సంస్కరణోద్యమ పంచ సూత్రాలు నేటి సంఘానికి ఇంకా  ప్రాముఖ్యమైనవేనా?
06/05/2025
సంస్కరణోద్యమ పంచ సూత్రాలు నేటి సంఘానికి ఇంకా  ప్రాముఖ్యమైనవేనా?
06/05/2025

“సోలా స్క్రిప్టురా” అంటే ఏమిటి?

    1. సంఘ సంస్కరణోద్యమంలోని ముఖ్యమైన సూత్రాలలో ఒకటైన “సోలా స్క్రిప్టురా” అనేది, ఆత్మీయ విషయాలన్నింటిలో పరిశుద్ధ లేఖనమే(బైబిల్) మనకు సర్వోన్నతమైన మరియు తుది అధికారంగా సరిపోతుంది అనే నమ్మకానికి సంబంధించినది. “సోలా స్క్రిప్టురా” అంటే మన రక్షణకు మరియు ఆత్మీయ జీవితానికి అవసరమైన సమస్త సత్యం లేఖనాలలో స్పష్టంగా లేదా పరోక్షంగా బోధించబడ్డాయి అని అర్థం. దీని అర్థం ప్రతి విధమైన సత్యం లేఖనాలలో దొరుకుతుందనే వాదన కాదు. ఉదాహరణకు డీఎన్ఏ నిర్మాణాలు, సూక్ష్మజీవశాస్త్రం, చైనీస్ వ్యాకరణ నియమాలు లేదా రాకెట్ సైన్స్ గురించి పరిశుద్ధ గ్రంథంలో తక్కువగానే లేదా ఏమీ చెప్పలేదని “సోలా స్క్రిప్టురా”ను గట్టిగా సమర్థించేవారు కూడా అంగీకరిస్తారు. ఉదాహరణకు ఒక నిర్దిష్టమైన “శాస్త్రీయ సత్యం” నిజంగా వాస్తవం కావచ్చు లేదా కాకపోవచ్చు అది లేఖనం ద్వారా సమర్థించబడిందో లేదో ముఖ్యమేమీ కాదు. ఎందుకంటే లేఖనం అనేది “మరింత నిశ్చయమైన వాక్యం,” దాని అధికారం మరియు నిశ్చయతలో అన్ని ఇతర సత్యాలకు మించి నిలుస్తుంది. అపొస్తలుడైన పేతురు చెప్పినట్లుగా, మన ఇంద్రియాల ద్వారా మనం నేరుగా సేకరించే సమాచారం కంటే ఇది “మరింత స్థిరమైనది” (2 పేతురు 1:19). కాబట్టి, పరిశుద్ధ గ్రంథం దేని గురించి మాట్లాడినా, దానిపై అత్యున్నతమైన మరియు సర్వోన్నతమైన అధికారాన్ని కలిగి ఉంటుంది.కానీ లేఖనం మౌనంగా ఉన్న అనేక ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. “సోలా స్క్రిప్టురా” దీనికి విరుద్ధంగా ఎటువంటి వాదనను చేయదు. యేసుక్రీస్తు లేదా అపొస్తలులు బోధించిన ప్రతిదీ లేఖనంలో భద్రపరచబడి ఉందని “సోలా స్క్రిప్టురా” చెప్పదు. మనకు అవసరమైన ప్రతిదీ, మన మనస్సాక్షిని బంధించే ప్రతిదీ మరియు దేవుడు మన నుండి కోరే ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇవ్వబడిందని మాత్రమే దీని అర్థం (2 పేతురు 1:3).

      అంతేకాకుండా, లేఖనానికి ఏదైనా జోడించడం లేదా అందులో నుండి తీసివేయడం మనకు నిషేధించబడింది (ద్వితీ. 4:2; 12:32; ప్రకటన 22:18-19). దానికి ఏదైనా జోడించడం అంటే దేవుడు స్వయంగా ప్రజలు మోయాలని ఉద్దేశించని భారాన్ని వారిపై వేయడమే (చూ. మత్తయి 23:4).

      కాబట్టి లేఖనం ఆత్మీయ సత్యానికి మరియు సంపూర్ణమైన ఏకైక ప్రమాణం, మనం రక్షించబడటానికి విశ్వసించవలసిన ప్రతిదీ మరియు దేవుణ్ణి మహిమపరచడానికి మనం చేయవలసిన ప్రతిదీ ఇది దోషరహితంగా వెల్లడిస్తుంది. దీనికంటే ఎక్కువ కాదు, దీనికంటే తక్కువ కాదు ఇదే “సోలా స్క్రిప్టురా” యొక్క సారాంశం.

      వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస ప్రకటన ఇలా చెబుతోంది: “దేవుని మహిమకు అవసరమైన అన్ని విషయాల గురించి, మానవుని రక్షణకు, విశ్వాసానికి మరియు జీవితానికి అవసరమైన అన్ని విషయాలకు సంబంధించిన దేవుని సంపూర్ణ సంకల్పం పరిశుద్ధ లేఖనాలలో స్పష్టంగా చెప్పబడింది లేదా మంచి మరియు అవసరమైన పర్యవసానాల ఫలితంగా లేఖనాల నుండి గ్రహించవచ్చ: పరిశుద్ధాత్మ యొక్క కొత్త ప్రత్యక్షతలు లేదా మానవుల సంప్రదాయాల ద్వారా ఎప్పటికీ దానికి ఏమీ జోడించబడకూడదు.”

      ఈ వ్యాసం వాట్ ఆర్ ది ఫైవ్ సోలాస్? సేకరణలో భాగం.

      గతంలో లిగోనియర్ మినిస్ట్రీస్ రాసిన సోలా స్క్రిప్టురా: ది ప్రొటెస్టంట్ పొసిషన్ ఆన్ ది బైబిల్‌లో ప్రచురించబడింది.

        

జాన్ మాక్‌ఆర్థర్
జాన్ మాక్‌ఆర్థర్
డాక్టర్ జాన్ మెక్‌ఆర్థర్ కాలిఫోర్నియాలోని సన్ వ్యాలీలోని గ్రేస్ కమ్యూనిటీ చర్చికి పాస్టర్/ఉపాధ్యాయుడు మరియు ది మాస్టర్స్ సెమినరీలో పాస్టోరల్ మినిస్ట్రీ యొక్క ఛాన్సలర్ మరియు ప్రొఫెసర్. అతను గ్రేస్ టు యులో ఫీచర్డ్ టీచర్ మరియు ది గోస్పెల్ అకార్డింగ్ టు జీసస్‌తో సహా అనేక పుస్తకాల రచయిత.