
బోధనలో దృష్టాంతాల యొక్క అవసరం
20/03/2025
కీర్తనలను నేను ఎందుకు ఇష్టపడతాను
27/03/2025నా జీవితం కొరకు దేవుని చిత్తం ఏమిటి?

- దేవుని నడిపింపు గురి౦చి బైబిలు ఏమి చెబుతో౦ది? మనము దేవున్ని అన్ని విధాలుగా అంగీకరిస్తే, ఆయన మన మార్గాలను నిర్దేశిస్తాడని ఇది చెబుతుంది (సామె. 3:5-6). మన జీవితాలలో దేవుని చిత్తాన్ని గ్రహించమని లేఖన౦ ద్వారా మన౦ ప్రోత్సహి౦చబడతా౦, మన దృష్టిని దేవుని నిర్ణయాత్మక చిత్తంపై కాక, దేవుని ఉపదేశపూర్వక చిత్త౦పై కేంద్రీకరి౦చడ౦ ద్వారా అలా చేస్తా౦. మీరు మీ జీవిత౦ గురి౦చి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకు౦టే బైబిలు ఇలా చెబుతో౦ది: “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము” (1 థెస్స. 4:3). కాబట్టి క్లీవ్ ల్యాండ్ లో ఉద్యోగం చేయాలా లేక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం చేయాలా లేక జేన్ లేదా మార్తాను పెళ్లి చేసుకోవాలా అని ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు, వారు దేవుని సంకల్పాన్ని నిశితంగా అధ్యయనం చేయాలి. వారు తమ జీవితాలను రోజువారీగా ఎలా జీవించాలో తెలుసుకోవడానికి దేవుని నియమాలను అధ్యయనం చేయాలి.
కీర్తనకారుడు ఇలా వ్రాశాడు, “దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” (కీర్తన 1:1-2). దైవభక్తిగల మానవుని ఆనందము దేవుని యొక్క ఉపదేశపూర్వక చిత్తములో ఉంటుంది, మరియు అలా దృష్టి కేంద్రీకరించబడినవాడు “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును” (వ. 3). దుష్టులు ఆలాగుననుండక “గాలి చెదరగొట్టు పొట్టువలె” నుందురు” (వ. 4).
ఏ ఉద్యోగం చేయాలో తెలుసుకోవాలంటే నియమాలపై ప్రావీణ్యత సాధించాలి. మీరు అలా చేస్తున్నప్పుడు, మీ వరాలు మరియు ప్రతిభను నిశితంగా విశ్లేషించడం దేవుని చిత్తమని మీరు కనుగొంటారు. అప్పుడు మీరు ఒక నిర్దిష్ట పనిలో మీ వరాలకు అనుగుణంగా ఉందో లేదో ఆలోచించాలి; ఒక వేళ ఆలా లేనట్లైతే, మీరు దానిని అంగీకరించకూడదు. అలాంటప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కోవాలన్నది దేవుని సంకల్పం. దేవుని చిత్తమేమిట౦టే, మీరు మీ వృత్తిని—మీ పిలుపును— ఉద్యోగావకాశాలతో సరిపోల్చుతారు, దానికి ఓయిజా బోర్డును (స్పిరిట్ గేమ్ ఆడే బోర్డు) ఉపయోగి౦చడ౦ క౦టే ఎక్కువ పని అవసర౦. దేవుని ధర్మశాస్త్రాన్ని జీవితంలోని వివిధ విషయాలన్నింటికీ వర్తింపజేయాలని దీని అర్థం.
ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయి౦చుకునే విషయానికి వస్తే, దేవుడు దీవించే వివాహాన్ని గురించిన, లేఖనాల్లో చెప్పే ప్రతిదాన్ని మీరు చూస్తారు. అలా చేసిన తర్వాత, బైబిల్ ఆవశ్యకతలను తీర్చే అనేక అవకాశాలు ఉన్నాయని మీరు కనుగొనవచ్చు. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? దానికి సమాధానం సులభం: మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే మీరు ఎంచుకున్న వారు దేవుని యొక్క సంకల్పం (వాక్యం) పరిధిలోకి ఉన్నంత వరకు మీకు ఇష్టమైన విధంగా వ్యవహరించడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది మరియు మీరు దేవుని చిత్త ప్రకారం చేస్తున్నారో లేదో అని ఆలోచిస్తూ నిద్రను కోల్పోవలసిన అవసరం లేదు. మొదటిది, మీరు దేవుని చిత్తానికి వెలుపల ఉండలేరు. రెండవది, ఈ రోజు మీ కొరకు దాగివున్న దేవుని రహస్య చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం రేపటి వరకు వేచి ఉండటమే, మరియు భవిష్యత్తులో అది మీకు స్పష్టం అవుతుంది ఎందుకంటే మీరు గతాన్ని తిరిగి చూడవచ్చు మరియు గతంలో జరిగినదాన్ని బట్టి అది రహస్య దేవుని చిత్తం యొక్క పని అని తెలుసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, వాస్తవం తర్వాతనే దేవుని యొక్క రహస్య చిత్తం మనకు తెలుస్తుంది. మన౦ సాధారణంగా భవిష్యత్తులో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకు౦టా౦, అయితే లేఖన౦లో ప్రాముఖ్యముగా మన పట్ల దేవుని చిత్త౦ వర్తమానము గురి౦చి ఉ౦టు౦ది, అది ఆయన ఆజ్ఞలతోనే జరిగించాలి.
“రహస్య విషయాలు” దేవునివి, మనవి కావు. “రహస్య విషయాలు” మనకు సంబంధించినది కాదు ఎందుకంటే అవి మనకు చెందనివి; అవి ఆయనవి. అయితే దేవుడు తన మనసులోని కొన్ని రహస్య ప్రణాళికలను తీసుకుని ఆ రహస్యాన్ని వెల్లడించాడు, అలాంటివి మనకు చెందుతాయి. ముసుగును తీసేసాడు. దీన్నే మనం ప్రత్యక్షత అంటాం. ప్రత్యక్షత అనేది ఒకప్పుడు దాచిన దానిని బహిర్గతం చేస్తుంది.
ప్రత్యక్షత ద్వారా మనకు లభించే జ్ఞానం దేవునికే చెందుతుంది, కానీ దేవుడు దానిని మనకు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 29:29లో మోషే ఇదే చెప్పాడు. రహస్య విషయాలు దేవునికి చెందినవి, కానీ ఆయన బహిర్గతం చేసినవి మనకు మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా చెందినవి. దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియజేయడానికి స౦తోషపడ్డాడు, ఆ విషయాలను మన పిల్లలతో, ఇతరులతో పంచుకునే అమూల్యమైన ఆశీర్వాద౦ మనకు ఉ౦ది. ఆ జ్ఞానాన్ని మన పిల్లలకు చేరవేయడానికి ప్రాధాన్యతనివ్వడం ద్వితీయోపదేశకాండములోని ప్రధాన సూత్రాలలో ఒకటి. దేవుని బహిర్గత చిత్తము ఆయన ఉపదేశపూర్వక చిత్తము ద్వారా ఇవ్వబడింది, మరియు మనము విధేయులముగా ఉండుటకు ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది.
నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, చాలా మంది ప్రజలు తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలరు అని నన్ను అడుగుతారు, కాని దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకొనుటకు చాలా అరుదుగా నన్ను అడుగుతారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థ౦ చేసుకోవాలో తమకు తెలుసు కాబట్టి ప్రజలు అడగరు— అది బైబిలులో ఉ౦టు౦ది. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకొనుటకు అధ్యయనము చేయగలరు. దేవుని ధర్మశాస్త్రాన్ని మనమెలా పాటించగలమనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. కొంతమంది దాని గురించి ఆందోళన చెందుతారు, కానీ చాలా మంది కాదు. దేవుని చిత్త౦ గురి౦చి ఆరా తీసే చాలామ౦ది ప్రజలు మూసుకుపోయిన భవిష్యత్తు గురి౦చి జ్ఞానాన్ని కోరుకు౦టారు. దేవుడు దేనిని ఆమోదిస్తాడో, దేనితో దేవుడు స౦తోషిస్తున్నాడో, దేని కోస౦ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే, దానికి సమాధాన౦ ఆయన ప్రేరణాత్మక చిత్తము ధర్మశాస్త్ర౦లో లభిస్తు౦ది
- ఈ భాగాన్ని ఆర్.సి.స్ప్రౌల్ రచించిన ప్రతి ఒక్కరూ వేదాంతే నుండి స్వీకరించారు.