
అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ
15/04/2025
యేసు యొక్క మానవత్వం
22/04/2025క్రీస్తుపై ప్రకటన ఇప్పుడు ఎ౦దుకు ప్రాముఖ్య౦?

-
- ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ పట్టణంలో సంస్కరణ అమరవీరుల స్మారక చిహ్నం ఉంది, వారు, శాసనంలో ఇలా వ్రాసి ఉన్నట్లుగా:రోమా సంఘము చేసిన తప్పుడు భోధలకు వ్యతిరేకంగా వారు ధృవీకరించి కొనసాగించిన పవిత్రమైన సత్యాలకు సాక్షాన్ని ఇస్తూ, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున వారికి అనుగ్రహింపబడెను అని ఆనందిస్తూ, వారి శరీరాలను కాల్చివేయబడడానికి అప్పగించేశారు.మీరు ఇక్కడ కీలక క్రియలను చూశారా? వారు నిజమైన మరియు బైబిల్ ప్రకారం నమ్మకమైన సిద్ధాంతాన్ని ధృవీకరించారు మరియు కొనసాగించారు. ఈ హతసాక్షులు వేదాంతవేత్తలు మరియు సంఘ కాపరులు. వారు దేవుని వాక్య సత్యాలను బోధించారు మరియు సమర్థించారు. ఆ సత్యాలలో ప్రధానమైనవి సోలస్ క్రిస్టస్ (క్రీస్తు మాత్రమే), సోలా ఫిడే (విశ్వాసం మాత్రమే), మరియు సోలా గ్రేషియా (కృప మాత్రమే) యొక్క సంస్కరణ నినాదాలు. ఈ సంస్కరణ సత్యాలు క్రీస్తు యొక్క వ్యక్తి మరియు పనికి సంబంధించిన ప్రధాన సిద్ధాంతాలను సంక్షిప్తీకరించాయి. అవి సువార్తను సంక్షిప్తీకరిస్థాయి.సంస్కరణ హతసాక్షులు కూడా సంతోషించారు. తాము క్రీస్తు కోస౦ శ్రమపడడానికి యోగ్యులని ఎంచబడ్డారు అని వారు స౦తోషపడ్డారు. అదే వేదాంత నిబద్ధత. పాశ్చాత్య ప్రపంచంలో చాలా వరకు తెలియని జలాల్లోకి మనం కదులుతున్నాం. చాలామంది ఎత్తిచూపినట్లుగా మనం క్రైస్తవానంతర యుగంలో జీవిస్తున్నాం. ఈ రోజు దాదాపు తాకగలిగే ఒక అత్యవసరత ఉంది. ఇది వేదాంత నిబద్ధతను కోరుకునే అత్యవసరత .
-
- మన క్రైస్తవానంతర యుగం అయోమయ యుగం. ఇది ఒకవైపు ఇస్లాం ఆవిర్భావం, మరోవైపు “ఎవరూ లేనివారు” ఆవిర్భవించిన యుగం- పూర్తిగా మతపరంగా సంబంధం లేనివారు. ఇది బహుళత్వ యుగం, అనేక సత్యాలను ధృవీకరించే అనేక స్వరాల యుగం; కొ౦తమ౦ది సత్యాన్ని అస్సలు పట్టించుకోనట్లు నటిస్తారు. ఈ గందరగోళం సంఘము వెలుపల మరియు లోపల చూడవచ్చు.
గందరగోళ సమయాల్లో, మనకు స్పష్టత మరియు నమ్మకం అవసరం. ఈ మేరకు లిగోనియర్ ది వర్డ్ మేడ్ ఫ్లెష్: ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీని విడుదల చేశారు. స్టేట్మెంట్ లోని మొదటి లైన్ ఇలా ప్రకటిస్తుంది:
దేవుడు శరీరధారి అయ్యాడు అన్న దానిట్లో ఉన్న మర్మముని అద్భుతాన్ని మేము ఒప్పుకుంటాము,
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారనైనా మన గొప్ప రక్షణలో సంతోషిస్తాము.
ఇక్కడ రెండు కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది క్రీస్తు యొక్క వ్యక్తి మరియు మానవ అవతారం యొక్క సిద్ధాంతం. యేసు “ఇమ్మాన్యుయేల్”, అనగా “దేవుడు మనకు తోడు” (మత్తయి 1:23). ఆయన దైవ-మానవుడు. మానవ అవతారం అనే పదానికి అక్షరాలా “శరీరాన్ని స్వీకరించడం” అని అర్థం. ఇది నిజంగా ఒక మర్మము మరియు ఆశ్చర్యం. మర్మము మనల్ని వినయంగా ఉండేలా, లొంగిపోయేలా చేస్తుంది. అద్భుతం మనల్ని విస్మయానికి, ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మర్మము మరియు అద్భుతం రెండూ మనలను పూజించడానికి మరియు ఆరాధించడానికి కారణమవుతాయి.
ఇక్కడ రెండవ ముఖ్యమైన అంశం క్రీస్తు యొక్క పని. క్రీస్తు మన గొప్ప రక్షణను సాధించాడు. దైవ-మానవునిగా ఆయన ఒక్కడే రక్షించగలడు. అనేక స్వరాలు ఉన్న ప్రపంచంలో మరియు మతపరమైన బహుళత్వ సముద్రంలో, క్రీస్తు మాత్రమే మార్గం, సత్యం మరియు జీవితం (యోహాను 14:6). క్రీస్తుశాస్త్రంపై లిగోనియర్ స్టేట్మెంట్ మరియు దానితో పాటు వచ్చే ట్వంటి ఫైవ్ ఆర్టికల్స్ అఫ్ అఫర్మేషన్ అండ్ డినైయల్: క్రీస్తు యొక్క వ్యక్తి మరియు పని, ఈ రెండు అంశాల యొక్క గొప్ప రూపురేఖలను విశదీకరించాయి మరియు అన్వేషిస్తాయి.
ఈ ప్రారంభ పంక్తులలో రెండు కీలక క్రియలు కూడా ఉన్నాయి. మొదటిది ఒప్పుకోవడం. ఇది లాటిన్ పదం. దీని అర్థం “[ఆయన]తో పాటు ప్రకటించు”. మనం ఏదైనా ఒప్పుకున్నప్పుడు ఒకరితో పాటు ప్రకటిస్తున్నాము. నేను నేరాన్ని ఒప్పుకుంటే, నా నేరానికి సంబంధించి అధికారులతో (లేదా సాక్ష్యాలతో) ప్రకటిస్తున్నాను. నేను ఒక నమ్మకాన్ని ఒప్పుకుంటే, నా విశ్వాసం గురించి నేను అధికారులతో ప్రకటిస్తున్నాను. పరస్పర నమ్మకాలను ఒకరితో ఒకరు ప్రకటిస్తున్నాం. ఒక క్రైస్తవ సంఘముగా, మనము కలిసి క్రీస్తును ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన ఉంది. మన౦ ఒప్పుకున్నప్పుడు, మన౦ దేవునితో పాటు ప్రకటిస్తున్నా౦; ఆయన తన వాక్యములో ఆయన గురి౦చి ఏమి వెల్లడించాడో మన౦ ఒప్పుకుంటున్నాము. “మేము ఒప్పుకుంటాము. . . ” అని చెప్పినప్పుడు, తరువాత వచ్చేది ఖచ్చితంగా మరియు దృఢంగా ఉండాలి.
ఇది వేదాంత నిబద్ధత. చావడానికీ, బ్రతకడానికీ అర్హమైన నమ్మకమే ఒప్పుకోదగినది.
సంతోషించు అనేది క్రీస్తుశాస్త్రంపై లిగోనియర్ స్టేట్మెంట్ యొక్క ప్రారంభ పంక్తులలోని రెండవ ముఖ్య క్రియ. డాక్టర్ ఆర్.సి. స్ప్రౌల్ వేదాంత శాస్త్రం పాడుతుందని చెప్పడానికి ఇష్టపడతాడు. లేదా, మంచి వేదాంత శాస్త్రం పాడుతుందని ఆయన చెప్పారు. ఈ నమ్మకాలు మేధో ధృవీకరణల కంటే చాలా ఎక్కువ. హృదయానికి నిప్పుపెట్టి జీవితాన్ని కార్యరూపంలోకి తెస్తాయి. మంచి వేదాంతాన్ని ప్రకటిస్తే నాలుక వదులు పడుతుంది మరియు కోరికలు స్పందిస్తాయి.
సంతోషం అనేది ఒక సమ్మేళన పదం. రిజాయ్స్ (సంతోషం) లో రి- అనేదాని భాషావేత్తలు తీవ్రత అని పిలుస్తారు. అది కలపబడిన పదము యొక్క చర్యను తీవ్రంగా చూపిస్తుంది, ఈ సందర్భంలో, జాయ్ (సంతోషం). సంతోషించు (రిజాయ్స్) అంటే సంతోషంతో (జాయ్) నిండి ఉండటం లేదా సంతోషాన్ని (జాయ్) కలిగించడం. సంతోషం (జాయ్) మీద సంతోషం (జాయ్).
ఆ సంస్కరణ హతసాక్షులు బాధలలో ఎలా సంతోషించగలరు, వారి హతసాక్షములో ఎలా సంతోషించగలరు? దీనికి సమాధానం క్రీస్తు. వారు క్రీస్తుపై, శిలువ వేయబడిన క్రీస్తుపై లేజర్ లాంటి దృష్టిని కేంద్రీకరించారు. ఆ దృష్టి వారి జీవితంలోని అన్ని కోణాలకు మరియు వారి మరణాలకు కూడా దృక్పథాన్ని అందించింది. వారి వేదాంత నిబద్ధత యొక్క లోతు మరియు వెడల్పు అలాంటిది.
- “దేవుడు శరీరధారియై మర్మము యొక్క అద్భుతమును మనము ఒప్పుకొనుచున్నాము, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన గొప్ప రక్షణయందు ఆనందించుచున్నాము.” ఇది మన వేదాంత నిబద్ధత. అందుకే క్రీస్తుపై ప్రకటన ఇప్పుడు చాలా ముఖ్యమైనది.
- మన క్రైస్తవానంతర యుగం అయోమయ యుగం. ఇది ఒకవైపు ఇస్లాం ఆవిర్భావం, మరోవైపు “ఎవరూ లేనివారు” ఆవిర్భవించిన యుగం- పూర్తిగా మతపరంగా సంబంధం లేనివారు. ఇది బహుళత్వ యుగం, అనేక సత్యాలను ధృవీకరించే అనేక స్వరాల యుగం; కొ౦తమ౦ది సత్యాన్ని అస్సలు పట్టించుకోనట్లు నటిస్తారు. ఈ గందరగోళం సంఘము వెలుపల మరియు లోపల చూడవచ్చు.