లిగొనియర్ బ్లాగ్

విశ్వాసంలో పెరుగుతున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన సంఘకాపరులు మరియు బైబిలు బోధకుల నుండి ఆలోచనను రేకెత్తించే వ్యాసాలు బైబిల్, వేదాంత మరియు ఆచరణాత్మక ఇతివృత్తాలను ప్రస్తావిస్తాయి.


 


 

19/08/2025

యాకోబు గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

యాకోబు రాసిన పత్రిక బైబిల్‌లోని "కాథలిక్" లేదా "సాధారణ పత్రికలు" అని పిలవబడే ఉప-విభాగానికి చెందినది. వీటిని ఇలా పిలవడానికి కారణం, ఈ పత్రికలు ఏ ఒక్క నిర్దిష్ట సంఘానికో లేదా వ్యక్తికో ఉద్దేశించినవి కావు; బదులుగా, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలందరికీ, అంటే విశ్వాసుల సమగ్ర సమాజాన్ని ఉద్దేశించి వ్రాయబడ్డాయి. ఈ పత్రిక 'అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి' (యాకోబు 1:1) పంపబడింది.
14/08/2025

యిర్మీయా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

యిర్మీయా గ్రంథం బైబిల్‌లోని అర్థం చేసుకోవడం కష్టతరమైన (లేదా చదవడానికి చాలా కష్టమైన) గ్రంథాలలో ఒకటి. పదాల సంఖ్య పరంగా, ఇది మొత్తం బైబిల్‌లోనే అతి పొడవైనది. ఇది కవితాత్మక చిత్రాలు, కథనాల మధ్య ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా, ఇది కాలక్రమానుసారం కూడా ఉండదు.
12/08/2025

దానియేలు గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

పాత నిబంధన గ్రంథాల్లో దానియేలు గ్రంథానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానిలోని విషయ పరిజ్ఞానం, మరియు ఇశ్రాయేలు పునరుద్ధరణ గురించిన పాత నిబంధన ప్రవచనాలతో పాటు, యేసుక్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణంలో ఆ ప్రవచనాల నూతన నిబంధన నెరవేర్పుకు మధ్య ఇది ఒక కీలకమైన వారధిగా నిలుస్తుంది. ఈ గ్రంథం సంక్లిష్టతతో, లోతుతో నిండి ఉంది.
07/08/2025

యెహెజ్కేలు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

యెహెజ్కేలు గ్రంథం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. దేవుని ప్రజలు ఒకవైపు బబిలోన్‌లో చెరసాలలో ఉన్నవారుగా, మరొకవైపు యెరూషలేములో ముట్టడిలో చిక్కుకున్నవారుగా చీలిపోయారు. యాజక వంశానికి చెందిన ప్రవక్త యెహెజ్కేలు, తన భార్య మరణించినా సంతాపం తెలపకుండా 390 రోజులు ఎడమ వైపున పడుకోవలసి వచ్చింది.
05/08/2025

హోషేయ గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

హోషేయ 1:1 ప్రకారం, హోషేయ పరిచర్య ఉత్తర రాజ్యపు రాజైన రెండవ యెరోబాము కాలంలో మొదలై, దక్షిణ యూదా రాజ్యంలోని ఉజ్జీయా, యోతాము, అహాజు, హెజ్కియా రాజుల పాలనల వరకు కొనసాగింది. దీని ప్రకారం, హోషేయ, రెండవ యెరోబాము పరిపాలనా కాలంలో పరిచర్య చేసిన ఉత్తర రాజ్యానికి చెందిన మరొక  ప్రవక్త అయిన యోనాకు సమకాలీనుడయ్యాడు (2 రాజులు 14:25).
31/07/2025

హగ్గయి గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

హగ్గయి గ్రంథం తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ప్రజల కోసం రాయబడింది. బబులోను నుండి యూదాకు తిరిగి వచ్చిన ప్రజలు, తమ సొంతగడ్డపై జీవితం అత్యంత కష్టంగా మారిందని గుర్తించారు. అన్నివైపులా శత్రువులు చుట్టుముట్టి ఉండగా, తమ దేశాన్ని, గత జీవితాలను తిరిగి నిర్మించుకోవడం వారు ఊహించిన దానికంటే ఎంతో కష్టతరమైంది.
29/07/2025

మలాకీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ప్రవక్త మలాకీ ద్వారా ప్రభువు తన చెర తరువాత ఉన్న  ప్రజలకు అనేక సవాలుతో కూడిన విషయాలను చెప్పాడు. మలాకీ పుస్తకం ఏడు ప్రవచనాల శ్రేణిగా ఏర్పాటు చేయబడింది, ప్రతి ఒక్కటి కూడ ప్రజల చేదు సామెతతో ప్రారంభమవుతుంది దానికి ప్రభువు ప్రతిస్పందిస్తాడు.
24/07/2025

1 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

ఈ వచనం గురించి యేసు ఉద్దేశం ఏమిటనే దాని గురించి కొంత చర్చ జరిగిందన్నది నిజమే.  అయితే యేసు పేతురుతో మాట్లాడుతున్నాడని స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేతురు అంతకు ముందే  “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” యేసును గురించి అంగీకరించాడు(మత్తయి 16:16). ఆ తర్వాత పేతురుకు రాళ్ళు, శిలల పట్ల ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చని ఊహించుకోవచ్చు.
22/07/2025

ఎజ్రా గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంతో కలిపి చూసినప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలో దాదాపు వంద సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది. ఈ కాలం క్రీ.పూ. 538లో పారసీక రాజు కోరెషు (సైరస్) యూదులను తమ స్వస్థలమైన యెరూషలేము మరియు యూదాకు తిరిగి వెళ్లడానికి అనుమతిస్తూ జారీ చేసిన శాసనంతో మొదలై, క్రీ.పూ.