మా మిషన్:
ప్రజలు దేవుని గురించి
మరియు ఆయన పరిశుద్ధత గురించి
వారి జ్ఞానాన్ని
పెంపొందించుకోవడానికి
సహాయపడటం
లిగోనియర్ మినిస్ట్రీస్ అనేది 1971 లో వేదాంతవేత్త డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ చేత స్థాపించబడిన ఒక అంతర్జాతీయ క్రైస్తవ శిష్యత్వ సంస్థ, క్రైస్తవులు వారు ఏమి నమ్ముతారో, ఎందుకు నమ్ముతారో, ఎలా జీవించాలో మరియు దానిని ఎలా పంచుకోవాలో తెలియజేయడానికి సన్నద్ధం చేస్తారు. దేవుని పరిశుద్ధతను ప్రకటి౦చడ౦ లిగోనియర్ స౦కల్పానికి కేంద్రబిందువు. దేవుని గురి౦చి, ఆయన పరిశుద్ధత గురి౦చి ప్రజలు తమ పరిజ్ఞానాన్ని పె౦పొ౦ది౦చుకోవడానికి సహాయ౦ చేయడమే మా లక్ష్య౦, అభిలాష, స౦కల్ప౦.
దేవుడు తన ప్రజలను వారి మనస్సులను పునరుద్ధరించడం ద్వారా పరివర్తన చెందమని పిలుస్తాడు. ఈ కారణంగానే సంస్కృతి, తత్వశాస్త్రం, అపోలిగేటిక్స్, నైతికత, సంఘచరిత్ర నేపథ్యంలో బైబిల్లో వెల్లడైన దేవుని మహిమలను ప్రకటించడానికి కోరుకుంటాము.
మా వెబ్ సైట్ లో, సాధ్యమైనంత ఎక్కువ మందికి దేవుని పరిశుద్ధతను దాని సంపూర్ణతలో ప్రకటించడం, బోధించడం మరియు సంరక్షించడం అనే మా లక్ష్యాన్ని నెరవేర్చడానికి తరగతులు, అధ్యయన గైడ్స్ మరియు మల్టీమీడియా కంటెంట్ వంటి అనేక రకాల వనరులను మీరు కనుగొంటారు.