మీరు ఎందుకు పని చేస్తారు?
24/01/2025
మార్టిన్ లూథర్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
01/02/2025
మీరు ఎందుకు పని చేస్తారు?
24/01/2025
మార్టిన్ లూథర్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
01/02/2025

జాన్ కాల్విన్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు

  1. జాన్ కాల్విన్ తన సంఘము నుండి, పరిచర్య నుండి మరియు ఇంటి నుండి బహిష్కరించబడ్డాడు.

జెనీవాలో తన పరిచర్యను ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపు, ఇరవై తొమ్మిదేళ్ల జాన్ కాల్విన్ (1509-64) తన సంఘము నుండి, పరిచర్య నుండి మరియు ఇంటి నుండి బహిష్కరించబడ్డాడు, నగరాన్ని విడిచిపెట్టడానికి రెండు రోజుల నోటీసు ఇవ్వబడింది. ఆ ఏప్రిల్ లో అతను మరియు విలియం ఫారెల్ జెనీవా నుండి బయలుదేరినప్పుడు, తరువాత ఏమి సంభవిస్తుందో అని వారు ఆలోచనలోపడ్డారు. ఈ చేదు అనుభవానికి ప్రతిస్పందనగా వారి ఆలోచనలు ముంచుకొస్తున్న సంఘ ఘర్షణల మీద ఉన్నాయి; వారు జ్యూరిక్  మరియు బెర్న్ లను జెనీవాలో వారిని తిరిగి నియమించడానికి ఎలా ఒప్పించవచ్చో అని యోచిస్తున్నారు. అయినప్పటికీ, కాల్విన్ కు తెలియకుండా, ప్రభువు తన అనుగ్రహంతో వారి ప్రయత్నాలను అడ్డుకుంటాడు.

దానికి బదులుగా, ప్రభువు కాల్విన్ యొక్క భవిష్యత్తులో చేయబోయే కాపరి పనులకు పునాది వేసే కాపరి శిక్షణకు కావలసిన సమయాన్ని ఏర్పాటు చేశాడు.

 

  1. జాన్ కాల్విన్ పరిచర్యలో అపజయాలను అనుభవించాడు.

ఆయన సంఘ క్రమశిక్షణ ద్వారా ప్రభు బల్లను నమ్మకంగా నిర్వహించాలని జెనీవాలో పడిన ప్రయాసాల గురించి కాల్విన్ యొక్క జీవిత కథ గురించి అవగాహన ఉన్న వారికి తెలిసే ఉంటుంది, అయితే కొంతమందికి మాత్రమే తన అపజయాల ద్వారా ప్రభువు తనను ఎలా మార్చాడో తెలుసు. బహిష్కరణలో ఉన్నపుడు ఒక్కసారి, కాల్విన్ బేసెల్ లో మొదట్లో స్థిరపడ్డాడు, కానీ మార్టిన్ బ్యూసర్ చే (1491-1551) స్ట్రాస్బోర్గ్ కు రమ్మని ఆహ్వానింపబడ్డాడు. కాల్విన్ కన్నా ఇరవై సంవత్త్సరాలు పెద్ద అయిన బ్యూసర్, కాల్విన్ కు పట్టణంలో పరిచర్య అవకాశాలు కల్పించడమే కాకుండా కాల్విన్ తో స్నేహం పెంచుకున్నాడు, తన ఇంటికి ఆహ్వానించాడు, కాలక్రమేణా కాల్విన్ కు పొరుగు ఇంటిని కొనుగోలు చేయడంలో సహాయం చేశాడు. ఇదంతా కాల్విన్ ఒక సంవత్సరం క్రిందట బ్యుసర్ కు ఒక కండితమైన, అహంకారంతో నిండిన లేఖను రాసిన తరువాత జరిగినది – ఆ లేఖకు బ్యుసర్ మాత్రం చాలా ఓపికతో, ప్రేమపూర్వకంగా స్పందించాడు. బ్యుసర్ లో, కాల్విన్ తనకు అవసరమైన మెంటర్ ను మరియు కాపరిని కలిశాడు.

 

  1. జాన్ కాల్విన్ శరణార్థులకు కాపరిగా పనిచేశాడు.

కాల్విన్ జెనీవాకు వచ్చిన సంవత్సరమే  (1538) బ్యుసర్ తన కన్సర్నింగ్ ద ట్రూ కేర్  అఫ్ సోల్స్1 అనే “చిన్న పుస్తకము” యొక్క వ్రాతప్రతిని పూర్తి చేస్తున్న సంవత్సరం.  వారిద్దరూ సంఘ పరిచర్య గురించి మరియు సంఘ జీవితం గురించి వారి భోజన సమయంలో జరిగే సంభాషణలో అనుమానం లేకుండా విపులంగా మాట్లాడుకొని ఉంటారు. బ్యుసర్ స్ట్రాస్బోర్గ్ లోని పరిచర్యలో చాలా కాలం అడ్డంకులు ఎదుర్కున్నాడు, మరియు సంఘానికి సంఘపరిచర్యకు క్రీస్తు కేంద్రితమైన  ఎదుగుదలను తీసుకొని రావడానికి అతను ఓపికతో పడిన కష్టాల భాగంలో తన రచనలు వున్నాయి. దేవుని ప్రావిడెన్స్ లో, పట్టణంలో కాల్విన్ యొక్క పరిచర్య అవకాశాలు బోధనకు మించి వున్నాయి; ఆయన ఫ్రెంచ్ శరణార్ధుల సంఘానికి  కాపరిగా సేవ చేశాడు. ఆ పనిలో ఎన్నో  ప్రోత్సాహాలు పొందుకున్నప్పటికీ, కాల్విన్ దుఃఖములు కూడా అనుభవించాడు. కాల్విన్ యొక్క రక్షణ విషయంలో పాత్రుడిగా ఉన్న అతని సన్నిహిత స్నేహితుడు మరియు బంధువు అయిన పియరీ రాబర్ట్ ఒలివెటన్ మరణించాడు. కాల్విన్ కు శ్రమలనుండి కాపుదలను కల్పించి, ది ఇంస్టిట్యూట్స్ అఫ్ ద క్రిస్టియన్ రెలీజియన్ యొక్క మొదటి పత్రాన్నికి కావలసిన వనరులను అందించిన లూయి డు టిల్లేట్, ఫ్రాన్స్ కు చెందిన తన పాత స్నేహితుడు, రోమన్ కాథోలిసిసంకు తిరిగి వెళ్ళిపోయాడు. “నా జీవితములో ఒక ఉత్తమమైన  సహచరురాలు” అని భావించిన ఐడెలెట్ డె బూర్ తో 1540 లో జరిగిన వివాహం ద్వారా నూతన సంతోషము పొందుకున్నాడు.

 

  1. తనను బహిష్కరించిన సంఘానికి జాన్ కాల్విన్ స్వచ్చందంగా తిరిగి వెళ్ళాడు. 

కాల్విన్ కు వివాహం జరిగిన సంవత్సరమే, స్ట్రాస్బోర్గ్ లో క్రొత్త పని మధ్యలో, “నా జీవితములో అత్యంత సంతోషకరమైన సంవత్సరాలలో” అని అనుకున్న సమయంలో, ఒక అనుకోని పిలుపు వచ్చింది. జెనీవా అతడు తిరిగి వచ్చి మళ్ళీ కాపరిగా సేవ చేయాలని కోరుకుంది.  “ఆకాశము క్రింద నేను భయపడే ప్రదేశము దాని కన్నా ఇంకా ఏది లేదు… రోజుకు వెయ్యి సార్లు ఆ సిలువలో చనిపోవడం కన్నా నేను వేరే రకంగా వంద సార్లు చనిపోవడానికి సిద్ధంగా వున్నాను” అని చెబుతూ సంకోచించాడు. అయినప్పటికీ, జెనీవా మాత్రమే మారలేదు కానీ – కాల్విన్ కూడా కొన్ని సంవత్సరాలలో మారాడు. బ్యుసర్ ప్రోత్త్సహంతో మరియు అతని ఆందోళనతో, కాల్విన్ ఆ పిలుపుకు లోబడ్డాడు. కొన్ని విధాలుగా, ఆ పట్టణం మారింది, సంఘము మరియు సమాజము సంస్కరణ దిశకు మరింత స్వాగతం పలికింది. వేరే విధంగా, ఆ పట్టణం అలానే వుంది. ప్రభువు బల్లను నమ్మకంగా పాటించే విషయం పరిష్కరించబడటానికి పద్నాలుగు సంవత్సరాలు తీసుకుంది. సంఘము యొక్క బలహీనత గురించి బాధపడుతూ ఉండగానే, కాల్విన్, తన జీవితంలో ప్రభువు బ్యుసర్ యొక్క పరిచర్యను వాడుకునందున సంఘము పట్ల మరింత సుదీర్ఘమైన దర్శనమును మరియు చాలా ఓపికగల ప్రేమను కలిగి వున్నాడు. 

 

  1. ఆనందాలు, శ్రమమాల ద్వారా, జాన్ కాల్విన్ దేవుని ప్రావిడెన్స్ కొరకు చూసాడు.

తొమ్మిది సంవత్సరాల తరువాత, జెనీవాలో పునరుద్ధరి౦చబడిన తన పరిచర్యలో, తన ప్రియమైన భార్యను సమాధి చేసిన కొన్ని నెలల తర్వాత,  కాల్విన్ థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన మాటలను ఇలా చెబుతూ: “మన రక్షణ యొక్క ఆరంభముకు మాత్రమే పౌలు దేవుని కృపకు  ఆపాదించడం కాకుండా… మన రక్షణ యొక్క పూర్తి పురోగతి  దేవుని కృప వలనే” అని బోధించాడు. ఆహ్లాదకరమైన రోజుల వెనుక, [దేవుని] ప్రావిడెన్స్ తో నిండిన కష్టమైన రోజుల వెనుక, ఎవరైతే మనలను పరిచర్యకు మరియు మహిమకు సిద్ధపరచడం కొనసాగిస్తున్నారో, ఆ రక్షకుని చిరునవ్వుతో నిండిన ముఖమే ఉందని ఆయన (కాల్విన్) ఆనందాలు, శ్రమమాల ద్వారా మరింత లోతుగా నేర్చుకున్నాడు. 

 

ఈ వ్యాసం మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాల సేకరణలో భాగం.

  1. మార్టిన్ బుసెర్, ట్రూ కేర్ ఆఫ్ సోల్స్ గురించి, ట్రాన్స్ పీటర్ బీలే (కార్లైల్, పి.ఎ: బానర్ ఆఫ్ ట్రూత్, 2009), 1-218.
విలియం వాన్ డ్యూడ్వార్డ్
విలియం వాన్ డ్యూడ్వార్డ్
డాక్టర్ విలియం వాన్ డూడెవార్డ్ సౌత్ కరోలినాలోని గ్రీన్ విల్లే ప్రెస్బిటేరియన్ థియోలాజికల్ సెమినరీలో సంఘ చరిత్ర ప్రొఫెసర్. అతను ది క్వెస్ట్ ఫర్ ది హిస్టారికల్ ఆడమ్ మరియు చార్లెస్ హాడ్జ్ యొక్క ఎక్సెజెటికల్ లెక్చర్స్ అండ్ సెర్మోన్స్ ఆన్ హెబ్రూస్ తో సహా అనేక పుస్తకాలకు రచయిత లేదా ఎడిటర్.