09/12/2025
క్రొత్త నిబంధనలో ఉపయోగించిన "శిష్యుడు" అనే గ్రీకు పదానికి మూలార్థం "నేర్చుకునేవాడు" లేదా "అనుసరించేవాడు" . ఈ దృష్టికోణం నుండి చూసినప్పుడు, మనం క్రైస్తవ శిష్యత్వం గురించి ఆలోచించినప్పుడు, మనమడుగుతున్న ప్రశ్న ఇదే: "యేసుక్రీస్తు నుండి నేర్చుకోవడం అంటే ఏమిటి, మరియు ఆయన్ని అనుసరించడం అంటే దేన్ని సూచిస్తుంది?"

