
రోమా పత్రికలో ఉన్న గొప్ప మార్పిడిలు
10/04/2025
క్రీస్తుపై ప్రకటన ఇప్పుడు ఎ౦దుకు ప్రాముఖ్య౦?
17/04/2025అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ

- క్రొత్త నిబంధనలో విశ్వాసి గురి౦చి సర్వసాధారణమైన, అత్య౦త ప్రాధమికమైన వర్ణన ఏమిటంటే, అతడు లేదా ఆమె “క్రీస్తులో” ఒక వ్యక్తి. ఈ భావ వ్యక్తీకరణ మరియు దాని రూపాలు అపొస్తలుల బోధనలో అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మరియు దీని అర్థం ఏమిటో గ్రహించడానికి లేఖనం మనకు ఇచ్చే ఆధారాలలో ఒకటి, ఓవెన్ చెప్పినట్లు “దాంపత్య సంబంధాలు” లేదా మనం చెప్పినట్లు, “వివాహం” అని పిలువబడే దాని పరంగా క్రీస్తుతో మన ఐక్యతను వ్యక్తీకరించడం. ఆత్మ పరిచర్య ద్వారా మరియు విశ్వాసం ద్వారా, వివాహ బంధంలో ఒక పురుషుడు మరియు స్త్రీ “ఒకే శరీరం” అయినట్లే, క్రీస్తుతో “ఐక్యపరచబడుతాము”, క్రీస్తుతో “ఒక్కటవుతాము”. పాత నిబంధనలో ఇప్పటికే ఉన్న ఈ చిత్రం, (యెషయా 54:5; 61:10; 62:5; యెషయా 54:5; 16:1-22; cf. హోషేయ పుస్తకము) క్రీస్తుకు ఆయన సంఘానికి మధ్య ఉన్న సంబంధములో క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది. క్రీస్తు నిత్యత్వములో ఈ ప్రణాళికలో సంతోషించాడు, మరియు సిలువ యొక్క అవమానాన్ని, బాధను, వేదనను భరిస్తూ ఆయన కాలక్రమేణా దానిని నిజం చేశాడు. క్రీస్తు, తన రక్షణ కృప మరియు వ్యక్తిగత ఆకర్షణ అంతటితో, సువార్తలో మనకు సమర్పించబడ్డాడు. తండ్రి తన కుమారుని వద్దకు తాను సిద్ధం చేసిన వధువును తీసుకువచ్చి, ఇరు పక్షాలు ఒకరికొకరు ఉంటారా అని అడుగుతాడు- అంటే రక్షకుడు పాపులను తన వారిగా కలిగి ఉండటం; పాపులు ప్రభువైన యేసును తమ రక్షకునిగా, భర్తగా, మిత్రునిగా కలిగి ఉండటం.
-
తన సమకాలీకులలో చాలామ౦దిలాగే, ఓవెన్ కూడా క్రీస్తుకు విశ్వాసికి మధ్య ఈ ఆధ్యాత్మిక ఐక్యతను, స౦బ౦ధాన్ని చూశాడు, పాత నిబంధన గ్రంథమైన సొలొమోను వ్రాసిన పరమగీతములో ముందే సూచించబడింది మరియు వర్ణి౦చబడింది. క్రైస్తవునికి క్రీస్తు యొక్క ఆకర్షణ గురించిన ఆయన వివరణ ప్రేమికుడు మరియు ప్రియురాలి యొక్క ఆప్యాయత వ్యక్తీకరణల వర్ణనల ద్వారా చాలా ప్రభావితమైంది. అతని విశ్లేషణ అతని కాలానికి విలక్షణమైనది అయినప్పటికీ, ఈ రోజు కొంతమంది వ్యాఖ్యాతలు అతని వ్యాఖ్యానము వివరాలలో అతనిని అనుసరిస్తారు.
కానీ ఓవెన్ ఆలోచనలో ముఖ్యమైనది మరియు గమనించదగినది ఏమిటంటే, క్రైస్తవుడిగా ఉండటం అనేది క్రీస్తు పట్ల లోతైన ఆప్యాయత కలిగి ఉండటం. ఆయన పేరుకోవలసిన, అభిమానించదగిన, ప్రేమించదగిన వ్యక్తి. కాబట్టి, క్రీస్తుతో సహవాసం అనేది మనకు మరియు ఆయనకు మధ్య “పరస్పర (స్వయం) రాజీనామా” లేదా స్వీయ (మనల్ని మనం) ఇచ్చుకోవడం కలిగి ఉంటుంది. క్రీస్తులో “అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ” ఉన్నాయి, “క్రీస్తు యొక్క మానవ స్వభావంలో కృప యొక్క సంపూర్ణత” ఉంది. అటువంటి నిష్పత్తులు, ఓవెన్ చెప్పాడు (ఆశ్చర్యం మరియు ప్రశంసల యొక్క ఆశ్చర్యకరమైన విస్ఫోటనంలో):
లోకమంతా (నేను అలా చెప్పగలిగితే) స్వేచ్ఛా కృప, కరుణ, క్షమాభిక్షను త్రాగడానికి, రక్షణ బావుల నుండి నిరంతరం నీటిని పీల్చుకుంటూ ఉంటే; ఒకే ఒక్క వాగ్దానం నుండి తమను తాము తోడుకోవడానికి సిద్ధపడితే, ఒక దేవదూత నిలబడి, “నా స్నేహితులారా, అవును, పుష్కలంగా త్రాగండి, మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న పాప లోకానికి సమృద్ధిగా సరిపోయేంత కృప మరియు క్షమాభిక్ష తీసుకోండి” అని అరిస్తే. —ఒక వెంట్రుక వెడల్పు వాగ్దానం యొక్క కృపను వారు ముంచలేరు. లక్షలాది లోకాలు ఉన్నట్లయితే వాటికి సరిపోతుంది; ఎందుకంటే అది అనంతమైన, అడుగులేని ఊట నుండి దానిలోకి ప్రవహిస్తుంది.
కాబట్టి, క్రైస్తవుడు అవ్వడము అనేది, ఏదో మనతో వ్యక్తిగత౦గా చెప్పినట్లు, హోషేయ 3:3లోని యెహోవా మాటల బరువును అనుభవి౦చడమే: “చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును.” ప్రతిస్పందనగా, మన చిత్తాలను క్రీస్తుకు మరియు దేవుడు ఆయనలో అనుగ్రహించిన రక్షణ మార్గానికి అప్పగిస్తాము మరియు ఇలా చెబుతాము:
“ప్రభువా, నా మార్గములో నిన్నును రక్షణను పొందుకొని ఉండి ఉండేవాన్ని, అది నా ప్రయత్నాల మూలముగాను, ధర్మశాస్త్ర క్రియల ద్వారాను అయియుండేది; ఇప్పుడు నేను నిన్ను స్వీకరించి నీ మార్గములో రక్షింపబడుటకు ఇష్టపడుచున్నాను – కేవలం కృప ద్వారానే: మరియు నేను నా స్వంత మనస్సు ప్రకారం నడుచుకోవాలనుకున్నప్పటికీ, ఇప్పుడు నీ ఆత్మచేత పాలించబడుటకు నన్ను నేను పూర్తిగా అప్పగించుకొనుచున్నాను; నీ యందు నాకు నీతియు బలమును కలిగియున్నవి, నీ యందు నేను నీతిమంతుడుగా తీర్చబడి, అతిశయపడుదును;” – అప్పుడు అది క్రీస్తుతో అతని వ్యక్తిత్వపు కృపలకు అనుగుణంగా సహవాసం చేస్తుంది. ఇది ప్రభువైన యేసును ఆయన ఆకర్షణీయతలో మరియు ఉన్నత స్థితిలో స్వీకరించడం. విశ్వాసులు ఈ విషయం పట్ల తమ హృదయాలను సమృద్ధిగా ఉపయోగించనివ్వండి. ఇది కుమారుడైన యేసుక్రీస్తుతో ఎంపిక సహవాసం.
అలాంటి రక్షకునిపై మనకు విశ్వాస౦ కలుగడ౦లో మనకు జరిగిన దాని పరిమాణాన్ని గ్రహి౦చడానికి ప్రయత్ని౦చేటప్పుడు మన హృదయాలు పగిలిపోయినట్లు భావి౦చకు౦డా, మొదట్లో భాష వింతగా అనిపించినప్పటికీ, ఈ విధమైన వాక్యాలను చదవడ౦ మనకు చాలా కష్ట౦గా ఉ౦టు౦ది. ఆయన కృపను ఆయన వ్యాప్తి చేయగలిగిన దానికంటే ఎక్కువగా మన పాపాన్ని వ్యాప్తి చేయలేము. దీని గురి౦చి ధ్యాని౦చడ౦, అలా౦టి స్వచ్ఛమైన ఊటలోని జలాలను రుచి చూడడ౦, “అనిర్వచనీయమైన మహిమతో నిండిన ఆన౦దాన్ని” తప్పక తెలుసుకోవడమే (1 పేతురు 1:9).
- సింక్లైర్ ఫెర్గూసన్ రాసిన ది ట్రినిటేరియన్ డివోషన్ ఆఫ్ జాన్ ఓవెన్ లో గతంలో ప్రచురించబడింది.