
నరకం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
05/06/2025
కొలొస్సయుల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
12/06/2025బైబిల్ ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

-
- నిర్ణయాలు, నిర్ణయాలు, నిర్ణయాలు! మనమందరం ప్రతి రోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నిజమే, కొన్ని సాధారణమైన నిర్ణయాలుగా కనిపిస్తాయి (కాఫీలో రెగ్యులర్ కావాలా లేక డికాఫ్ కావాలా?), మరికొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి (నేను ఏ కళాశాలలో చేరాలి? ఈ ఉద్యోగ అవకాశాన్ని నేను అంగీకరించాలా? నా జీవిత భాగస్వామిగా నేను ఎవరిని ఎన్నుకోవాలి?). ఈ సందర్భాలన్నిటిలోనూ, విశ్వాసులు దేవుని సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. సంపూర్ణమైన జాబితా కాకపోయినా, బైబిలు ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతి క్రైస్తవుడు పరిగణించవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
1. బైబిల్ ఆధారిత నిర్ణయం బైబిల్ పైన ఆధారపడి ఉంటాయి.
స్పష్టంగా చెప్పాలంటే, బైబిల్ మనం ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న అనేక సమానమైన స్వరాలలో ఒకటి కాదు. అది తప్పుపట్టలేని జ్ఞానానికి, సలహాకు, దిశానిర్దేశానికి మరియు సూచనలకు ఏకైక ఆధారం. బైబిలు కేవలం ఒక సమాచార పుస్తకం మాత్రమే కాదు; అది మన దేవుని స్వరం, ఆయనే స్వయంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న స్వరం(2 తిమోతి 3:16). మరో విధంగా చెప్పాలంటే, బైబిల్ కేవలం సమాచారం ఇవ్వడం కోసం ఉద్దేశించినది కాదు; అది సంబంధాన్ని నెలకొల్పడం కోసం ఉద్దేశించినది. మన ప్రేమగల పరలోకపు తండ్రి మనం నిర్ణయాలు తీసుకోవడంలో మనకు తన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాడు. కాబట్టి, లేఖనాలను స్పష్టంగా ఉల్లంఘించే ఏ నిర్ణయం అయినా కేవలం బైబిల్‌ను తిరస్కరించడం మాత్రమే కాదు; అది మన పరలోకపు తండ్రిని తిరస్కరించడమే. అలాంటి నిర్ణయాలకు తప్పనిసరిగా పర్యవసానాలు ఉంటాయి.
2. బైబిల్ ఆధారిత నిర్ణయం తీసుకోవడం ప్రార్థనతో కూడుకున్నది.
బైబిల్ ప్రకారం నిర్ణయం తీసుకోవడం అంటే దేవునితో సంబంధానికి సంబంధించినది. దేవుడు వింటాడు, పట్టించుకుంటాడు మరియు జవాబిస్తాడు. మనం కేవలం వ్యక్తిత్వంతో సంబంధం లేని మార్గదర్శక పుస్తకాన్ని పరిశోధించడం లేదు; మనం మార్గదర్శకుడు అయిన ఆయన్నే మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాము. మనం రచయితతో సంబంధం కలిగి ఉన్నాము. అది ఆయన జ్ఞానం; అది ఆయన సలహా; మరియు అది ఆయన పిల్లల కొరకు వ్రాయబడింది, ఎవరి కోసం యేసు మరణించాడో, ఎవరిని ఆయన దత్తత తీసుకున్నాడో, ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి కొరకు. మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి సంతోషిస్తాడు.
“మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును” (మత్తయి 7:9–11).
3. బైబిల్ ఆధారిత నిర్ణయం తీసుకోవడం సంప్రదింపులతో కూడుకున్నది.
ఇతరుల జ్ఞానాన్ని సంప్రదించడం ద్వారా జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని బైబిల్ తరచుగా ప్రశంసిస్తుంది. “ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును” (సామెతలు 20:18). “ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును” (సామెతలు 13:10). అయితే, ఆ “ఇతరులు” దైవభక్తిగల, పరిణతి చెందిన, బైబిలు పరిజ్ఞానం కలిగిన, మరియు మనల్ని బాగా ఎరిగిన క్రైస్తవులై ఉండాలి. మన నిర్ణయాన్ని ధృవీకరించడానికి లేదా మనం ఆలోచించని ప్రమాదాలు, సవాళ్లు, లోపాలను గురించి హెచ్చరించడానికి తగిన వారిని సంప్రదించడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది. మనం సంప్రదించే వారు తక్కువ పరిణతి చెందినవారు లేదా క్రైస్తవేతర స్నేహితులు అయినప్పుడు ఈ సూచన తరచుగా ఉల్లంఘించబడుతుంది, ఎందుకంటే వారు తరచుగా మనం వినాలనుకునే మాటలే చెప్తారు. కాబట్టి, మనం “బైబిలు జ్ఞానము” ఉన్నవారి సూచనను అనుసరిస్తాము ఎందుకంటే “భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు” (సామె. 12:5).
4. బైబిల్ ఆధారిత నిర్ణయం దైవ సంకల్పంతో కూడుకున్నది.
బైబిల్ ఆధారిత నిర్ణయం తీసుకోవడం అనేది దేవుడు తన సార్వభౌమాధికారంలో “తన సమస్త జీవులన్నింటినీ, వాటి చర్యలన్నింటినీ సంరక్షిస్తూ, పరిపాలిస్తూ” (వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కాటెకిజం 11) ఏమి చేస్తున్నాడో గమనించడం. నిర్ణయం తీసుకోవడంలో దేవుని చిత్తాన్ని నిర్ణయించడానికి ఖచ్చితంగా ఇది మాత్రమే ఏకైక అంశం కాదు. అయినప్పటికీ, మన ప్రార్థనలకు సమాధానంగా దేవుడు మనకు అవకాశాలను ఇవ్వగలడు లేదా ఆయన సంకల్పం ద్వారా మనం ఇంతకు ముందు ఊహించని దిశగా మనల్ని నడిపించగలడు. దేవుని ప్రజలు ఆయనపై విశ్వాసంతో మార్గదర్శకత్వం కోసం చూస్తున్నప్పుడు, దైవసంకల్పం ద్వారా తమను నడిపించగలడని నమ్మవచ్చు.
5. బైబిల్ ఆధారిత నిర్ణయం అనేది దేవుడు ఇచ్చిన మరియు బైబిలు ద్వారా ఆమోదించబడిన ఈ సూత్రాల (మరియు ఇతర) సమ్మేళనం, వీటిని కలిపి తీసుకోవాలి.
మంచి ఉద్దేశ్యాలతో కూడిన క్రైస్తవులు కూడా కొన్ని సార్లు బైబిలుకు అంతగా అనుగుణంగా లేని నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, ఈ ప్రక్రియలో ఒక పద్ధతిని మాత్రమే అనుసరిస్తూ మిగతా అన్నింటినీ విస్మరిస్తారు. దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రజలు తప్పుగా నమ్మే రెండు అత్యంత తరచుగా ఉపయోగించే “ఒకే మూలం” పరిష్కారాలు ఏమిటంటే (1) మనం దేవుని సంకల్పానికి తప్పుపట్టలేని వ్యాఖ్యాతలమని భావించడం (“నేను ఈ గుర్తును చూశాను” లేదా “నాకు ఈ కల వచ్చింది”) మరియు (2) మన భావాలు (“దేవుడు నేను ఇదే చేయాలని కోరుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది”). ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకుని మిగతా అన్నింటినీ విస్మరించినప్పుడు, తీసుకునే నిర్ణయం అసమతుల్యంగా ఉంటుంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అందుకోసం ఆయన తన వాక్యాన్నంతటినీ మనం కలిపి ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు.
మన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు లభించే శాంతి మరియు నమ్మకం ఏమిటంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, మరియు మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆయన తన అత్యున్నత ఉద్దేశ్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు. మరియు మనం “తప్పు చేసినప్పటికీ”, దానికి ఖచ్చితంగా మనమే పూర్తిగా బాధ్యత వహించవలసిన ప్రతికూల పర్యవసానాలు ఉండవచ్చు, అయినప్పటికీ దేవుడు మన పాపాలు మరియు తప్పులతో సహా మన జీవితాన్ని మన మంచి కొరకు మరియు ఆయన మహిమ కొరకు పర్యవేక్షిస్తాడు. ఆందోళన కలిగించే భయాల నుండి మనలను కాపాడే శాంతి మరియు ఓదార్పు ఏమిటంటే, ఆయన ఇప్పటికీ దేవుడు, తన సార్వభౌమ సంకల్పం ద్వారా, దేవుడిని ప్రేమించేవారికి మరియు ఆయన సంకల్పం ప్రకారం పిలవబడిన వారికి సమస్తమును మేలుకొరకు జరిగేలా చేస్తాడు (రోమీయులు 8:28).
- నిర్ణయాలు, నిర్ణయాలు, నిర్ణయాలు! మనమందరం ప్రతి రోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నిజమే, కొన్ని సాధారణమైన నిర్ణయాలుగా కనిపిస్తాయి (కాఫీలో రెగ్యులర్ కావాలా లేక డికాఫ్ కావాలా?), మరికొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి (నేను ఏ కళాశాలలో చేరాలి? ఈ ఉద్యోగ అవకాశాన్ని నేను అంగీకరించాలా? నా జీవిత భాగస్వామిగా నేను ఎవరిని ఎన్నుకోవాలి?). ఈ సందర్భాలన్నిటిలోనూ, విశ్వాసులు దేవుని సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. సంపూర్ణమైన జాబితా కాకపోయినా, బైబిలు ప్రకారం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతి క్రైస్తవుడు పరిగణించవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
-
- ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.
-
-