
ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం అంటే ఏమిటి?
09/12/2024
“మానవ జీవిత పవిత్రత” గురించి మాట్లాడేటప్పుడు మన ఉద్దేశ్యం ఏమిటి?
10/12/2024ప్రార్థనా యొక్క స్థానం

క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? క్రీస్తుకు చూపించే విధేయత నుండి పుట్టిన దైవభక్తి. విధేయత క్రైస్తవ అనుభవం యొక్క ఐశ్వర్యాన్ని తెరుస్తుంది. విధేయతను కోరుకోవడానికి హృదయాన్ని సరైన “మానసిక స్థితిలో” ఉంచుతూ, ప్రార్థన అనేది విధేయతను ప్రేరేపిస్తుంది మరియు పెంపొందిస్తుంది.
వాస్తవానికి, జ్ఞానం కూడా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది లేకుండా, దేవుడు ఏమి కోరుతున్నాడో మనము తెలుసుకోలేము. ఏదేమైనా, ప్రార్థనలో దేవునితో సంభాషించకపోతే జ్ఞానం మరియు సత్యం వియుక్తమైనవిగా ఉంటాయి. పరిశుద్ధాత్మే దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తాడు, ప్రేరేపిస్తాడు మరియు ప్రకాశవంతం చేస్తాడు. ఆయన దేవుని వాక్యానికి మధ్యవర్తిత్వం వహిస్తాడు మరియు ప్రార్థనలో తండ్రికి ప్రతిస్పందించడంలో మనకు సహాయం చేస్తాడు.
క్రైస్తవుల జీవితంలో ప్రార్థనకు ముఖ్యమైన స్థానం ఉంది. మొదటిది, ఇది రక్షణకు సంపూర్ణమైన ఆవశ్యకత. కొందరికి వినిపించదు; చెవిటివారైనప్పటికీ , వారు రక్షింపబడగలరు. కొందరికి కనిపించకపోవచ్చు. గుడ్డివారు అయినప్పటికీ, వారు రక్షింపబడగలరు. యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త మరణ౦, పునరుత్థాన౦ ద్వారానే రక్షణ అనే సువార్త జ్ఞాన౦ ఏదో ఒక మూల౦ ను౦డి వస్తు౦ది, అయితే అంతిమ విశ్లేషణలో, ఒక వ్యక్తి రక్షణ కోస౦ దేవుణ్ణి వినయ౦గా అడగాలి. దుష్టులు చేసే ఒకే ఒక ప్రార్థనను దేవుడు వింటానని చెప్పినది, రక్షణను గూర్చిన ప్రార్థన.
పరలోకంలో ఉన్నవారికి ఉమ్మడిగా ఉన్నవి ఏమిటి? అనేక విషయాలు. వారంతా క్రీస్తు ప్రాయశ్చిత్తములో తమ విశ్వాసాన్ని ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారంతా దేవుడిని స్తుతిస్తున్నారు. వారంతా రక్షణ కొరకు ప్రార్థించారు. ప్రార్థన లేకుండా ఉండటం అంటే దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ మరియు పరలోకపు నిరీక్షణ ఇంక పరలోకపు వాస్తవాన్ని కలిగి లేకుండా ఉండటం.
రెండవది, క్రైస్తవుని యొక్క ఖచ్చితమైన గుర్తులలో ఒకటి అతని ప్రార్థనా జీవితం. ఒకడు క్రైస్తవుడు కాకపోయినా ప్రార్ధించవచ్చు కానీ ఒకడు క్రైస్తవుడై వుండి ప్రార్ధించకపోవడం అనేది అసాధ్యమైన విషయం. మనల్ని దేవుని కుమారులుగా చేసిన ఆధ్యాత్మిక దత్త పుత్రత్వం మనల్ని మౌఖిక వ్యక్తీకరణలలో: “అబ్బా! తండ్రి” అని అరిచేలా చేస్తుందని రోమీయులకు 8:15 లో చెప్పబడింది. క్రైస్తవునికి ప్రార్థన ప్రాణానికి శ్వాసలాంటిది, అయినప్పటికి దానిని నిర్లక్ష్యం పెట్టినంతగా ఏ క్రైస్తవ కర్తవ్యాని నిర్లక్ష్య పెట్టలేదు.
ప్రార్థన, కనీసం వ్యక్తిగత ప్రార్థన, తప్పుడు ఉద్దేశ్యంతో చేయడం కష్టము. అబద్ధ ప్రవక్తల వలే తప్పుడు ఉద్దేశ౦తో బోధించవచ్చు; ఒకరు తప్పుడు ఉద్దేశాలతో క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. మతం యొక్క అనేక బాహ్య చర్యలు తప్పుడు ఉద్దేశాలతో చేయబడవచ్చు, కానీ ఎవరైనా ఏదో అనుచితమైన ఉద్దేశ్యంతో దేవునితో సంభాషణ చేసే అవకాశం లేదు. “అంతిమ దినములో” చాలామ౦ది తీర్పులో నిలబడి ఆయన నామమున చేసిన గొప్ప, ఉన్నతమైన కార్యాల గురి౦చి క్రీస్తునకు చెబుతారు, కానీ వారు ఎవరో ఆయనకు తెలియదని ఆయన ప్రతిస్ప౦దిస్తాడు అని మత్తయి 7 లో చెప్పబడింది.
కాబట్టి, ప్రార్థన చేయడానికి మనము ఆహ్వానించబడ్డాము, ఆజ్ఞాపించబడ్డాము కూడా. ప్రార్థన ఒక ఆధిక్యత మరియు కర్తవ్యం, మరియు ఏ కర్తవ్యమైనా కష్టంతో కూడుకున్నది కావచ్చు. క్రైస్తవుని కొరకైనా ఎదుగుదల యొక్క సాధనాల వలె, ప్రార్థనకు పని అవసరం. ఒకరకంగా చెప్పాలంటే, ప్రార్థన మనకు అసహజమైనది. మన౦ దేవునితో సహవాస౦ మరియు సాంగత్యం కోస౦ సృష్టి౦చబడినప్పటికీ, పతనం యొక్క ప్రభావాలు మనలో చాలామ౦దిని ప్రార్థనవ౦టి ప్రాముఖ్యమైన విషయాలపట్ల సోమరులుగా, ఉదాసీనీయులుగా మార్చాయి. తిరిగి జన్మించుట అనునది దేవునితో సాంగత్యము కావాలనే నూతన కోరికను రేకెత్తిస్తుంది, అయితే పాపము పరిశుద్ధాత్మను ప్రతిఘటిస్తుంది.
దేవునికి మన హృదయాలు తెలుసు అని మరియు మన పెదవుల నుండి వెలువడే పదాల కంటే మన మాట్లాడని విజ్ఞాపనలను ఎక్కువగా వింటారు అనే వాస్తవం నుండి మనం ఓదార్పు పొందవచ్చు. మన అంతరంగములోని లోతైన భావాలను, భావోద్వేగాలను వ్యక్తపరచలేకపోయినప్పుడల్లా లేదా మనం దేని కోస౦ ప్రార్థి౦చాలో మనకు పూర్తి స్పష్టత లేనప్పుడు, పరిశుద్ధాత్మ మన కోస౦ విజ్ఞాపనము చేస్తాడు. రోమీయులు 8:26-27 లో ఇలా చెప్పబడింది,
అటువలె పరిశుద్దాత్ముడు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఎలా ప్రార్థించాలో లేదా దేని కోస౦ ప్రార్ధి౦చాలో మనకు తెలియనప్పుడు, పరిశుద్దాత్ముడు మనకు సహాయ౦ చేస్తాడు. మనము తప్పుగా ప్రార్థన చేస్తే, పరిశుద్దాత్ముడు మన ప్రార్థనలను తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళక ముందు సరిదిద్దుతాడని నమ్మడానికి కారణం లేఖనములో ఉంది, ఎందుకంటే 27వ వచనంలో ఆయన “దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.”
ప్రార్థన అనేది పరిశుద్ధత యొక్క రహస్యము- పరిశుద్ధత గురించి నిజంగా ఏదైనా రహస్యమువుంటే. సంఘమునకు చెందిన గొప్ప పరిశుద్ధుల జీవితాలను పరిశీలిస్తే, వారు ప్రార్థించే గొప్ప ప్రజలు అని మనకు తెలుస్తుంది. రోజుకు కనీసం నాలుగు గంటలు ప్రార్థనలో గడపని పరిచారకుల గురించి తాను పెద్దగా ఆలోచించనని జాన్ వెస్లీ ఒకసారి వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ ఒక గంట క్రమం తప్పకుండా ప్రార్థించాడు, కాకపోతే ప్రత్యేకంగా బిజీగా ఉన్న రోజును అనుభవించినప్పుడు అతడు రెండు గంటలు ప్రార్థించాడు, అని లూథర్ చెప్పాడు.
ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం క్రైస్తవ జీవితంలో నిశ్చలత్వానికి ప్రధాన కారణం. లూకా 22:39-62 లోని పేతురు యొక్క ఉదాహరణను పరిశీలి౦చ౦డి. యేసు తన అలవాటు ప్రకార౦ ప్రార్థి౦చడానికి ఒలీవ కొండకు వెళ్లి తన శిష్యులతో ఇలా అన్నాడు: “శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి.” అయితే శిష్యులు నిద్రించారు. తరువాత పేతురు ఒక కత్తితో రోమా సైన్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు; తరువాత అతడు క్రీస్తును తిరస్కరించాడు. పేతురు ప్రార్థన చేయలేదు గనుక దాని ఫలితంగా శోధనలో పడిపోయాడు. పేతురు విషయ౦లో ఏది వాస్తవమో మన౦దరి విషయ౦లో కూడా అది వాస్తవమే: మనము బహిరంగ౦గా పడకముందు వ్యక్తిగతంగా పడిపోతాము.
ప్రార్థనకు సరైన సమయం మరియు తప్పు సమయం అంటూ ఉందా? ఉదయకాల సమయాలలో రోజూ ప్రార్థన చేయాలనే కోరికను దేవుడు ఇస్తాడని మరియు దేవునిపై నూతన విశ్వాసాని ఇస్తాడని యెషయా 50:4 లో మాట్లాడబడింది. అయితే రోజులో అన్నీ సమయాలలో ప్రార్థనకు ఇవ్వచ్చు అని చూపించే వాక్య భాగాలు కూడా వున్నాయి. రోజులోని ఏ భాగము కూడా మరొకదాని కంటే ఎక్కువ పరిశుద్ధ పరచబడినదిగా వేరుచేయబడలేదు. యేసు ఉదయమున, పగటిపూట, కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థి౦చాడు. ఆయన ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించినట్లు ఆధారాలు ఉన్నాయి; అయితే, యేసుకు త౦డ్రితో ఉన్న స౦బ౦ధాన్ని పరిశీలిస్తే, వారి మధ్య సాంగత్యము ఎప్పటికీ ఆగిపోలేదని మనకు తెలుసు.
యెడతెగక ప్రార్థనచేయుడి అని మొదటి థెస్సలొనీకయులకు 5:17 లో ఆదేశించబడింది. అంటే మనము మన త౦డ్రితో నిరంతర సాంగత్యము కలిగి ఉ౦డాలి.