31/07/2025
హగ్గయి గ్రంథం తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ప్రజల కోసం రాయబడింది. బబులోను నుండి యూదాకు తిరిగి వచ్చిన ప్రజలు, తమ సొంతగడ్డపై జీవితం అత్యంత కష్టంగా మారిందని గుర్తించారు. అన్నివైపులా శత్రువులు చుట్టుముట్టి ఉండగా, తమ దేశాన్ని, గత జీవితాలను తిరిగి నిర్మించుకోవడం వారు ఊహించిన దానికంటే ఎంతో కష్టతరమైంది.

