సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్
24/12/2024
సువార్త అంటే ఏమిటి?
31/12/2024
సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్
24/12/2024
సువార్త అంటే ఏమిటి?
31/12/2024

మార్టిన్ లూథర్ మరణం మరియు వారసత్వం

xr:d:DAFOOw3yt3M:10,j:37241480381,t:22100603

మార్టిన్ లూథర్ 1546 ఫిబ్రవరి 18న మరణించాడు. ఒక నెల క్రితం, అతను తన వయస్సులోని బలహీనతల గురించి ఫిర్యాదు చేస్తూ ఒక స్నేహితుడికి ఒక ఉత్తరం రాశాడు, “నేను, ముసలివాడిని, అలసిపోయినవాడిని, సోమరివాడిని, అరిగిపోయినవాడిని, చల్లగా ఉన్నవాడిని, వణుకుతూ ఉన్నవాడిని, మరియు అంతకు మించి, ఒంటికన్ను గల మనిషిని.” అప్పుడు అతను, “సగం చనిపోయిన వానిగా, నన్ను ప్రశాంతంగా ఉండనీయవచ్చు.” అని నిట్టూర్చాడు.

అయితే లూథర్ ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆయన స్వస్థలమైన ఐస్లెబెన్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒక వివాదం సామాజిక క్రమమును మరియు సంఘము యొక్క క్రమమును ప్రమాదంలో పెట్టింది. విసిగిపోయిన లూథర్ వివాదాన్ని పరిష్కరించడానికి తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ముగ్గురు కుమారులు, కొంతమంది సేవకులతో విట్టెన్ బర్గ్ నుండి బయలుదేరాడు. వారు హాలేకు చేరుకున్నారు. మంచు, తుఫానులు నదులను దాటడం సవాలుగా మార్చాయి. లూథర్ నేరుగా తమ పడవ వైపు తేలియాడుతున్న మంచు ముక్కలను అనబాప్టిస్ట్ ప్రత్యర్థులుగా మరియు రోమన్ కాథలిక్ బిషప్ లు మరియు పోప్ లుగా నామకరణం చేశాడు. అతను సగం చనిపోయి ఉండవచ్చు, కానీ అతని హాస్యం పూర్తిగా చెక్కుచెదరలేదు.

హాలే లూథర్ యొక్క చిరకాల సహచరుడైన డాక్టర్ జస్టస్ జోనాస్, యొక్క నివాసం. 1519 లో లీప్జిగ్ వద్ద చర్చ జరిగినప్పటినుండి, జోనాస్ లూథర్ యొక్క సన్నిహిత శిష్యులలో ఒకడు. డైట్ ఆఫ్ వర్మ్స్ వద్ద జోనాస్ అతనికి అండగా నిలిచాడు. లూథర్ వార్ట్ బర్గ్ లో ప్రవాసంలో ఉన్నప్పుడు అతను విట్టెన్ బర్గ్ వద్ద సంస్కరణను ముందుకు నడిపించాడు. ఇప్పుడు జస్టస్ జోనాస్ లూథర్ చివరి యాత్రలో అతని వెంట ఉన్నాడు.

లూథర్ మరియు అతని విస్తరించిన ప్రయాణ బృందం ఐస్లెబెన్ లోకి విజయవంతమైన ప్రవేశం చేశారు. స్వగ్రామ హీరోకు ఉల్లాసవంతమైన జనములతో స్వాగతం పలికారు, వాహనాలతో వెంటవెళ్లారు.  జనవరి 31వ తేదీన, ఆదివారం నాడు ఆయన బోధించారు.

కానీ ఆ ప్రయాణం మలుపు తిరిగింది. చేదు గాలులు మరియు గడ్డకట్టే వర్షాలు, చెప్పనవసరంలేని ఆ ప్రమాదకరమైన మంచు ముక్కల గురించి లూథర్ తన ప్రియమైన కేటీకి వ్రాశాడు. లూథర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లూథర్ గది వెలుపల అదుపు తప్పిన మంటలు కూడా అతని ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. అతని గది కూడా ప్రమాదకరంగా ఉంది. గోడల మీదనున్న ప్లాస్టర్ ఊడి పడిపోయింది, దాని వలన కొన్ని రాళ్లు వదులయినాయి. దిండు పరిమాణంలో ఉన్న ఒక రాయి లూథర్ తలకు దగ్గరగా కూలి పడింది. ఈ దుస్సాహసాలు కేటీకి ఇంట్లో ఆందోళన పెరగడానికి కారణమయ్యాయి. ఆందోళన మరియు చింతతో నిండిన లేఖను ఆమె తిరిగి వ్రాసింది. కాబట్టి లూథర్ ఆమెను మిస్ అవుతున్నానని ఇంకా “నీకంటే మరియు దేవదూతలందరి కంటే గొప్ప సంరక్షకుడు నాకు ఉన్నాడు; అతను ఒక తొట్టిలో పడుకొని, తన తల్లి రొమ్ము వద్ద పాలు తాగుతాడు, అయినప్పటికీ అతను సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు” అని తిరిగి వ్రాశాడు.

లూథర్ ఫిబ్రవరి 7న ఆ లేఖ రాశాడు. పదకొండు రోజుల తర్వాత చనిపోయాడు. అతను జన్మించిన ఐస్లెబెన్ పట్టణం ఇప్పుడు అతని మరణ పట్టణంగా కూడా పిలువబడుతుంది. లూథర్ యొక్క ముగ్గురు కుమారులు తమ తండ్రి మృతదేహాన్ని తిరిగి విట్టెన్ బర్గ్ కు తీసుకువెళ్లారు, అక్కడ అంతిమ నివాళులు అర్పించడానికి జనం గుమిగూడారు.

లూథర్ చనిపోవడానికి ము౦దు ఐస్లెబెన్లోని మరణశయ్య ను౦డి తన చివరి ప్రసంగమేమిటో ప్రకటి౦చాడు. “ప్రసంగము” కేవలం రెండు వచనాలను, ఒకటి కీర్తనల నుండి మరియు మరొకటి సువార్తల నుండి ఉటంకిస్తూ ఉన్నవి. లూథర్ కీర్తన 68:19 ను ఉదహరించాడు, “ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు”. తరువాత ఆయన యోహాను 3:16ను ఉదహరించాడు. మన దేవుడు నిజానికి రక్షణగల దేవుడు, ఆయన కుమారుని క్రియ ద్వారానే ఆ రక్షణ లభిస్తుంది.

లుకాస్ క్రానాచ్ అనే చిత్రకారుడు తన స్నేహితుడికి చివరి స్మారక చిహ్నాన్ని అందించాడు. ఆ పెయింటింగ్ క్యాసిల్ చర్చిలోని బలిపీఠాన్ని ఆలపిస్తుంది. అందులో లూథర్ ఒక గుంపు వింటూవుండగా ప్రకటిస్తున్నాడు. క్రానాచ్ లూథర్ భార్య కేటీని పెయింటింగ్ లో చిత్రించాడు. పదమూడేళ్ల వయసులో మరణించిన లూథర్ కుమార్తె మాగ్డలీనాను కూడా ఆయన పెయింటింగ్ లో చిత్రించాడు. లూథర్ మరియు అతని స౦ఘానికి మధ్య క్రీస్తు ఉన్నాడు. లూథర్ క్రీస్తును, మరియు ఆయన శిలువ వేయబడాటాన్ని బోధించాడు. ఆయన స౦ఘము లూథర్ ప్రకటి౦చడ౦ విన్నప్పుడు, వారు లూథర్ను చూడలేదు, గాని బదులుగా క్రీస్తును, ఆయనను శిలువ వేయబడడాన్ని చూశారు. అది లూథర్ వారసత్వం.

ఆ వారసత్వం లూథర్ కాలానికి మించి విస్తరించింది.

1940లో, డబ్ల్యు.హెచ్. ఆడెన్ ఒక కవితాత్మక నివాళిని లూథర్ కు మరియు అతని వారసత్వానికి అర్పించాడు. ఆయన తన చిన్న కవితకు ‘లూథర్’ అని పేరు పెట్టి ఈ పంక్తులతో ముగించారు.

అన్ని క్రియలు, గొప్ప వ్యక్తులు, సమాజాలు చెడ్డవి.

“నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు…” అని ఆయన భయంతో మొర్రపెట్టాడు.

 

మరియు తమ జీవితాల్లో ఎప్పుడూ పట్టించుకోని, వణికిపోని వారు,

ప్రపంచంలోని పురుషులు మరియు మహిళలు ఆనందంగా ఉన్నారు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

స్టీఫెన్ J. నికోల్స్
స్టీఫెన్ J. నికోల్స్
డాక్టర్ స్టీఫెన్ జె. నికోల్స్ రిఫార్మేషన్ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ మరియు లిగోనియర్ మినిస్ట్రీస్ యొక్క చీఫ్ అకడమిక్ ఆఫీసర్. అతను బియాండ్ ది 95 థీసిస్, ఎ టైమ్ ఫర్ కాన్ఫిడెన్స్ మరియు ఆర్.సి.స్ప్రోల్: ఎ లైఫ్తో సహా అనేక పుస్తకాల రచయిత.