కీర్తనలను నేను ఎందుకు ఇష్టపడతాను
27/03/2025
మా దినములను లెక్కించుట మాకు నేర్పుము
03/04/2025
కీర్తనలను నేను ఎందుకు ఇష్టపడతాను
27/03/2025
మా దినములను లెక్కించుట మాకు నేర్పుము
03/04/2025

దేవుడు మంచివాడు అంటే ఏమిటి?

దేవునికి ఇవ్వబడిన రెండు సుగుణాలు, గొప్పతనం మరియు మంచితనం, పరిశుద్ధత అనే ఒక బైబిల్ పదం ద్వారా సంగ్రహించవచ్చు. మన౦ దేవుని పరిశుద్ధత గురి౦చి మాట్లాడినప్పుడు, దాన్ని దేవుని స్వచ్ఛత, నీతితో ముడిపెట్టడ౦ మనకు అలవాటై౦ది. పరిశుద్ధత అనే భావనలో ఈ సుగుణాలు ఉన్నాయి, కానీ అవి పరిశుద్ధత యొక్క ప్రాధమిక అర్థం కాదు.

పరిశుద్ధత అనే బైబిల్ పదానికి రెండు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ప్రాధమిక అర్థం “వేరుతనం” లేదా “ఇతరత్వం”. దేవుడు పరిశుద్ధుడని మన౦ చెప్పినప్పుడు, ఆయనకు, సమస్త ప్రాణుల మధ్య ఉన్న లోతైన వ్యత్యాసాన్ని గూర్చి చూపిస్తాము. ఇది దేవుని మహోన్నత మహిమను సూచిస్తుంది, దాని ద్వారా ఆయన మనము చూపించే ఘనతకు, గౌరవానికి, పూజకు, ఆరాధనకు అర్హుడు. ఆయన మహిమలో మనకన్నా “వేరేవాడు” లేదా భిన్నమైనవాడు. బైబిలు పరిశుద్ధ వస్తువుల గురి౦చి లేదా పరిశుద్ధ వ్యక్తుల గురి౦చి లేదా పవిత్ర సమయ౦ గురి౦చి మాట్లాడినప్పుడు, దేవుని స్పర్శ ద్వారా వేరుచేయబడిన, ప్రతిష్ఠి౦చబడిన లేదా భిన్నమైన విషయాలను సూచిస్తు౦ది. మండుతున్న పొద దగ్గర మోషే నిలబడిన భూమి పవిత్ర భూమి, ఎందుకంటే దేవుడు అక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నాడు. దైవానికి దగ్గరగా ఉండటమే మామూలువి అకస్మాత్తుగా అసాధారణంగా, సామాన్యమైనవి ప్రత్యేకమైనవిగా మార్చింది.

పరిశుద్ధత యొక్క రెండవ అర్థం దేవుని స్వచ్ఛమైన మరియు నీతివంతమైన చర్యలను సూచిస్తుంది. దేవుడు ఏది సరైనదో అదే చేస్తాడు. ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతంగా వ్యవహరిస్తాడు ఎందుకంటే ఆయన స్వభావం పరిశుద్ధమైనది. అందువలన, దేవుని అంతర్గత నీతి (ఆయన పరిశుద్ధ స్వభావం) మరియు దేవుని బాహ్య నీతి (ఆయన చర్యలు) మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించవచ్చు.

దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన గొప్పవాడు మరియు మంచివాడు. ఆయన మంచితనంతో ఏ చెడు మిళితమై ఉండదు. మన౦ పరిశుద్ధులమని పిలువబడినప్పుడు, మన౦ దేవుని దివ్య మహిమలో భాగ౦ వహి౦చాలని కాదు, మన౦ సాధారణ౦గా పతనమైన పాపపు స్థితి నుండి భిన్న౦గా ఉ౦డాలని అర్థ౦. దేవుని నైతిక స్వభావాన్ని, కార్యాచరణను ప్రతిబింబించడానికి మనల్ని పిలుస్తారు. ఆయన మంచితనాన్ని మనము అనుకరించాలి.

ఇంతకు ముందు  లిగోనియర్ మినిస్ట్రీస్ చే ESV రిఫార్మేషన్ స్టడీ బైబిల్ లో ప్రచురించబడింది.

లిగోనియర్ సంపాదకీయం
లిగోనియర్ సంపాదకీయం
లిగోనియర్ మినిస్ట్రీస్ నుండి వ్యాసాలు, పుస్తకాలు మరియు ప్రసంగాలు.