
1 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
24/07/2025
హగ్గయి గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
31/07/2025మలాకీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
ఇయాన్ డుగ్విడ్
ప్రవక్త మలాకీ ద్వారా ప్రభువు తన చెర తరువాత ఉన్న ప్రజలకు అనేక సవాలుతో కూడిన విషయాలను చెప్పాడు. మలాకీ పుస్తకం ఏడు ప్రవచనాల శ్రేణిగా ఏర్పాటు చేయబడింది, ప్రతి ఒక్కటి కూడ ప్రజల చేదు సామెతతో ప్రారంభమవుతుంది దానికి ప్రభువు ప్రతిస్పందిస్తాడు. మలాకీ సమకాలీనుల వైఖరులు, చర్యల గురించి ఈ వక్తృత్వాలు చాలావరకు అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా, ప్రభువు ప్రజలను మందలించడానికి ముందు, ఆయన వారి పట్ల తన ఎన్నుకునే ప్రేమను ధృవీకరించడం ద్వారా ప్రారంభిస్తాడు, అందుకే వారు బహిష్కరణ తీర్పు తర్వాత కూడా ఉనికిలో ఉంటారు. “ఇదే నీ మీద నాకున్న వ్యతిరేకత” అని ఆయన చెప్పే ముందు ప్రభువు మొదట ఇలా ప్రకటిస్తాడు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” (మలాకీ 1:2).
1. దేవుని ఎన్నుకునే ప్రేమ ఎల్లప్పుడూ ప్రారంభ బిందువు అని మలాకీ వెల్లడిస్తాడు.
ఇంతలో ప్రజలు “ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివి?” అని తిరస్కరిస్తారు. (మలాకీ 1:2). ఈ ప్రశ్నకు దేవుడు ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తాడు. యెహోవా తన ప్రజలను కాపాడటానికి మరియు వారికి వారసత్వాన్ని ప్రసాదించడానికి గొప్ప అద్భుతాలు చేసిన కనాను దేశాన్ని జయించడం మరియు ఆ నిర్గమనం వైపు చూపిస్తాడని మనము ఆశించి ఉండవచ్చు. దానికి బదులుగా, ప్రభువు ఇశ్రాయేలీయులను మరి౦త వెనక్కు వారి పూర్వీకుడైన యాకోబు ఎన్నికను, తన సహోదరుడైన ఏశావును తిరస్కరి౦చడాన్ని చూపిస్తాడు (మలాకీ 1:3). చెర తరువాత మరియు బబులోను యెరూషలేమును నాశనం చేసిన తరువాత కూడా ఇంకా ఇశ్రాయేలు ఉన్నది అంటే పూర్తిగా ఈ అనర్హమైన ప్రేమనే కారణం. ఇశ్రాయేలు ఆమె చేసిన పాపాల కోరకు బాధపడ్డింది, కానీ యెహోవా యొక్క గొప్ప ప్రేమవల్ల ఆమె పునరుద్ధరి౦చబడి౦ది. ఏశావు సంతతికి చెందిన ఏదోము బబులోనీయులకు సహాయ౦ చేయడ౦ ద్వారా బబులోను కాల౦లో సాపేక్ష౦గా ప్రాణాపాయ౦ లేకుండా బయటపడ్డారు (ఓబద్యా1:10-14 చూడండి). కాని ఏదోము ప్రస్తుత సౌఖ్యము త్వరలో నాశనమౌతుంది, ఆమె పతనం పరిపూర్ణమై అంతిమముగా ఉ౦టు౦ది (మలాకీ 1:4-5). దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు తమ పాపాలలో తడబడవచ్చు, కాని వారు పూర్తిగా పడిపోరు, ఎందుకంటే ప్రభువు వారిని ప్రేమతో పట్టుకుంటాడు (కీర్తనలు 37:23-24 చూడండి).
2. జీవిత౦ కష్ట౦గా ఉన్నప్పుడు ప్రజలు ద్వేషపూరిత౦గా ప్రవర్తి౦చబడతారని మలాకీ నిరూపిస్తు౦ది.
మలాకీ పుస్తకంలో, ప్రభువు పట్ల ప్రజల ప్రతిస్పందన మొదటి నుండి చివరి వరకు తీవ్రమైన చిరాకుగా ఉంటుంది. ప్రారంభంలో, వారు తమపట్ల ప్రభువు చేసిన ప్రేమ ప్రకటనను తోసిపుచ్చుతారు (మాల్ 1:2). చివరికి, దుష్టులు సుభిక్షంగా ఉంటారు మరియు అహంకారులు ఆశీర్వదించబడతారు కాబట్టి ప్రభువుకు విధేయత చూపడం పనికిరాదని వారు ప్రకటిస్తారు (మాల్ 3:15). దేవుని న్యాయము ఎక్కడ ఉంది (మత్తయి 2:17)? యెహోవాపట్ల ఈ ద్వేషపూరిత వైఖరి ప్రజల అర్ధహృదయ ఆరాధనలో (మాల్. 1:12-13), ఇశ్రాయేలీయుల భార్యలకు వారు చేసిన నమ్మకద్రోహ౦ (మాల్. 2:14-16), వారు పిరికిగా ఇవ్వడ౦ (మాల్. 3:8-9)లో కనిపిస్తు౦ది. యాజకులు కూడా అదే దృక్పథానికి లోనయ్యారు (మాల్ 2:1-9), ప్రజలు లోపభూయిష్టమైన త్యాగాలు చేయడానికి మరియు లంచాలకు బదులుగా పక్షపాత చట్టపరమైన తీర్పులు ఇవ్వడానికి అనుమతించారు (మాల్ 2:9). కష్టకాలాలు తరచూ దేవునిపట్ల చల్లని హృదయాలను పె౦పొ౦దిస్తాయి, అప్పుడు, ఇప్పుడు.
3. యెహోవా తనను గౌరవి౦చేవారిని గౌరవిస్తాడని మలాకీ చూపిస్తాడు.
మలాకీ కాల౦లో ప్రతి ఒక్కరూ ప్రభువుపట్ల ఈ ద్వేషపూరిత వైఖరిని కలిగి ఉ౦డలేదు. కొ౦తమ౦ది యెహోవాకు భయపడేవారు, యెహోవా ఆ దృక్పథాన్ని చూసి వారిని తన “విలువైన సొత్తుగా” పెట్టుకున్నాడు (సెగుల్లా; మలాకీ 3:17), నిర్గమకా౦డము 19:6లో ఇశ్రాయేలీయులను వర్ణి౦చడానికి ఉపయోగి౦చబడిన పద౦ అదే. ప్రజలు కోరుకున్న న్యాయం తీసుకురావడానికి ప్రభువు త్వరలోనే తన మందిరంలో ప్రత్యక్షమవుతాడు (మలాకీ 3:1-2). ఆయన నీతిమంతులను దుష్టుల నుండి శాశ్వతంగా వేరు చేస్తాడు, మరియు ప్రభువుకు భయపడేవారు ఆయన నిజమైన ప్రజలుగా రుజువు చేయబడతారు, దుష్టులు తీర్పు పొందుకుంటారు మరియు నాశనం చేయబడతారు (మలాకీ 4:1-3). ఈలోగా, నమ్మకమైన శేషము పరిశుద్ధముగా జీవించడానికి దేవుని ప్రమాణమైన మోషే ధర్మశాస్త్రాన్ని గుర్తుంచుకోవాలి మరియు దేవుని ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడానికి అత్యద్భుతమైన ప్రవక్త అయిన కొత్త ఏలీయా రాక కోసం ఎదురుచూడాలి (మలాకీ 4:4-6). ఆయన సందేశానికి ప్రతిస్ప౦ది౦చడ౦లో విఫలమైనవారు తీర్పు యొక్క శాపాన్ని ఎదుర్కొ౦టారు (హెరెమ్; మలాకీ 4:6).
రోమీయులు 3లో పౌలు ఎత్తి చూపినట్లుగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడంలో మనమ౦దర౦ చాలా వెనుకబడిన పాపులమైతే, మన౦దరిని ఖ౦డి౦చకుండా అంతిమ తీర్పులో దేవుడు నీతిమ౦తులు, అవినీతిమంతులు అనే తేడాను ఎలా గుర్తి౦చగలడు? యెహోవా తాను ప్రేమి౦చి ఎన్నుకున్న అవినీతిమంతుడైన యాకోబును ఎలా రక్షి౦చగలడు? ఆ ప్రశ్నకు జవాబు క్రొత్త నిబంధన కోరకు ఎదురుచూస్తు౦ది, దానికి మలాకీ ప్రవచన౦ మనల్ని పరిపూర్ణ౦గా సిద్ధ౦ చేస్తు౦ది.
లూకా 1:17లో, బాప్తీస్మము ఇచ్చే యోహాను తన పుట్టుకకు ముందు యేసుక్రీస్తుకు ముందుగా రాబోయే ఏలీయాగా గుర్తింపబడ్డాడు. ముఖ్య౦గా, దేవదూత యొక్క స౦దేశ౦ మలాకీ ప్రవచన౦లోని సానుకూల కోణ౦పై ప్రత్యేక౦గా దృష్టిని కేంద్రీకరిస్తు౦ది, “అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును.” తీర్పుకు సంబంధించిన శాపం యొక్క సంభావ్యత పేర్కొనబడలేదు ఎందుకంటే యేసు తన మొదటి రాకలో, తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు (మత్తయి 1:21).
రూపాంతర పర్వతంపై, యేసు మోషే మరియు ఏలీయా ఇద్దరినీ కలుసుకుని, యెరూషలేము నుండి తన ప్రజలకు విమోచనను తీసుకువచ్చే తన నిర్గమం (ఎక్సోడోన్) గురించి మాట్లాడాడు (లూకా 9:31). ఇప్పుడు క్రీస్తును అంగీకరించడానికి నిరాకరిస్తున్నవారికి, పశ్చాత్తాపం చెందనివారిపై వినాశనాన్ని తీసుకురావడానికి క్రీస్తు తెల్ల గుర్రంపై కూర్చొని తిరిగి ఎప్పుడు వస్తాడో అని వేచి ఉండటానికి మరొక రాక ఉంది (ప్రకటన 19:11-21). కానీ క్రీస్తుపై విశ్వాసంతో ప్రభువు పట్ల భయభక్తిని ప్రదర్శించేవారికి, చర్మాన్ని ఆహ్లాదకరంగా వేడెక్కించేలాగ, అది తాకిన ప్రతిదాన్ని తినే అగ్ని కొలిమి లాగ కాకుండా, ఆ రోజు వసంతకాలంలో ఉదయించే సూర్యుని మొదటి కిరణాల వలె ఉంటుంది. (మలాకీ 4:1-2).
ఈ వ్యాసం బైబిలులోని ప్రతి పుస్తక౦లో: తెలుసుకోవాల్సిన 3 విషయాలు లో భాగ౦.
డాక్టర్ ఇయాన్ డుగ్విడ్ ఫిలడెల్ఫియాలోని వెస్ట్ మినిస్టర్ థియోలాజికల్ సెమినరీలో పాత నిబంధన ప్రొఫెసర్. అతను ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మరియు జెఫన్యా, హగ్గై & మలాకీతో సహా అనేక పుస్తకాల రచయిత.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


