
దేవుని వాక్యాన్ని వినే 6 రకాల శ్రోతలు
10/11/2026పిల్లల కోసం నిబంధన దైవశాస్త్రం: ఒక ప్రారంభ మార్గదర్శిని
మనము మన పిల్లలను సండే స్కూల్కు లేదా వి.బి.ఎస్ (VBS)కు పంపినప్పుడు, వారు ఏమి పొందుతారని మనం ఆశిస్తున్నాము? అంతగా ప్రాముఖ్యత లేని బైబిల్ పాత్రలను విస్తృత చిత్రంతో అనుసంధానించడంలో మనం వారికి ఎలా సహాయపడగలం? క్రైస్తవుల జీవితాలను సమూలంగా పరివర్తన చేసిన ఆ అత్యవసర సత్యాలు ఖచ్చితంగా ఏవి?
లిగోనియర్ మినిస్ట్రీస్ వారి కొత్త పిల్లల పాఠ్యప్రణాళిక, ‘గ్రోయింగ్ ఇన్ గాడ్స్ వర్డ్’, ఒక సంవత్సరం పాటు సాగే అధ్యయనంలో బైబిలు యొక్క ప్రాథమిక అంశాలను వివరిస్తుంది. ఇది ప్రత్యేకంగా లేఖనాల నిబంధనాత్మక చట్రం నుండి వ్రాయబడింది, ఇది దేవుని రక్షణ ప్రణాళిక మరియు మానవాళితో ఆయన వ్యవహారాల యొక్క సమగ్ర చిత్రాన్ని మనకు అందిస్తుంది. బైబిలు యొక్క ప్రాథమిక సత్యాలను పంచుకోవడానికి లేదా వారికి దైవశాస్త్రాన్ని పరిచయం చేయడానికి మన పిల్లలు పెద్దయ్యే వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ వనరు, వారి వయస్సుకు తగిన కార్యకలాపాలు మరియు ప్రశ్నల ద్వారా నిబంధన దైవశాస్త్రంలోని కీలక అంశాలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుంది.
సంఘాలు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు యేసు ఆజ్ఞను పాటించాలని గంభీరంగా పిలుపునిచ్చారు: “చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆపవద్దు, ఎందుకంటే పరలోకరాజ్యం అలాంటివారిదే” (మత్తయి 19:14). మన పిల్లల ప్రారంభ అభ్యాసంలో వారికి బైబిల్ను స్థిరంగా మరియు విశ్వసనీయంగా అందుబాటులోకి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, మనం ప్రారంభించగల కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
1. సృష్టికర్త
మనం పిల్లలకు నిబంధన దైవశాస్త్రాన్ని పరిచయం చేసినప్పుడు, మనం కేవలం ఆరంభం నుండే మొదలుపెట్టవచ్చు. దేవుడే సృష్టికర్త. దేవుడు శూన్యం నుండి సృష్టిని మాట ద్వారా కలుగజేశాడు. ఆయన తన సృష్టిలో బయలుపరచబడ్డాడు, కాని ఆయన వాక్యంలో మాత్రమే మనం జీవం, మరణం, పాపం మరియు క్రీస్తు వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలం. మార్టిన్ లూథర్ ఇలా అన్నారు, “నేను దేవుని కార్యములను, ఆయన శక్తిని ఎరుగకపోతే, నేను దేవుణ్ణి ఎరుగను; మరియు నేను దేవుణ్ణి ఎరుగకపోతే, నేను ఆయనను ఆరాధించలేను, స్తుతించలేను, కృతజ్ఞతలు చెల్లించలేను, లేదా సేవించలేను.”1
దేవుడు సమస్తమును సృజించి, నిబంధన ద్వారా తన సృష్టిని సార్వభౌమాధికారంతో సంరక్షిస్తాడు (రోమా 5; 1 కొరింథీ 15 చూడండి). నిబంధన అంటే ఆశీర్వాదాలు మరియు కట్టుబాట్లతో కూడిన వాగ్దానం.2 దేవుని నిబంధనలు యాదృచ్ఛికమైనవి లేదా లావాదేవీలకు సంబంధించినవి కావు; బదులుగా, అవి ఆయన సృష్టిలో ఆయన పరిశుద్ధతను మరియు ఆయన కార్యాలను స్వయంగా వెల్లడిస్తాయి. ఆయన తన త్రిత్వ స్వభావానికి అనుగుణంగా స్థిరంగా పనిచేస్తాడు గాని, కోరికలు, సౌలభ్యం లేదా ఆచరణాత్మకత నుండి అస్తవ్యస్తంగా కాదు. బైబిలు మూడు ప్రాథమిక నిబంధనలను వెల్లడిస్తుంది: విమోచన నిబంధన, క్రియల నిబంధన మరియు కృప నిబంధన.
2. క్రీస్తు
లేఖనమంతా క్రీస్తునే సూచిస్తుంది. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, బైబిలు విభిన్నమైన కథలతో నిండి ఉంది, మరియు అవన్నీ కలిసి, క్రీస్తు కార్యంలో అంతిమంగా వెల్లడి చేయబడిన, దేవుడు తన సృష్టి పట్ల చూపిన కృప అనే అత్యంత గొప్ప కథను ఒక వస్త్రంలా అల్లుతాయి. నిబంధన డైవశాస్త్రం పాత మరియు క్రొత్త నిబంధనలను అనుసంధానించి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన ధర్మశాస్త్రంలోనూ మరియు క్రీస్తు యొక్క ఒక్కసారియే జరిగిన కార్యంలోనూ వెల్లడిస్తుంది (గలతీ. 3:24–29). ధర్మశాస్త్రాన్ని మరచిపోకుండా, క్రీస్తు తన పరిపూర్ణమైన జీవితం, బలియాగ మరణం మరియు సమాధి నుండి పునరుత్థానం ద్వారా క్రియల నిబంధనను నెరవేర్చి, తనను అనుసరించేవారందరిని కృపా నిబంధనలోనికి నడిపించాడు (మత్త. 5:17).
నిజంగా మానవుడు మరియు నిజంగా దేవుడైన యేసు క్రీస్తు, పరిపూర్ణుడైన దేవునికి మరియు విచ్ఛిన్నమైన మానవాళికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి. తండ్రి తన ఏకైక కుమారుని పంపడం ద్వారా; కుమారుని ప్రాయశ్చిత్త జీవితం, మరణం మరియు పునరుత్థానం ద్వారా; మరియు పరిశుద్ధాత్మ యొక్క పునరుజ్జీవన కార్య శక్తి ద్వారానే మనం కృపా నిబంధన యొక్క అన్ని ప్రయోజనాలను పొందుతాము. విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యమైన క్రైస్తవులు ఇప్పుడు దేవుణ్ణి “తండ్రి” అని పిలవగలరు మరియు ఈ సంబంధముగల దేవునిలో లభించే శాంతి, భరోసా మరియు పరిపూర్ణ విశ్రాంతిని తెలుసుకోగలరు.
3. సంఘము (చర్చి)
కృపా నిబంధన అనేది ప్రతి జాతి, దేశం మరియు భాషకు చెందిన విశ్వాసుల సమూహం కొరకు ఉద్దేశించబడింది. ఇందులో ఏకాకులుగా మిగిలిపోయేవారు గాని, పక్షపాతం చూపేవారు గాని లేరు. సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం నిబంధన దైవశాస్త్రాన్ని మరియు సామూహిక ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే చారిత్రాత్మక విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సువార్త నిబంధన ప్రజలను ఒకే పతాకం క్రింద ఏకం చేస్తుంది: యేసే ఏకైక మార్గం (యోహాను 14:6). మొదటి ఆదాము ద్వారా మానవాళి పాపంలో మరణించింది మరియు కడపటి ఆదాము ద్వారా మనం విశ్వాసంలో నీతిమంతులుగా చేయబడ్డాము (1 కొరింథీ. 15:45). ఈ విశ్వాసం మనలను అంధకార ఆధిపత్యం నుండి వెలుగులోకి తీసుకువస్తుంది, అక్కడ క్రీస్తు నామాన్ని పిలిచే వారందరూ మళ్లీ ఎన్నడూ వేరు చేయబడరు లేదా ఒంటరిగా ఉండరు.
ఇది తక్షణ వాస్తవమే అయినప్పటికి, క్రీస్తు తిరిగి వచ్చేవరకు లేదా మనలను తన ఇంటికి పిలిచే వరకు మనం విచ్ఛిన్నమైన లోకంలోనే జీవిస్తున్నాము. ఆదివారపు ఆరాధన అనేది కేవలం ఇష్టమైన వారాంతపు కార్యకలాపాల గురించి మాత్రమే కాదు, మనం దేనికోసం సృష్టించబడ్డామో దాని యొక్క ఒక ఉన్నతమైన దృశ్యం: మన సృష్టికర్త అయిన దేవుని గురించిన జ్ఞానంలో మరియు క్రీస్తులో పాలుపంచుకోవడానికి ఆయన మనలను ఆహ్వానించే త్రిత్వ విశ్రాంతిలో ఎదగడం.
4. పిలుపు
సువార్త ప్రకటించబడటాన్ని వినే వారందరిలాగే, నిబంధన పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన ఆధిక్యత మరియు ఆశీర్వాదం ఇవ్వబడింది; అదే ప్రభువు మార్గంలో కొనసాగమని పదేపదే వచ్చే పిలుపు. మనం మన పిల్లలకు నిబంధన దైవశాస్త్రాన్ని బోధించినప్పుడు, నిత్య సత్యంపై నిర్మించబడిన జీవితానికి ఒక చట్రాన్ని అందిస్తాము. కాని మన బోధన కేవలం కంఠస్థం చేయించడానికో లేదా ప్రవర్తన మార్పుకో పరిమితమైతే, ప్రభువైన యేసుక్రీస్తు అనే ద్రాక్షతీగలో నిలిచియుండమని మనం వారిని పిలవలేము. మన పిల్లలు విశ్వాసంతో యేసుకు ప్రతిస్పందించాలని, కృపా సాధనాల ద్వారా ద్రాక్షతీగలో ఎదగాలని మనం కోరుకుంటున్నాము. స్థానిక సంఘం సందర్భంలో ఈ పిలుపే బైబిల్లోని ఆ విభిన్న కథలకు మూలం: దేవుని వాగ్దానాలను విశ్వసించమని విశ్వాసంతో ఇచ్చే పిలుపు.
ఈ సందేశంలో ఒక ఆవశ్యకత ఉంది, దానిని మనం మన పిల్లలకు తెలియజేయాలి. అదే సమయంలో, ప్రభువు దొరికేటప్పుడే ఆయనను వెదకమని (యెషయా 55:6) వారికి ఓపికతో శిక్షణనిస్తూ, హెచ్చరిస్తూ ఉండాలి. మనం మన పిల్లలకు నిబంధన దైవశాస్త్రాన్ని బోధించినప్పుడు, ఈ జీవితంలోనూ, రాబోయే జీవితంలోనూ వారు సంపూర్ణంగా తెలుసుకోబడి, సురక్షితంగా ఉండి, నిశ్చలమైన జలాలచే నడిపించబడే అంతిమ ప్రయాణం వైపు వారిని నడిపిస్తాము.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


