సంస్కరించబడినవారిగా ఉండటానికి ధైర్యము
18/12/2024
సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్
24/12/2024
సంస్కరించబడినవారిగా ఉండటానికి ధైర్యము
18/12/2024
సంఘాన్ని సంస్కరించే ఆవశ్యకతపై జాన్ కాల్విన్
24/12/2024

సమర్థన యొక్క సాధన కారణం

xr:d:DAFXk0WDSFg:25,j:45162075609,t:23011320

సమర్థన (Justification/నీతిమంతులుగా తీర్చడం) యొక్క సంస్కరణ సిద్ధాంతం తరచుగా సోలా ఫిడే (sola fide), అనగా “విశ్వాసం ద్వారా మాత్రమే”, అనే నినాదంలో సంక్షిప్తీకరించబడింది. విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థన ఉంటుంది అనే బోధనను సోలా ఫిడే అను పదబంధం సూచిస్తుంది.

రోమన్ కాథలిక్ సంఘము కూడా, చారిత్రాత్మకంగా, విశ్వాసం ద్వారా సమర్థన అని బోధించింది. విశ్వాసం అనేది సమర్థన యొక్క ప్రారంభ దశ అని వారు చెబుతారు. అదే మన సమర్థనకు పునాది  మరియు మూలం. సమర్థన కొరకు విశ్వాసం యొక్క ఆవశ్యకతను రోమా నొక్కి చెబుతుంది. కాబట్టి సోలా ఫిడేలోని ఫిడేని రోమా చేత ధృవీకరించబడినది. రోమా చేత ధృవీకరించబడనిది సోలా, ఎందుకంటే విశ్వాసం సమర్థన యొక్క నాంది, పునాది మరియు మూలం అయినప్పటికీ, దాని ఉనికి సమర్థనను అమలు చేయడానికి సరిపోదు. మన౦ న్యాయబద్ధ౦గా ఉ౦డడానికి విశ్వాస౦తో పాటు మరేదైనా ఉ౦డాలి— అది అవసరమైన షరతు. ఒక ప్రభావం లేదా పర్యవసానం అనుసరించడానికి అవసరమైన షరతు తప్పనిసరిగా ఉండాలి, కానీ దాని ఉనికి ఫలితానికి హామీ ఇవ్వదు.

ఉదాహరణకు, సాధారణ పరిస్థితులలో, ఆక్సిజన్ యొక్క ఉనికి అగ్నికి అవసరమైన షరతు. కానీ, అదృష్టవశాత్తూ, అగ్నిని కలిగించడానికి కేవలం ఆక్సిజన్ యొక్క ఉనికి సరిపోదు. అదే జరిగితే, మనము గాలి పీల్చిన ప్రతిసారీ మంటలు చెలరేగేవి. కాబట్టి మనము అవసరమైన షరతుకు మరియు తగిన షరతుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తాము. తగిన షరతు ఫలితాన్ని ఇస్తుందని ఖచ్చితంగా హామీ ఇస్తుంది.

ఆ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే, విశ్వాసానికి, సమర్థనకు మధ్య ఉన్న బంధానికి సంబంధించిన రోమన్ కాథలిక్ దృక్పథానికి మరియు సంస్కరణ దృక్పథానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. రోమీయుడి దృష్టిలో, విశ్వాసం అనేది సమర్థనకు అవసరమైన షరతు, దానికి తగిన షరతు కాదు. ప్రొటెస్టంట్ దృష్టిలో, విశ్వాసం అనేది ఒక అవసరమైన షరతు మాత్రమే కాదు, సమర్థనకు తగిన షరతు కూడా. అనగా, మన విశ్వాసము మరియు నమ్మకమును క్రీస్తుపై ఉంచినప్పుడు, దేవుడు తన దృష్టిలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని నిశ్చయంగా ప్రకటిస్తాడు. బైబిల్ దృక్పథం అయిన సంస్కరణ దృక్పథం ఏమిటంటే, విశ్వాసం ఉంటే, సమర్థన కూడా అనివార్యంగా ఉంటుంది.

మనం సమర్థన లేకుండా విశ్వాసం కలిగి ఉండవచ్చు అనేది సంస్కరణ దృక్పథంలో ఊహించలేని విషయం. విశ్వాసం లేకుండా మనము సమర్థన కలిగి ఉండలేము మరియు సమర్థన లేకుండా మనము విశ్వాసాన్ని కలిగి ఉండలేము. విశ్వాసం లేకుండా మనకు సమర్థన ఉండదు, కానీ మనం సమర్థన లేకుండా విశ్వాసం కలిగి ఉండవచ్చు అని రోమా చెబుతుంది. మనము మన విశ్వాసాన్ని నిలుపుకొని సమర్థన యొక్క కృపను నాశనం చేసే మర్త్యమైన పాపము చేయగలము, తద్వారా మనము (సరైన పెనన్స్ (penance) లేకుండా) నాశనము చేయబడతాము (అని రోమా చెబుతుంది). కానీ సంస్కర్తలకు, కృపను పొందడానికి మరియు సమర్థన స్థితిని కొనసాగించడానికి నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం మాత్రమే అవసరం.

ఒప్పుకోలు ఇలా చెబుతున్నాయి:

విశ్వాసం, ఆ విధ౦గా,  క్రీస్తును ఆయన నీతిని స్వీకరి౦చుచూ, ఆయనలో మరియు ఆయన నీతిలో విశ్రమించుచూ, సమర్థనకు ఏకైక సాధన౦గా ఉంటుంది.

పరికరం అనేది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించే ఒక సాధనం. వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ రూపకర్తలు విశ్వాసం ఒక్కటే సమర్థనకు సాధనం అని రాసినప్పుడు, సమర్థన యొక్క సాధన కారణానికి సంబంధించి పదహారవ-శతాబ్దపు వివాదం గురించి వారికి తెలిసేవున్నది. ఈ సిద్ధాంత౦—సమర్థన యొక్క సాధన కారణం—గురి౦చి స్పష్టమైన అవగాహన కలిగివు౦డడ౦ అవసర౦, అది మన౦ ఎలా రక్షి౦చబడుతున్నాము అనే దాని గురి౦చి ఆలోచిస్తు౦ది.

సాధన కారణం అనే పదం క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దం వరకు, అరిస్టాటిల్ యొక్క తత్వశాస్త్రం వరకు కూడా చరిత్రలో ఉంది. చలనం మరియు మార్పును వివరించడానికి అతను ఆందోళన చెందాడు. ఆ క్రమంలో ఏదో ఒక స్థితి లేదా స్థాయి యొక్క మార్పుకు దోహదపడే వివిధ కారణాలను వేరు చేయడానికి ప్రయత్నించాడు. ఇది ఇక్కడ మన ప్రశ్నకు ఎలాంటి సంబంధం కలిగి ఉంది? స్వభావికముగా, మనము నీతిమంతులుగా తీర్చబడము. మనము అన్యాయమైనవాళ్ళం, మరియు దేవుని ముందు మన స్థితి ఏమిటంటే, ఆయన అపరిమితమైన ఉగ్రతకు అర్హులము. మన స్థితిని, నాశన స్థితి నుండి సమర్థన స్థితికి మార్చాల్సిన అవసరం ఉంది.

అరిస్టాటిల్ నాలుగు రకాల కారణాలను గుర్తించాడు: అధికారిక కారణం, సమర్థవంతమైన కారణం, అంతిమ కారణం మరియు భౌతిక కారణం. ఆయన సాధన కారణాన్ని చేర్చలేదు. అయినప్పటికి, అతని నాలుగు కారణాలు సాధన కారణం అనే ఆలోచనకు ఆధారం అయ్యాయి.

అతను ఒక గని నుండి బండ రాయిగా మొదలయ్యే విగ్రహాన్ని ఉదాహరణగా ఉపయోగించాడు. అరిస్టాటిల్ బండ రాయిని భౌతిక కారణం అని నిర్వచించాడు, ఆ పదార్థం నుండి ఏదైనా తయారు చేయబడుతుంది. అధికారిక కారణం అనేది, అతను పూర్తి చేసిన ఉత్పత్తి ఎలా ఉండాలనుకుంటున్న దానికి తగట్టుగా శిల్పి యొక్క మనస్సులో ఉన్న ఆలోచన లేదా అతని బ్లూప్రింట్ లేదా నమూనా. ఫలితం రావడానికి ముందు ఒక ఆలోచన ఉండాలి. రాయి నుండి విగ్రహానికి మార్పును తీసుకువచ్చేది సమర్థవంతమైన కారణం, మరియు ఈ సందర్భంలో అది శిల్పి. అది జరిగేలా చేసేది ఆయనే. అంతిమ కారణం వస్తువు ఏ ఉద్దేశ్యంతో తయారు చేయబడిందో అన్నది, ఈ సందర్భంలో తోటను అందంగా తీర్చిదిద్దడం కావచ్చు.

మార్పు జరిగే సాధనం అయిన సాధన కారణం యొక్క ఆలోచనను ఈ నాలుగు కారణాలకు మనం జోడించవచ్చు. శిల్పి బండ రాయిని విగ్రహంగా మార్చాలనుకుంటే, దానిని ఆకారంలోనికి, రూపంలోనికి, మృదువుగా చెయ్యడానికి రాయిని చెక్కాలి. అతని ఉలి మరియు అతని సుత్తి సాధనాలు, మార్పును కలిగించే సాధనాలు. ఆంగ్ల భాషలో, మనం తరచుగా ద్వారా మరియు  మూలముగా అనే పదాలతో అర్థాలను సూచిస్తాము.

సమర్థన విశ్వాసము ద్వారా లేదా విశ్వాసమూలముగా అని సంస్కర్తలు చెప్పినప్పుడు, విశ్వాసం మరియు విశ్వాసం మాత్రమే మనము సమర్థించబడడానికి మార్గము లేదా సాధనము అని వారు ధృవీకరించారు. మనకు కావలసిన ఏకైక సాధనం, మనల్ని ఖండించబడిన స్థితి నుండి సమర్థన స్థితికి తరలించడానికి అవసరమైన ఏకైక సాధనం విశ్వాసం, కానీ నీతిమంతులుగా తీర్చడానికి మనకు అవసరమైన ఏకైక విషయం విశ్వాసం కాదు. నీతిమంతులుగా తీర్చబడటానికి మనకు క్రీస్తు కూడా అవసరం. అనగా, నీతిమంతులుగా తీర్చబడటానికి, మనకు ఆయన పరిపూర్ణ నీతి, సిలువపై ఆయన ప్రాయశ్చిత్తం కావాలి. దేవుడు తన నీతి ప్రమాణాలను మరియు న్యాయ ప్రమాణాలను చేరుకోవడానికి అవసరమైన ప్రతిదీ క్రీస్తులో మరియు ఆయన పని ద్వారా నిష్పాక్షికంగా నెరవేరింది. అన్నీ ఆయనే చేశారు. సమర్థనపై రోమన్ కాథలిక్-ప్రొటెస్టంట్ సంఘము మొత్తం క్రీస్తు యొక్క నిష్పాక్షిక పనిపై కాదు గాని, ఆయన పని యొక్క ప్రయోజనాలను మనం ఎలా పొందుతాము అనే దానిపై ఉంది. క్రీస్తు యొక్క నిష్పాక్షిక పనిని ఆత్మాశ్రయంగా ఎలా సముచితం చేస్తారు? అపొస్తలుడైన పౌలు బోధ ఆధారంగా సంస్కర్తలు ఇచ్చిన సమాధాన౦ “విశ్వాస౦ ద్వారా లేదా మూలముగా మాత్రమే.” కానీ విశ్వాసం ఒక్కటే మనల్ని కాపాడదు. సమర్థన కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అని మనము చెప్పినప్పుడు, సమర్థన క్రీస్తుపై మన విశ్వాసం ద్వారా మాత్రమే ఉందని మనము చెబుతున్నాము.

రోమా ప్రకారం, సమర్థనకు ప్రధాన కారణం బాప్తీస్మము మరియు పెనన్స్(penance). రోమా ఈ సంస్కారాలను ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చే సాధనాలుగా నిర్వచించింది. ఇది పవిత్ర సంప్రదాయబద్ధంగా (అనగా, సంస్కారాల యొక్క సంఘ పరిపాలన ద్వారా) సాధించబడే రక్షణ మరియు క్రీస్తులో విశ్వాసం ద్వారా మాత్రమే అనుభవించే రక్షణ మధ్యన ఉన్న వ్యత్యాసము. ఇదే ఇక్కడ ఉన్న వ్యత్యాసం అంతా. విశ్వాసం మాత్రమే సమర్థనకు సాధనమని ఒప్పుకోలు(confession) చెబుతుంది, ఎందుకంటే విశ్వాసం ద్వారా మాత్రమే మనము క్రీస్తుపై ఆధారపడతాము మరియు క్రీస్తు యొక్క నీతిని పొందుకుంటాము. క్రీస్తు యొక్క నీతి, ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ప్రయోజనాలు, మన సమర్థన యొక్క నిష్పక్షపాతమైన యోగ్యత లేదా ఆధారం, విశ్వసించే ఎవరికైనా స్వేచ్ఛగా అందించబడతాయి. ” నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును” (రోమా.1:17). మనము విశ్వాసం మరియు క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతాము. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినదల్లా విశ్వాసం లేదా క్రీస్తు పనిపై విశ్వాసం మాత్రమే.

విశ్వాసం మన సమర్థనకు ఆధారం కాదు. క్రీస్తు నీతి, ఆయన యోగ్యతే మన సమర్థనకు ఆధారం. మన సమర్థనకు యోగ్యమైన కారణం క్రీస్తు నీతి మాత్రమే అని సంస్కర్తలు చెప్పారు. మన సమర్థనకు మూలకారణం విశ్వాసం, కానీ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చెప్పినప్పుడు, విశ్వాసం అనేది మన సమర్థనకు ఏదైనా జోడించే ఒక యోగ్యమైన పని అని అర్థం కాదు. 

ఆచరణాత్మకంగా దాని వల్ల ఎలాంటి మార్పు ఉంటుంది? విశ్వాసం ద్వారా మాత్రమే తాము సమర్థనను విశ్వసిస్తున్నామని అంటూ, దేవుని న్యాయం యొక్క డిమాండ్లను సంతృప్తిపరిచే యోగ్యత లేదా మంచి పనిగా తమ విశ్వాసం ఉందనట్లుగా దాని మీద ఆధారపడే వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి విశ్వాసం ఉందనే వాస్తవం అతని ఖాతాలో ఎటువంటి యోగ్యతను జోడించదు. ఆ విశ్వాసం క్రీస్తు యొక్క యోగ్యతను అతనికి ఆపాదించడం ద్వారా అతని ఖాతాలోనికి అపరిమితమైన యోగ్యతను జోడిస్తుంది. మనము విశ్వాసము ద్వారా మాత్రమే క్రీస్తు యోగ్యతను పొందగలము, అలా పొందుకునే విధంలో ఏ యోగ్యత లేదు. మనల్ని రక్షించగల ఏకైక వ్యక్తి క్రీస్తు, మరియు మనము విశ్వాసం ద్వారా మాత్రమే ఆయనను పొందగలము. మన జీవితంలో మన రక్షణ కొరకు క్రీస్తుపై మరియు ఆయన నీతిపై తప్ప మరి దేనిపైన మనము ఆధారపడము.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.