పశ్చాత్తాపం ఎలా ఉంటుంది?
10/12/2024సిలువలో దేవుని స౦కల్ప౦ ఏమిటి?
10/12/2024యేసు క్రీస్తు: దేవుని గొర్రెపిల్ల
దేవుని గొర్రెపిల్ల యొక్క ఈ ఆలోచన విమోచన చరిత్ర అంతటా నడిచే ఒక తంతువు. ఆదికాండము 22 లో దేవుడు అబ్రాహామును మోరియా పర్వతానికి వెళ్లి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని పిలిచాడు. అబ్రాహాము దేవునికి విధేయత చూపుతూ అలా చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ చివరి క్షణంలో, అబ్రాహాము ఇస్సాకును బలిపీఠానికి బంధించి, కత్తిని తన హృదయ౦లో దూయడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు ఆయనను ఆపి, “ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను” (వ. 12). అప్పుడు అబ్రహాము వెనుక ఒక గందరగోళం జరిగింది, మరియు అతను వెనక్కి తిరుగగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలును చూసాడు. దేవుడు అబ్రాహాము కుమారుని బలికి ప్రత్యామ్నాయ౦గా ఒక గొర్రెపిల్లను ఇచ్చాడు. వాస్తవానికి, ఇస్సాకు స్థానంలో అబ్రాహాము పట్టుకొని అర్పించిన పొట్టేలు ప్రాయశ్చిత్త బలి అని ఆదికాండము 22లో ఎన్నడూ చెప్పబడలేదు. ఏదేమైనా, అది ప్రత్యామ్నాయ బలి, మరియు ఇది క్రీస్తు ప్రాయశ్చిత్తానికి ఆధారమైన ఆలోచన. యేసు మనకు ప్రత్యామ్నాయ౦గా పనిచేస్తాడు, దేవుడు మన పాప౦ మూల౦గా తన కోపాన్ని మనకు బదులుగా ఆయనపై కుమ్మరిస్తాడు. కాబట్టి, దేవుడు తన స్వంత గొర్రెపిల్లను ఇస్తాడు మరియు ఆ ప్రత్యామ్నాయ గొర్రెపిల్ల జీవాన్ని స్వీకరిస్తాడు.
దేవుడు మన పాపము వలన తన ఉగ్రతను మన మీదకు బదులుగా యేసు మీదకు కుమ్మరిస్తాడు.
అదేవిధంగా, దేవుని గొర్రెపిల్ల ఖచ్చితంగా పస్కాలో ముందుగానే చిత్రీకరించబడింది . ఫారో యువరాజుతో సహా ఐగుప్తీయులలో తొలి సంతతిగా జన్మించిన ప్రతి మగవాడి మరణానికి కారణమైన ఐగుప్తీయులపై తన అంతిమ తెగులును తీసుకురావడానికి దేవుడు సిద్ధమైనప్పుడు, మచ్చలేని గొర్రెపిల్లలను చంపమని మరియు వారి తలుపుల మీద రక్తాన్ని పూయమని ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను. అన్ని ఇళ్ళ ద్వారబంధాలు మీద వున్న గొర్రెపిల్లల రక్తాన్ని చూసి దాటిపోయెదను అని దేవుడు వాగ్దానం చేశాడు (ఆదికాండము 12:3-13). ఆ గొర్రెపిల్లల రక్తము ఇశ్రాయేలీయులను దేవుని ఉగ్రత నుండి రక్షించినట్లే, దేవుని గొర్రెపిల్ల తన ప్రజలను వారి పాపమునకు విధించబడిన శిక్ష నుండి విముక్తులను చేస్తాడు.
ఆదికా౦డము 22, నిర్గమకా౦డము 12, పాత నిబంధనలోని ఇతర భాగాల్లోని ఈ చిత్రణను బట్టి చూస్తే, “దేవుని గొర్రెపిల్ల” అనే శీర్షిక అపొస్తలుడైన యోహాను యొక్క ఆవిష్కరణ అని చెప్పడ౦ అవివేక౦. బాప్తిస్మమిచ్చు యోహాను మాటలు క్రీస్తు కాల౦లో యూదుల పవిత్ర లేఖనాలైన పాత నిబంధన గురి౦చిన జ్ఞాన౦ ద్వారా తెలియజేయబడ్డాయి.
యోహాను మొదటి అధ్యాయ౦లో యేసుకు ప్రాముఖ్యమైన బిరుదులు విస్తారంగా ఉపయోగి౦చబడినప్పటికీ— “దేవుని గొర్రెపిల్ల”, “దేవుని కుమారుడు”, “మెస్సీయ,”మనుష్యకుమారుడు” వగైరా— బాప్తిస్మమిచ్చు యోహాను, ఆంధ్రేయా, నతానియేలు లేదా శిష్యుల్లో ఏ ఒక్కరికీ ఈ బిరుదుల అర్థ౦ గురి౦చి సమగ్రమైన అవగాహన ఉ౦దని నేను నమ్మను. “ఇదిగో! లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!” అని చెప్పిన బాప్తిస్మమిచ్చు యోహాను తరువాత చెరసాలలో బంధించబడి యేసు దగ్గరకు దూతలను పంపి, “రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా?” అని అడిగాడు (లూకా 7:20). యేసు గుర్తింపుకు అద్భుతమైన సాక్ష్యమిచ్చినప్పటికీ, యోహాను యేసు గుర్తింపును పూర్తిగా అర్థం చేసుకోలేదని ఈ ప్రశ్న సూచిస్తుంది. సమస్య ఏమిటంటే, అతను తన స్వంత అంచనాలను కలిగి ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల వచ్చి అందరిలాగే రోమీయులను తరిమికొడుతాడని ఆయన ఆశించాడు. యేసు కేవల౦ బోధిస్తూ సంచరించడం చూసి ఆయన అయోమయానికి గురయ్యాడు.
దేవుని గొర్రెపిల్ల తన ప్రజలను వారి పాపమునకు విధించబడిన శిక్ష నుండి విముక్తులను చేసాడు.
యేసు యోహాను దూతలతో ఇలా అన్నాడు, “మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది” (లూకా 7:22). సందేహాస్పదుడైన యోహానుకు తన గుర్తింపును ధృవీకరించడానికి యేసు తన అద్భుతాలను చూపించాడు. యెషయా 61:1-2ఎలోని క్రీస్తును గూర్చిన ప్రవచనాన్ని కూడా ఆయన ప్రస్తావి౦చాడు, అది ఇలా చెబుతో౦ది:
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు
యెహోవా నన్ను అభిషేకించెను
నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును
చెరలోనున్నవారికి విడుదలను
బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును;
యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును.”
యేసు ఇలా అంటునట్లుగా: “యోహాను, నీవు నిజంగా నీ బైబిలు అధ్యయన౦ చేసివుంటే, రాబోవువాడను నేనేనా అని మీరు అడిగేవారు కాదు. ఇంకొకరి కొరకు చూసే అవసరం లేదు. నీవు మొదటి సారే సరిగ్గా గ్రహించావు. నేను దేవుని గొర్రెపిల్లను.”
ఫిలిప్పుదైన కైసరయలో తన గొప్ప ఒప్పుకోలు చెప్పినప్పుడు కూడా పేతురు అదే విధ౦గా అయోమయానికి గురయ్యాడు. శిష్యులు యేసును ఎవరు అని అనుకుంటున్నారనే ప్రశ్నకు పేతురు ఇలా జవాబిచ్చాడు, “నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు” (మత్తయి 16:16). ఒప్పుకోలు ఖచ్చితమైనదని యేసు ధృవీకరించాడు మరియు పేతురు తాను ఎవరో అర్థం చేసుకోవడానికి “ఆశీర్వదించబడ్డాడు” అని ప్రకటించాడు. కానీ ఆ వెంటనే యేసు తన శిష్యులకు తాను యెరూషలేముకు వెళ్లనైవున్నాడని చనిపోవడ౦ ఖాయమని చెప్పినప్పుడు, పేతురు ఆయనను మందలించి, “అది నీ కెన్నడును కలుగదని” చెప్పాడు. (16:22బి). ఒక నిముష౦ పేతురు యేసే క్రీస్తు అని ధృవీకరి౦చాడు, కానీ మరుసటి నిమిష౦లో యేసు మెస్సీయగా ఉ౦డడ౦ అంటే ఏమిటో తనకు అర్థ౦ కాలేదని బహిర్గత౦ చేశాడు.
వాస్తవానికి, మనము కూడా అదే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. సిలువ, పునరుత్థానము, ఆరోహణము మరియు పెంతెకొస్తు దినమున ఆత్మ కుమ్మరించబడుటను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే, దేవుడు తన దూత ప్రకటన ద్వారా తెలియజేసిన సమస్తము యొక్క లోతులను, సంపదలను మనం చూడటం ప్రారంభిస్తాము, “ఇదిగో! లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!”
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.