
“సోలా గ్రాటియా” అంటే ఏమిటి?
20/05/2025
తల్లిదండ్రులుగా ఉండటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
28/05/2025“సోలి డియో గ్లోరియా” అంటే ఏమిటి?

-
- “సోలి డియో గ్లోరియా (Soli Deo gloria అనగా దేవునికి మాత్రమే మహిమ చెందాలి అని అర్థం)” అనేది ప్రొటెస్టంట్ సంస్కరణ నుండి ఉద్భవించిన గొప్ప నినాదం మరియు జోహాన్ సెబాస్టియన్ బాచ్ దీనిని తన ప్రతి సంగీత రచన కూర్పులో ఉపయోగించాడు. దేవుని అద్భుత కార్యాలైన సృష్టి కార్యములోనూ మరియు విమోచన కార్యములోనూ మహిమను పొందేది కేవలం దేవుడు మాత్రమే అనే ఆలోచనను తెలియజేయడానికి అతను ప్రతి ప్రతి సంగీత రచన చివరలో “SDG” అనే అక్షరాలను అతికించాడు. దేవుని కృప అనే ప్రశ్న పదహారవ శతాబ్దపు రక్షణ వివాదంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఇది మనిషికి కృప అవసరమా అనే ప్రశ్న కాదు. ఆ కృప ఎంతవరకు అవసరం అనేదే ప్రశ్న. పూర్వంలో పెలాజియస్ అనే బోధకుడు కృప రక్షణను సులభతరం చేస్తుంది, కానీ అది ఖచ్చితంగా అవసరం లేదని బోధించాడు, సంఘం అప్పటికే ఆ బోధను ఖండించింది. ఆ తరువాత కాలంలో సెమీ-పెలాజియనిజం కృప లేకుండా రక్షణ లేదని ఎల్లప్పుడూ బోధించింది. అయితే సెమీ-పెలాజియన్ మరియు అర్మినియన్ రక్షణ సిద్ధాంతాలలో చెప్పబడే కృప శక్తివంతమైనది కృప కాదు. అది రక్షణను సాధ్యమయ్యేలా చేస్తుంది, కానీ ఖచ్చితంగా రక్షణను కలుగజేసే కృప కాదు.
దేవుడు విత్తువాడు
విత్తువాని ఉపమానంలో రక్షణ విషయంలో దేవుడే రక్షణను తీసుకురావడానికి చొరవ తీసుకుంటాడని మనం చూస్తాము. ఆయనే విత్తువాడు. విత్తబడిన విత్తనం ఆయన విత్తనం, ఆయన వాక్యానికి అనుగుణంగా ఉంటుంది మరియు దాని ఫలితంగా వచ్చే పంట ఆయన పంట. ఆయన ఆ ప్రక్రియను ప్రారంభించినప్పుడు ఏమి పంట పండించాలని ఉద్దేశించాడో దానినే కోస్తాడు. దేవుడు తన పంటను ఎదగకుండచేసే దారిలో ఉన్న ముళ్లపొదలు, రాళ్ళు ఉన్న చోట వదిలివేయడు. ఆయన వాక్యం యొక్క ఒక భాగం మంచి నేలపై పడేలా చూసేది మరియు చేసేది దేవుడు మాత్రమే. ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, మంచి నేల అనేది పతనమైన పాపుల యొక్క మంచి స్వభావం అని, దేవుని ముందస్తు కృపకు సానుకూలంగా స్పందించి సరైన ఎంపిక చేసుకునే పాపులు అని భావించడం. సంప్రదాయ సంస్కరణ సిద్ధాంత అవగాహన ప్రకారం, దేవుడు విత్తిన విత్తనానికి నేల గ్రహణశక్తి కలిగి ఉంటే, ఆ విత్తనం మొలకెత్తడానికి ఆ నేలను సిద్ధం చేసేది కూడా దేవుడే.
సెమీ-పెలాజియన్ లేదా ఆర్మీనియన్ సిద్ధాంతాలను అనుసరించేవారు ఎవరైనా ఆచరణాత్మక స్థాయిలో ఎదుర్కోవాల్సిన అతి పెద్ద ప్రశ్న ఇది: నా పొరుగువాడు, అదే సువార్తను విన్నవాడు, దానిని తిరస్కరించాలని ఎంచుకున్నప్పుడు, నేను ఎందుకు సువార్తను నమ్మి, నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేయాలని ఎంచుకున్నాను? ఆ ప్రశ్నకు అనేక విధాలుగా సమాధానం ఇవ్వబడింది. ఒక వ్యక్తి సువార్తకు మరియు క్రీస్తుకు సానుకూలంగా స్పందించడానికి, మరొకరు స్పందించకపోవడానికి కారణం, సానుకూలంగా స్పందించిన వ్యక్తి రెండో వ్యక్తి కంటే ఎక్కువ తెలివైనవాడు కావచ్చు అని మనం ఊహించవచ్చు. ఒకవేళ అదే నిజమైతే, తెలివితేటలు దేవుని బహుమానం కాబట్టి, రక్షణను అందించే అంతిమ కర్త దేవుడే అవుతాడు, సువార్తను తిరస్కరించిన పొరుగువాడికి దేవుడు అదే తెలివితేటలను ఇవ్వలేదని కూడా వివరించవచ్చు. కానీ ఆ వివరణ ఎంతైనా హాస్యాస్పదంగా ఉంటుంది.
పరిశీలించవలసిన మరొక అవకాశం ఏమిటంటే: ఒక వ్యక్తి సువార్తకు సానుకూలంగా స్పందించడానికి మరియు అతని పొరుగువాడు స్పందించకపోవడానికి కారణం, స్పందించిన వ్యక్తి మంచి వ్యక్తి కావడం. అంటే, సరైన ఎంపిక మరియు మంచి ఎంపిక చేసుకున్న వ్యక్తి తన పొరుగువాడి కంటే నీతిమంతుడు కాబట్టే దానిని చేశాడు. ఈ పరిస్థితిలో, మానవ ప్రయత్నం కేవలం కొంతమేరకు ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా, సర్వస్వమూ సాధించినట్లు అవుతుంది. చాలా మంది ఎవాంజెలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న అభిప్రాయం ఇదే, వారు రక్షించబడటానికి మరియు ఇతరులు రక్షించబడకపోవడానికి కారణం, వారు దేవుని కృపకు సరైన రీతిలో స్పందించడం, ఇతరులు అలా చేయకపోవడమేనని వారు భావిస్తారు.
ఇక్కడ మనం తప్పుడు ప్రతిస్పందనకు బదులుగా సరైన ప్రతిస్పందన గురించి మాత్రమే కాకుండా, చెడు ప్రతిస్పందన కంటే మంచి ప్రతిస్పందన గురించి కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ నేను చెడు ప్రతిస్పందనకు బదులుగా మంచి ప్రతిస్పందన ఇచ్చినందు వల్లే దేవుని రాజ్యంలో ఉంటే, అప్పుడు నేను గర్వపడటానికి ఒక కారణం ఉంటుంది, అదేమిటంటే దేవుని కృపకు నేను స్పందించిన ఆ మంచితనమే. “నేను విశ్వాసిగా ఉండటానికి కారణం నా పొరుగువాడి కంటే నేను మంచివాడిని కాబట్టే” అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక్క ఆర్మీనియన్‌ను కూడా నేను ఇప్పటివరకు కలవలేదు. వారు అలా చెప్పడానికి ఇష్టపడరు. అయితే, వారు ఈ భావాన్ని తిరస్కరించినప్పటికీ, సెమీ-పెలాజియనిజం యొక్క తర్కం ఈ నిర్ధారణకు దారితీస్తుంది. అంతిమంగా నేను క్రైస్తవుడిగా ఉండటానికి మరియు మరొకరు కాకపోవడానికి కారణం, దేవుని రక్షణ ప్రతిపాదనకు నేను సరైన ప్రతిస్పందన ఇవ్వగా, మరొకరు దానిని తిరస్కరించినట్లయితే, తిరస్కరించలేని తర్కం ప్రకారం నేను నిజంగా మంచి ప్రతిస్పందన చేశాను మరియు నా పొరుగువాడు చెడు ప్రతిస్పందన చేశాడు.
విశ్వాసానికి ముందే తిరిగిజన్మిస్తాం
సంస్కరణ వేదాంతం ఏమి బోధిస్తుందంటే విశ్వాసి దేవుని పిలుపుకు సరైన ప్రతిస్పందన ఇస్తాడు మరియు అవిశ్వాసి తప్పు ప్రతిస్పందన ఇస్తాడు. కానీ విశ్వాసి మంచి ప్రతిస్పందన ఇవ్వడానికి కారణం దేవుడు తన సార్వభౌమ ఎన్నికలో ఎన్నుకోబడిన వారి హృదయ స్వభావాన్ని మార్చి మంచి ప్రతిస్పందనను కలిగించడానికి మారుస్తాడు. క్రీస్తుకు నేను ఇచ్చిన ప్రతిస్పందనకు ఎటువంటి ఘనతనూ నేను తీసుకోలేను. దేవుడు నా రక్షణను ప్రారంభించడమే కాకుండా, ఆయన విత్తనాన్ని విత్తడమే కాకుండా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను తిరిగి జన్మింప చేయడం ద్వారా ఆ విత్తనం నా హృదయంలో మొలకెత్తేలా చూశాడు. ఆ తిరిగి జన్మించడం అనేది విత్తనం నాటుకొని, ఫలించేందుకు అత్యంత ఆవశ్యకమైనది. అందుకే సంస్కరణ వేదాంతశాస్త్రం యొక్క హృదయంలో ఒక ముఖ్యమైన సూత్రం ప్రతిధ్వనిస్తుంది, అదేమిటంటే తిరిగి జన్మించడం అనేది విశ్వాసానికి ముందు జరుగుతుంది. సెమీ-పెలాజియన్ సిద్ధాంతాన్ని అనుసరించే వారంతా ఆ సూత్రాన్ని, ఆ రక్షణ క్రమాన్ని తిరస్కరిస్తారు. వారు తమ ఆత్మీయ మరణం యొక్క పతనమైన స్థితిలో, ముందుగా విశ్వాసాన్ని కలిగి ఉంటారని, ఆ తరువాతనే తిరిగి జన్మిస్తారు అనే భావనను కలిగి ఉంటారు. వారి దృష్టిలో, పరిశుద్ధాత్మ వారిని విశ్వాసంలోకి రాగలిగేలా వారి హృదయ స్వభావాన్ని మార్చడానికి ముందే వారు సువార్తకు ప్రతిస్పందిస్తారు. అలా జరిగినప్పుడు, దేవునికి చెందవలసిన మహిమ ఇతరులతో పంచుకోబడుతుంది. అందుకే ఏ సెమీ-పెలాజియన్ కూడా నిజాయితీగా “దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక” అని చెప్పలేడు. సెమీ-పెలాజియన్ దృష్టిలో దేవుడు కృపామయుడై ఉండవచ్చు, కానీ దేవుని కృపతో పాటు నేను చూపే ప్రతిస్పందన కూడా పూర్తిగా అవసరమైనదిగా భావిస్తారు. ఇక్కడ కృప ప్రభావవంతమైనది కాదు, మరియు అటువంటి కృప, చివరికి పరిశీలిస్తే, నిజంగా రక్షించే కృప కాదు. నిజానికి, రక్షణ ఆరంభం నుండి ముగింపు వరకు ప్రభువుకు చెందినది. అవును, నేను నమ్మాలి. అవును, నేను ప్రతిస్పందించాలి. అవును, నేను క్రీస్తును స్వీకరించాలి. కానీ ఆ విషయాలలో దేనికైనా నేను “అవును” అని చెప్పాలంటే, ముందుగా నా హృదయం పరిశుద్ధాత్మ దేవుని సార్వభౌమ, ప్రభావవంతమైన శక్తి ద్వారా మార్చబడాలి. సోలి డియో గ్లోరియా.
ఈ వ్యాసం వాట్ ఆర్ ది ఫైవ్ సోలాస్? సేకరణలో భాగం.
- “సోలి డియో గ్లోరియా (Soli Deo gloria అనగా దేవునికి మాత్రమే మహిమ చెందాలి అని అర్థం)” అనేది ప్రొటెస్టంట్ సంస్కరణ నుండి ఉద్భవించిన గొప్ప నినాదం మరియు జోహాన్ సెబాస్టియన్ బాచ్ దీనిని తన ప్రతి సంగీత రచన కూర్పులో ఉపయోగించాడు. దేవుని అద్భుత కార్యాలైన సృష్టి కార్యములోనూ మరియు విమోచన కార్యములోనూ మహిమను పొందేది కేవలం దేవుడు మాత్రమే అనే ఆలోచనను తెలియజేయడానికి అతను ప్రతి ప్రతి సంగీత రచన చివరలో “SDG” అనే అక్షరాలను అతికించాడు. దేవుని కృప అనే ప్రశ్న పదహారవ శతాబ్దపు రక్షణ వివాదంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఇది మనిషికి కృప అవసరమా అనే ప్రశ్న కాదు. ఆ కృప ఎంతవరకు అవసరం అనేదే ప్రశ్న. పూర్వంలో పెలాజియస్ అనే బోధకుడు కృప రక్షణను సులభతరం చేస్తుంది, కానీ అది ఖచ్చితంగా అవసరం లేదని బోధించాడు, సంఘం అప్పటికే ఆ బోధను ఖండించింది. ఆ తరువాత కాలంలో సెమీ-పెలాజియనిజం కృప లేకుండా రక్షణ లేదని ఎల్లప్పుడూ బోధించింది. అయితే సెమీ-పెలాజియన్ మరియు అర్మినియన్ రక్షణ సిద్ధాంతాలలో చెప్పబడే కృప శక్తివంతమైనది కృప కాదు. అది రక్షణను సాధ్యమయ్యేలా చేస్తుంది, కానీ ఖచ్చితంగా రక్షణను కలుగజేసే కృప కాదు.