08/01/2026
ప్రియమైన వారిని కోల్పోవడం వలన కలిగే తీవ్రమైన వేదనకు సాటి మరొకటి లేదు. మనము ఎంతగానో ప్రేమించే వారికి దూరంగా ఉండడానికి మనము సృష్టించబడలేదు, లేదా ఆ విధంగా రూపొందించబడలేదు. మరణం అనేది పాపం యొక్క వినాశకరమైన పర్యవసానం; ఇది దేవుని ఆది సృష్టి క్రమంలో భాగం కాదు (రోమా 5:12).








