07/10/2025

చారిత్రక కథనం చదవడం ఎలా?

దేవుడు సమస్తాన్ని సృష్టించడం, మానవులు పాపములో పడిపోవడం, కృపా నిబందన మరియు దాని వివిధ పరిపాలనల ద్వారా విమోచన మరియు అంత్యదినముల మహిమలో సమస్తము పరిపూర్ణమగుట గురించి బైబిల్ నిబంధన కథనాన్ని నమోదు చేస్తుంది. ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయువాడు (యెషయా 46:10) ఆయనే మొదటివాడను కడపటివాడను (యెషయా 44:6; యెషయా 48:12).