17/07/2025
యోనా సాహసయాత్ర లేఖనంలో బాగా తెలిసిన కథలలో ఒకటి. సంఘంలోని ఏ పిల్లవాడిని అడిగినా, దాని గురించి మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. అదే హబక్కూకు లాంటి వేరే చిన్న ప్రవక్తల గురించి అడిగితే, అంత స్పష్టమైన జవాబు దొరకదు. కానీ ఈ గ్రంథం గుర్తుండిపోయేదే అయినప్పటికీ, చాలామందికి దాని పూర్తి అర్థం తెలియదు.








