బైబిల్ ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
10/06/2025
2 పేతురు పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
24/06/2025
బైబిల్ ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
10/06/2025
2 పేతురు పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
24/06/2025

కొలొస్సయుల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

    1. ఇమెయిల్ లేదా టెక్స్ట్ సందేశాన్ని దాని నేపథ్యం, సందర్భం మరియు ఉద్దేశ్యం తెలుసుకుంటే తప్ప మనం అర్థం చేసుకోలేము. అదేవిధంగా, పౌలు కొలొస్సయులకు వ్రాసిన పత్రిక గురి౦చి, దాని నేపథ్యాన్ని, స౦దర్భాన్ని, ఉద్దేశ్యాన్ని గ్రహించకపోతే మన౦ దాన్ని అర్థ౦ చేసుకోలేము.అబద్ధ బోధ, కొలొస్సి విశ్వాసుల విశ్వాసాన్ని, ఆచరణను బలహీనపరుస్తున్నదనే ఆందోళన పౌలు కొలొస్సయులకు వ్రాసిన లేఖలో ఉంది. ఈ అబద్ధ బోధకులను జ్ఞానవాదులు (“తెలిసినవారు” లేదా “అన్నీ -తెలిసినవారు”) అని పిలిచేవారు, ఎందుకంటే మోక్షానికి మార్గం ఒక ప్రత్యేకమైన, అదనపు జ్ఞానం అని వారు విశ్వసించారు, ఇది ఆధ్యాత్మిక ఉన్నత వర్గాలను భౌతిక ప్రపంచం నుండి దివ్య ప్రపంచానికి ఉన్నతీకరించింది.

      కాబట్టి, కొలొస్సయన్ల మూడు ప్రధాన ఇతివృత్తాలన్నీ జ్ఞానవాదుల మూడు ప్రాధమిక బోధలకు సంబంధించినవి కావడంలో ఆశ్చర్యం లేదు.

      1. క్రీస్తు సర్వోన్నతుడు.

      దైవిక ఆత్మల విషయంలో సంక్లిష్టమైన శ్రేణి ఉందని, వారిలో అట్టడుగున ఉన్నవాడు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడని జ్ఞానవాదులు బోధించారు. కాబట్టి భౌతికంగా ఉన్నదానికి చాలా తక్కువ విలువ ఉండేది.

      పౌలు క్రీస్తును దేవుని పరిపూర్ణ ప్రతిరూపంగా గుర్తించడం ద్వారా అందరిపై క్రీస్తు యొక్క అత్యున్నత స్థానాన్ని మరియు అధికారాన్ని స్థాపించాడు, ఎందుకంటే ఆయన భౌతిక ప్రపంచం మరియు ఆత్మ ప్రపంచంతో సహా అన్నింటిని సృష్టించాడు (కొలొ. 1:15-16). ఆయన భౌతిక ప్రపంచాన్ని సృష్టించి దాని నుండి దూరంగా నడవడమే కాదు, సమస్త విశ్వాన్ని కాపాడుతూ, నిర్వహిస్తూ, వాటన్నిటినీ కలిపి ఉంచాడు (కొలొ. 1:17). సంఘంపై ఆధిపత్యం మరియు అధికారం యొక్క మొదటి స్థానాన్ని కూడా కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన అవతారంలో, దేవుని సంపూర్ణతను పూర్తి శారీరక మానవత్వంతో ఏకం చేశాడు, తరువాత బాధలు అనుభవించాడు, మరణించాడు మరియు పాపులను దేవునితో సర్దుబాటు చేయడానికి అదే శరీరంలో తిరిగి లేచాడు (కొలొ. 1:18-20).

      పౌలు కొలొస్సయులతో ఇలా అన్నాడు: “జ్ఞానవాదుల మాట వినవద్దు. సర్వోన్నత దైవం క్రీస్తు, మరే ఇతర ఆత్మ కాదు. భౌతిక ప్రపంచం అత్యల్ప ఆత్మచే సృష్టించబడలేదు, కానీ ఈ మహోన్నత క్రీస్తుచే సృష్టించబడింది. ఈ మహోన్నత క్రీస్తు భౌతిక శరీరంలో భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఈ సర్వోన్నత క్రీస్తు భౌతిక ప్రపంచాన్ని దేవునితో సర్దుబాటు చేయడానికి ఇదంతా చేశాడు. దేవునికి భౌతికమైనది ఎంత విలువైనదో చూశారా? శరీరాన్ని లేదా భౌతిక ప్రపంచాన్ని ద్వేషించకండి, కానీ ఆయన రక్షించాలనుకుంటున్న దేవుని సృష్టిగా దానిని గౌరవించండి మరియు ఘనపరచండి.”

      2. క్రీస్తు చాలినవాడు.

      ఒక ప్రత్యేకమైన రహస్య జ్ఞానాన్ని (గ్నోసిస్ అని పిలుస్తారు) పొందడం ద్వారా రక్షణ లభిస్తుందని జ్ఞానవాదులు బోధించారు, దీనిని అరుదైన అంతర్దృష్టులు మరియు మార్మిక అనుభవాల ద్వారా కొద్దిమంది మాత్రమే చేరుకోగలరు (కొలొ. 2:1–3). తమను తాము కాపాడుకోగలమని నమ్మబలికారు.

      కాబట్టి పౌలు కొలొస్సయులకు క్రీస్తు మీద విశ్వాసమే గొప్ప మరియు రక్షణ జ్ఞానానికి ఏకైక వనరుగా సూచించాడు. క్రీస్తు సమృద్ధి నుండి వారిని వేరుచేసే లౌకిక తత్త్వశాస్త్రానికి, సంప్రదాయానికి లేదా ఆచరణకు దూరం చేసే బోధకు వ్యతిరేకంగా ఆయన వారిని హెచ్చరించాడు (కొలొ. 2:4-9). క్రీస్తులో పరిపూర్ణత ఉంది, అందువలన క్రైస్తవులు ఆయనలో నిండుగా ఉన్నారు (కొలొ. 2:10). శిలువ వేయబడిన క్రీస్తుపై విశ్వాసం తప్ప రక్షణ లేదా పరిశుద్ధీకరణకు మరేదీ అవసరం లేదు (కొలొ. 2:11-15). ఏ అదనపు జ్ఞానం, అభ్యాసం, అనుభవం లేదా దేవదూత క్రీస్తుకు ఏమీ జోడించలేరు. ఆయన పరిపూర్ణుడు, మనము ఆయనలో పరిపూర్ణులము (కొలొ. 2:16-23).

      పౌలు కొలొస్సయులతో ఇలా అన్నాడు: “మీకు క్రీస్తు ఉంటే, మీకు అది చాలు. మీరు ఆయనకు జోడించిన ప్రతిదీ ఆయన నుండి తీసివేయబడుతుంది. సంపూర్ణ క్రీస్తులో విశ్రాంతి తీసుకోండి.”

      3. క్రీస్తు మన గుర్తింపు

      భౌతిక ప్రపంచం జ్ఞానవాదులచే తృణీకరింపబడినందున, నైతికత విషయంలో కూడా అదే ధోరణి కలిగియున్నారు. వారికి, రక్షణ అంటే ఈ భౌతిక ప్రపంచం నుండి తప్పించుకుని ఆత్మ ప్రపంచంలోకి ప్రవేశించడం. భౌతిక ప్రపంచంలో మన శారీరక చర్యలు వారికి ముఖ్యం కాదు.

      దీనికి విరుద్ధంగా, క్రైస్తవులు క్రీస్తుతో సమాధి చేయబడ్డారు మరియు క్రీస్తుతో లేపబడ్డారు కాబట్టి, వారికి ఈ లోకంలో ఒక నూతన గుర్తింపు ఉందని పౌలు బోధించాడు (కొలొ. 3:1-4). ఈ లోకంలో, ఆ కొత్త గుర్తింపుతో కొత్త జీవనశైలి, అందులో మన జీవితాలకు కొత్త విధానం వస్తుంది. ప్రాపంచిక మార్గాల యొక్క పాత గుర్తింపును పక్కనబెట్టి, క్రీస్తు యొక్క – క్రొత్త గుర్తింపును ఉంచాలి (3:5-17). ఆ గుర్తింపు, భార్యలు, భర్తలు, పిల్లలు, ఉద్యోగులు మరియు యజమానులకు చాలా నిర్దిష్టమైన సూచనలతో రూపొందించబడ్డాయి (కొలొ. 3:18–4:6).

      కొలొస్స క్రైస్తవులకు పౌలు చేసిన ఉపదేశాన్ని ఇలా సంక్షిప్తీకరించవచ్చు: “ఆధ్యాత్మిక లోక౦పై జ్ఞానవాదులు చూపి౦చిన ప్రత్యేక దృష్టితో తప్పుదారి పట్టవద్దు. భౌతిక జగత్తుపై క్రీస్తు యొక్క ఆధిక్యత అంటే మీరు ఈ భౌతిక ప్రపంచంలో మీ భౌతిక శరీరాలలో ఆయన ప్రభుత్వం క్రింద జీవించాలి. మరియు క్రీస్తు యొక్క సమృద్ధి అంటే మీరు ఆయనలో సంపూర్ణమైన మరియు సంతృప్తికరమైన నూతనమైన గుర్తింపును కలిగి ఉన్నారు, అది ఈ ప్రపంచంలో మీ సంబంధాలలో రుజువు చేయబడుతుంది.”

      అలాంటప్పుడు మన౦ క్రీస్తు సర్వోన్నత ప్రభుత్వ౦లో ఎలా జీవి౦చగలము, సంపూర్ణ క్రీస్తులో పరిపూర్ణతను ఎలా కనుగొనగలము, క్రొత్త జీవనశైలితో క్రీస్తులో మన క్రొత్త గుర్తింపును క్రీస్తుకు ఎలా వ్యక్తపరచగలము? కొలొస్సయులకు పౌలు చెప్పిన మొదటి, చివరి మాటలను చూడండి: “మీకు కృప తోడైయుండును గాక !” (కొలొ. 1:2; 4:18).

    1. ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.
      1.        
డేవిడ్ పి. ముర్రే
డేవిడ్ పి. ముర్రే
డాక్టర్ డేవిడ్ పి.ముర్రే ఒక పాస్టర్ మరియు ప్రొఫెసర్. జీసస్ ఆన్ ఎవ్రీ పేజ్, క్రిస్టియన్స్ గెట్ డిప్రెషన్ టూ, సహా అనేక పుస్తకాలను ఆయన రచించారు. అతను ది స్టోరీఛేంజర్ అనే పాడ్ కాస్ట్ కు హోస్ట్ గా కూడా ఉన్నాడు.