ఎక్లేసియా: పిలువబడిన వారు
12/03/2025
బోధనలో దృష్టాంతాల యొక్క అవసరం
20/03/2025
ఎక్లేసియా: పిలువబడిన వారు
12/03/2025
బోధనలో దృష్టాంతాల యొక్క అవసరం
20/03/2025

యేసు పాపం చేయగలిగి ఉంటాడా?

  1. యేసు పాపం చేసి ఉంటాడా అనే ప్రశ్నపై గతంలో అలాగే ప్రస్తుతం ఉత్తమ వేదాంతవేత్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. యేసు పూర్తిగా మానవుడు కాబట్టి, అతను పాపం చేయడం సాధ్యమేనని నేను నమ్ముతున్నాను. దైవ స్వభావం పాపం చేయజాలదు  అది స్పష్టం. కానీ క్రీస్తు యొక్క దైవిక స్వభావ౦ ఆయనను పాప౦ చేయకుండా నిరోధిస్తే, ఆయన రెండవ ఆదాముగా దేవుని ధర్మశాస్త్రానికి ఏ విధ౦గా లోబడినట్లు అవుతుంది? పతనం అవ్వకమునుపు ఆదాము స్వభావము ఆయన నైతిక విలువలకు సంబంధించి ఎలా ఉండెనో, పుట్టుక సమయంలో యేసు యొక్క మానవ స్వభావం అచ్చు అలానే వున్నది. యేసునకు కలిగిన ఈ నైజాన్ని, అగస్టీన్ “పోసే పెక్కేర్” మరియు  “పోసే నాన్ పెక్కేర్” అని పిలిచారు, అనగా పాపం చేసే సామర్థ్యం మరియు పాపం చేయకుండా ఉండే సామర్థ్యం. ఆదాము పాపము చేశాడు; యేసు అలా చేయలేదు. సాతాను యేసును చెడగొట్టడానికి మరియు పాపానికి ప్రలోభపెట్టడానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేశాడు. ఒక దైవికమైన వ్యక్తిని పాపం చేయమని ప్రలోభపెట్టడానికి అతను ప్ప్రేరేపిస్తుంటే అది నిష్ప్రయోజనమైన ప్రయత్నము. సాతాను దేవుణ్ణి పాపానికి గురిచేయడానికి ప్రయత్నించలేదు. అతను యేసు, రక్షకుడిగా ఉండటానికి అర్హుడు కాకూడదని ఆయన యొక్క మానవ స్వభావాన్ని పాపం చేయడానికి శోధించాడు. 

    అదే సమయంలో, క్రీస్తు పరిశుద్ధాత్మచే ప్రత్యేకంగా పరిశుద్ధపరచబడ్డాడు మరియు పరిచర్య చేయబడ్డాడు. పాపం చేయాలంటే, ఒక వ్యక్తికి పాపపు కోరికలు  ఉండాలి. కానీ యేసు యొక్క మానవ స్వభావ౦లో తన జీవితమంతా నీతిపట్ల ఉత్సాహం కనపరచినట్లు గుర్తించబడ్డాడు. ఆయన ఇలా అన్నాడు, “నన్ను పంపినవాని చిత్తము చేయడమే నా ఆహారము” (యోహాను 4:34). యేసుకు పాప౦ చేయాలనే కోరిక లేనంతవరకు, ఆయన పాప౦ చేయడు. నేను తప్పు కావచ్చు, కానీ క్రీస్తు యొక్క దైవిక స్వభావం అతని మానవ స్వభావం పాపం చేయడం అసాధ్యం చేసిందని నమ్మడం తప్పు అని నేను అనుకుంటున్నాను. అదే నిజమైతే, ప్రలోభాలు, పరీక్షలు, మొదటి ఆదాము బాధ్యతను స్వీకరించడం అన్నీ బూటకమే అయిపోయేవి. ఈ స్థితి మానవ స్వభావం యొక్క ప్రామాణికత యొక్క సమగ్రతను కాపాడుతుంది ఎందుకంటే మానవ స్వభావం మన తరఫున రెండవ ఆదాము యొక్క లక్ష్యాన్ని నిర్వహించింది. అది పరిశుద్ధాత్మ చేత కొలవలేనంతగా అభిషేకింపబడిన మానవ స్వభావం.

  2. ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.
ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.