సమర్థన యొక్క సాధన కారణం
20/12/2024మార్టిన్ లూథర్ మరణం మరియు వారసత్వం
27/12/2024సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్
450 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, సంఘములో సంస్కరణ యొక్క స్వభావం మరియు ఆవశ్యకత గురించి రాయమని జాన్ కాల్విన్ కు ఒక అభ్యర్థన వచ్చింది. కాల్విన్ యొక్క ఇతర రచనలకు ప్రేరణ కలిగించిన పరిస్థితులకు ఈ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి మరియు సంస్కరణను సమర్థించడంలోని ఇతర కోణాలను చూడటానికి మనకు వీలు కల్పిస్తాయి. చక్రవర్తి ఐదవ చార్లెస్, 1544 లో స్పెయర్ నగరంలో సమావేశం కావాలని డైట్ ఆఫ్ ది హోలీ రోమన్ ఎంపైర్ ను పిలిచాడు. స్ట్రాస్ బర్గ్ యొక్క గొప్ప సంస్కర్త మార్టిన్ బుసెర్, సంస్కరణ సిద్ధాంతాలు మరియు ఆవశ్యకతల యొక్క ప్రకటనను రూపొందించమని కాల్విన్ కు విజ్ఞప్తి చేశాడు. ఫలితం అద్భుతంగా వచ్చింది. జెనీవాలో కాల్విన్ స్నేహితుడు మరియు వారసుడు అయిన థియోడర్ బెజా “సంఘమును సంస్కరించాల్సిన అవసరం” అన్న దానిని తన కాలంలో అత్యంత శక్తివంతమైన రచనగా పేర్కొన్నాడు.
కాల్విన్ ఈ పనిని మూడు పెద్ద విభాగాలుగా నిర్వహిస్తాడు. మొదటి భాగం సంస్కరణ అవసరమయ్యే సంఘములోని చెడులకు అంకితం చేయబడింది. రెండవది ఆ దురాచారాలకు సంస్కర్తలు అవలంబించిన నిర్దిష్టమైన పరిష్కారాలను వివరిస్తుంది. మూడవది సంస్కరణను ఎందుకు ఆలస్యం చేయకూడదో చూపిస్తుంది, కానీ పరిస్థితి “తక్షణ సవరణ” ను ఎలా కోరిందో చూపిస్తుంది.
ఈ మూడు విభాగాలలో కాల్విన్ నాలుగు అంశాలపై దృష్టి పెడతాడు, దీనిని అతను సంఘము యొక్క ఆత్మ మరియు శరీరం అని పిలుస్తాడు. ఆరాధన మరియు రక్షణ సంఘము యొక్క ఆత్మయై ఉన్నది . సంస్కారాలు మరియు సంఘ ప్రభుత్వం (సంఘము యొక్క) శరీరమై ఉన్నది. కాల్విన్ కు సంస్కరణ యొక్క గొప్ప కారణం ఈ అంశాలపై కేంద్రీకృతమై ఉంది. దురాచారాలు, పరిహారాలు మరియు సత్వర చర్య యొక్క ఆవశ్యకత వంటివి అన్నీ ఆరాధన, రక్షణ, సంస్కారాలు మరియు సంఘ ప్రభుత్వానికి సంబంధించినవి.
కాల్విన్ కు సంస్కరణ యొక్క గొప్ప కారణం ఈ అంశాలపై కేంద్రీకృతమై ఉంది. కాల్విన్ ఈ నాలుగు విషయాలలో జరిగిన దాడులకు ప్రతిస్పందించుటలేదు, కాని సంస్కరణలో అత్యంత ముఖ్యమైన అంశాలుగా వాటిని ఎంచుకున్నాడు అని గుర్తు చేసుకున్నప్పుడు ఈ విషయాలు కాల్విన్ కు ఎంత ప్రాముఖ్యమైనవో హైలైట్ అవుతుంది. సరైన ఆరాధన అనేది కాల్విన్ యొక్క మొదటి ఆందోళన.
ఆరాధన
ఆరాధన యొక్క ప్రాముఖ్యతను కాల్విన్ నొక్కి చెప్పాడు ఎందుకంటే మానవులు దేవుని జ్ఞానం కంటే వారి స్వంత జ్ఞానం ప్రకారం సులభంగా ఆరాధిస్తారు. ఆరాధనను దేవుని వాక్య౦ ద్వారా మాత్రమే క్రమబద్ధీకరి౦చాలని ఆయన నొక్కి చెబుతున్నాడు: “దేవుడు తన వాక్య౦ ద్వారా స్పష్టంగా అనుమతి౦చబడని అన్ని ఆరాధనా పద్ధతులను తిరస్కరిస్తాడని లోకాన్ని ఒప్పి౦చడ౦ ఎ౦త కష్టమో నాకు తెలుసు. వారి కీళ్లకు మూలుగులకు హత్తుకొనివున్నట్టిది, వాటిలో కూర్చొని ఉన్నట్టువంటి విరుద్ధమైన ఆలోచన ఏమిటంటే, వారు దేవుని గౌరవానికి ఒక విధమైన ఉత్సాహాన్ని ప్రదర్శించేది ఏది చేసినా దానికి తగిన అనుమతి ఉంటుందన్నది. కాని ఆయన ఆజ్ఞలకు విరుధంగా ఆయనను ఆరాధించడానికి మనము ఉత్సాహంగా పూనుకునే ఏదైనను, దేవుడు నిష్ప్రయోజనమైనవిగా భావించడమే కాక, స్పష్టంగా అసహ్యకరించుకుంటాడు. దానివల్ల మనము ఏమి పొందుకుంటాము? దేవుని మాటలు స్పష్టమైనవి, విలక్షణమైనవి, ‘బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్ఠము’. సంస్కరణ అవసరం కావడానికి ఈ విశ్వాసం ఒక కారణం: “. . . ఎందుకంటే… దేవుడు చాలా భాగాల్లో తన వాక్య౦ ద్వారా అనుమతి౦చబడని ఏ క్రొత్త ఆరాధననైనను నిషేధిస్తాడు; అలా౦టి ఆరాధనను కనిపెట్టే ఆలోచనతో తాను తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, దాన్ని కఠినంగా శిక్షిస్తానని హెచ్చరిస్తున్నాడని ఆయన ప్రకటి౦చడ౦వల్ల, మేము ప్రవేశ పెట్టిన సంస్కరణ ఒక బలమైన అవసర౦తో కోరబడి౦దని స్పష్టమౌతో౦ది.” దేవుని వాక్య ప్రమాణ౦ ప్రకార౦ కాల్విన్ రోమన్ కాథలిక్ సంఘమును ఇలా గురించిన సారాంశాన్ని ఇలా తెలియజేస్తున్నాడు: “ప్రస్తుత కాల౦లో సాధారణ౦గా ఉపయోగి౦చబడుతున్న దైవారాధన యొక్క మొత్తం రూప౦ కేవల౦ అవినీతి తప్ప మరేమీ కాదు.”
కాల్విన్ కు మధ్యయుగ సంఘ ఆరాధన “స్థూల విగ్రహారాధన”గా మారింది. సమర్థనలో క్రియల ద్వార నీతి పొందుకోవడం అనే విషయం ఆయనకు ఎంత తీవ్రమైనదో, విగ్రహారాధన సమస్య కూడా అంతే తీవ్రమైనది. దైవిక ప్రత్యక్షత స్థానంలో మానవ జ్ఞానానికి ఆ రెండూ కూడా ప్రాతినిధ్యం వహించాయి. ఈ రెండూ దేవున్ని సంతోషపెట్టాలనే, ఆయనకు విధేయత చూపాలనే దానికి బదులుగా మానవ ప్రయోజనానికి ప్రాతినిధ్యం వహించాయి. విగ్రహారాధకులతో ఆరాధనలో ఐక్యత ఉండదని కాల్విన్ నొక్కి చెబుతున్నాడు: “అయితే ప్రవక్తలు మరియు అపొస్తలులు సిద్ధాంతపరంగా దుష్ట పూజారులతో విభేదించినప్పటికీ, వారు ఇప్పటికీ బలులు మరియు ప్రార్థనలలో వారితో సఖ్యతను పెంపొందించుకున్నారని చెప్పవచ్చు. వారిని బలవంతంగా విగ్రహారాధన చేయకపోతే వారు అలా చేశారని నేను అంగీకరిస్తున్నాను. కాని అసలు బెతెలులో బలి అర్పించారని ప్రవక్తలలో ఎవరు గురించి మనము చదువుతాము?”
పూర్వపు ప్రవక్తల వలె సంస్కర్తలు కూడా విగ్రహారాధన మరియు వారి కాలపు ఆరాధన యొక్క “బాహ్య ప్రదర్శన”పై దాడి చేయాల్సిన అవసరమైంది. జెనీవా సంఘములో సేవా క్రమంలో ప్రతిబింబించినట్లుగా – కాల్విన్ కాలంలో సంఘ సిద్ధాంతాలకు ఆరాధన యొక్క దైవిభక్తిగల సరళతయే విరుగుడు. అలా౦టి సరళత ఆరాధకులను వారి మనస్సును మరియు శరీరాన్ని సమర్పించడానికి ప్రోత్సహి౦చి౦ది: “హృదయాన్ని ఇంకా మనస్సును ఇవ్వవలసిన బాధ్యత సత్యారాధకులపై ఉన్నప్పటికీ, మనుష్యులు ఎల్లప్పుడూ దేవుని సేవి౦చే విధానాన్ని పూర్తిగా భిన్నమైన వర్ణనతో కనిపెట్టాలని కోరుకు౦టారు, వారి లక్ష్య౦ ఆయనకు కొన్ని శారీరక ఆచారాలను నిర్వర్తి౦చడ౦ మరియు వారు తమ మనస్సును తమతోనే ఉ౦చుకుంటారు.”
సమర్థన
కాల్విన్ తరువాత సమర్ధన (justification) అన్న అంశము వైపు మళ్లుతాడు. ఇక్కడ విభేదాలు అత్యంత పదునైనవిగా ఉన్నాయని ఆయన ఇలా పేర్కొన్నాడు: “మన ప్రత్యర్థులు తమ వ్యతిరేకతలో సమర్థన కంటే ఎక్కువ ఉదాసీనత చూపే అంశం మరొకటి లేదు, అనగా, విశ్వాసము ద్వారా లేదా క్రియల ద్వారా మనం దానిని పొందుతామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.” ఈ సిద్ధాంతంపై “సంఘము యొక్క భద్రత” ఆధారపడి ఉంటుంది మరియు ఈ సిద్ధాంతముపై చేయబడిన తప్పుల కారణంగా సంఘము “ప్రాణాంతక గాయానికి” గురైంది మరియు “వినాశనం యొక్క చాలా అంచుకు తీసుకురాబడింది.”
విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థన సాధ్యమని కాల్విన్ నొక్కి చెబుతాడు: “. . . ఏ మానవుని క్రియల వర్ణన ఎలా ఉన్నా, అతడు కేవలం అపరిమితమైన కరుణ యొక్క ప్రాతిపదికన బట్టియే దేవుని ముందు నీతిమంతునిగా పరిగణించబడతాడు; ఎ౦దుక౦టే క్రియలపట్ల ఏ విధమైన గౌరవ౦ లేకుండా, దేవుడు క్రీస్తు నీతిని అతనికి అతని సొంతది అన్నట్లుగా ఆపాదిస్తూ, అతనిని స్వేచ్ఛగా క్రీస్తులో దత్తకు తీసుకుంటాడు.
ఈ సిద్ధాంత౦ క్రైస్తవుని జీవిత౦పై, అనుభవ౦పై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తు౦ది: “. . . మనిషి తన పేదరికం మరియు శక్తిహీనత గురించి ఒప్పించడం ద్వారా, మేము అతనికి నిజమైన వినయానికి మరింత సమర్థవంతంగా శిక్షణ ఇస్తాము, ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని త్యజించి, తనను తాను పూర్తిగా దేవునిపై పడవేసుకోవడానికి దారితీస్తుంది; అదే విధ౦గా, ప్రతి మంచి విషయాన్ని పొందుకోవడం అనేది దేవుని మంచితనానికి ఆపాదించే, సత్యానికి అతను ఆలా చేయవలసిన, విషయంలో అతనిని నడిపి౦చడ౦ ద్వారా, కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో అతనికి మరి౦త ప్రభావశీల౦గా శిక్షణ ఇస్తున్నా౦.”
సంస్కారాలు
కాల్విన్ యొక్క మూడవ అంశము అతను వివరంగా పరిశీలించే సంస్కారాలు. “… మానవులు రూపొందించిన వేడుకలు క్రీస్తు స్థాపించిన మర్మాలతో సమానమైన స్థానంలో ఉంచబడ్డాయి” మరియు ముఖ్యంగా ప్రభువు బల్ల ఒక “నాటక ప్రదర్శన”గా మార్పు చెందింది, అని ఆయన ఫిర్యాదు చేస్తాడు. దేవుని సంస్కారాలను ఇలా దుర్వినియోగం చేయడ౦ సహించరానిది. “ఇక్కడ మేము మొదట ఫిర్యాదు చేసే విషయం ఏమిటంటే, ప్రదర్శన వేడుకలతో ప్రజలను అలరిస్తారు, కానీ వారి ప్రాముఖ్యత మరియు సత్యం గురించి ఒక్క మాట కూడా చెప్పబడదు. ఎందుకంటే సంకేతం స్పష్టంగా సూచించే దానిని దేవుని వాక్యానికి అనుగుణంగా వివరన ఇస్తే తప్ప సంస్కారాలలో ఉపయోగం లేదు.”
ప్రారంభ సంఘములో ఉన్న సంస్కార సిద్ధాంతం మరియు ఆచరణ యొక్క సరళత్వం పోయిందని కాల్విన్ విచారం వ్యక్తం చేశాడు. ఇది ప్రభువు బల్ల భోజనంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యూకారిస్టిక్ బలిఅర్పణ, పరివర్తన మరియు పవిత్రమైన రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ఆరాధించడం అవాంఛనీయమైనవి మరియు సంస్కారము యొక్క నిజమైన అర్థాన్ని నాశనం చేస్తాయి. “పవిత్ర మనస్సులను పరలోకానికి లేవనెత్తడానికి సంస్కారం ఒక సాధనంగా ఉండాల్సి ఉండగా, ప్రభువు బల్ల భోజనం యొక్క పవిత్ర చిహ్నాలు పూర్తిగా భిన్నమైన ప్రయోజనం కోసం దుర్వినియోగం చేయబడ్డాయి, మరియు వాటిని చూస్తూ, వాటిని ఆరాధించడంలో తృప్తి చెందిన మానవులు ఒక్కసారి కూడా క్రీస్తు గురించి ఆలోచించలేదు.” “. . . క్రీస్తు మన కోసం ఒక్కసారి మరణించడంలో తగినంతగా చేయనట్లు రోజుకు వెయ్యిసార్లు బలి ఇవ్వబడ్డాడు” అని యూకారిస్టిక్ బలిఅర్పణ అనే భావనలో క్రీస్తు యొక్క క్రియ నాశనమై పోయింది అని చూడవచ్చు.
“. . . అందరూ విశ్వాసంతో రావాలని ప్రోత్సహాహిస్తున్నాం. . . మేము… క్రీస్తు శరీరము మరియు రక్తము రెండూ ప్రభువుచే రాత్రి భోజనములో మనకు దయచేయబడ్డాయని; మరియు మనచే స్వీకరించబడిందని ప్రకటిస్తాము, అని ప్రభువు బల్ల యొక్క నిజమైన అర్థాన్ని కాల్విన్ సరళంగా సంక్షిప్తీకరించాడు. వాటితో కలిసి ఒక సత్యం ఉందని, మరియు దానికి అవి ప్రాతినిధ్యం వహిస్తాయని వెంటనే కలపకుండా, రొట్టె, ద్రాక్షారసము చిహ్నాలని మేము బోధించడం లేదు. ” విశ్వాసము ద్వారా ప్రభువుచే రాత్రి భోజనములో పాల్గొనే వారికి క్రీస్తు నిజ౦గా తనకు, తన రక్షక ప్రయోజనాలన్నిటినీ ఇస్తాడు.
కాల్విన్ సంస్కారాల గురించిన చర్చ యొక్క ఈ సంక్షిప్త అవలోకనం ఈ ముఖ్యమైన అంశంపై ఆయన వ్యవహరించిన తీరును మాత్రమే మనకు అందిస్తుంది. అతను బాప్తిస్మానికి గణనీయమైన శ్రద్ధను కేటాయిస్తాడు, అలాగే ఐదు అదనపు సంస్కారాలు ఉన్నాయనే రోమన్ వైఖరిని ఖండిస్తాడు.
సంఘ ప్రభుత్వం
చివరకు కాల్విన్ సంఘ ప్రభుత్వ విషయానికి వస్తాడు. ఇదొక పెద్ద అ౦శ౦ అని ఆయన ఇలా పేర్కొన్నాడు: “నేను సంఘ ప్రభుత్వ లోపాలను సవివర౦గా పరిశీలి౦చ వలసివస్తే, నేనెప్పుడూ అలా చేసి ఉ౦డేవాడిని కాదు.” సంఘకాపరి పదవి యొక్క ప్రాముఖ్యతపై అతను దృష్టి పెడతాడు. బోధన యొక్క సౌలభ్యం మరియు బాధ్యత ఈ పదవి యొక్క కేంద్రబిందువు: “. . . బోధించే పదవిని నిర్వర్తించని ఏ వ్యక్తీ సంఘానికి నిజమైన కాపరి కాదు.” దేవుని ప్రజల జీవిత౦లో ప్రకటి౦చడాన్ని సముచిత స్థానానికి తీసుకురావడ౦ సంస్కరణ యొక్క గొప్ప విజయాల్లో ఒకటి. “. . . వాక్యము యొక్క సాధారణ ప్రకటన లేకుండా మన సంఘములు ఏవీ కనిపించవు.” సంఘకాపరి పదవి తప్పనిసరిగా బోధనకు పవిత్రతను అనుసంధానించాలి: “. . . సంఘములో అధిపతిగా ఉన్నవారు ఇతరులను మించి, పరిశుద్ధమైన జీవితానికి ఉదాహరణతో ప్రకాశించాలి. . .”
పవిత్రతను బోధించడానికి మరియు అనుసరించడానికి బదులుగా, రోమన్ సంఘములోని నాయకత్వం దేవుని ప్రజల ఆత్మలపై “అత్యంత క్రూరమైన నిరంకుశత్వాన్ని” ప్రదర్శిస్తుందని, దేవుడు వారికి ఇవ్వని శక్తులు మరియు అధికారాలను పొందుకున్నారని చుప్పుకుంటారని, కాల్విన్ ఫిర్యాదు చేశాడు. సంస్కరణ సంఘాన్ని బంధించిన అనాగరిక సంప్రదాయాల నుండి గొప్ప స్వేచ్ఛను తీసుకువచ్చింది. “కాబట్టి, విశ్వాసుల మనస్సాక్షిని వారు నిర్బంధించిన అనవసరమైన బానిసత్వం నుండి విముక్తులను చేయడం మన కర్తవ్యం కాబట్టి, వారు మానవ నియమాలకు బంధింపబడి లేరని స్వేచ్ఛ కలిగి ఉన్నారని, క్రీస్తు రక్తము ద్వారా కొనుగోలు చేయబడిన ఈ స్వేచ్ఛను ఉల్లంఘించరాదని మేము బోధించాము.”
రోమన్ సంఘము తన అపోస్తుల వారసత్వాన్ని చాలావరకు ఉపయోగించుకున్నది, ప్రత్యేకించి నియామకం (అర్డినేషన్) విషయంలో. క్రీస్తు, అపొస్తలులు మరియు చారిత్రిక సంఘము యొక్క నిజమైన బోధను మరియు ఆచరణను సంస్కరించబడిన నియామకం అనుసరిస్తుందని కాల్విన్ నొక్కి చెప్పాడు. “కాబట్టి, సిద్ధాంత స్వచ్ఛత ద్వారా సంఘ ఐక్యతను కాపాడని వారు, నియమించే చేసే హక్కును ఎవరూ కూడా కోరుకోలేరు” అని కాల్విన్ గమనించాడు.
సంస్కరణ
అతను “సున్నితమైన చేతితో” సంస్కరణకు పిలుపునిచ్చిన లూథర్‌కు ప్రారంభాన్ని ఆపాదించాడు. “సత్యాన్ని హింస మరియు క్రూరత్వంతో అణచివేయడానికి” ఒక ప్రయత్నమే రోమ్ నుండి ప్రతిస్పందన. ఈ యుద్ధం కాల్విన్‌కు ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే “… దాని మొదటి ప్రారంభం నుండి గొప్ప వివాదాల మధ్య ప్రపంచంలో బోధించబడాలి అనేది సువార్త యొక్క ఏకరీతి విధిగా ఉన్నది, చివరి వరకు కూడా ఎల్లప్పుడూ ఆలా ఉంటుంది.”
సంఘ జీవితంలో ఈ సమస్యను కాల్విన్ సమర్థించాడు ఎందుకంటే వివాదంలో ఉన్న సమస్యలకు ప్రాముఖ్యత ఉంది. “క్రైస్తవ మతం యొక్క విషయము అంతా” ప్రమాదంలో ఉందనే వాస్తవాన్ని తగ్గించడానికి అతను అనుమతించడు. సంస్కర్తలు బైబిలుకు విధేయత చూపి౦చేవారు కాబట్టి, వారు వేర్పాటువాదులు అనే సూచనను ఆయన తిరస్కరిస్తాడు: “. . . సంఘమును దాని అధిపతి అయిన క్రీస్తు నుండి వేరుచేసే విషయంలో జాగ్రత్త వహించాల్సిన విషయం మొదటిది. నేను క్రీస్తు అని చెప్పేటప్పుడు, ఆయన తన రక్తముతో ముద్రించిన ఆయన సువార్త సిద్ధాంతాన్ని చేర్చుచున్నాను. . . కాబట్టి, స్వచ్ఛమైన సిద్దాంతానికి సమ్మతించి, క్రీస్తులో మాత్రమే ఐక్యమైనప్పుడు, మన మధ్య ఒక పవిత్ర ఐక్యత ఉనికిలో ఉందని ఒక స్థిరమైన అంశంగా ఉండనివ్వండి.” సంఘము అనే పేరు ఐక్యతను అందించదు, కానీ దేవుని వాక్య౦లో నిలిచి ఉ౦డే నిజమైన సంఘ౦ యొక్క వాస్తవికత ఐక్యతను అందిస్తుంది.
అప్పుడు కాల్విన్ సంఘములో సంస్కరణకు ఎవరు సరిగ్గా నాయకత్వం వహించగలరనే ఆచరణాత్మక ప్రశ్న వైపు మళ్లాడు. పోప్ సంఘమును లేదా సంస్కరణను నడిపించగలడనే ఆలోచనను బలమైన భాషలో అతను తిరస్కరిస్తాడు: “రోమన్ కాథలిక్ కేంద్ర ప్రభుత్వం అపోస్టోలికల్ అని నేను తిరస్కరిస్తున్నాను, ఇందులో మతభ్రష్టత్వం తప్ప ఏమీ కనిపించదు- సువార్తను తీవ్రంగా హింసించడంలో, అతను అంతిక్రీస్తు అని తన ప్రవర్తన ద్వారా నిరూపించుకున్న క్రీస్తు యొక్క వికార్ అని నేను తిరస్కరిస్తున్నాను- అతన్ని పేతురు వారసునిగా నేను తిరస్కరిస్తున్నాను. పేతురు యొక్క కట్టడాలను కూల్చివేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఎవరైతే ఆమె నిజమైన మరియు ఏకైక శిరస్సు అయిన క్రీస్తు నుండి ఆమెను విడదీసిన తర్వాత దౌర్జన్యం ద్వారా సంఘాన్ని చీల్చివేసి, ఛిన్నాభిన్నం చేస్తారో, నేను అతనిని సంఘానికి అధిపతిగా ఉండడం తిరస్కరిస్తాను.” సంఘము యొక్క సమస్యలను పరిష్కరించడానికి చాలా మంది సార్వత్రిక మండలిని కోరుతున్నారని అతనికి తెలుసు, కాని అటువంటి కౌన్సిల్ ఎప్పటికీ సమావేశం కాజాలదని మరియు అలా జరిగితే, అది పోప్ చేత నియంత్రించబడుతుందని భయపడుతున్నాడు. సంఘము చారిత్రాత్మిక సంఘము యొక్క ఆచారాన్ని అనుసరించాలని మరియు వివిధ స్థానిక లేదా ప్రాంతీయ మండలిల్లలో విషయాలను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఏదేమైనా, అన్ని సంస్కరణ ప్రయత్నాలకు తగిన ఆశీర్వాదాన్ని ప్రసాదించే దేవునికే అంతిమంగా కారణం వదిలివేయాలి: “మన పరిచర్య లోకానికి ప్రయోజనకరమని నిరూపింపబడుతుందని మేము నిజంగా కోరుకుంటున్నాము; కాని ఈ ఫలితాన్ని ఇవ్వటం దేవునిదే తప్ప మనది కాదు.”
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.