యేసు క్రీస్తు: దేవుని గొర్రెపిల్ల
10/12/2024
ప్రొ-ఛాయిస్: దీని అర్థం ఏమిటి?
10/12/2024
యేసు క్రీస్తు: దేవుని గొర్రెపిల్ల
10/12/2024
ప్రొ-ఛాయిస్: దీని అర్థం ఏమిటి?
10/12/2024

సిలువలో దేవుని స౦కల్ప౦ ఏమిటి?

xr:d:DAFXk0WDSFg:25,j:45162075609,t:23011320

పరిమిత ప్రాయశ్చిత్త సిద్ధాంతం  (దీనిని “ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం” లేదా “నిర్దిష్ట విమోచన” అని కూడా పిలుస్తారు) క్రీస్తు ప్రాయశ్చిత్తం ఎన్నుకోబడినవారికి పరిమితం (దాని పరిధి మరియు లక్ష్యంలో) అని చెబుతుంది; యేసు లోకములోని ప్రతి ఒక్కరి పాపములకు ప్రాయశ్చిత్తము చేయలేదు. నా డినామినేషన్ లో, పరిచర్యకు వెళ్ళే యౌవనస్థులను పరిశీలిస్తాము, ఖచ్చితంగా ఎవరోఒకరు ఒక విద్యార్థిని “పరిమిత ప్రాయశ్చిత్తాన్ని మీరు విశ్వసిస్తున్నారా?” అని అడుగుతారు. “అవును, క్రీస్తు ప్రాయశ్చిత్తం అందరికీ సరిపోతుందని మరియు కొంతమందికి సమర్థవంతమైనదని నేను నమ్ముతున్నాను” అని విద్యార్థి ప్రతిస్పందిస్తాడు, అంటే సిలువపై క్రీస్తు మరణం యొక్క విలువ ఇప్పటివరకు జీవించి ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపాలన్నింటినీ కప్పివేసే అంత గొప్పది, కానీ ఇది క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆ మాట సిలువలో దేవుని ఉద్దేశంతో సంబంధం కలిగివున్న ఆ  వివాదాస్పదము యొక్క అసలైన కేంద్రానికి కూడా రాలేదు.

దేవుని నిత్య ప్రణాళికను అర్థ౦ చేసుకోవడానికి ప్రాథమిక౦గా రెండు మార్గాలున్నాయి. ఒక అవగాహన ఏమిటంటే, శాశ్వతం నుండి, దేవుడు పతనమైన మానవజాతి నుండి వీలైనంత ఎక్కువ మందిని రక్షించాలనే కోరికను కలిగి ఉన్నాడు, కాబట్టి ఆయన తన కుమారుడిని పతనమైన ప్రజలకు పాపము-మోసేడిగా ఈ ప్రపంచంలోకి పంపే విమోచన ప్రణాళికను రూపొందించాడు. యేసు ఏదో ఒక సమయంలో తనపై నమ్మకము౦చే వార౦దరి కోస౦ సిలువకు వెళ్లి మరణిస్తాడు. కాబట్టి ఆ ప్రణాళిక తాత్కాలికమైనది— దాన్ని సద్వినియోగ౦ చేసుకునే వార౦దరికీ, విశ్వాసుల౦దరికీ దేవుడు ప్రాయశ్చిత్త౦ చేసాడు. ఆలోచన ఏమిటంటే, యేసు ప్రతిఒక్కరి కొరకు సంభావ్యంగా మరణించాడు, కానీ సిద్ధాంతపరంగా అది అంతా  వృధా అయ్యే అవకాశం వుంది, ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి చివరి వ్యక్తి యేసు యొక్క పనిని తిరస్కరించవచ్చు మరియు వారి అపరాధములలో మరియు పాపములలో చనిపోయి ఉండునట్లు ఎంచుకోవచ్చు. ఆ విధంగా, దేవుని ప్రణాళిక జరగకుండా నిరోధించవచ్చు, ఎందుకంటే ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోకపోవచ్చు. యేసు ప్రతి ఒక్కరి కోస౦ తాత్కాలిక౦గా చనిపోయాడని నేడు సంఘములో ప్రబల౦గా ఉన్న అభిప్రాయమిది. తుది విశ్లేషణలో, రక్షణ కలుగుతుందా లేదా అనేది ప్రతి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.

రిఫార్ముడ్ దృక్పథం దేవుని ప్రణాళికను భిన్నంగా అర్థం చేసుకుంటుంది. దేవుడు శాశ్వత కాలం నుండి తాత్కాలికం కాని ఒక ప్రణాళికను రూపొందించాడని అది చెబుతుంది. ఆ ప్రణాళిక పని చేయకుంటే అనుసరించాల్సిన ప్లాన్ “బీ” లేకుండానే అది ప్లాన్ “ఏ”. ఈ ప్రణాళిక ప్రకార౦, దేవుడు పతనమైన మనుష్యజాతి ను౦డి నిర్దిష్ట స౦ఖ్యలో ప్రజలను రక్షి౦చాలని నిర్ణయించుకున్నాడు, వారిని  ఎన్నుకోబడిన వారు అని బైబిలు పిలుస్తు౦ది. ఆ ఎన్నిక యొక్క ప్రణాళిక చరిత్రలో జరుగడానికి, ఎన్నికైనవారికి విమోచనం సాధించాలనే నిర్దిష్ట లక్ష్యముతో మరియు ప్రణాళికతో ఆయన తన కుమారుడిని లోకానికి పంపాడు. క్రీస్తు రక్తపు చుక్క కూడా వృధా కాకుండా ఇది పరిపూర్ణంగా నెరవేరింది. విమోచన కోసం తండ్రి ఎంచుకున్న ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం ద్వారా రక్షింపబడతారు.

రిఫార్ముడ్ కాని దృక్పథం యొక్క అంతరార్థం ఏమిటంటే, ఎవరు రక్షింపబడతారో దేవుడికి ముందుగా తెలియదు. ఈ కారణ౦గా, “దేవుడు సాధ్యమైన౦త ఎక్కువమ౦ది ప్రజలను రక్షిస్తాడు” అని నేడు వేదాంతవేత్తలు చెబుతున్నారు. దేవుడు ఎంతమందిని కాపాడగలడు? ఎంతమందిని కాపాడే శక్తి ఆయనకు ఉంది? ఆయన నిజంగా దేవుడైతే వారందరినీ రక్షించే శక్తి ఆయనకు ఉంది. ఎంతమందిని కాపాడే అధికారం ఆయనకు ఉంది? మోషే జీవిత౦లో, అబ్రాహాము జీవిత౦లో, లేదా అపొస్తలుడైన పౌలు జీవిత౦లో చేసినట్లే దేవుడు ఎవరి జీవిత౦లోనూ జోక్యం చేసుకోలేడా? ఆ హక్కు ఆయనకు కచ్చితంగా ఉంటుంది.

యేసు “లోకము కొరకు” చనిపోవడం అనే దాని గురించి బైబిలు చెబుతో౦దని మనము కాదనలేము. యోహాను 3:16 ఈ భాషను ఉపయోగి౦చే ఒక వచనానికి ప్రధాన ఉదాహరణ. కానీ యోహాను సువార్తతో సహా క్రొత్త నిబంధనలో యేసు తన జీవితాన్ని అందరి కోసం కాకుండా తన గొర్రెల కోసం అర్పించాడని చెప్పే ఒక వ్యతిరేక దృక్పథం ఉంది. ఇక్కడ యోహాను సువార్తలో, యేసు తన గొర్రెలను తండ్రి తనకు ఇచ్చినవిగా పేర్కొన్నాడు.

 యోహాను 6లో యేసు ఇలా అన్నాడు, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” (వ. 44ఎ), “ఆకర్షించితేనే” అని అనువది౦చబడిన పదానికి “బలవంత౦” అని అర్థ౦. యేసు కూడా ఆ అధ్యాయములో ఇలా అన్నాడు, “తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు” (వ. 37ఎ). తండ్రి తన కుమారుని వద్దకు రావడానికి ఉద్దేశించిన ప్రతి ఒక్కరూ వస్తారని, మరెవరూ రారని ఆయన అభిప్రాయం. మీలో ఆయన చూసినవి ఏవియు ఆ రక్షణను డిమాండ్ చేసినందుకు కాదుగాని, కుమారుని పట్ల ఆయనకు  వున్న ప్రేమను బట్టి, ఆయన తన కృపలో, మీపై దయ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా, మీ రక్షణ, ప్రారంభం నుండి చివరి వరకు, దేవుని సార్వభౌమ శాసనంపై ఆధారపడి ఉంటుంది. నేను కైస్తవుని కావడానికి పరలోకం క్రింద నేను ఇవ్వగల ఏకైక కారణం ఏమిటంటే, నేను కుమారునికి తండ్రి ఇచ్చిన వరమును, నేను ఇప్పటివరకు చేసిన లేదా చేయగలిగిన దేని వల్ల కాదు.

 

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.