
దేవుడు మంచివాడు అంటే ఏమిటి?
01/04/2025మా దినములను లెక్కించుట మాకు నేర్పుము

- మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. (కీర్తన 90:12)
“జీవితం చిన్నది, కాబట్టి తెలివిగా జీవించండి” అనే అర్థం వచ్చే సామెతగా ఈ శ్లోకాన్ని తరచుగా పరిగణిస్తారు. కానీ మొత్తం కీర్తన సందర్భ౦లో, మన౦ చూడబోతున్నట్లుగా, దానికన్నా ఎక్కువ అర్థ౦ ఉ౦ది. దేవుని గురి౦చి, దేవుని ప్రజలుగా జీవి౦చడ౦ గురి౦చి ధ్యాని౦చడ౦లో ఇది ఒక కీలకమైన భాగ౦.
హిబ్రూ భాషలో 12వ వచన౦ “మా దినములు లెక్కించుటకు” అనే మాటలతో మొదలౌతు౦ది. ఈ వాక్యం ఈ కీర్తనలో విస్తృతంగా వ్యాపించిన కాల ఇతివృత్తాన్ని ఎంచుకుంటుంది. కాలాన్ని గూర్చి ఆలోచిస్తే మన౦ ఎ౦త బలహీనులమో, మన జీవితాలు ఎ౦త చిన్నగా ఉన్నాయో అర్థమౌతు౦ది: “నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. . . . వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. … మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.” (వచనాలు 3, 5–6, 10). ఇక్కడ, కీర్తన 90 మానవుని బలహీనత గురి౦చి కీర్తన 89లోని ఆందోళనలతో దాని స౦బ౦ధాన్ని చూపిస్తో౦ది: “నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు? మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?” (కీర్తనలు 89:47-48). మన బలహీనత గురించి అటువంటి వాస్తవికత ఏ నిజమైన జ్ఞానానికైనా అవసరమైన పునాది. “యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.” (కీర్తన 39:4).
మానవ జీవితం యొక్క చిన్నతనం మరియు బలహీనత ప్రపంచంలోని పాపం మరియు తీర్పు యొక్క ఫలితం. కీర్తనాకారుడు ఆ పాపాన్ని నిర్మొహమాటంగా అంగీకరిస్తాడు, “మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.” (కీర్తన 90:8). తన పరిశుద్ధ దేవుడు పాపులపై తన తీర్పును అనుసరిస్తాడని అతనికి తెలుసు. “నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము… నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?” (వచనం 9, 11). దేవుని కోప౦ ఆయనకు చెందవలసిన విధేయత అంతటికీ సమాన౦గా ఉ౦టు౦దని ఆలోచి౦చడ౦ ఖచ్చిత౦గా భయ౦గా ఉ౦టు౦ది.
జీవిత౦ చిన్నదైనా, దేవుని కోప౦ భయానకమైనదైనా, దేవుని ప్రజలపట్ల దేవుని కృప, రక్షణ గొప్పవి. దేవుడు తన ప్రజలకు నివాసస్థలము: “ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.” (వ. 1). దేవుడు తన ప్రజల ఉనికిలోని అన్ని తరాలలో, సృష్టి ఆరంభము వరకు తిరిగి చూస్తే, తన ప్రజలను ఎల్లప్పుడూ సంరక్షించాడు మరియు రక్షించాడు. ఏదేను తోటలో కూడా ఆయన తన వారిని విమోచిస్తానని వాగ్దానం చేశాడు (ఆదికాండము 3:15). దేవుడు విమోచించే దేవుడు కాబట్టి తన ప్రజలకు నివాసంగా ఉంటాడు.
మానవుని జీవితం బలహీనమైనది, చిన్నది అయితే, దేవుడు శాశ్వతుడు అని మోషే మనకు గుర్తు చేస్తాడు. “పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు” (వ. 2). మన దేవుడు కాలానికి, ఈ లోకానికి ముందు, వెలుపల ఉన్నాడని గుర్తు చేయడానికి మోషే మనలను దేవుడు భూమిని సృష్టించక మునువు ఉన్న కాలానికి తీసుకువెళతాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, మరియు మనం లేకున్నా ఆయన తనకు తాను చాలినవానిగా ఉన్నాడు. 4వ వచన౦లో మోషే మరో విధ౦గా ఈ విషయాన్ని చెబుతున్నాడు: “నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.” సమయం యొక్క అర్థము మనకు ఎటువంటిదో, దేవునికి అటువంటిది కాదు. మనకు, వెయ్యి సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన సమయం, దానిని అనుభవించడాన్ని మనం నిజంగా ఊహించలేము. దేవునికి, అది చాలా తక్కువ సమయముతో పోలిస్తే భిన్నమైనది కాదు. ఆయన శాశ్వతుడు, ఆయన సృష్టించిన కాలానికి అతీతుడు.
ఈ నిత్య దేవుడు తన అనంతమైన శక్తితో చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు ను౦డి విడిపి౦చడ౦లో దేవుని శక్తి తరచూ ప్రదర్శి౦చబడిందని చూసిన మోషే, దేవుని కార్యముల యొక్క మహిమ ప్రజల కళ్ళముందు నిలిచి ఉండాలని ప్రార్థిస్తూనే ఉన్నాడు: “నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము” (వ. 16). దేవుడు తన శక్తి ద్వారా శ్రమలను తీసుకువచ్చినట్లే, దేవుడు ఆశీర్వాదాన్ని పంపాలని మోషే ప్రార్థిస్తున్నాడు: “నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము” (వ. 15). మన దినములను వాటి చిన్నతనాన్ని దేవుని నిత్య స్వభావంతో వ్యత్యాసపరచడం ద్వారా మన దినములను లెక్కించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు దేవునికి మన ప్రార్థన ఏమిటంటే, “మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” మన సొంత శక్తితో మనం ఆ పాఠాన్ని ఎప్పటికీ నేర్చుకోలేము. మనల్ని మనకు వదిలేస్తే మనం అజ్ఞానులమే కాదు గాని, దుర్నీతిచేత సత్యమును అడ్డగిస్తాము (రోమా 1:18). మనం జీవించడానికి చాలా సమయం ఉందని, మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలం, మనం ఈ శరీరంలో శాశ్వతంగా జీవిస్తామని మనం నమ్ముతాము. మనకు ఒక గురువు కావాలి, మన నుండి మనల్ని రక్షించగల ఏకైక గురువు దేవుడు.