ప్రొటెస్టెంట్ చేసిన తప్పులలో పెద్ద తప్పు ఏమిటి?
16/01/2025
జాన్ కాల్విన్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు
24/01/2025
ప్రొటెస్టెంట్ చేసిన తప్పులలో పెద్ద తప్పు ఏమిటి?
16/01/2025
జాన్ కాల్విన్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు
24/01/2025

మీరు ఎందుకు పని చేస్తారు?

మీరు ఎందుకు పని చేస్తారు? నేను ఒకసారి ఇలాంటి ప్రశ్నకి నిరుత్సాహకరమైన సమాధానాన్ని విన్నాను. అది ఈ విధంగా ఉంది: “మా పిల్లలను మంచి పాఠశాలలో వేయడానికి, వారు అక్కడ  మంచిగా చదివి, వారును  ఉద్యోగం చేసి  తద్వారా వారు వారి పిల్లలకు కూడా అలాగే చేయోచ్చని మేము ఉద్యోగం చేస్తాం”.  వేరే విధంగా చెప్పాలంటే పని అర్థరహితమైనది. వాస్తవానికి, కేవలం ఆ దృక్పధంలో చూసినట్లైతే ఈ  అంతులేని చక్రంలో  అసలు జీవితమే అర్థరహితంగా మారుతుంది.

మరి కొందరైతే దేవుని రాజ్య పరిచర్యకు మద్దతు ఇవ్వడానికి మేము పని చేస్తాము మరియు అదే నిజమైన పని అని కూడా అనడం విన్నాను. దేవుని పరిచర్య విషయంలో ఇచ్చే మద్దతుకు నేను వ్యతిరేకం కాదు. వాస్తవానికి, మీరు అలా చేయాల్సిన బాధ్యత ఉందని బలమైన బైబిల్ ఆధారాలు చూపించగలరని నేను భావిస్తున్నాను. కానీ ఇది పని యొక్క పూర్తి అర్ధాన్ని సంగ్రహిస్తుందా అని నేను ఆశ్చర్యపోతున్నాను.

మరొకసారి, మీరు ఎందుకు పని చేస్తారు? మొదటిగా దీని గురించిన సమాధానం నేను 104వ కీర్తనలో కనుగొన్నాను. ఈ కీర్తన సృష్టి యొక్క ప్రతిబింబం మరియు ఆపైన ఆదికాండం 6-8 అధ్యాయాలలో తదుపరి ప్రతిబింబం కూడా కావచ్చు. దేవుడు భూమిని మరియు సమస్త జీవులను సృష్టించిన విషయాన్ని, కీర్తనకారుడు కవితాత్మకంగా వర్ణించడం మనం చూస్తాము, అంతమాత్రమే కాదు ఆయన సృష్టిని మరియు సమస్త జీవులను నిలబెట్టుకొనే దేవుని పనిలో ఆయనకున్న చిత్తశుద్ధిని కూడా మనం చూస్తాము (వ. 1-13).

14వ వచనంలో, దేవుడు పశువులకు మరియు ప్రజలకు పోషకుడని మనం చదువుతాము. అయితే దేవునిచే అనుగ్రహించబడిన కూర మొక్కలను పెంచే భాద్యత మానవునిదే అని  కూడా చదువుతాం. మన పని ద్వారా దేవుని ప్రతిబింబింపచేయడమే ఇక్కడ మనకున్న విధి. దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారిగా, మనం ఆధిపత్యం వహించాలి మరియు భూమిని లోపరచుకోవాలి. అసలు, దేవుడు ఇచ్చిన తోటను మనం విస్తరించాలి. మనం ఇక్కడ ఆదికాండము 1:26-28 యొక్క సాంస్కృతిక ఆదేశం యొక్క సారంశాము చూస్తాము.

కీర్తన 104లోని 21-23 వచనాలలో కూడా మనం దీనిని చూస్తాము.  సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి – అలాగే మనిషి కూడా “సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై  బయలుదేరి” వెళ్తాడు (వ. 23). ఇక్కడ ఒక సామరస్యత ఉంది, దానిని మరువకండి. దేవుని యొక్క అన్ని జీవులు, గొప్పవి మరియు చిన్నవి, వాటిని  సృష్టించిన రూపకల్పనకు అనుగుణంగా అన్నియు సామరస్యంతో పని చేస్తున్నాయి. సింహాలు వాటి  “పని” నిమిత్తం చేయబడ్డాయి. మనము అయన స్వభావమును ప్రతిబింబించే  పనికై  చేయబడ్డాము. వాస్తవానికి, కీర్తనకారుడు నిరంతరాయంగా జీవి నుండి జీవికి మాత్రమే కాకుండా, జీవి నుండి సృష్టికర్త అయిన దేవునితో  కొనసాగుతాడు. తరువాతి 24వ వచనంలో, కీర్తనకారుడు ఇలా ప్రకటించాడు, 

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది.”

మన పనికి మరియు దానికి సంబంధించిన గొప్ప అర్థానికి గల సమస్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. మనం పని చేయుచుండగా, ఆ పనిలో సృష్టికర్త అయిన దేవుని పనిని ప్రతిబింబిస్తాము. లోపరచుకొని ఆధిపత్యం వహించే మన పనిలో, పండించే పనిలో, మనకు ఇంకేదో కనిపిస్తుంది. అదేమిటంటే, మనం ఎవరి స్వారూప్యంలో తయారు చేయబడతామో వారికి మన పని సాక్ష్యాన్ని ఇస్తుంది మరియు ఆయనను సూచిస్తుంది. సి.ఎస్. లూయిస్ ఇలా చెప్పారు “మేము ఒక సాధారణ వ్యక్తిని ఎన్నడు కలవలేదు.’’ బహుశా మనం దానిని ఈ విధముగా చెప్పవచ్చు: మనము ఎప్పుడూ సాధారణమైన  పని చేయము. పని అనేది నీచమైనది, అల్పమైనది, అర్ధంలేనిది, అసంబద్ధమైనది లేదా అర్థరహితమైనది కాదు. మన పని అర్థం మరియు ప్రాముఖ్యతతో నిండి ఉందని అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇక్కడ ఆగండి ఇక్కడ ఇంకా ఉంది. 

25-26 వచనాలలో ఈ విధంగా చదువుతాము: 

అదిగో విశాలమైన మహాసముద్రము 

అందులో లెక్కలేని జలచరములు 

దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి

అందులో ఓడలు నడుచుచున్నవి 

దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి.

దేవుని యొక్క గొప్పతనాన్నికి ఔన్నత్యాన్నికి అందాన్నికి సముద్రం మరియు దానిలోని జీవరాసులు చాలా స్పష్టంగా సాక్ష్యామిస్తున్నాయి. అయితే 26వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. కీర్తనకారుడు ఓడలు మరియు మకరము అను ఈ రెండు విషయాలను సమాంతరంగా ఉంచాడు. పద్యభాగపు పుస్తకాలైన కీర్తనలు, యోబు మరియు కొన్ని ప్రవచన పుస్తకాలలో ఈ జంతువు గురించి ప్రస్తావించబడింది. వాస్తవానికి ఈ జీవి ఏమై యుండవచ్చు అనే విషయాన్ని ఊహించుకోవడంలో కొదువ ఏమి లేదు. ఇది ఒక తిమింగలమా? ఇది ఒక డైనోసారా? ఇది ఒక పెద్ద స్క్విడ్?? అయితే ఈ జీవి గురించి మనకు తెలిసిన విషయం మనకు ఊపిరాడకుండా చేస్తుంది. మనం చాలా తరచుగా అద్భుతం అనే పదాన్ని ఉపయోగిస్తాము మరియు అయితే దానిని అలంకారంగా వాడి  దానిని క్షీణింపజేస్తాము. కానీ ఈ సందర్భంలో ఆ పదం సరిపోతుంది. మకరములు అద్భుతమైనవి .

మకరములు కూడా ఆడటానికి ఇష్టపడతాయి. వాటిని చూడకుండా ఉండలేము . జోనాథన్ ఎడ్వర్డ్స్, ఎగిరే సాలీడు గురించి వ్రాస్తూ, ఈ సాలీడు ఎగిరినప్పుడు దాని ముఖంలో చిరునవ్వు ఉందని పేర్కొన్నాడు. దేవుడు “అన్ని రకాల జీవుల ఆనందం మరియు వినోదం కోసం, క్రిమి కీటకాలతో సహా వాటిని చేసాడని ఎడ్వర్డ్స్ నిర్ధారించాడు. అలాగే  మకరము కూడా అద్భుతమైన మృగం, అది కూడా ఆడుతుంది. ఆపై  26వ  వచనంలో మరికొన్ని సృష్టి కనబడుతుంది ఈ జీవి మానవ నిర్మితమైనది: “అక్కడ ఓడలు వెళ్తాయి.” ఇప్పుడు మనం దీని గురించి ఆలోచించాలి. దేవుని సృష్టి మరియు మన సృష్టి సమాంతరంగా ఒకదానికొకటి పక్కపక్కనే ఉన్నాయి. కీర్తనకర్త మకరమును చూసి ఆశ్చర్యపోతాడు, మరియు కీర్తనకారుడు ఓడలను చూసి ఆశ్చర్యపోతాడు. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. “అదిగో, ఓడ వెళుతుంది. ఎంత అద్భుతం,”  అని మీకు మీరే అంటారేమో.. 

నౌకానిర్మాణంలో ఏమి జరుగుతుంది? గణితం మరియు భౌతిక శాస్త్రం, నైపుణ్యం కలిగిన వడ్రంగి పని, అనుభవం, అనేక విభిన్న పద్ధతులను ప్రయత్నించి తప్పుల నుండి సరైనది నేర్చుకొనిన అనేక తరముల భాగస్వామ్య నైపుణ్యం, మరియు కష్టంతో కూడిన పని  -ఇవన్నీ నౌకానిర్మాణంలోకి అవసరమైనవి. 

సముద్రపు విస్తీర్ణంలో ఓడలు వెళ్లడం చూసి మన కీర్తనకారుడు ఆశ్చర్యపోతాడు. అలాగే సముద్రపు విస్తీర్ణంలో ఉల్లాసంగా మకరములు విహరించడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నిజంగా ఇవి అద్భుతం.

మనం ఈ కీర్తన చదువుతున్నప్పుడు, ప్రకృతిసిద్ధమైన మరియు మానవ నిర్మితమైన పెద్ద ఓడలు సముద్రాలను దాటడం మరియు అలలలో ఆడుకోవడం కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయని మనము కనుగొంటాము. 27వ వచనం మనకు ఇలా చెబుతోంది: “ఇవన్నీ,” దేవునిచే సృజించబడిన  జీవరాసులన్నింటిని సూచిస్తూ,….. “తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి… .నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును.” మన పని వలన మనకు ఆనందం కలుగుతుంది, మనకు పరిపూర్ణత లభిస్తుంది, మన జీవితానికి అర్ధం మనము గ్రహిస్తాము. మనకు మన దేవుడు ఇచ్చిన బహుమతులను, వనరులను గుర్తించి, ఆపై మనము పనికి వెళ్దాం. అప్పుడు మనము సంతృప్తి చెందాతాము. ద్రాక్షారసము మన హృదయాలను సంతోషపరుస్తుంది (వ. 15). సృష్టి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఇవన్నీ కూడా మన పని యొక్క ఫలితాలే. కానీ, ఇవన్నీ మన పని యొక్క ముఖ్యమైన లక్ష్యం లేదా అంతిమ ఫలితం కాదు. మన పని యొక్క ముఖ్యమైన లక్ష్యం గురించి 31వ వచనంలో ఉంది: “ “యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ” మన పని అర్ధవంతమైనది. మనం ఎవరి స్వరూపంలో చేయబడ్డామో మన పని చూపిస్తుంది. మనం పని చేసినప్పుడు మనం దేవునికి మహిమను తీసుకొనివస్తాం. దేవుడు మనలను బట్టి ఆనందిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు పని చేయాలి అనే దానికి జవాబు పొందుకున్నాము.

కీర్తన 104 లో లేని విషయాన్ని నీవు గమనించావా? మందిరం గురించి, మందిరపు సంగీతకారుల గురించి, యాజకులు  మరియు వారి పనుల గురించి ఒక మాటకూడా లేదు. పొలం గురించి ఉంది. ద్రాక్షాతోట గురించి ఉంది. ఒకరి కొకరు శ్రమించే పని గురించి ఉంది. పని గురించి ఉంది.

ఓడల నిర్మాణం గురించి ఉంది. 

“అదిగో ఓడలు వెళ్తున్నాయి.” దేవునికే మహిమ కలుగునుగాక! 

 

ఈ పోస్ట్ మొదట టేబుల్‌టాక్ పత్రికలో ప్రచురించబడింది.

స్టీఫెన్ J. నికోల్స్
స్టీఫెన్ J. నికోల్స్
డాక్టర్ స్టీఫెన్ జె. నికోల్స్ రిఫార్మేషన్ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ మరియు లిగోనియర్ మినిస్ట్రీస్ యొక్క చీఫ్ అకడమిక్ ఆఫీసర్. అతను బియాండ్ ది 95 థీసిస్, ఎ టైమ్ ఫర్ కాన్ఫిడెన్స్ మరియు ఆర్.సి.స్ప్రోల్: ఎ లైఫ్తో సహా అనేక పుస్తకాల రచయిత.