
యేసు యొక్క మానవత్వం
22/04/2025ఆపాదన సిద్ధాంతం

-
- మంచి విషయాలు కలిసి వచ్చినప్పుడు అది మీకు నచ్చుతుందా? హామ్ మరియు గుడ్లు. బాట్ మాన్ మరియు రాబిన్. మాకరోనీ మరియు జున్ను. కాబట్టి, చాక్లెట్ చిప్ కుకీలు మరియు సువార్త గురించి అయితే ఎలా ఉంటుంది? ఇది మీకు కొత్తదిగా అనిపించవచ్చు.
1990 లలో, ఎవాంజెలికల్ వేదాంతవేత్తలు మరియు సంఘ నాయకుల బృందం రోమన్ కాథలిక్ వేదాంతవేత్తలు మరియు సంఘ నాయకుల బృందంతో చర్చలు జరిపి, వారు కలిసి ఎవాంజెలికల్స్ అండ్ కాథలిక్స్ టుగెదర్ (ఇసిటి) పేరుతో ఒక ప్రకటనను రూపొందించారు. ఇ.సి.టి తరువాత, సువార్త గురించి రోమన్ కాథలిక్ అవగాహన గురించి మరియు ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క వారసులైన ఎవాంజెలికల్స్ చారిత్రాత్మకంగా ధృవీకరించిన సువార్త యొక్క అవగాహనకు ఇది ఎలా సంబంధం కలిగి ఉంది అనే దాని గురించి చాలా చర్చ జరిగింది. కేవలం విశ్వాసం ద్వారానే సమర్థన అనే అంశం తెరపైకి వచ్చింది. వాస్తవానికి, ఇది సంస్కరణ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటి.
సోలా ఫిడే (విశ్వాసం మాత్రమే), సోలా గ్రేషియా (కృప మాత్రమే), సోలస్ క్రిస్టస్ (క్రీస్తు మాత్రమే) సంస్కరణ సూత్రాలలో విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థన సిద్ధాంతం ఎంత అవసరమో మనం చూస్తాము. కృప ద్వారా మాత్రమే రక్షణ క్రీస్తులో విశ్వాసం ద్వారా మాత్రమే ఉంటుందని ఈ సోలాలు నొక్కి చెబుతున్నాయి. ఏదేమైనా, సంస్కర్తలు విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థన సిద్ధాంతానికి పూర్తిగా అవసరమని వారు భావించిన ఒక పదాన్ని నొక్కి చెప్పారు, ఇది సువార్త యొక్క సరైన అవగాహనకు అవసరమని వారు భావించారు. ఆ పదం ఏమిటంటే ఆపాదన (ఇంప్యుటేషన్).
ఇసిటి చుట్టూ జరిగిన కొన్ని చర్చల సమయంలో, ఆపాదన విషయంలో ఎవాంజెలికల్స్ మరియు రోమన్ కాథలిక్కుల మధ్య చారిత్రాత్మక విభేదాలు తెరపైకి వచ్చాయి. సంస్కరించబడిన వేదాంతవేత్త మైఖేల్ హార్టన్ చాక్లెట్ చిప్ కుకీల తయారీలో చాక్లెట్ చిప్స్ తో పోల్చాడు. మీరు చాక్లెట్ చిప్ కుకీలను తయారు చేయడానికి అన్ని పదార్థాలను సెట్ చేసి, చాక్లెట్ చిప్స్ యొక్క అసలైన ఏకైక పదార్ధాన్ని వదిలివేస్తే, మీరు ఓవెన్ నుండి ట్రేను బయటకు లాగినప్పుడు మీకు చాక్లెట్ చిప్ కుకీలు ఉండవు. అదేవిధంగా, మీరు సువార్తలోని ముఖ్యమైనవి చాలా పదార్థాలను కలిగి ఉండవచ్చు. మనము పాపులమనే అవగాహన మీకు ఉండవచ్చు. మనము దేవున్ని పరిశుద్ధుడుగా మరియు న్యాయమైనవాడుగా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు గురి౦చి, సిలువపై ఆయన చేసిన కార్యం గురి౦చి మీరు అవగాహన కలిగివు౦డవచ్చు. కానీ మీరు ఆపాదనను వదిలేస్తే, మీకు సువార్త లేదు. అందుకే సంస్కర్తలు బైబిలు పరంగా విశ్వసనీయ సువార్త ప్రకటనకు ఈ పదం చాలా అవసరమని భావించారు. అయితే ఆపాదన అనే పదానికి అర్థం ఏమిటి?
ఆపాదన (ఇంప్యూటేషన్) అనే పదం నేరుగా లాటిన్ భాష నుండి వచ్చింది. ఇది అకౌంటింగ్ లో వాడే ఒక పదం; దీని అర్థం “ఒకరి ఖాతాకు వర్తింపజేయడం” అని. ఖర్చులు డెబిట్ చేయబడుతాయి ఆదాయం జమ చేయబడుతుంది. దానికి “లెక్క” అనే పదాన్ని పాత కింగ్ జేమ్స్ వాడుతుంది.
వేదాంత పరంగా, సమర్థనలో జరిగే ద్వంద్వ ఆపాదన గురించి మనము మాట్లాడతాము. 2 కొరింథీయులు 5:21 వంటి వచనాలలో ఈ ద్వంద్వ ఆపాదన బోధించబడింది, ఇక్కడ పౌలు స్పష్టంగా ఇలా చెబుతున్నాడు, “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” ఇక్కడ మన పాపము క్రీస్తుకు ఆపాదించబడిందని చదువుతాము. మనది అభ్యంతరపరిచే పార్టీ. అతను అపరాధ భావం లేనివాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్నంగ పాటించాడు. అయినప్పటికీ, సిలువపై, దేవుడు క్రీస్తుపై తన ఉగ్రతను కురిపించాడు. ఎందువల్ల? ఎందుకంటే మన పాపం క్రీస్తుకు ఆపాదించబడింది. క్రీస్తు మన పాపాన్ని తనపై వేసుకున్నాడు. మన గొప్ప డెబిట్ ఆయన ఖాతాలో వేయబడింది. దేవుని ఉగ్రతను కలిగి ఉన్న గిన్నె తనపై కుమ్మరించడంతో క్రీస్తు భయంకరమైన శిక్షను చెల్లించాడు.
రెండో ఆపాదన కూడా ఉంది. క్రీస్తు నీతి మనకు ఆపాదించబడింది. ఆయన మన డెబిట్ (మన ఖాతాలో ఉన్నది) తీసుకోవడమే కాదు గాని, మనకు ఆయన క్రెడిట్ (ఆయన ఖాతాలో ఉన్నది) దక్కుతుంది. మనం ఎన్నటికీ తీర్చలేని శిక్షను క్రీస్తు చెల్లించాడు, కానీ మనం పాటించలేని ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన పరిపూర్ణంగా పాటించాడు. పర్యవసానంగా, దేవుడు తన నీతిని మనకు దయచేస్తాడు. మనం క్రీస్తు నీతితో కప్పబడి దేవుని ఎదుట నిలబడతాము. మన౦ క్రియల ద్వారా రక్షింపబడ్డామని – మన క్రియల ద్వారా కానేకాదు, దానికి బదులుగా క్రీస్తు మన పక్షాన చేసిన క్రియల ద్వారా, ఆయన మన పక్షాన చూపిన పరిపూర్ణ విధేయత ద్వారానే అని- మన౦ వాస్తవ౦గా చెప్పవచ్చు. బైబిలులోని రెండు అందమైన పదాలు మనకోసమే అని ఒక వేదాంతవేత్త చెప్పాడు. యేసు మన కోస౦ జీవి౦చి చనిపోయాడు, మళ్లీ లేచాడు. ఆయన చేసిన పనులన్నీ మన తరుపున జరిగాయి.
ఈ ఆవశ్యక సిద్ధాంతాన్ని మనం ది వర్డ్ మేడ్ ఫ్లెష్: ది లిగోనియర్ స్టేట్ మెంట్ ఆన్ క్రిస్టోలజీలో వ్యక్తపరుస్తున్నాము, ఎందుకంటే ద్వంద్వ ఆపాదన సిద్ధాంతం మన కాలంలో స్వీయ-ప్రకటిత ఎవాంజెలికల్ లచే గణనీయమైన దాడులను ఎదుర్కొంది. గుర్తుంచుకోండి, సమర్థన యొక్క సరైన అవగాహనకు ఆపాదన అవసరం, మరియు సువార్త యొక్క సరైన అవగాహనకు సమర్థన యొక్క సరైన అవగాహన అవసరం. ఇసిటి వంటి సందర్భాల్లో ఆపాదన మరియు సమర్థన సిద్ధాంతాలను సవాలు చేశారు. పౌలుపై నూతన దృక్పథం (న్యూ పర్స్పెక్టివ్ ఆన్ పౌల్) అని పిలువబడే సమకాలీన ఉద్యమాలలో కూడా ఆపాదన మరియు సమర్థన సిద్ధాంతాలు సవాలు చేయబడ్డాయి. ఈ ప్రమాదకరమైన వేదాంత కదలికకు ప్రతిస్పందించడానికి, మేము ఇసుకలో స్పష్టమైన రేఖను గీయాలనుకుంటున్నాము. అ౦తేకాక, సువార్త ఎంతటి శుభమైన వార్తనో విశ్వాసులకు గుర్తు చేయాలనుకుంటున్నా౦. క్రీస్తు మన పాపపు మురికిని తీసుకొని తన నీతిమంతమైన వస్త్రాన్ని మనకు ఇచ్చాడు. ఇదొక అందమైన చిత్రం. మన విమోచనను నెరవేర్చడంలో క్రీస్తు చేసిన పనిని ప్రకటనలోని నాల్గవ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాము:
ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించి, పాపానికి ప్రాయశ్చిత్తం చేసి, దేవుని ఉగ్రతను తృప్తిపరిచాడు. ఆయన మన మురికి గుడ్డలను తీసుకొని తన నీతివంతమైన వస్త్రాన్ని మనకు ఇచ్చాడు.
మేము ఈ ప్రకటనను ఇవ్వడానికి ప్రధాన కారణాలలో ఆపాదన సిద్ధాంతం యొక్క ఆవశ్యకత ఒకటి. లిగోనియర్ వద్ద, గతానికి సంబంధించిన గొప్ప విశ్వాసాలను ప్రజలకు చూపించడానికి మేము ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తాము. డాక్టర్ స్ప్రౌల్ యొక్క మొదటి పుస్తకం అపోస్తలుల విశ్వాస ప్రామాణంపై ఉంది, మరియు ఈ పుస్తకం యొక్క కొత్త ఎడిషన్ ఇటీవల వాట్ వి బిలీవ్ పేరుతో విడుదలైంది. నైసీన్ క్రీడ్ యొక్క గొప్ప విలువను కూడా మేము గుర్తించాము. వ్యక్తిగతంగా చెప్పాలంటే, బహిరంగ ఆరాధనలో నైసీన్ క్రీడ్ పఠించే సందర్భాల నుండి నేను చాలా ప్రయోజనం పొందుతాను. నేను ప్రారంభ సంఘములో క్రీస్తుశాస్త్రంపై ఒక పుస్తకం రాశాను, నైసీన్ క్రీడ్ లోని ఆ గొప్ప పదబంధం తరువాత దానిని మన కోసం మరియు మన రక్షణ కోసం రాశాను. ఇది వేదాంత సాహిత్యంలో అత్యంత అందమైన పదబంధాలలో ఒకటి అని నేను అనుకుంటున్నాను. ఈనాటి సంఘాన్ని మన గతానికి సంబంధించిన ఈ గొప్ప గ్రంథాలు, సంపదలను చూపిస్తాం.
అపోస్తలుల విశ్వాస ప్రామాణం మరియు నైసీన్ క్రీడ్ లను ఎవాంజెలికల్స్, మెయిన్ లైన్ ప్రొటెస్టెంట్లు, రోమన్ కాథలిక్కులు మరియు ఈస్టర్న్ ఆర్థోడాక్స్ పఠిస్తున్నారని కూడా మేము గుర్తించాము. మరో మాటలో చెప్పాలంటే, ఈ చారిత్రాత్మక విశ్వాసాలను కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థనను ధృవీకరించే వారు పఠిస్తారు, మరియు అవి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థనను తిరస్కరించే సంఘములు లేదా సమాజాలకు చెందినవారు పఠిస్తున్నారు. ఈ విశ్వాసాలు, క్రీస్తు యొక్క వ్యక్తి గురించి అవసరమైన బోధను ఇస్తున్నప్పటికిని, క్రీస్తు యొక్క కార్యం గురించి మరియు ఈ ప్రస్తుత కాలంలో అవసరమైన దేవుని ఎదుట మన సమర్థనను గురించి ఖచ్చితత్వంతో మాట్లాడవు. కానీ సువార్తకు ఆపాదన సిద్ధాంతంతో సహా విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థించడం అవసరమని, అందువల్ల సంఘము యొక్క గుర్తింపుకు అవసరమని మేము నమ్ముతున్నాము. కాబట్టి అపోస్తలుల విశ్వాస ప్రామాణం యొక్క స్ఫూర్తితో, సంక్షిప్తంగా, పఠించదగిన ఒక ప్రకటనను సంఘానికి ఇవ్వడానికి మేము ప్రయత్నించాము. దేవుని ముందు మనకు సరైన స్థానం కల్పించడానికి క్రీస్తు చేసిన కార్యాన్ని సంస్కర్తలు చక్కగా వివరించినట్లుగా మేము కూడా దానిని నొక్కి చెప్పడానికి ప్రయత్నించాము. ఆదిమ సంఘము మరియు సంస్కర్తల యొక్క గొప్ప సంప్రదాయాలలో నిలబడటం ఎంత ఆహ్లాదకరంగా మరియు ఉత్తేజకరంగా ఉంటుంది.
సువార్త అనేది క్రీస్తు యొక్క వ్యక్తి మరియు కార్యము యొక్క సిద్ధాంతం. కాబట్టి, మన పాపాన్ని ఆయనకు ఆపాదించడం, ఆయన విధేయత మనకు ఆపాదించడం అనే ఆపాదన సిద్ధాంత౦ ఈ సువార్తకు ఆవశ్యక౦. సువార్త ఎ౦దుకు మంచి వార్త అనేది అది మనకు చూపిస్తు౦ది—క్రీస్తు నిజ౦గా అన్నీ చేశాడు. ఆయన మన కోసం మన సృష్టికర్త యొక్క పరిపూర్ణ ప్రమాణాన్ని చేరుకున్నాడు, కాబట్టి మనం విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తులో ఉంటే ప్రభువు ఉగ్రతకు భయపడవలసిన అవసరం లేదు. దేవుని మహిమను, కృపను స్తుతించటానికి మాత్రమే ఈ ఆపాదన సిద్ధాంతం మనల్ని నడిపిస్తుంది. రక్షణ నిజంగా ఆయన నుండి మరియు ఆయన నుండి మాత్రమే అని ఈ ఆపాదన సిద్ధాంతం మనకు చెబుతుంది.
ఈ వ్యాసం ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీ సేకరణలో భాగం.
ఇంతకు ముందు ది వర్డ్ మేడ్ ఫ్లెష్: ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీ లో లిగోనియర్ మినిస్ట్రీస్ చేత ప్రచురించబడింది.
- మంచి విషయాలు కలిసి వచ్చినప్పుడు అది మీకు నచ్చుతుందా? హామ్ మరియు గుడ్లు. బాట్ మాన్ మరియు రాబిన్. మాకరోనీ మరియు జున్ను. కాబట్టి, చాక్లెట్ చిప్ కుకీలు మరియు సువార్త గురించి అయితే ఎలా ఉంటుంది? ఇది మీకు కొత్తదిగా అనిపించవచ్చు.