తల్లిదండ్రులుగా ఉండటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
28/05/2025
తల్లిదండ్రులుగా ఉండటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
28/05/2025

వివాహం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    1. పెళ్లి గురించి ఎంత చెప్పినా, నిత్యావసరాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు వివాహం చేసుకున్నా లేదా ఒంటరిగా ఉన్నా, ప్రసిద్ధ ఐదు ఎ-లతో (ఆంగ్లంలో డబ్ల్యులు) సంక్షిప్తీకరించిన వివాహం గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి: ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ మరియు ఎందుకు.
      1. ఎవరు: వివాహము దేవునిచే రూపొందించబడినది, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీకి సమానమైన జోడిగా ఉంటారు. (ఆదికాండము 2:24; మత్తయి 19:4-5).

      దేవుడు వివాహాన్ని సృష్టించాడు. వివాహ౦పై దేవుని ఆశీర్వాదాన్ని ఆశి౦చినప్పుడు, దాని కోస౦ ఆయన నియమాలను పాటి౦చడ౦ జ్ఞానవంతమైనది. మరీ ముఖ్యంగా క్రైస్తవులకు, దీని అర్థం ఒకే విశ్వాసాన్ని పంచుకోవడం (2 కొరింథీయులు 6:14). కొన్నిసార్లు ఒక క్రైస్తవ వ్యక్తి క్రైస్తవేతర వ్యక్తితో వివాహంలో ఉండిపోతారు ఎందుకంటే ప్రజలు మారతారు. భార్యాభర్తల్లో ఒకరు విశ్వాసానికి వస్తారు లేదా ఒక జీవిత భాగస్వామి ఎప్పుడూ నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండరని రుజువు చేస్తారు. దేవుడు అలా౦టి మిశ్రమ-విశ్వాస వివాహాలను అనుమతి౦చినా, అలా౦టి వివాహాల ద్వారా కూడా పనిచేస్తాడు, అయితే, అలా౦టి వివాహ౦లో మన౦ ఇష్టపూర్వక౦గా ప్రవేశి౦చవద్దని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఒక క్రైస్తవుడు క్రైస్తవేతర వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎంచుకోవడం అంటే క్రీస్తు వైపు కాకుండా క్రీస్తుకు దూరంగా నడవడం మరియు ఆత్మతో అడుగులు వేయడానికి బదులుగా ఆత్మకు విరుధంగా అడుగులు వేయడం (గలా. 5:16-19).

      1. ఏమిటి: వివాహం అనేది భార్యాభర్తల మధ్య జీవితకాల కలయిక, ఇది క్రీస్తు మరియు సంఘానికి మధ్య సంబంధాన్ని చిత్రిస్తుంది.

      వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు తమ మూల కుటుంబాన్ని వదిలి నూతన కుటుంబాన్ని ప్రారంభించడం. క్రైస్తవ వివాహం అనేది క్రీస్తు మరియు సంఘము, తన వధువు మధ్య సంబంధానికి ప్రతిబింబం (ఎఫె. 5:32; 2 కొరింథీ 11:2). అందువలన, సంఘమునకు అధిపతిగా ఉన్న క్రీస్తు పాత్రను అనుసరించి భర్తలకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. భర్తలు త్యాగపూరితంగా నడిపించడానికి, క్రీస్తు సంఘము కొరకు చేసినట్లుగా తమ భార్య కోసం తమ ప్రాణాలను అర్పించడానికి కూడా పిలువబడ్డారు (ఎఫె. 5:25). అదేవిధంగా, క్రీస్తు శరీరంగా సంఘ పాత్రకు అనుగుణమైన ఆజ్ఞలు భార్యలకు ఇవ్వబడ్డాయి. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలు తమ భర్తకు లోబడవలెను (ఎఫె. 5:24). రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. తమ వివాహం ద్వారా క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడి చేయడానికి  జంటలకు ఎంత గౌరవం మరియు ఎంత బాధ్యత.

      1. ఎప్పుడు: వివాహం జీవితకాలం కొరకు, కానీ శాశ్వతకాలం కొరకు కాదు (మత్తయి 22:30).

      “మంచికైనను చెడుకైనను, కలిమికైనను లేమికైనను, వ్యాధియందును ఆరోగ్యమందును, మీరిద్దరు జీవించు కాలమంతయు” అని అనేక ప్రతిజ్ఞలు చెబుతున్నట్లుగా వివాహం అన్నది ఇక్కడ మరియు ఇప్పుడు అనే వాస్తవాని కొరకు. ఇది కేవలం మనం ప్రేమించబడినట్లు భావించే సమయాలకు లేదా ప్రేమించాలని భావించే సమయాలకు మాత్రమే కాదు- ఇది జీవితం కోసం. దేవుడు నిర్దిష్ట పరిస్థితులకు విడాకులను ఒక ఎంపికగా ఇచ్చినప్పటికీ, ప్రతి అవాంఛిత, ఊహించని లేదా అన్యాయమైన పరిస్థితికి ప్రతిస్పందనగా దీనిని అనుసరించకూడదు. అటువంటి ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి దేవుడు సంతోషిస్తున్నాడని తెలుసి, వైవాహిక సవాళ్ల కొరకు ఎదురుచూస్తూ, ఒకరిపట్ల ఒకరికి ఉన్న తమ ప్రేమను పునరుద్ధరించబడడానికి, జోడించబడడానికి మరియు గుణించబడడానికి (మత్తయి 7:7) కూడా జంటలు తెలివిగా దేవునికి ప్రార్థిస్తారు (1 యోహాను 5:14-15).

      భార్యాభర్తలకు అలా౦టి ప్రార్థనలు అవసర౦ కావడానికి ఒక కారణమేమిట౦టే, మన౦ ఇప్పటికీ పాపులమే, కానీ నిరీక్షణ కోల్పోవడానికి ఇది కారణ౦ కాదు. క్రీస్తు నిర్దేశించిన నమూనాను అనుసరిస్తూ, ఆత్మ మనల్ని ఒకరినొకరు త్యాగపూర్వకంగా ప్రేమించడానికి వీలు కల్పిస్తాడు. పాప ఉనికి వివాహానికి అడ్డంకి కాదు, దాని అమరిక మాత్రమే అడ్డంకి. దేవుడు తన కృపతో జంటలను ప్రేమతో ఒకరినొకరు సహించమని పిలుస్తాడు (ఎఫె. 4:2). జ్ఞానవ౦తమైన జంటలు, పరిపూర్ణత-కంటే-తక్కువైన వివాహాన్ని సద్వినియోగ౦ చేసుకోవడానికి సహాయ౦ కొరకు దేవుని నమ్ముతారు – మరియు అందులో ఉన్న దేవుడు అనుగ్రహించే అనేక ఆశీర్వాదాలను గమనిస్తారు మరియు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు (1 థెస్స. 5:18).

      ఈ జన్మలో వివాహం చేసుకున్నా లేదా ఒంటరిగా ఉన్నా, విశ్వాసులందరూ క్రీస్తుకు మరియు పరలోకంలోని సంఘానికి మధ్య శాశ్వతమైన మరియు పరిపూర్ణమైన వివాహమైన గొర్రెపిల్ల యొక్క వివాహ భోజనాన్ని శాశ్వతంగా మరియు పూర్తిగా ఆస్వాదిస్తారు (ప్రకటన 19:6-9).

      1. ఎక్కడ: వివాహం కొత్త కుటుంబాన్ని, కొత్త ఇంటిని ఏర్పరుస్తుంది.

      కింగ్ జేమ్స్ వెర్షన్ కవితాత్మకంగా చెప్పినట్లు, దేవుడు భార్యాభర్తలను “విడిచిపెట్టమని మరియు కలిసిపోమని” పిలుస్తాడు (ఆదికాండము 2:24). తల్లిదండ్రుల నుండి జీవిత భాగస్వామికి ఒకరి ప్రాధమిక నమ్మకత్వాన్ని మార్చడం సవాలుగా ఉంటుంది. దంపతులు మరియు వారి తల్లిదండ్రుల మధ్య కొంత భౌతిక దూరం ఈ ప్రక్రియకు సహాయపడుతుంది. దేవుడు వివాహిత జంటలను తల్లిద౦డ్రులను గౌరవి౦చడ౦ కొనసాగి౦చమని పిలుస్తాడు, కానీ వారికి విధేయత చూపించడము అవశ్యముగా కాదు (ఎఫె. 20:12; ఎఫె. 6:2-3). జంటలు ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి. వారు తల్లిద౦డ్రుల సలహాలను వినవచ్చు, వారి జ్ఞానాన్ని కూడా ఆహ్వాని౦చవచ్చు, కానీ భార్యాభర్తలు స్వతంత్ర కుటు౦బ౦గా తమ స్వ౦త నిర్ణయాలను స్వేచ్చగా తీసుకోవాలి, ఎ౦దుక౦టే దేవుడు వారిని అలా చూస్తాడు (ఆదికా౦డము 2:24).

      1. ఎందుకు: దేవుడు వివాహానికి నాలుగు ఉద్దేశాలను ఇస్తాడు. ఆయన ఇచ్చే అవకాశము కొలది ఆ నాలుగింటిని నెరవేర్చాలని చూస్తూ వివాహిత దంపతులు దేవుని మహిమపరుస్తారు. 

      పిల్లలను పెంచడం. కొ౦తమ౦ది వివాహిత దంపతులు పిల్లలను కనడానికి దైవానుగ్రహం ద్వారా అవరోధాలు కలిగినప్పటికిని, పిల్లలను కోరుకోవడం అనేదానిని లేఖనం దీవెనగా చూస్తుంది. (కీర్తన 127:3-5; మలకీ 2:15), మరియు తల్లిద౦డ్రులు పిల్లలను యెహోవా క్రమశిక్షణలో, ఉపదేశ౦లో పె౦చాలి (ఎఫె. 6:4).

      లైంగిక సంతృప్తి. దేవుడు వివాహానికి వెలుపల శృంగారాన్ని అనుమతించడు (1 కొరింథీ 7:2). వివాహంలో, ఇది దేవుడి నుండి వచ్చిన ఇతర మంచి వరం వలె ఆనందించాలి.

      లోకాన్ని, సంఘాన్ని ఆశీర్వదించడం. తరచుగా, ఒక జంట దాని భాగాల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకరి కంటె ఇద్దరు మెరుగ్గా సేవ చేయగలరు (ప్రసంగి 4:9-12, మత్తయి 20:28).

      సహచర్యం. సృష్టిలో, దేవుడు ప్రతిదాన్ని సృష్టించినప్పుడు, అది మంచిదని ప్రకటించాడు (ఆదికాండము 1:31). పెళ్లి విషయంలోనూ అదే చెప్పొచ్చు. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడు (ఆదికాండము 2:18).

      గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే ఉందంటే, అది: వివాహం అనేది మంచిది. వివాహ౦ అనేది దేవుడు ప్రజలకు సహవాసాన్ని ప్రసాది౦చే ఒక ప్రాముఖ్యమైన మార్గ౦, దానిలో మన౦ ఆయనను గౌరవి౦చినప్పుడు దాని మీద ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఆశి౦చడ౦ సరైనదే.

    1. ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.
      1.        
ఎమిలీ వాన్ డిక్షోర్న్
ఎమిలీ వాన్ డిక్షోర్న్
ఎమిలీ వాన్ డిక్షోర్న్ వెస్ట్ మినిస్టర్ థియోలాజికల్ సెమినరీ నుండి గ్రాడ్యుయేట్. ఆమె గోస్పెల్ షేప్డ్ మ్యారేజ్: గ్రేస్ ఫర్ సిన్నర్స్ టు లవ్ లైక్ సెయింట్స్ అనే పుస్తకానికి సహ రచయిత్రి మరియు కన్ఫెసింగ్ ది ఫెయిత్ స్టడీ గైడ్ అనే పుస్తకానికి రచయిత్రి. ఎమిలీ, ఆమె భర్త చాడ్ మరియు వారి ఐదుగురు పిల్లలు షార్లెట్, NCలో నివసిస్తున్నారు.