Is Jesus Our Example?

యేసు మనకు మాదిరియా?

01/09/2026
Is Jesus Our Example?

యేసు మనకు మాదిరియా?

01/09/2026

విగ్రహారాధన అంటే ఏమిటి?

What Is Idolatry?

ప్రజలు ‘విగ్రహారాధన’ అనే పదం విన్నప్పుడు, రకరకాల విషయాల గురించి ఆలోచిస్తారు. కొందరు, భక్తులు చెక్కిన విగ్రహాల ముందు సాగిలపడే ప్రాచీన ఆచారాలను ఊహించుకుంటారు. మరికొందరు, అభిమానులు తమకు ఇష్టమైన నటులను, క్రీడాకారులను లేదా సంగీతకారులను ఎలా ‘ఆరాధిస్తారో’ అని ఆలోచిస్తారు. ఇంకొందరు ఈ పదాన్ని ఒక రకమైన వ్యామోహానికి రూపకంగా ఉపయోగించవచ్చు.

అయితే, విగ్రహారాధన అంటే ఏమిటి? ముఖ్యంగా, సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన దేనినైనా ఆరాధించడమే విగ్రహారాధన.

దేవుడు ఈ విషయం గురించి ఎందుకు అంతగా పట్టించుకుంటున్నాడు? దానికి కారణం చాలా సులభం: దేవుడు ఆరాధన గురించి పట్టించుకుంటాడు కాబట్టి, విగ్రహారాధన గురించి కూడా పట్టించుకుంటాడు.

కొన్నిసార్లు ఈ భావన ఆధునిక పాఠకులను కలవరపరుస్తుంది, ఎందుకంటే వారు దేవుడిని ఒక అహంకారిగా, తన ఆరాధనకు అనారోగ్యకరంగా బానిసైన వ్యక్తిగా భావించవచ్చు. దేవుడు సృష్టికర్త కాకుండా సృష్టించబడినవాడైతే ఇది నిజమే కావచ్చు. కానీ మనుషులుగా, దేవుడు తనను ఆరాధించడానికే మనల్ని సృష్టించాడు. ఇది సరైనదే. ఇది మంచిది, ఎందుకంటే దేవుడు ఒక్కడే ఆరాధనకు అర్హుడు. కానీ మనం దీనిని తిప్పి చూస్తే, దేవుడు తన మహిమను, గౌరవాన్ని ప్రోత్సహించకపోయినా లేదా కాపాడకపోయినా, ఆయన దేవునిలా ప్రవర్తించడం లేదు. తరచుగా, ప్రజలు దేవుడిని ఒక వ్యక్తిగా (సృష్టిలో ఒక భాగంగా) భావిస్తూ, అదే సమయంలో సృష్టిని దేవుడిగా (ఆరాధనకు యోగ్యమైనదిగా) భావిస్తారు. యాదృచ్ఛికంగా, సృష్టిని హేచించడం మరియు సృష్టికర్తను తగ్గించడం రెండూ అనుచితమైనవే. అది విగ్రహారాధన.

అపొస్తలుడైన పౌలు విగ్రహారాధనను ఒక మార్పిడిగా వర్ణించాడు. దేవునికి మహిమను ఆపాదించడానికి బదులుగా, సృష్టించబడిన వస్తువుల విగ్రహాల మహిమకు దానిని మార్చుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా, ఆరాధకుడు “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌” (రోమీయులకు 1:25).

దేవుని మహిమను విగ్రహాలతో మార్చుకోవడం అనేది, దేవుని విలువను త్రాసులో పెట్టి అంచనా వేయడం లాంటిది. ఆయన మహిమను (ఆయన అనంతమైన బరువు, విలువ మరియు సారాన్ని) చూడటానికి బదులుగా, ఆరాధకుడు సృష్టించబడిన దానికంటే (పోలికలో, తేలికైన మరియు శూన్యమైన దానికంటే) ఆయన తక్కువ విలువైనవాడని నిర్ణయిస్తాడు. ఈ మార్పిడి మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక వ్యక్తి త్రాసులో ఏనుగును, ఈకను పోల్చి చూసి, ఈక బరువు ఎక్కువని నిర్ధారణకు రావడాన్ని ఊహించుకోండి. స్పష్టంగా, అలాంటి వ్యక్తి వాస్తవికతకు దూరంగా ఉంటాడు. ఇలా ఎలా ఆలోచించగలరు? మనం దేవుని స్థానంలో ఒక విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించగలం? దేవుని గురించిన సత్యాన్ని అబద్ధంతో మార్చుకోవడం ద్వారా మాత్రమే. దేవుడు ఎవరో అనే ఆయన ప్రత్యక్షతను మనం అణచివేసినప్పుడు, మనం తప్పుడు నిర్ధారణలకు వస్తాము (రోమా 1:18). 

విగ్రహారాధన నుండి కాపాడటానికి మరియు దేవుని సత్యారాధనను ప్రోత్సహించడానికి, ప్రభువు తన వాక్యంలో మనకు ఇలా బోధిస్తున్నాడు:

నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;

నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. (నిర్గమకాండము 20:2-3)

ఈ సుపరిచితమైన వాక్యభాగం ఉద్దేశపూర్వకంగా పది ఆజ్ఞలలో మొదటి స్థానంలో ఉంచబడింది. దేవునికి ఉండవలసిన ఆధిక్య స్థానాన్ని ఎవరూ గానీ, మరేదీ గానీ ఆక్రమించుకోవడానికి మనం అనుమతించకూడదు.

అయితే బైబిలులో మనం పదే పదే ఏమి చూస్తాము? నిర్గమకాండములోనే, ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రజలు తమ బంగారంతో ఒక విగ్రహాన్ని తయారుచేసి, దానిని ఆరాధించారు (నిర్గమకాండము 32). ఆ తర్వాత, రాజైన యరొబాము తన అధికారాన్ని కోల్పోతాననే భయంతో, అదే విగ్రహారాధనను అనుకరించి, తన సొంత ఆరాధనా విధానాన్ని సృష్టించుకున్నాడు. దేవునికి చెందాల్సిన ఘనతను విస్మరించి, వారు తమ సొంత సృష్టిని ఆరాధించారు: “ఇశ్రాయేలూ, ఇదిగో ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుళ్లు” (1 రాజులు 12:28). విగ్రహారాధన పట్ల మనల్ని హెచ్చరించే ప్రకాశవంతమైన సంకేతాల్లా ఈ ప్రసిద్ధ ఉదాహరణలు నిలుస్తాయి. దేవుడు తన మహిమను ప్రేమిస్తాడు కాబట్టి విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు. దేవుడు తన మహిమను ప్రేమిస్తాడు, ఎందుకంటే అది మంచిది.

మొదటి ఆజ్ఞ మిగిలిన తొమ్మిది ఆజ్ఞలకు పునాది అని చాలామంది గుర్తించారు; మిగిలిన వాటిని అతిక్రమించడం అంటే సత్య దేవుని నుండి వైదొలగి విగ్రహాన్ని ఆరాధించడమే. విగ్రహారాధన ఎంత ప్రమాదకరమైనదో మరియు అది ఎంత వైవిధ్యమైన రూపాల్లో ఉంటుందో ఇది తెలియజేస్తుంది. విగ్రహారాధన అంటే కేవలం ఏదైనా విగ్రహానికి నమస్కరించడం మాత్రమే అని మనం అనుకోవచ్చు, కానీ ఇతరుల దగ్గర ఉండి మన దగ్గర లేని దానిని తీవ్రంగా కోరుకోవడం కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది (నిర్గమకాండము 20:17 చూడండి).

మనం క్రైస్తవులైనప్పుడు, సజీవుడైన దేవుణ్ణి సేవించడానికి విగ్రహాల నుండి వైదొలుగుతాము (1 థెస్సలొనీకయులకు 1:9). అయితే, పోరాటం ఇంతటితో ముగిసిపోదు. మనం విగ్రహాలకు దూరంగా ఉంటూనే ఉండాలి (1 కొరింథీయులకు 10:14), అలాగే మనల్ని మనం మరియు ఇతరులను వాటికి దూరంగా ఉంచడానికి కృషి చేయాలి (1 యోహాను 5:21).

అపొస్తలుడైన పౌలు మనకు తగిన మరియు సవాలుతో కూడిన ఉదాహరణను అందిస్తున్నాడు. తన పరిచర్య భాగస్వాములు తనతో చేరడం కోసం ఎదురుచూస్తూ, అతను ఏథెన్సులో తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రదేశాలను చూశాడు. అక్కడి వాస్తుశిల్పం అతన్ని ఆకట్టుకోవడానికి బదులుగా, విచ్చలవిడిగా జరుగుతున్న విగ్రహారాధన అతనికి కోపం తెప్పించింది (అపొస్తలుల కార్యములు 17:16). దేవుని మహిమ విషయంలో పౌలు ఎంతగానో అసూయపడ్డాడు, దేవునికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అతను నిజానికి చిరాకుపడ్డాడు. దాని ఫలితంగా, అతను బయటకు వెళ్లి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో సువార్తను పంచుకున్నాడు.

దేవుని ఘనత పట్ల ఉండే ఈ ప్రేమ విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఒక సరైన రక్షణగా ఉంటుంది. కాబట్టి, సమస్తం కంటే దేవునికి ఉన్న అత్యున్నత విలువ గురించి లోతుగా ఆలోచించండి. ఆయన ఎన్నటికీ తప్పని విశ్వసనీయత, నిస్సంకోచమైన ప్రేమ, అంతులేని కృప, అచంచలమైన నీతి, ఏమాత్రం కల్మషం లేని మంచితనం, నిష్కళంకమైన జ్ఞానం మరియు మార్పులేని స్వభావం గురించి ధ్యానించండి. ఆయన వంటివారు ఎవరున్నారు? ఆ తర్వాత, యేసు క్రీస్తులో  మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఆయనే అని ఆలోచించండి.

దేవుడు మనకు సహాయం చేయాలని, ఆయనకు చెందాల్సిన ఘనతను ఆయనకే సమర్పించాలని మనం దృఢ నిశ్చయం చేసుకోవాలని, అలాగే దానికి భిన్నమైన ఏ విషయమైనా మనకు అసౌకర్యాన్ని కలిగించేలా ఉండాలని మనం ప్రార్థించవచ్చు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఎరిక్ రేమండ్

ఎరిక్ రేమండ్

రెవరెండ్ ఎరిక్ రేమండ్ మసాచుసెట్స్‌లోని వాటర్‌టౌన్‌లో ఉన్న రిడీమర్ ఫెలోషిప్ సంఘానికి సీనియర్ పాస్టర్. ఆయన 'చేజింగ్ కంటెంట్‌మెంట్'తో సహా అనేక పుస్తకాల రచయిత.