దేవుడు సార్వభౌముడు కాబట్టి, మానవులు ఎలా స్వేచ్ఛ కలిగి ఉంటారు?
18/12/2024సమర్థన యొక్క సాధన కారణం
20/12/2024సంస్కరించబడినవారిగా ఉండటానికి ధైర్యము
సంస్కరించబడిన వేదాంతశాస్త్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు, విమోచన గురించిన మన అవగాహన మాత్రమే మారదు, కానీ ప్రతిదానిపై మన అవగాహన కూడా మారుతుంది. ఈ కారణంగానే ప్రజలు సంస్కరించబడిన వేదాంతశాస్త్రం యొక్క ప్రాథమిక సిద్ధాంతాల ద్వారా కుస్తీపడి వాటిని అర్థం చేసుకున్నప్పుడు, వారు తరచుగా రెండవసారి మార్పుపొందినట్లు భావిస్తారు. వాస్తవానికి, చాలా మంది అంగీకరించినట్లు, నిజానికి కొంతమంది మొదటిసారిగా మార్పుచెందబడ్డారు. సంస్కరించబడిన వేదాంతశాస్త్రాన్ని పరిశీలించడం ద్వారా, వారు తమ తీవ్రమైన అవినీతి మరియు పాపంలో నిర్జీవత్వం, దేవుడు తన స్వంత వారిని షరతులేకుండా ఎన్నుకోవడం మరియు ఇతరులను ఖండించడం, క్రీస్తు తన ప్రజల కోసం విమోచనను వాస్తవంగా సాధించడం, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావవంతమైన కృప, దేవుని కృప ద్వారా వారు పట్టుదలతో ఉండటానికి కారణం మరియు దేవుని మహిమ కోసం దేవుని నిబందన మార్గం వంటి అన్నిటి యొక్క కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొన్నారు. అంతిమంగా, తాము దేవుణ్ణి ఎన్నుకోలేదని, కానీ ఆయన తమను ఎన్నుకున్నాడని ప్రజలు గ్రహించినప్పుడు, వారు సహజంగానే తమ పట్ల దేవుని అద్భుతమైన కృపను వినయంగా ఒప్పుకునే స్థితికి వస్తారు. అప్పుడే మనం నిజంగా ఎంత దుర్మార్గులమో గుర్తిస్తేనే మనం నిజంగా “అమేజింగ్ గ్రేస్” పాడగలం. సంస్కరించబడిన వేదాంతశాస్త్రం సరిగ్గా అదే చేస్తుంది: ఇది మనలను లోపలి నుండి మారుస్తుంది మరియు మనము పాడటానికి దారితీస్తుంది –ఇది కేవలం ఆదివారాల్లో మాత్రమే కాదు గాని, జీవితమంతటిలో ప్రతిరోజూ మన సార్వభౌమ మరియు త్రిత్వమైన, దయగల మరియు ప్రేమగల దేవుడిని ఆరాధించేలా నడిపిస్తుంది. సంస్కరించబడిన వేదాంతశాస్త్రం అనేది సంస్కరించబడిన వారు ప్రసిద్ధి చెందడం లేదా సులభంగా ఉన్నపుడు ధరించుకునే బ్యాడ్జ్ మాత్రమే కాదు, ఇది మనము జీవించే మరియు శ్వాసించే, ఒప్పుకునే, మరియు దానిని దాడి చేసినప్పుడు రక్షించే ఒకే వేదాంతశాస్త్రం.
పదహారవ శతాబ్దానికి చెందిన ప్రొటెస్టంట్ సంస్కర్తలు, వారి పదిహేనవ శతాబ్దపు పూర్వీకులు మరియు వారి పదిహేడవ శతాబ్దపు వారసులతో కలిసి, వారి సిద్ధాంతం ప్రసిద్ధి చెందడం లేదా సులభంగా ఉన్నందున బోధించలేదు మరియు సమర్థించలేదు, కానీ అది వాక్యానుసారమైనది కాబట్టి వారు భోదించారు మరియు సమర్ధించారు, మరియు వారు దాని కోసం తమ జీవితాలను ప్రమాదంలో పెట్టారు. వారు లేఖనాల యొక్క వేదాంతశాస్త్రం కోస౦ చనిపోవడానికి సిద్ధ౦గా ఉ౦డడమే కాదు, దాని కోస౦ జీవి౦చడానికి, దాని కోస౦ శ్రమపడడానికి, దాని కోస౦ మూర్ఖులుగా పరిగణి౦చబడడానికి సిద్ధపడ్డారు. పొరపడవద్దు: సంస్కర్తలు వారి ఆత్మవిశ్వాసం మరియు స్వయంశక్తి వల్ల సాహసవంతులు, ధైర్యవంతులు కాదు, కానీ సువార్త చేత తగ్గించబడిన వారు అన్న వాస్తవము యొక్క ఫలితాన్ని బట్టియే. వారు ధైర్యవంతులు ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలో నివసించినందున మరియు వారు అబద్ధాల చీకటి యుగంలో సత్యం యొక్క వెలుగును ప్రకటించడానికి సన్నద్ధమయ్యారు. వారు బోధించిన సత్యం కొత్తదేమీ కాదు; పురాతనమైనది. ఇది అమరవీరులు, తండ్రులు, అపొస్తలులు, పితృదేవతల సిద్ధాంతం—ఇది పవిత్ర లేఖనములో చెప్పబడిన దేవుని సిద్ధాంతము.
సంస్కర్తలు వారి వేదాంతాన్ని వారు రూపొందించుకోలేదు; కానీ, బదులుగా, వారి వేదాంతమే వారిని ఎవరో అన్నది చేసింది. లేఖన వేదాంత శాస్త్రం వారిని సంస్కర్తలను చేసింది. వారు సంస్కర్తలుగా ఉ౦డడానికి సిద్ధపడలేదు, వారు దేవునికి నమ్మక౦గా ఉ౦డడానికి, లేఖనానికి నమ్మక౦గా ఉ౦డడానికి పూనుకొన్నారు. సంస్కరణ సిద్ధాంతాలను గానీ, కృప సిద్ధాంతాలను గానీ (కాల్వినిజం యొక్క ఐదు అంశాలు) సంస్కర్తలు కనిపెట్టలేదు, లేదా అవి ఏ విధంగానూ సంస్కరణ సిద్ధాంతం యొక్క మొత్తం కాదు. దానికి బదులుగా, రాబోయే తరాల సంఘము నమ్మినదానిని ఒప్పుకోవడానికి మరియు రక్షించుకొవడానికి సహాయపడటానికి ఆధారమైన సైదంతిక ప్రారంభ విషయాలుగా అవి మారాయి. నేటికీ సంస్కరించబడిన వేదాంతశాస్త్రాన్ని స్వీకరించారని భావించే వారు చాలా మంది ఉన్నారు, కాని సంస్కరణ యొక్క సోలాలు మరియు కృప సిద్ధాంతాలు ఉన్నంత లోతులో మాత్రమే వారి సంస్కరించబడిన వేదాంతశాస్త్రం ఉంటుంది. ఇంకా ఏమిటంటే, సంస్కరించబడిన వేదాంతానికి కట్టుబడి ఉన్నామని చెప్పే వారు చాలా మంది ఉన్నారు, కాని వారు సంస్కరించబడ్డారని ఎవరికీ తెలియకుండా చూసుకుంటారు. అటువంటి “క్లాసెట్ కాల్వినిస్టులు” పదహారు లేదా పదిహేడవ శతాబ్దాలకు చెందిన చారిత్రాత్మక సంస్కరణ చేసిన ఒప్పుకోలను అంగీకరించరు లేదా స్పష్టంగా సంస్కరించబడిన వేదాంత భాషను ఉపయోగించరు.
ఏదేమైనా, చారిత్రాత్మక సంస్కరణ చేసిన ఒప్పుకోలు ప్రకారం మనం నిజంగా సంస్కరించబడిన వేదాంతశాస్త్రానికి కట్టుబడి ఉంటే, మనం సంస్కరించబడిన వారిగా గుర్తింపు పొందుకోకుండా ఉండలేము. వాస్తవానికి, “క్లాసెట్ కాల్వినిస్ట్“గా ఉండటం అసాధ్యం మరియు ఎవరికీ తెలియకుండా సంస్కరించబడిన వారిగా ఉండటం అసాధ్యం–అది అనివార్యంగా బయటకు వస్తుంది. చారిత్రాత్మకంగా సంస్కరించబడాలంటే, ఒక సంస్కరణ చేయబడిన ఒప్పుకోలుకు కట్టుబడి ఉండాలి మరియు దానికి కట్టుబడి ఉండటమే కాకుండా, దానిని అంగీకరించాలి, ప్రకటించాలి మరియు దానిని రక్షించాలి. సంస్కరించబడిన వేదాంత శాస్త్రం ప్రాథమికంగా ఒక ఒప్పంద వేదాంత శాస్త్రం.
సంస్కరించబడిన వేదాంత శాస్త్రం కూడా సమస్తాన్ని చుట్టుముట్టే వేదాంత శాస్త్రం. ఇది మనకు తెలిసిన వాటిని మార్చడమే కాదు, మనకు తెలిసిన వాటిని ఎలా తెలుసుకోవాలో మారుస్తుంది. ఇది దేవుని పట్ల మన అవగాహనను మార్చడమే కాదు, మన గురించి మన అవగాహనను కూడా మారుస్తుంది. వాస్తవానికి, అది రక్షణ గురి౦చిన మన దృక్పథాన్ని మార్చడమే కాదు, మన౦ ఎలా ఆరాధిస్తామో, ఎలా సువార్తను బోధిస్తామో, మన పిల్లలను ఎలా పెంచుతామో, సంఘముతో ఎలా వ్యవహరిస్తామో, ఎలా ప్రార్థిస్తామో, లేఖనాన్ని ఎలా అధ్యయన౦ చేస్తామో – అది మన౦ ఎలా జీవిస్తామో, ఎలా కదులుతామో, ఎలా ఉంటామో మారుస్తుంది. సంస్కరించబడిన వేదాంత శాస్త్రం మనం దాచగల వేదాంత శాస్త్రం కాదు, మరియు ఇది కేవలం పెదవి విరిచే వేదాంత శాస్త్రం కాదు. ఎందుకంటే అది చరిత్ర అంతటా మతవిద్రోహులకు, వేదాంత అభ్యుదయవాదులకు(theological progressives) అలవాటే. వారు తమ సంస్కరణ చేసిన ఒప్పుకోలకు కట్టుబడి ఉన్నారని చెప్పుకుంటారు, కాని వారు వాస్తవానికి వాటిని ఎన్నడూ ఒప్పుకోరు. వారు రక్షణాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే – వారి అభ్యుదయ (ప్రజాదరణ పొందినప్పటికీ) వేదాంతశాస్త్రం ప్రశ్నార్థకమైనప్పుడు, మరియు వారు పాస్టర్లు అయితే, వారి ఉద్యోగాలు పోయేటట్టుగా ఉన్నప్పుడు మాత్రమే తాము సంస్కరణ యొక్క ఒప్పుకోలకు లోబడియున్నారని చెప్పుకుంటారు. “సంస్కరించబడినవారు” గా గుర్తించబడే సంఘాలు మరియు వర్గాలలో(Denominations) వేదాంత ఉదారవాదులు ఉన్నప్పటికీ, వారు అటువంటి గుర్తింపు గురించి సిగ్గుపడతారు మరియు “సంస్కరణ” అని పిలువబడటం కొంతమందికి అవరోధం మరియు మరికొందరికి అపరాధం అని నమ్ముతారు. అ౦తేకాక, సంఘము యొక్క చారిత్రాత్మక, సాధారణ గుర్తుల ప్రకార౦— దేవుని వాక్యాన్ని స్వచ్ఛ౦గా ప్రకటి౦చడ౦, దేవుని వాక్య౦ ప్రకార౦ ప్రార్థన చేయడ౦, బాప్తిస్మ౦, ప్రభువు భోజన౦ అనే స౦స్కారాలను సక్రమ౦గా ఉపయోగి౦చడ౦, సంఘము క్రమశిక్షణను స్థిర౦గా ఆచరి౦చడ౦— అలా౦టి “సంస్కరించబడిన” సంఘాలు తరచుగా నిజమైన సంఘాలు కావు. నేడు, సంప్రదాయబద్ధంగా సంస్కరించబడిన సంఘాలు, ప్రొటెస్టంట్ సంఘాలు మరియు వర్గాలలో అనేక మంది సామాన్యులు మరియు కాపరులు ఉన్నారు, వారు వారి సంఘాలు మరియు వర్గాలతో పాటు, వారి సంస్కరించబడిన పునాదులను విడిచిపెట్టారు మరియు సంవత్సరాల క్రితమే వారు అంగీకరించిన దానిని తిరస్కరించారు.
ఈ ధోరణికి భిన్నంగా, మనకు చాల అవసరమైనవారు సంస్కరించబడిన వారుగా ఉండగలిగే ధైర్యవంతమైన పురుషులు–పరిశుద్దులకు ఒక్కసారి అప్పగించిన విశ్వాసానికి సిగ్గుపడని వారు , కానీ దాని కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న పురుషులు, పెదవి సేవతో కాదు కానీ, తమ జీవితముతో మరియు తమ సర్వశక్తితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నవారు అవసరము. సత్యాన్ని ప్రకటి౦చడ౦లో ధైర్య౦గా, అచంచల౦గా ఉ౦డే వారు, అదే సమయ౦లో కృపగల మరియు దయగల మనుష్యులు మనకు పుల్పిట్లో అవసర౦. ముఖాన్నికి వేలు చూపించే వారు కాకుండా భుజం చుట్టూ చేయి వేసి, సమయమందును అసమయ మందును సంస్కరించబడిన వేదాంతశాస్త్రం యొక్క అపరిష్కృత సత్యాన్ని బోధించే వ్యక్తులు మనకు అవసరం. మన దేవుడైన యెహోవాను, ఆయన యొక్క మారని, దైవావేశమువలన కలిగిన, అధికార వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి సంస్కరించబడిన ఒప్పుకోలును ప్రేమి౦చే మనుష్యులు మనకు అవసర౦. సంస్కరించబడే ధైర్యము ఉన్న మనుష్యులు మన పుల్పిట్లో ఉన్నప్పుడు మాత్రమే సంస్కరించబడిన వేదాంతాన్ని మరియు జీవితాంతంలో ప్రభావాలను గ్రహించే వ్యక్తులు కుర్చీలలో ఉంటారు తద్వారా మనము మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, శక్తితో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించవచ్చు మరియు మనలాగే మన పొరుగువారిని ప్రేమించవచ్చు. పదహారవ శతాబ్దంలో సంఘాన్ని సంస్కరించిన వేదాంత శాస్త్రం అదే, మరియు ఇరవై ఒకటవ శతాబ్దంలో సంస్కరణ మరియు పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చే ఏకైక వేదాంత శాస్త్రం అదే. ఎందుకంటే తీవ్రమైన అభ్యుదయ వేదాంత ఉదారవాధ్యము (రాడికల్ ప్రోగ్రెసివ్ థియలాజికల్ లిబరలిజం) ఉన్న ఈ రోజుల్లో, అహంకారంతో కాక, సంఘము పట్ల మరియు కోల్పోయిన వారిపట్ల ధైర్యసాహసాలతో, కరుణతో, దేవుని మహిమ కోసం మాత్రమే మన సంస్కరణ ఒప్పుకోలు ప్రకారంగా మనము అత్యంత తీవ్రంగా ఉండగలది సంప్రదాయవాదం (orthodox).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.