జాన్ కాల్విన్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు
24/01/2025
సంస్కరణ ముగించబడిందా?
01/02/2025
జాన్ కాల్విన్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు
24/01/2025
సంస్కరణ ముగించబడిందా?
01/02/2025

మార్టిన్ లూథర్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

  1. మార్టిన్ లూథర్ తన యవ్వన జీవితంలో ప్రతి మూడు వారాలకోసారి కీర్తనలను చదివేవాడు

 సోలా స్క్రిప్ట్యురా అనే ఈ లాటిన్ పదానికి అర్థం “లేఖనం మాత్రమే”. మన సిద్ధాంతానికి, సంఘ ఆచరణకు, క్రైస్తవ జీవితానికి లేఖనమే అంతిమ అధికారమని దీని అర్థం. సంస్కరణ ప్రారంభ సంవత్సరాల్లో, లూథర్ దీని కోసం పోరాడాడు. రోమన్ కాథలిక్ చర్చి క్రియలు మరియు యోగ్యతల యొక్క తప్పుడు సువార్తను బోధించిందని అతను వాదించాడు. అతను విశ్వాసం ద్వారా మాత్రమే నీతి కలుగుతుందని వాదించాడు: దానిని సోలా ఫిడే అంటారు. 1519 లో లీప్జిగ్ వద్ద జోహన్ ఎక్ తో మరియు 1521 లో వార్మ్స్ వద్ద మాదిరిగా రోమన్ కాథలిక్ అధికారులతో జరిగిన ప్రారంభ చర్చలలో, లూథర్ సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే, ఆయన నమ్మిన సిద్ధాంతానికి మూలాల్ని నిరూపించాల్సి వచ్చింది, అతను దేనిపై నిలబడ్డాడు? “లేఖనం,” అని బిగ్గరగా పలికాడు. లూథర్ లేఖన౦ మీద నిలబడ్డాడు.

 లూథర్ బైబిలును సమర్థి౦చడ౦, చదవడ౦, అధ్యయన౦ చేయడ౦, జీవి౦చడ౦, ప్రేమి౦చడ౦ వ౦టివాటిలో తన జీవితాన్ని గడిపాడు. ఆయన ప్రతి స౦వత్సర౦ బైబిలు మొత్తాన్ని రెండు లేదా మూడుసార్లు చదివేవాడు, అదే సమయంలో నిర్దిష్ట భాగా లను లేదా పుస్తకాలను లోతుగా అధ్యయన౦ చేశేవాడు. మరి ముఖ్యముగా ఆయనకు కీర్తనలంటే చాలా ఇష్టం. మూడు వారాల్లో మొత్తం కీర్తనలను పూర్తి చేసే రోజువారీ పఠనా పట్టీని ఆయన నిర్వహించాడు. లూథర్ సోలా స్క్రిప్టురాను బోధించాడు మరియు దాని ప్రకారం జీవించాడు.

 

  1. లూథర్ తన తొంభై అయిదు సిద్ధాంతాలను సంఘ ద్వారము మీద పోస్ట్ చేసిన తరువాత, హైడెల్ బర్గ్ వివాదానికి ఇరవై ఎనిమిది థీసిస్ ల శ్రేణిని కూడా వ్రాశాడు

1517 అక్టోబరు 31న లూథర్ యొక్క తొంభై-ఐదు సిద్ధాంతాలు పోస్ట్ చేయబడినవి, సంస్కరణోద్యమాన్ని రగిలించాయి. ఆ సమయంలో అతను సాధు అగస్టీనియన్ మరియు ఆ ప్రాంతంలో అతని వ్యవస్థకు పెద్దగా ఉండేవాడు. జోహన్నెస్ స్టాపిట్జ్కు లూథర్ విమర్శ పట్ల సానుభూతిని కలిగి ఉండేవాడు . 1518 ఏప్రిల్ లో హైడెల్ బర్గ్ లో జరిగిన అగస్టీనియన్ ఆర్డర్ సమావేశంలో తన వాదనను వినిపించమని స్టాపిట్జ్ లూథర్ ను ఆహ్వానించాడు.

 హైడెల్ బర్గ్ థీసిస్ నెంబరు 16లో అతను ఇలా వాదిస్తాడు, “ఏ వ్యక్తయితే తన క్రియ ద్వారా కృపను పొందగలనని నమ్ముతాడో ఆ వ్యక్తి తన పాపానికి ఇంకా పాపాన్ని జోడిస్తాడు, తద్వారా అతను రెట్టింపు దోషి అవుతాడు.” ఆయన 17వ అధ్యాయంలో ఇలా కొనసాగిస్తాడు, “ఈ విధంగా మాట్లాడటం వల్ల  నిరుత్సాహనికి  కారణం కాదు కానీ తనను తాను తగ్గించుకుని, దేవుని కృపను పొందాలనే కోరికను రేకెత్తిస్తుంది.” మన అసమర్థత గురించి మనం నిరాశ చెందుతున్నప్పటికీ, ఇంకా నిరీక్షణ ఉంటుంది. అది మనలో కాదు, క్రీస్తులోను, సువార్తలోను కనిపిస్తుంది. హైడెల్ బర్గ్ థీసిస్ నెంబరు 28 అనేది లూథర్ వ్రాసిన అత్యంత అందమైన వాక్యం కావచ్చు: “దేవుని ప్రేమ తనకు  ప్రీతికరమైనదాన్ని కనుగొనదు కానీ సృష్టిస్తుంది.” దేవుడు మనలను ప్రేమించి, మనము తన శత్రువులుగా ఉన్నప్పుడు క్రీస్తును మన కొరకు పంపాడు. అదే కృప.

 

  1. మాజీ సాధువు అయిన లూథర్, ఒక మాజీ సాధువురాలిని వివాహం చేసుకున్నాడు

ఒక సాధువుల సమూహం నింబ్స్చెన్ కాన్వెంట్ నుండి తప్పించుకుని విట్టెన్ బర్గ్ వెళ్ళారు. కొందరు తిరిగి తమ కుటుంబస్తుల యొద్దకు చేరుకున్నారు. కొంతమంది విట్టెన్ బర్గ్ వద్ద విద్యార్థులు లేదా పాస్టర్లను వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరైన కత్రినా వాన్ బోరా 1525లో మార్టిన్ లూథర్ ను వివాహం చేసుకుంది. లూథర్ ఆమెను “కేటీ, నా పక్కటెముక” అని పిలిచే వాడు. వారు ఒక అద్భుతమైన జంట. లూథర్ సంస్కరణను నిర్విరామముగా ముందుకు తీసుకువెళుతుండగా, ఆమె రద్దీగా ఉండే ఇంటిని, పెద్ద తోటను, చేపల హేచరీని మరియు ఒక చిన్న బ్రూవరీని నిర్వహించింది. వీరికి ఆరుగురు సంతానం కాగా, బంధువుల ద్వారా అనాథలైన ఇతరులను దత్తత తీసుకున్నారు. వారు ఒక పసిబిడ్డను కోల్పోయారు, మరియు వారు తమ పదమూడేళ్ల కుమార్తె మాగ్డలీనా మరణాన్ని భరించారు.

మార్టిన్ లూథర్ మరణానంతరం కేటీ కష్టాల్లో పడింది. ఆమెకు మద్దతుగా స్నేహితులు, మద్దతుదారులు ముందుకొచ్చారు. ఆ క్లిష్ట సమయాల్లో ఆమె ఇలా చెప్పింది, “నా మట్టుకు నేను క్రీస్తుకు ఒక వస్త్రం వలె అతుక్కుపోయి ఉన్నాను.”

 

  1. మార్టిన్ లూథర్ ఎంత మంచి వేదాంతవేత్తపరుడో అంతేవిధంగా మంచి సంగీత విద్వాంసుడు

లూథర్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. అతను ల్యూట్ (వీణ వంటిది) వాయించే వాడు. అతను 1524 లో తన మొదటి కీర్తనను వ్రాశాడు- ఇది ఒక శ్లోకం అంటే జానపద గేయం- “ఇక్కడ ఒక కొత్త పాట ప్రారంభమవుతుంది” అనే శీర్షికతో ఉంటుంది.  ఇది పన్నెండు శ్లోకాల నిడివితో నడుస్తుంది మరియు నెదర్లాండ్స్ లో ఇద్దరు అగస్టీనియన్ సాధువుల త్యాగానికి గుర్తుగా ఉంటుంది. వారు మార్చబడి లూథర్ ను అనుసరించి, సంస్కరణ సిద్ధాంతాల భోధకులైయ్యారు, సువార్తను తమ మాతృదేశానికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నారు. వారిని అరెస్టు చేసి అమరులను చేశారు. ఆ మాట లూథర్ కు తెలియగానే, అతను సంగీతం వైపు మళ్లాడు. ఐదు సంవత్సరాల తరువాత అతను తన అత్యంత ప్రసిద్ధ శ్లోకాన్ని మరియు సంఘ చరిత్రలో అత్యంత ప్రియమైన కీర్తనలలో ఒకటి, “శక్తివంతమైన కోట మన దేవుడు(మైటీ ఫోట్రెస్).” వ్రాశాడు. అతను 1524 లో మొదటి సంస్కరణోద్యమ కీర్తనను ప్రచురించాడు. అతను లూథరన్ చర్చిలో మరియు శాస్త్రీయ సంగీతంలో భావితరాల సంగీతకారులకు కూడా ప్రేరణగా నిలిచాడు. కొంతకాలం లూథర్ ఉన్నత శ్రేణికి చెందిన లూథరన్ సంగీత విద్వాంసుడైన జోహాన్ సెబాస్టియన్ బాచ్ స్వస్థలమైన ఐసెనాక్ లో చదువుకున్నాడు. ఒకానొక సందర్భంలో లూథర్ ఇలా అన్నాడు, “వేదాంతశాస్త్రం తరువాత, నేను సంగీతానికి అత్యున్నత స్థానం మరియు గొప్ప గౌరవాన్ని ఇస్తాను.”

 

  1. మార్టిన్ లూథర్ తన స్వగ్రామంలో మరణించాడు

మార్టిన్ లూథర్ 1486 నవంబరు 10న ఐస్లెబెన్ లో జన్మించాడు. అతను 1511 లో చదువుకోవడానికి మరియు బోధించడానికి విట్టెన్ బర్గ్ కు వెళ్ళాడు. విట్టన్ బర్గ్ తో అత్యంత అనుబంధం ఉన్న పట్టణంగా మారుతుంది. ఆయన అక్కడ సాధువు. తన తొంభై ఐదు థీసిస్ లను అక్కడ పోస్ట్ చేశాడు. అక్కడే పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషించాడు. అతను విట్టెన్ బర్గ్ యొక్క సెయింట్ మేరీస్ చర్చిలో దాదాపు ప్రతిరోజూ బోధించాడు మరియు అతను విట్టెన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు. 1546 జనవరిలో ఐస్లెబెన్ లో ఒక వివాదం చెలరేగి చర్చిని, పట్టణాన్ని కూల్చివేస్తామని బెదిరించడంతో, ముసలివాడైన లూథర్ తన వయసును గ్రహించి తన స్వగ్రామానికి బయలుదేరాడు.

క్లిష్టమైన కాళ్ళ నడక తర్వాత, లూథర్ హీరోగా స్వాగతించబడ్డాడు , ప్రత్యర్థి పక్షాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించాడు, కొన్నిసార్లు బోధించాడు, ఆపై అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్య పడక అతని మరణ మంచంగా మారింది. అతను తన చివరి రాతపూర్వక మాటలను ఒక కాగితంపై ఇలా వ్రాసాడు: “మేము బిచ్చగాళ్ళం. ఇది నిజం.” లూథర్ 1546 ఫిబ్రవరి 18న మరణించాడు. కేటీ లాగే, అతను చివరి వరకు క్రీస్తుకు అతుక్కుపోయాడు.

ఈ వ్యాసం మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాల సేకరణలో భాగం.

స్టీఫెన్ J. నికోల్స్
స్టీఫెన్ J. నికోల్స్
డాక్టర్ స్టీఫెన్ జె. నికోల్స్ రిఫార్మేషన్ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ మరియు లిగోనియర్ మినిస్ట్రీస్ యొక్క చీఫ్ అకడమిక్ ఆఫీసర్. అతను బియాండ్ ది 95 థీసిస్, ఎ టైమ్ ఫర్ కాన్ఫిడెన్స్ మరియు ఆర్.సి.స్ప్రోల్: ఎ లైఫ్తో సహా అనేక పుస్తకాల రచయిత.