లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

29/07/2025

మలాకీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ప్రవక్త మలాకీ ద్వారా ప్రభువు తన చెర తరువాత ఉన్న  ప్రజలకు అనేక సవాలుతో కూడిన విషయాలను చెప్పాడు. మలాకీ పుస్తకం ఏడు ప్రవచనాల శ్రేణిగా ఏర్పాటు చేయబడింది, ప్రతి ఒక్కటి కూడ ప్రజల చేదు సామెతతో ప్రారంభమవుతుంది దానికి ప్రభువు ప్రతిస్పందిస్తాడు.
24/07/2025

1 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

ఈ వచనం గురించి యేసు ఉద్దేశం ఏమిటనే దాని గురించి కొంత చర్చ జరిగిందన్నది నిజమే.  అయితే యేసు పేతురుతో మాట్లాడుతున్నాడని స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేతురు అంతకు ముందే  “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” యేసును గురించి అంగీకరించాడు(మత్తయి 16:16). ఆ తర్వాత పేతురుకు రాళ్ళు, శిలల పట్ల ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చని ఊహించుకోవచ్చు.
22/07/2025

ఎజ్రా గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంతో కలిపి చూసినప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలో దాదాపు వంద సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది. ఈ కాలం క్రీ.పూ. 538లో పారసీక రాజు కోరెషు (సైరస్) యూదులను తమ స్వస్థలమైన యెరూషలేము మరియు యూదాకు తిరిగి వెళ్లడానికి అనుమతిస్తూ జారీ చేసిన శాసనంతో మొదలై, క్రీ.పూ.
17/07/2025

యోనా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

యోనా సాహసయాత్ర లేఖనంలో బాగా తెలిసిన కథలలో ఒకటి. సంఘంలోని ఏ పిల్లవాడిని అడిగినా, దాని గురించి మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. అదే హబక్కూకు లాంటి వేరే చిన్న ప్రవక్తల గురించి అడిగితే, అంత స్పష్టమైన జవాబు దొరకదు. కానీ ఈ గ్రంథం గుర్తుండిపోయేదే అయినప్పటికీ, చాలామందికి దాని పూర్తి అర్థం తెలియదు.
15/07/2025

యూదా పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

నేడు చాలా మంది ప్రజలు సంపూర్ణ సత్యం కోసం పోరాటాన్ని వదులుకోవడానికి, యేసు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం అనే నమ్మకాన్ని విడిచిపెట్టడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మత విశ్వాసాలను రక్షణకు సరైన మార్గాలుగా అంగీకరించడానికి శోదించబడుతున్నారు. విచారకరంగా, సంఘాలు కూడా ఈ తప్పుడు బోధలకు అతీతంగా ఉండలేకపోతున్నాయి, వాస్తవానికి కొన్ని సంఘాలు ఒత్తిడికి లొంగిపోయి, సత్యాన్ని తిరస్కరించి తప్పుడు బోధలను స్వీకరించాయి.
10/07/2025

హబక్కూకు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

దేవుణ్ణి మహిమపరిచే రీతిలో న్యాయం జరగాలని హబక్కూకుకు ఉన్న ప్రగాఢమైన కోరిక, మరియు ఆ న్యాయం కనిపించకపోయినప్పుడు అతనిలో చెలరేగిన తీవ్రమైన ప్రతికూల స్పందన ఈ గ్రంథాన్ని నేటి పాఠకులకు ఎంతో సముచితంగా, అర్థవంతంగా చేస్తుంది.
08/07/2025

1, 2, 3 యోహాను పత్రికల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

బైబిలు నిండా ఎన్నో అమూల్యమైన రత్నాలు దాగి ఉన్నాయి. అయితే, ఆ  దాగివున్న రత్నాలు చాలావరకు బైబిలులోని చిన్న పుస్తకాలలో కనిపిస్తాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే క్రైస్తవులు ఆదికాండము, కీర్తనలు, యెషయా, యోహాను సువార్త, రోమా పత్రిక , ఎఫెసీయులు వంటి "పెద్ద పుస్తకాల"తో మంచి పరిచయం కలిగి ఉంటారు.
03/07/2025

సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

మొదట సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు, అది జీవితంలోని అన్ని సమస్యలకు సులభమైన, తక్షణంగా, సూత్రబద్ధమైన పరిష్కారాలను అందించే గ్రంథంగా అనిపించవచ్చు. ఈ గ్రంథాన్ని చదివితే ఇందులో ఉన్న సూత్రాలను తమ జీవితాల్లో ఆచరించేవారికి సంపదను మరియు విజయాన్ని ఖచ్చితంగా లభిస్తాయని హామీ ఇస్తున్నట్లు తోస్తుంది.
01/07/2025

యోబు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

మొదట, యోబు ఇశ్రాయేలీయుడు కాదని చాలా మంది పండితులు అంగీకరిస్తారు. అతను కనాను దేశంలో కాకుండా ఊజు దేశంలో నివసించాడనే వాస్తవం నుండి ఈ నిర్ధారణ వచ్చింది (యోబు 1:1). విలాపవాక్యములు ఏదోము ఊజు దేశంతో సంబంధం కలిగి ఉన్నట్లు సూచిస్తున్నందున, యోబు ఏదోము ప్రాంతంలోనే నివసించి ఉండవచ్చు(విలాపవాక్యములు 4:21).