియు ప్రేమాపూర్వకంగా క్రీస్తుకు బానిసలుగా వున్నా హృదయాలను, మరియు పరిశుదాత్మచే నివసింపబడ్డ హృదయాలను) మన మృతమైన హృదయాలతో మారుస్తాడు.
ఒకే ఆత్మాలో ఉజీవము అయినా, కుటుంబములో ఉజీవము అయినా, సమాజములో ఉజీవము అయినా, లేదా దేశములో ఉజీవము అయినా, దేవుడు మేల్కొల్పినప్పుడు, ఆయన ప్రతిసారి ఉజీవము తీసుకొని వస్తాడు. దేవుడు ఉజీవము తీసుకొని వచ్చినప్పుడు, అయన ప్రతీసారి లోతైన ఒప్పింపజేసే మారుమనస్సును తీసుకొని వస్తాడు. అది విశ్వాసము, మారుమనస్సు, మరియు విధేయత కలిగిన జీవితానికి దారితీస్తుంది. దేవుడు మనలను మేల్కొలిపినప్పుడు ఆయన ప్రతీసారి నిజమైన మరియు నిలిచియుండే సంస్కరణను తీసుకొని వస్తాడు (అంటే హృదయాలు, జీవితాలు,గృహాలు, మరియు సంఘాల యొక్క సంస్కరణ). అయినప్పటికీ, మేల్కొలుపును మనము షెడ్యూల్ చేయలేము, మరియు మేల్కొలుపును తీసుకురావడానికి ఉపరితల, సూత్రబద్ధమైన ప్రణాళికను రూపొందించడానికి మనం ప్రయత్నించకూడదు. “ఒక ఉజ్జీవమునకు ప్రచారం చేయవలసిన అవసరం లేదు; దానంతటికి అదే ప్రచారం చేసుకుంటుంది” అని డి. మార్టిన్ లాయిడ్-జోన్స్ అన్నారు. దేవుడు నియమిస్తేనే మేల్కొలుపు అనేది జరుగుతుంది. ఆయనే తన సార్వభౌమ ప్రణాళిక ప్రకారం మేల్కొలుపును తీసుకొస్తాడు. ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికీ కావాలంటే వారికి, ఆయనే మేల్కొల్పును కలుగజేస్తాడు.
ఏదేమైనా, దేవుడు మేల్కొలుపును నియమించినట్లు, ఆయన మేల్కొలుపు యొక్క సాధనాలను నియమిస్తాడు. దేవుడు అన్ని విషయాల అంతములను (లక్ష్యములను) నియమించడమే కాకుండా, ఆ అంతముల యొక్క సాధనాలను కూడా ఆయనే నియమిస్తాడు. మనము క్రమము తప్పకుండా జరుపుకునే వారపు ఆరాధన మరియు రోజు వారి కృపలో ఎదుగుదల కొరకు దేవుడు నియమించిన సాధారణ మార్గాలే దేవుడు మేల్కొల్పు తీసుకొని రావడానికి నియమించిన మార్గాలు. వాక్యము, ప్రార్థన, బాప్తీస్మము మరియు ప్రభువు బల్ల సంస్కారాలు దేవుడు మనకిచ్చిన సాధారణ కృపా సాధనాలు. ఈ సాధనాల ద్వారా పరిశుద్దాత్ముడు నిజమైన మార్పును, నిజమైన ఉజ్జీవాన్ని, ఇంకా నిజమైన సంస్కరణను తీసుకొని వస్తాడు. దేవుని మేల్కొలుపు శక్తి మన పథకాలు మరియు వ్యూహాల ద్వారా సక్రియం చేయబడదు, కానీ ఆయన ఆత్మ మరియు ఆయన సాధారణ మేల్కొలుపు మార్గాల ద్వారా సక్రియం చేయబడుతుంది. మనము ఆయన ముఖము ఎదుట (కోరం డేఓ) జీవించినప్పుడు ఆయన ముక్కప్రకాశము యొక్క వెలుతురు మన పైన ప్రకాశిస్తుందని ఆయన వాగ్ధానాలలో విశ్రమిస్తు, ఆయన సార్వభౌమ జ్ఞానం ప్రకారము ఆయనకు ఏదైతే ఇష్టమౌతుందో అదే ఆయన చేయాలని మనము నమ్మాలి.
ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో ప్రచురితమైంది.