Teaching Our Children about Forgiveness
క్షమాపణ గురించి మన పిల్లలకు బోధించడం
27/01/2026
Soul Rest
ఆత్మకు నిజమైన విశ్రాంతి
05/02/2026
Teaching Our Children about Forgiveness
క్షమాపణ గురించి మన పిల్లలకు బోధించడం
27/01/2026
Soul Rest
ఆత్మకు నిజమైన విశ్రాంతి
05/02/2026

క్రైస్తవ జీవితం

The Christian Life

దేవుడు జీవానికి మూలం మరియు జీవదాత. పరిశుద్ధ లేఖనాల తొలిపుటలు ఆయనకున్న ఈ జీవాన్ని ఇచ్చే అద్భుత శక్తిని బలంగా ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా, దేవుడు ఆదాము నాసికా రంధ్రాలలోకి జీవవాయువును ఊదగా, అతడు ప్రాణముగలవాడయ్యాడు (ఆది. 2:7). ఆదాము, హవ్వలు దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగివుంటూ, ఆయన ప్రేమపూర్వకమైన మరియు శ్రేష్ఠమైన పరిపాలనకు విధేయులయ్యే జీవితాన్ని జీవించడానికి దేవుడు వారిని సృష్టించాడు. అయితే, సాతాను శోధించడం వలన ఆదాము, హవ్వలు దేవునికి అవిధేయత చూపారు. ఆ మానవజాతి పతనంలో పరాకాష్టకు చేరిన వారి పాపం, దేవుడు ఏర్పరచిన ఈ శ్రేష్ఠమైన సృష్టిలోకి పాపాన్నీ, దాని పర్యవసానమైన మరణాన్నీ ప్రవేశపెట్టింది (రోమీయులకు 5:12).

వారు పాపం చేసిన తరువాత, ఆదాము, హవ్వల దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు జంతువుల చర్మాలను ఏర్పాటు చేయడంలో, ఒక లోతైన సత్యం వెల్లడవుతోంది. ఈ సత్యమే పవిత్ర లేఖనాలలో అంతటా తేటతెల్లమవుతుంది: పతనం ద్వారా మానవాళి కోల్పోయిన ఆ స్థితిని, సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఒక పవిత్రమైన బలియాగం తప్పనిసరి. పాత నిబంధన కాలంలో దైవభక్తిగల విశ్వాసులు, దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే బలులను అర్పించారు. ఈ అర్పణలు రక్తపు అవసరాన్ని మరియు దేవుడు వాగ్దానం చేసిన అంతిమ విమోచకుడు రాకపై వారికున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పాయి. వాస్తవానికి, ఈ పాత నిబంధన బలులన్నీ దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు సిలువలో అర్పించబోయే పరిపూర్ణమైన మరియు అంతిమ బలికి  ముందుసూచనగా ఉన్నాయి.

ఇశ్రాయేలు దేవునితో చేసిన నిబంధనను కాపాడుకోవడంలో పదేపదే విఫలమైనప్పటికీ, మన దేవుడు మాత్రం తన నమ్మకత్వాన్ని ఎన్నటికీ విడిచిపెట్టలేదు. దేవుడు తాను నిర్ణయించిన సమయం సంపూర్ణమైనప్పుడు, త్రిత్వంలో రెండవ వ్యక్తియైన యేసు క్రీస్తు, కన్యక గర్భం ద్వారా జన్మించి, మానవ రూపాన్ని ధరించాడు. ఆయన తానే సృష్టించిన ఈ భూమిపై నడిచాడు. తన భూలోక పరిచర్య అంతటా, యేసు తన దైవత్వాన్ని మరియు గుర్తింపును చాలా స్పష్టంగా ప్రకటించారు: ఆయనే సాక్షాత్తూ జీవం, మరియు దేవుని ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు (యోహాను 14:6; 10:11). యేసు కేవలం జీవానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటి మాత్రమే కాదు. జీవానికి నడిపించే ఏకైక, అసలైన మార్గం ఆయనే; ఆయనను విడిచిపెట్టిన మిగిలిన త్రోవలన్నీ నిశ్చయంగా మరణానికే దారితీస్తాయి. దేవుని పరిశుద్ధమైన నీతి ఆవశ్యకతలను పూర్తిగా సంతృప్తిపరచడానికి, పరిపూర్ణమైన మరియు అంతిమ బలియాగం ఆయనేనని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం నిత్య జీవాన్ని పొందగలం (యోహాను 20:31).

మన రక్షకునిగా యేసుక్రీస్తును ఏకైక మార్గంగా నమ్మి, ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు, మనం ఆత్మీయ మరణం అనే స్థితి నుండి నిత్య జీవం వైపుకు దాటిపోతాము (యోహాను 5:24). ఈ విశ్వాసం ద్వారా, మనం క్రీస్తుతో అత్యంత సన్నిహితంగా ఐక్యమౌతాము; మనం క్రీస్తులో ఉంటాము. ఈ గొప్ప దైవ సంబంధంతోనే నిజమైన క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది.

కాబట్టి, క్రైస్తవ జీవితం అనేది మన స్వంత బలంతో లేదా స్వంత నీతి ప్రయత్నాలతో ఏదో ఒక నైతిక జీవితాన్ని గడపాలని ఆరాటపడటం కాదు. కేవలం సంఘానికి హాజరు కావడం ద్వారా, సామాజికంగా “మంచి” వ్యక్తిగా కనిపించడం ద్వారా, లేదా బైబిలు జ్ఞానాన్ని మాత్రమే సంపాదించడం ద్వారా ఈ క్రైస్తవ జీవితం ఉత్పత్తి కాదు. దానికి బదులుగా, క్రైస్తవ జీవితం అనేది మరేదో కాదు, పునరుత్థానం పొందిన క్రీస్తు యొక్క జీవితమే పరిశుద్ధాత్మ ద్వారా మనలో నిరంతరం పనిచేయడం. ఇది క్రీస్తు యొక్క మహిమను మరియు దివ్య సౌందర్యాన్ని చూడగలిగేలా మరియు హృదయపూర్వకంగా ఆరాధించగలిగేలా చేస్తుంది. అలాగే, త్రియేక దేవుని పట్ల మరియు మన చుట్టూ ఉన్న ఇతరుల పట్ల ప్రేమలో మనం వృద్ధి చెందుతున్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడవడానికి అవసరమైన శక్తిని, సామర్థ్యాన్ని మనకు ఇస్తుంది.

ఇదే క్రైస్తవ జీవితం—ఈ జీవితంలో దేవుడు తన ప్రజలకు క్రొత్త హృదయాలను అనుగ్రహించడం ద్వారా, వారిని మరణం నుండి జీవములోనికి సార్వభౌమంగా (sovereignly) తీసుకొనివస్తాడు. పాపులకు ఏకైక నిరీక్షణగా సిలువ వేయబడి, పునరుత్థానం చెందిన యేసును వారు అంగీకరించేలా చేస్తాడు. 

ఇదే అసలైన క్రైస్తవ జీవితం – ఇది కేవలం మానవ ప్రయత్నం కాదు, దేవుని సార్వభౌమ కార్యం. ఈ జీవితంలో: దేవుడు సార్వభౌమాధికారంతో తన ప్రజలకు క్రొత్త హృదయాలను అనుగ్రహిస్తాడు. తద్వారా వారిని ఆత్మీయ మరణం నుండి నిత్య జీవంలోకి తీసుకువస్తాడు. సిలువ వేయబడిన మరియు పునరుత్థానమైన యేసే పాపులకు ఉన్న ఏకైక నిరీక్షణ అని వారు గట్టిగా అంగీకరించి, స్వీకరించేలా చేస్తాడు. మరియు, ఆయనతో ఉన్న ఈ ఐక్యతలో, వారు క్రీస్తుకు మరింత దగ్గరగా ఎదుగుతూ, ఆయన పోలికను ధరించడానికి ప్రయత్నిస్తారు. ఈ అద్భుతమైన మార్పులన్నీ ఆయన మహిమగల కృపకు నిరంతరం స్తోత్రము కలుగుటకే (ఎఫెసీ. 1:6) ఉద్దేశించబడ్డాయి.

లిగొనియర్ మినిస్ట్రీస్ తరచుగా వ్యాసాలు, పుస్తకాలు  మరియు బైబిలు అంశాలపై బోధనలను అందిస్తుంది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

లిగొనియర్ సంపాదకీయం
లిగొనియర్ సంపాదకీయం
లిగొనియర్ మినిస్ట్రీస్ తరచుగా వ్యాసాలు, పుస్తకాలు మరియు బైబిలు అంశాలపై బోధనలను అందిస్తుంది.