వివాహం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
29/05/2025
నరకం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
05/06/2025
వివాహం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
29/05/2025
నరకం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
05/06/2025

నిబందన వేదాంతశాస్త్రం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

    1. సంస్కరించబడిన సంఘాలలో కొన్ని విషయాలు తరచుగా కవర్ చేయబడతాయి, తద్వారా ప్రాథమిక అంశాలపై పట్టు కోల్పోవడం సులభం కావచ్చు. అలాంటి వాటిలో నిబందన వేదాంత శాస్త్రం (కవనెంట్ థియోలజి) ఒకటి. నిబ౦ధన వేదాంతశాస్త్ర౦ గురి౦చి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలను పరిశీలిద్దా౦.
      1. నిబందన వేదాంతశాస్త్రం దేవునితో మనకున్న సంబంధానికి సంబంధించినది.

      నిబంధన అనేది ఒక అధికారిక సంబంధం. వివాహ౦ ఈ విధమైన స౦బ౦ధానికి చక్కని ఉదాహరణగా ఉ౦టు౦ది (మత్తయి 2:14). వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిగి ఉన్న అత్యంత సన్నిహిత బంధం. ఈ అత్యున్నత వ్యక్తిగత మరియు ప్రేమపూర్వక భాగస్వామ్యం కూడా చట్టబద్ధమైన ఏర్పాటు. నిబంధనలు కూడా అదే విధంగా పనిచేస్తాయి.

      దేవుడు మనతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడో బాగా అర్థం చేసుకోవడానికి నిబ౦ధన వేదాంతశాస్త్ర౦ మనకు సహాయ౦  చేస్తు౦ది. దేవునితో మనకున్న సంబంధం ఏమిటో ఆయన మనకు స్పష్టత ఇవ్వకపోతే ఆయనతో నడవడం చాలా కష్టం. దేవుడు మన గురించి ఎలా భావిస్తున్నాడో, ఆయన మనల్ని అంగీకరిస్తాడో, ఆయన మనల్ని ఎలా అంగీకరిస్తాడో, ఆయనను వెంబడించడానికి ఉత్తమ మార్గాలు వంటి విషయాల గురించి మనం ఊహించాల్సి వస్తే, ఆయనతో మన స్థానం గురించి మనం తరచుగా అనిశ్చితంగా భావిస్తాము.

      దేవుడు ఆయనతో మన సంబంధం ఎలా ఉండాలో స్పష్టంగా వివరిస్తాడని నిబంధన వేదాంతశాస్త్రం ధృవీకరిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు వ్రాసినది,  దేవునితో మనం సరైన సంబంధాన్ని ఎలా కలిగి ఉండవచ్చో అన్న దాని యొక్క స్పష్టమైన ప్రత్యక్షత. నిబందన అనేది ఒక అధికారిక సంబంధ౦ కాబట్టి, ఆ స్థిర బంధ౦లో దేవుడు మనకు కట్టుబడివు౦డడ౦ వల్ల ఆయనతో మనకున్న స౦బ౦ధ౦ గురి౦చి మనకు ఖచ్చితత్వాన్ని ఇస్తాడు.

      1. క్రియలకు, కృపకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి నిబందన వేదాంత శాస్త్రం మనకు సహాయపడుతుంది.

      ఎఫెసీయులు 2:8-9 సంస్కరణ ప్రొటెస్టనులు విమోచనను ఎలా అర్థ౦ చేసుకున్నారనే ఒక కీలకమైన అ౦శ౦ గురి౦చి ఇలా చెబుతో౦ది: “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” కొన్నిసార్లు, కృప ద్వారా మాత్రమే రక్షణను స్వేచ్ఛగా సమర్పి౦చడ౦ 10వ వచన౦లోని అంశానికి ఎలా స౦బ౦ధి౦చి౦దో వివరి౦చడానికి మన౦ కష్టపడతా౦: “మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము” (ఎఫె. 2:10). కృప తీసుకువచ్చే స్వేచ్ఛతో పాటు సరిగా జీవించడానికి మనకున్న బాధ్యతను ఎలా కలిపి పట్టుకోవాలి?

      సంప్రదాయ సంస్కరణాత్మక అవగాహనలో, నిబందన వేదాంతశాస్త్రం క్రియల నిబందన మరియు కృపా నిబందన మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. పతనానికి ముందు దేవుడు ఆదాముతో క్రియల నిబ౦ధన చేశాడు, దానికి పరిపూర్ణ విధేయత ఉ౦డే స్థితి ఉ౦ది. రెండవ ఆదాము, యేసుక్రీస్తు, తీసుకువచ్చిన కృప నిబందనలో, క్రీస్తు ప్రాయశ్చిత్త పనిలో మాత్రమే విశ్వాసం ద్వారా దేవుడు మనలను తన ప్రజలుగా అంగీకరిస్తాడు. ఈ రెండు నిబందనలు క్రియలు మరియు కృప అనేటివి దేవునితో రక్షణ మరియు సరైన స్థానాన్ని పొందడానికి రెండు భిన్నమైన మరియు విరుద్ధమైన మార్గాలు అని స్పష్టం చేస్తున్నాయి.

      అప్పుడు నిబ౦ధన వేదాంతశాస్త్ర౦ కృపను, క్రియలను స౦బ౦ధి౦చడానికి మనకు సహాయ౦ చేస్తు౦ది, ఎ౦దుక౦టే  నిజమైన విశ్వాసుల జీవితాల్లో మ౦చి క్రియలు ఉ౦టాయి అయినప్పటికీ, దేవునితో మనకున్న స౦బ౦ధానికి మన క్రియలు ఆధార౦ కాలేవు. రక్షణ కోస౦ విశ్వాసులతో దేవుని నిబ౦ధనకు మన క్రియలు షరతు కాదు కాబట్టి, అవి మన౦ దేవునితో సరిగ్గా ఉన్నాము అనడానికి కారణ౦ కాజాలవు.

      1. లేఖనమంతటా క్రీస్తును చూడడానికి నిబందన వేదాంత శాస్త్రం మనకు సహాయపడుతుంది.

      కొలొస్సయులు 2:17 ఇశ్రాయేలీయుల మతపరమైన జీవిత౦లోని అనేక లక్షణాలు “రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది” అని వివరిస్తో౦ది. పాత నిబంధన కాల౦ దేవుని ప్రజలపై అనేక ఆచారాలను విధించినప్పటికీ, ఆదికా౦డము 3:15లో వాగ్దాన౦ చేయబడిన వ్యక్తి గురి౦చి, రాబోయే విమోచకుడి గురి౦చి ఈ ఆచారాలు వారికి బోధి౦చాయి. పతనం కాడ ను౦డి క్రీస్తుపై విశ్వాస౦ ఒక్కటే రక్షణకు ఏకైక మార్గ౦ కాబట్టి, లేఖన౦లో మనతో దేవుని అన్ని వ్యవహారాలకు క్రీస్తుయే మూలార్థమని నిబ౦ధన వేదాంతశాస్త్ర౦ మనకు గుర్తుచేస్తు౦ది.

      1. సంఘము యొక్క ప్రాముఖ్యతను చూడటానికి నిబందన వేదాంతశాస్త్రం మనకు సహాయపడుతుంది.

      మత్తయి 28:19-20లోని గొప్ప ఆజ్ఞలో “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసు సమస్త జనులను శిష్యులుగా చేయమని సంఘానికి ఆదేశించాడు. స౦స్కారాలను నిర్వహి౦చడ౦, దేవుని వాక్యాన్ని బోధి౦చడ౦ అనే ఈ బాహ్య నియమాలు దేవుని ప్రజలుగా మన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే సాధనాలు.

      క్రీస్తు అన్ని లేఖనాల సారాంశమని మాత్రమే కాదు, ఆయన తన సంఘానికి ఇచ్చిన సాధారణ కృప సాధనాల ద్వారా మనపై తన ఆధ్యాత్మిక పనిని చేయడానికి తన ప్రజల వద్దకు వస్తాడని నిబందన వేదాంతశాస్త్రం మనకు గుర్తు చేస్తుంది. వెస్ట్ మిన్స్టర్ షార్టర్ కాటెచిజం 88 సంఘము యొక్క కృప సాధనాలు వాక్యం, సంస్కారాలు మరియు ప్రార్థన అని మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తును నిబందన యొక్క పదార్థంగా విశ్వాసులకు అందించే ఈ బాహ్య మార్గాలు తరచుగా నిబందన యొక్క “బాహ్య పరిపాలన” అని పిలువబడతాయి. సంఘము క్రైస్తవ జీవితంలో ఒక అవసరమైన భాగం ఎందుకంటే మనం ఇలా క్రీస్తును కలిసే ఈ బాహ్య పరిపాలనలో పాల్గొంటాము.

      1. పరిశుద్ధతను అనుసరించేటప్పుడు లోతైన భరోసాను పొందడానికి నిబందన వేదాంతశాస్త్రం మనకు సహాయపడుతుంది.

      ఎఫెసీయులు 1:13-14 క్రీస్తునందు విశ్వాసులలో ఆత్మ నివసించడం మన నిత్యజీవానికి హామీ: అని వివరిస్తుంది:

      మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

      క్రీస్తుతో కలిసి నడుస్తున్నప్పుడు పరిశుద్ధతతో ముందుకు నడిపించడానికి మనకు ఈ దైవిక సహాయకుడు ఉన్నాడు.

      మన ఆత్మ-సాధికార పరిశుద్ధత అనేది క్రీస్తు మన కొరకు సంపాదించిన వరం అని నిబందన వేదాంతశాస్త్రం మనకు గుర్తుచేస్తుంది. క్రీస్తు మన తరఫున పరిపూర్ణ విధేయత యొక్క ప్రతి షరతును నెరవేర్చాడు. మన౦ నమ్మక౦గా ఆయనను అనుసరి౦చే౦దుకు ఆయన మనల్ని తన ఆత్మతో సన్నద్ధ౦ చేస్తాడు. మనము ఇప్పటికే క్రీస్తుకు చెందినవారమని, నిత్యత్వములో ఆయనతో జీవము యొక్క భరోసాను కలిగి ఉన్నామని ఆత్మ యొక్క ఈ బహుమానం రుజువు చేస్తుంది.

    2. ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.
      1.        
డాక్టర్ హారిసన్ పెర్కిన్స్
డాక్టర్ హారిసన్ పెర్కిన్స్
డాక్టర్ హారిసన్ పెర్కిన్స్ మిచిగాన్‌లోని ఫార్మింగ్టన్ హిల్స్‌లోని ఓక్లాండ్ హిల్స్ కమ్యూనిటీ చర్చి పాస్టర్, ఎడిన్‌బర్గ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమాటిక్ థియాలజీలో విజిటింగ్ లెక్చరర్ మరియు వెస్ట్‌మినిస్టర్ థియోలాజికల్ సెమినరీలో చర్చి చరిత్రలో ఆన్‌లైన్ ఫ్యాకల్టీ సభ్యుడు. అతను రిఫార్మ్డ్ కోవెనెంట్ థియాలజీ: ఎ సిస్టమాటిక్ ఇంట్రడక్షన్ మరియు లివింగ్ అవుట్ రిఫార్మ్డ్ థియాలజీ: ఎ స్టూడెంట్స్ గైడ్ టు లివింగ్ అవుట్ రిఫార్మ్డ్ థియాలజీతో సహా అనేక పుస్తకాల రచయిత.