వివేచన అంటే ఏమిటి?
08/04/2025
అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ
15/04/2025
వివేచన అంటే ఏమిటి?
08/04/2025
అంతులేని, అడుగులేని, అపరిమితమైన కృప మరియు కరుణ
15/04/2025

రోమా పత్రికలో ఉన్న గొప్ప మార్పిడిలు

  1. సువార్త యొక్క అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు, దాని శక్తిని మరియు మహిమను కనుగొన్న మొదటి వ్యక్తి మీరే అని మీరు భావిస్తారు. ఇన్నాళ్లూ క్రీస్తు ఎక్కడ దాక్కున్నాడు? అతను చాలా తాజాగా, చాలా కొత్తగా, చాలా కృపతో నిండి ఉన్నాడు. తరువాత రెండవ ఆవిష్కరణ వస్తుంది- గుడ్డివారుగా ఉన్నది మీరు, కానీ ఇప్పుడు మీరు మీ ముందు ఉన్న లెక్కలేనన్ని మంది మాదిరిగానే అనుభవించారు. మీరు గమనికలను పోలుస్తారు. నిశ్చయంగా, మీరు మొదటివారు కాదు! కృతజ్ఞత కొలది మీరు చివరివారు కాదు.

    నా స్వంత అనుభవం తీర్పు ఇవ్వడానికి ఏదైనా ఉంటే, రోమా పత్రిక కనుగొనడం ఇలాంటి అనుభవం కావచ్చు. ఒక క్రైస్తవ యుక్తవయసులో, నా మనస్సులో ఈ ఆలోచన నెమ్మదిగా ఉదయించడం నాకు ఇప్పటికీ గుర్తుంది: లేఖనమంతా దైవావేశమువలన కలిగినది మరియు నాకు ఉపయోగకరమైనది, కానీ దీనికి ఒక ఆకారం మరియు నిర్మాణం, ఒక కేంద్రం మరియు చుట్టుకొలత కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అయితే, కొన్ని బైబిల్ పుస్తకాలు పునాది కావచ్చు; వీటిపై ముందుగా పట్టు సాధించాలి.

    అప్పుడు (క్రమబద్ధమైన వేదాంతాలతో పాటు) బైబిల్ వ్యాఖ్యానాలు నా పుస్తక సంకలనానికి పునాది కావాలని గ్రహించారు. ఆనాటి స్కాట్లాండ్ లో ఉచిత ట్యూషన్, స్టూడెంట్ అలవెన్స్ తో ఆశీర్వదించబడ్డాను, రాబర్ట్ హాల్డేన్ మరియు జాన్ ముర్రే రాసిన రోమా పత్రిక యొక్క అద్భుతమైన అధ్యయనాలను నేను కొనుగోలు చేశాను. (ఇద్దరూ స్కాట్లు కాబట్టి నాలో ఏదో జాతి వివక్ష ఉండి ఉండొచ్చని తర్వాతే అనిపించింది!)

    నేను రోమా పత్రిక అధ్యయనం చేస్తున్నప్పుడు, దానిలోని కొన్ని గొప్ప సత్యాలతో కుస్తీ పడుతున్నప్పుడు, దానిలోని కొన్ని కఠినమైన భాగాలతో పోరాడుతున్నప్పుడు (ఖచ్చితంగా 2 పేతురు 3:14-16 వారికి  సూచిస్తుంది!), లెక్కలేనన్ని పాదాలు ఇంతకు ముందు ఈ మార్గంలో నడిచాయని స్పష్టమైంది. పౌలు “దేవుని సువార్త” (రోమా 1:1; 15:16), “క్రీస్తు సువార్త” (రోమా 1:16; 15:19), మరియు “నా సువార్త” (రోమా 2:16; 16:25) అని పౌలు పిలిచిన వాటి యొక్క మనస్సును పునరుద్ధరించే, జీవితాన్ని మార్చే శక్తిని కనుగొనడంలో నేను ఇప్పుడే వారితో చేరడం ప్రారంభించాను. మార్టిన్ లూథర్ రోమా పత్రిక “అన్నిటికన్నా స్పష్టమైన సువార్త” అని ఎందుకు పిలిచాడో త్వరలోనే స్పష్టమైంది.  రోమా పత్రిక యొక్క సువార్తను ఒకే మాటలో సంక్షిప్తీకరించవచ్చు: మార్పిడి. వాస్తవానికి, పౌలు రోమీయులు 1:18–5:11 బోధను సంక్షిప్తీకరించినట్లుగా, క్రైస్తవులు “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునియందు ఆనందిస్తారు, ఆయన ద్వారా మనం ఇప్పుడు  సమాధానస్థితి పొందియున్నాము” (రోమా 5:11, నొక్కి చెప్పబడింది). ” సమాధానస్థితి” అని అనువదించబడిన గ్రీకు పదం కాటల్లాగే యొక్క మూల అర్థం జరుగుతున్న మార్పు (లేదా మార్పిడి). పౌలు సువార్త అనేక మార్పిడిల కథ.

    మార్పిడి సంఖ్య మొదటిది 1:18–32 లో వివరించబడింది: ఆయన సృజించిన విశ్వంలో ఆయన మహిమను విశదపరచిన స్పష్టంగా బయలుపరచబడిన  సృష్టికర్తయైన దేవుని ఎరిగియు “వారు అక్షయుడగు దేవుని మహిమను … ప్రతిమాస్వరూపముగా మార్చిరి… దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి…  స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి” (1:23-26, నొక్కి చెప్పబడింది)—అన్ని వైవిధ్యాలు ఒకే మూలంపై ఉన్నాయి.

    రెండవ మార్పిడి దీని యొక్క ప్రత్యక్ష, దైవికంగా నిర్దేశించబడిన పరిణామం: దేవుని వ్యక్తిగతంగా తెలుసుకునే మానవుని జ్ఞానము యొక్క ఆధిక్యతకు బదులుగా మానవుల పట్ల ఆయన యొక్క నీతిమంతమైన ఉగ్రతకు దేవుడు మార్పిడి చేసాడు (రోమా 1:18). మానవజాతి దేవుణ్ణి తెలుసుకొని, నమ్మి, ప్రేమపూర్వక౦గా మహిమపరచడానికి బదులుగా, దాని భక్తిహీనత, దుర్నీతి (క్రమ౦ ప్రాముఖ్యమైనది) చేత దేవుని తీర్పును వెలువరి౦చి౦ది.

    ఆ విధ౦గా, దేవునితో సహవాసానికి బదులుగా దేవునిచే ఖండించబడానికి మార్పిడి జరిగింది. ఇది కేవలం భవిష్యత్తులో చాలా దూరంలో ఉన్న అంత్యదినాలకు సంబంధించినది కాదు; ఇది సమకాలీన పద్ధతిలో దురాక్రమణాత్మకమైనది. స్త్రీపురుషులు దేవుని విడిచిపెట్టి, ఆయన ముఖంలో తమ స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తారు. “మేము ఆయన నియమాలను ద్వేషిస్తాము మరియు వాటిని స్వేచ్ఛగా ఉల్లంఘిస్తాము, అయినప్పటికీ తీర్పు యొక్క బెదిరింపు ఉరుములు మమ్మల్ని తాకవు” అని వారు భావిస్తారు. అయితే, వాస్తవానికి, వారు న్యాయపరంగా గుడ్డివారు మరియు కఠినంగా ఉన్నవారు. తమ తిరుగుబాటు యొక్క మనస్సాక్షి-గట్టిపడటం మరియు శరీరాన్ని నాశనం చేసే ప్రభావాలు దేవుని తీర్పు అని వారు చూడలేరు. ఆయన తీర్పులు నీతిమంతమైనవి- మనము భక్తిహీనత కలిగి ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా మనం చేసిన నేర సాధనాల ద్వారానే శిక్ష వస్తుంది. అంతిమంగా, ప్రస్తుత అంతర్గత చీకటి కొరకు మరియు భవిష్యత్తు బాహ్య చీకటి కొరకు ఆయన సన్నిధి యొక్క వెలుగును మనం మార్పిడి చేసుకున్నాము.

    మార్పిడి సంఖ్య మూడు అనేది దేవుడు క్రీస్తులో అందించిన కృపగల, అర్హత లేని (వాస్తవానికి, అర్హత కోల్పోయిన) మార్పిడి. ఉగ్రతలో బయలుపరచబడిన తన నీతితో రాజీపడకుండా, దేవుడు మన పాపాలకు క్రీస్తు రక్త ప్రాయశ్చిత్తంలో అందించిన విమోచన ద్వారా పాపులను నీతిమంతులుగా సమర్థిస్తాడు. ఈ విషయాన్ని పౌలు రోమీయులు 3:21-26లోని సుసంపన్నమైన, బిగువుగా సమకూర్చిన పదాలలో ఇలా చెబుతున్నాడు.

    ఆ పత్రికలోనే తరువాత ఆయన మనకు భిన్నమైన, కొన్ని విధాలుగా మరి౦త ప్రాధమికమైన దృక్పథాన్ని చూపి౦చాడు: దేవుని కుమారుడు ఆదాముతో స్థానాలను మార్పిడి చేసుకోవడానికి మన స్వభావాన్ని తీసుకొని “పాప శరీరాకారముతో” వచ్చాడు (రోమా 8:3) కాబట్టి ఆదాము (మరియు మన) అవిధేయతకు, పాపానికి బదులుగా ఆయన విధేయతను, నీతిని మన కోస౦ మార్పిడి చేసుకోవడానికి వచ్చాడు (రోమా. 5:12-21).

    మార్పిడి సంఖ్య నాల్గవది సువార్తలో పాపులకు ఇవ్వబడినది: దుర్నీతి మరియు ఖండనకు బదులుగా నీతి మరియు సమర్థన. అ౦తేకాక, ఈ క్రీస్తు ఆకారపు నీతి ఆయన జీవితమంతా విధేయత చూపి౦చడ౦, సిలువపై ఆయన ఉగ్రతను ఆలింగి౦చే బలి ద్వారా ఏర్పడి౦ది, అక్కడ ఆయనను పాప సమర్పణగా చేయబడ్డాడు (రోమా 8:3లో పౌలు ఇలా చెబుతున్నాడు, “పాప౦ వల్ల”, లేదా “పాప సమర్పణగా ఉ౦డడానికి”).

    ఈ దైవిక మార్పిడి దేవుని సంపూర్ణ నీతికి అనుగుణంగా ఉంటుందనే వాస్తవాన్ని నొక్కిచెప్పడంతో పాటు (రోమా 3:21, 22, 25, 26), ఈ రక్షణ మార్గం పాత నిబంధన బోధనకు అనుగుణంగా ఉందని పౌలు నొక్కి చెప్పాడు (“ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు”, వ. 21; చూడండి 1:1-4). మన రక్షణకు మనమేమీ దోహదపడలేమని కూడా ఆయన నొక్కి చెబుతాడుడు. అది కృప మాత్రమే. దివ్య వ్యూహంలోని మేధస్సు కేవలం అబ్బురపరుస్తుంది.

    ఎక్స్ఛేంజ్ సంఖ్య అయిదవది ఇక్కడ ఆవిర్భవించింది. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్ లో, జాన్ కాల్విన్ రెండవ పుస్తకం (క్రీస్తు యొక్క పనిపై) నుండి మూడవ పుస్తకానికి (విమోచన అనువర్తనంపై) మారినప్పుడు, అతను ఇలా వ్రాశాడు:

    ఇప్పుడు మనం ఈ ప్రశ్నను పరిశీలించాలి. తండ్రి తన అద్వితీయ కుమారునికి -క్రీస్తు వ్యక్తిగత ఉపయోగ౦ కోస౦ కాదు గాని, ఆయన పేదవారిని, నిరుపేదలను స౦పన్న౦ చేయడానికి- ప్రసాదించిన ప్రయోజనాలను మనమెలా పొందగలము? మొదటిది, క్రీస్తు మనకు వెలుపల ఉన్నంత కాలం, మరియు మనం అతని నుండి వేరు చేయబడినంత కాలం, మానవజాతి రక్షణ కోసం ఆయన అనుభవించిన మరియు చేసినవన్నీ నిరుపయోగంగా ఉంటాయి మరియు అవి మనకు ఎటువంటి విలువ లేదని మనం అర్థం చేసుకోవాలి … మనం విశ్వాసం ద్వారా దీనిని పొందుతాము.

    క్రీస్తులో మనకు జరిగిన గొప్ప మార్పిడికి ప్రతిస్పందనగా, ఆత్మ ద్వారా మనలో ఒక మార్పిడి జరుగుతుంది: అవిశ్వాసం విశ్వాసానికి దారితీస్తుంది, తిరుగుబాటు నమ్మకానికి మార్పిడి చేయబడుతుంది. సమర్థన – మన౦ నీతిమంతులమని ప్రకటి౦చబడడ౦, దేవునితో నీతిపూర్వకమైన స౦బ౦ధ౦ ఏర్పడడ౦ మన క్రియల ద్వారా కాదు, కానీ క్రీస్తుపై విశ్వాస౦ ఉ౦చడ౦ ద్వారా చేయబడుతు౦ది.

  2. సింక్లైర్ ఫెర్గూసన్ రాసిన ఇన్ క్రైస్ట్ అలోన్: లివింగ్ ది గాస్పెల్-సెంటర్డ్ లైఫ్ నుండి ఈ భాగాన్ని స్వీకరించారు.

          

సింక్లైర్ ఫెర్గూసన్
సింక్లైర్ ఫెర్గూసన్
డాక్టర్ సింక్లెయిర్ బి. ఫెర్గూసన్ రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమాటిక్ థియాలజీకి ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆయన గతంలో కొలంబియా, ఎస్.సి లోని ఫస్ట్ ప్రెస్బిటేరియన్ చర్చిలో సీనియర్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆయన ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్‌తో సహా అనేక పుస్తకాల రచయిత.