
ఐదు సోలాలు ఏమిటి?
01/05/2025
“సోలా స్క్రిప్టురా” అంటే ఏమిటి?
08/05/2025సంస్కరణోద్యమ పంచ సూత్రాలు నేటి సంఘానికి ఇంకా ప్రాముఖ్యమైనవేనా?

-
- సంస్కరణోద్యమపు పంచ సూత్రాలు (Five Solas “Solas” అనగా లాటిన్లో “మాత్రమే” అనే అర్థం) లేఖనం మాత్రమే, కృప ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తు మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే అనే పంచ సూత్రాలు ఏ కాలంలోని సంఘానికైనా అత్యవసరమైనవి. అవి ఎల్లప్పుడూ సందర్భోచితంగా ఉంటాయి, ఎందుకంటే అవి బైబిలు సువార్తను సంగ్రహంగా తెలియజేస్తాయి, అవి ప్రతి యుగంలోనూ సంఘానికి జీవనాధారం. మన చుట్టూ ఉన్న సంస్కృతి సంగతి అటుంచితే, విశ్వాసులమని చెప్పుకునే క్రైస్తవులు కూడా సువార్తను విడిచిపెట్టడానికి శోధింపబడుతున్న ఈ రోజుల్లో అవి మరింత ముఖ్యమైనవి. కాబట్టి, సంఘం పంచ సూత్రాలను(Five Solas) కేవలం రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాకుండా వాటిని ఉత్సవంగా జరుపుకోవడాన్ని కూడా గుర్తుంచుకోవాలి .మూడు ముఖ్యమైన కారణాల వల్ల ఈ పంచ సూత్రాలు(Five Solas) ఈ రోజుల్లో మనకు ఎంతో అవసరమైనవి.
-
- పంచ సూత్రాలు(Five Solas) నిజమైన సువార్తను ప్రతి ఇతర మతం, ప్రపంచ దృక్పథం లేదా తత్వశాస్త్రం నుండి వేరు చేస్తాయి.
ప్రతి రోజు, ఈ ప్రపంచం ఆత్మీయంగా రాజీపడే పాటను వినిపిస్తూ, మనలను ఆకర్షిస్తుంది. సాతానుకు మనల్ని బైబిలు సత్యం యొక్క రాజీ పడలేని అంశాలపై రాజీపడేలాగ చేయడం ఇష్టం. సత్యానికి మన ఏకైక ప్రమాణంగా బైబిలు గురించి దృఢమైన నమ్మకాలు కలిగి ఉండవలసిన అవసరం లేదని లేదా రక్షణ కోసం క్రీస్తునందు మాత్రమే విశ్వసించేవారు దేవునితో సరియైన సంబంధం కలిగి ఉంటారనే బోధనను గట్టిగా పట్టుకోవలసిన అవసరం లేదని అతను అబద్ధాలు చెబుతాడు.
సిద్ధాంతాన్ని తక్కువగా చూపించాలనే ప్రలోభం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. పంచ సూత్రాలపై(Five Solas) తిరుగులేని పట్టు ఆకర్షణీయమైన ఈ అబద్ధాలను నిరోధించడానికి మనకు సహాయపడతాయి.
- పంచ సూత్రాలు(Five Solas) గందరగోళమైన ప్రపంచంలో చెప్పశక్యముకాని ఆదరణను మనకు అందిస్తాయి.
ఆధునిక జీవిత వేగం నిలకడలేనిది. ఇది “సాధారణ క్రైస్తవ జీవితం” గురించి మన అవగాహనను మార్చివేస్తుంది. మనం సాధారణంగా పరిచర్యలో తీరిక లేకుండా ఉండటాన్ని యేసు కోసం ఫలవంతంగా ఉండటంతో సమానం చేస్తాము. కానీ రెండూ గందరగోళంగా ఉండకూడదు. దేవుని కృప ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డామని తెలుసుకోవడం అలసిపోయే ఈ ప్రపంచం నుండి మనకు విశ్రాంతినిస్తుంది. మనం దేవునితో మన సంబంధంలో మనం ప్రదర్శన మనస్తత్వాన్ని వదిలివేసి, విశ్వాసంతో, విశ్రాంతితో కూడిన కృప జీవితాన్ని స్వీకరిస్తాము. మన రక్షకుని బాహువులలో సురక్షితంగా ఉండి, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే క్రీస్తుని స్వయంగా సంపాదించడానికి ప్రయత్నించడాన్ని వదిలివేయడానికి మనం స్వేచ్ఛగా విడుదల చేయబడతాము.
- పంచ సూత్రాలు(Five Solas) మన రక్షణ సురక్షితమైనదని మనకు గుర్తుచేస్తాయి.
దేవుని ప్రేమను గురించి మనకు నిశ్చయత ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా అనుసరించగలుగుతాము. పంచ సూత్రాలు(Five Solas) దావీదు వలె “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:97) అని మనం కూడా చెప్పగలుగుతాము. యేసును అనుసరించడం, ఆత్మ సహాయంతో ఆయనకు విధేయత చూపడం మరియు పాపాన్ని చంపడం మన ఆనందంగా మారుతుంది. చాలా మంది క్రైస్తవులు తమకు తెలియకుండానే వారు చాలా సందర్భాలలో “నేను విధేయత చూపించినపుడు దేవుడు నన్ను ప్రేమిస్తాడు” అన్న నమ్మకంలోకి కొట్టుకుపోతారు.
కానీ పంచ సూత్రాల(Five Solas) యొక్క నిజమైన సువార్త, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం విధేయత చూపుతామనే ప్రాథమిక లేఖన సత్యం యొక్క దృఢమైన పునాదికి మనలను తిరిగి లాగుతుంది. ఈ వ్యత్యాసం సున్నితమైనది, కానీ అది మన దైనందిన జీవితాలలో చాలా మార్పును కలిగిస్తుంది. మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు! క్రీస్తునందు ఆయన మీతో సంతోషిస్తున్నాడు! ఆ సత్యాలు మన హృదయాలలో స్థిరపడినప్పుడు, యోహాను వ్రాసిన వాక్యం మన ఆనందకరమైన విశ్వాస ప్రమాణంగా మారతాయి: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3).
సంక్షిప్తంగా, పంచ సూత్రాల(Five Solas) ద్వారా సంగ్రహించబడిన నిజమైన సువార్తను రక్షించడం, ప్రచారం చేయడం మరియు తరతరాలకు అందించడం కంటే సంఘానికి అత్యవసరమైన పని మరొకటి ఏదీ లేదు. ఇది మన ఏకైక నిరీక్షణ, మన గొప్ప ఆదరణ మరియు మన అత్యున్నత ఆనందం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ బైబిల్ బోధనలు ఎల్లప్పుడూ ముఖ్యమైనవిగా ఉంటాయి, ఎందుకంటే అవి మన జీవమైన క్రీస్తు వద్దకు మనలను తీసుకువస్తాయి.
-
- ఐదు సోలాలు అంటే ఏమిటి? అనే సేకరణలోని ఒక భాగం ఈ వ్యాసం.