తడబడని నిబద్ధతలు

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎల్లప్పుడూ మారుతున్నప్పటికీ, చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రపంచ మేల్కొలుపును ముందుకు తీసుకువెళ్తూ మేము మార్గంలో ఉండుటకు ప్రయత్నిస్తాము. మాకు అప్పగించిన మిషన్‌ను మేము  నిర్వహించేటప్పుడు దృఢంగా ఉండుటకు దేవుని కృపపై ఆధారపడుతూ, లిగోనియర్ మినిస్ట్రీస్ ఈ పది నిబద్ధతలను ఆ దిశగా లాంఛనప్రాయంగా చేసింది.

1. చారిత్రక క్రైస్తవ్యానికి స్థిరమైన మరియు ధైర్యమైన నిబద్ధతను కొనసాగించండం

మారుతున్న కాలంలో మేము మారము. దానికి బదులుగా, బైబిల్ యొక్క అధికారం మరియు క్రీస్తు సిలువ యొక్క సమృద్ధి నుండి మేము శక్తిని  పొందుతాము. కుటుంబాలలో, సంఘాలలో, వృత్తులలో, సమాజంలో మరియు దేశాలలో సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసం యొక్క సిద్ధాంతపరమైన సంపద నుండి మేము పొందుతాము. లౌకికవాదం, తప్పుడు మతాలు మరియు మిలిటెంట్ నాస్తికత్వం నుండి వచ్చే సవాళ్లను తట్టుకోగలిగేలా క్రైస్తవులు నమ్మకంతో జీవించాలనేది మా లక్ష్యం. మేము అన్ని శ్రమలు గురించి, ముఖ్యంగా శాశ్వతమైన శ్రమల గురించి శ్రద్ధ వహిస్తాము మరియు గ్రేట్ కమీషన్ యొక్క శిష్యులను చేసే ప్రేరణ మా సమస్తమైన ఔట్రీచ్‌ చర్యలకు జీవం పోస్తుంది.

2. దృష్టి అంత వేదాంతశాస్త్రం, వేదాంతశాస్త్రం, వేదాంతశాస్త్రం

మనం ప్రజలకు ఇవ్వగల అత్యంత ప్రేమపూర్వకమైన విషయం సత్యం. సరైన ఆలోచనకు ముందు సరైన జీవం ఉంటుందని డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ చెప్పారు. దేవుని గురించి మనం ఏమనుకుంటామో అది మన ప్రధాన నమ్మకాలలో చొచ్చుకుపోతూ, మరియు మన విలువలు, నిర్ణయాలను మరియు లక్ష్యాలను నిర్ణయిస్తూ మనం ఎవరో రూపొందిస్తుంది. వేదాంత శాస్త్రం అంటే దేవుడు ఎవరో తెలుసుకోవడం, తద్వారా మనం ఆయనను ఆరాధించవచ్చు మరియు ఆనందించవచ్చు. మేము, దేవుని కృప ద్వారా, ప్రతి వంశములు, ప్రతి భాష మరియు ప్రతి దేశము యొక్క మేలు కొరకు నమ్మకమైన మరియు ఫలవంతమైన జీవనమును తెలియపరచే సత్యానికి మా తడబడని నిబద్ధతను కొనసాగిస్తాము.

3. ఆడియో మరియు వీడియోలో పెట్టుబడి

మేము ఎల్లప్పుడూ వీడియో ఆధారిత క్రైస్తవ విద్యలో మార్గదర్శకులము. ఈ రోజు, సమాజంలో లోపించిన విశ్వసనీయమైన బోధనను అందించడం కొనసాగించడానికి, మేము మా స్టూడియో సామర్థ్యాన్ని పెంచుతున్నాము, అదనపు నైపుణ్యం కలిగిన నిపుణులను స్వాగతిస్తున్నాము మరియు మా క్రైస్తవ విద్యా లైబ్రరీని మరింతగా పెంచుతున్నాము. అదే సమయంలో, ఆడియో కంటెంట్ పంపిణీ యొక్క ఇటీవలి పునరుద్ధరణను ఉపయోగించుకోవడానికి మేము కొత్త పాడ్‌క్యాస్ట్‌లు మరియు రేడియో ప్రసారాలలో గణనీయంగా పెట్టుబడి పెడుతున్నాము.

4. క్రైస్తవ జీవితంలోని ప్రతి దశ కోసం ప్రచురన

ప్రపంచవ్యాప్తంగా, బైబిల్ అక్షరాస్యత అధ్వాన్నంగా ఉంది. మా వర్గాన్ని నిర్వచించే శిష్య సాహిత్యం దేవుని వాక్య సత్యాన్ని ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేస్తుంది. మా అధ్యయన బైబిల్, నెలవారీ బైబిల్ అధ్యయన మ్యాగజిన్, విశ్వసనీయ రచయితల నుండి పుస్తకాలు, ఆన్‌లైన్ ఆర్టికల్ ఆర్కైవ్‌లు మరియు మరెన్నో ప్రజలు దేవుడు ఎవరో మరియు వారు ఎలా జీవించాలని కోరుకుంటున్నారనే వాస్తవాన్నికి  మేల్కొంటున్న సమయంలో వారు సేకరించే కొన్ని మొదటి వనరులలు ఇవి.

5. సంఘంలో క్రైస్తవులను సేకరించడం

ఇనుము ఇనుమును పదునుపెడుతుంది, కాబట్టి క్రైస్తవులు తమ పూర్ణహృదయంతో, పూర్ణఆత్మతో, పూర్ణమనస్సుతో మరియు పూర్ణశక్తితో దేవుణ్ణి ప్రేమించమని ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒర్లాండోలోని మా బైబిల్ కళాశాలలో వ్యక్తిగత సమావేశాలు, సన్నిహిత శిక్షణా కార్యక్రమాలు మరియు కఠినమైన విద్యా కార్యక్రమాల కోసం మేము విశ్వాసులను సేకరిస్తాము, ఎందుకంటే ఎవరూ ఒంటరిగా ఎదగడానికి ఉద్దేశించబడలేదు. మనము సంఘంలో ఎదుగుతున్న కొలద్దీ దేవుణ్ణి ఉత్తమంగా ప్రేమిస్తాం మరియు సేవిస్తాము.

6. ఉద్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయండం

పౌలు తన లేఖలను ప్రసారం చేయడానికి రోమీయుల రోడ్లను ఉపయోగించాడు, మార్టిన్ లూథర్ గూటెన్‌బర్గ్ యొక్క ముద్రణ విప్లవాన్ని ఉపయోగించాడు మరియు కొత్త సాంకేతికతను తెలివిగా ఉపయోగించడం ద్వారా దూరాలను అధిగమించవచ్చని మరియు భాషా అడ్డంకులను ఉల్లంఘించవచ్చని డాక్టర్ స్ప్రౌల్ గుర్తించారు. ప్రతి జేబులో మొబైల్ ఫోన్‌లతో, మా పరిచర్య పరిధిని కొలవడానికి ఇంటర్నెట్‌ను వినూత్నంగా ఉపయోగించడంపై మేము మా దృష్టిని కొనసాగిస్తాము.

7. స్థానిక అవసరాలకు అనుకూలించు మరియు పరిష్కరించు

ప్రపంచవ్యాప్తంగా దేవుని సత్యానికి కరువు ఉన్నందున, లిగోనియర్ పరిచర్య ఇంగ్లీష్లో-మాత్రమే కాదు. మేము కలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల ప్రత్యేక అవసరాలను నేర్చుకుంటాము మరియు క్రీస్తులో వున్న కుటుంబాలు, సంఘాలు మరియు పాఠశాలలు ఎదిగే సహాయం చేయడానికి శిష్యత్వ బోధనను పలు భాషలలోనికి మరియు దేశాలలోకి తరలిస్తాము.

8. విశ్వసనీయ ప్రపంచవ్యాప్తమైన భాగస్వాములను కనుగొను

ఏ పరిచర్య కూడా ఒంటరిగా పని చేయలేదు. విభిన్న వ్యక్తుల సమూహాలకు సేవలందించే వివిధ ప్రదేశాలలో ఒకే ఆలోచన గల సంఘ నాయకులు, మిషనరీలు మరియు సంస్థలను మేము పరిశోధిస్తాము. మేము ఎవరో మాకు తెలుసు, మరియు మా దూరదృష్టిగల దాతలకు ధన్యవాదాలు, ప్రజలు ఎక్కడున్నా వారికి నమ్మకమైన శిష్యత్వ వనరులను మేము ప్రత్యేకంగా పొందగలుగుతున్నాము.

9. సంఘకాపరులను మరియు నాయకులను సన్నద్ధం చేయండి

దేవుని వాక్య బోధకుల గొడ్డలికి పదును పెట్టడానికి మేము సహాయం చేస్తున్నాము. వారికి వ్యూహాత్మక ఉత్సాహము కోరకు అవకాశాలు అవసరం మరియు మేము దీనిని బోధనకు సంబంధించిన సెమినార్‌లు మరియు కాన్ఫరెన్స్‌లను ద్వారా అలాగే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రైస్తవ వృద్ధి అవకాశాల ద్వారా చేస్తాము.

10. తదుపరి తరాన్ని చేరుకోవడం

దేవుని పరిశుద్ధత మరియు ఆయన వాక్య సత్యం యొక్క సందేశంతో “సాధ్యమైనంత ఎక్కువ మందిని” చేరుకోవాలని మాలో ప్రతి ఒక్కరిని పిలిచినప్పుడు డాక్టర్ స్ప్రౌల్ పరిచర్యగా మా దృష్టిని స్థిరపరిచారు. తర్వాతి తరాన్ని చేరుకోవడం చాలా ముఖ్యం. మేము కళాశాల మరియు హైస్కూల్ విద్యార్థులతో నిమగ్నమై ఉన్నాము, వారు ఏమి విశ్వసిస్తారు, ఎందుకు నమ్ముతారు, ఎలా జీవించాలి మరియు ఎలా పంచుకోవాలో తెలుసుకోవడానికి వారికి శిక్షణ ఇస్తున్నాము. మేము దీనిని సంఘాలలో, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో, మా క్యాంపస్‌లో మరియు యాప్‌లు మరియు ఇంటర్నెట్ ద్వారా చేస్తాము. ఆలోచనల యొక్క గొప్ప సంభాషణ సత్యం మరియు తప్పుల మధ్య గొప్ప ఘర్షణగా మారింది, ప్రమాదంలో శాశ్వతమైన గమ్యాలు ఉన్నవి. విశ్వాసం ఉన్న క్రైస్తవులదే భవిష్యత్తు. మా యువకుల ఆత్మల కోసం జరిగే యుద్ధంలో సహాయం చేయడానికి మేము అక్కడ గురి కలిగి ఉన్నాము.

దేవుని పరిశుద్దతను సంపూర్ణంగా ప్రకటించడం, బోధించడం మరియు సమర్థించడం లిగోనియర్ హృదయ స్పందన. మన పరిశుద్ధ దేవుడు మరియు ఆయన పరిశుద్ద వాక్యం గురించిన సత్యానికి ప్రపంచవ్యాప్త మేల్కొలుపును ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఈ పరిచర్యకు ఎలా మద్దతు ఇవ్వాలని ప్రభువు నడిపిస్తున్నాడో  దానిని పరిగణంలోకి తీసుకునేందుకు మీకు ధన్యవాదాలు. ఈ రోజు మీరు ఇచ్చే కానుక పరిచర్యను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ధన్యవాదాలు.