
క్రీస్తుపై ప్రకటన ఇప్పుడు ఎ౦దుకు ప్రాముఖ్య౦?
17/04/2025
ఆపాదన సిద్ధాంతం
24/04/2025యేసు యొక్క మానవత్వం

-
- మనం కొత్త నిబంధన పేజీల నుండి బయటకు రాకముందే, దేవుని కుమారుడు శరీరధారియై వచ్చాడని తిరస్కరించే వారిని కలుస్తాము. అంటే మొదటి శతాబ్దపు సంఘాలలో, అపొస్తలుల సంఘాలలో, అబద్ధ బోధకులు ఉనికిని కలిగి ఉన్నారు. మరియు వారు వ్యాప్తి చేసిన అత్యంత సాధారణ తప్పుడు బోధలలో ఒకటి దేవుని కుమారుడు మానవ రూపాన్ని ధరించాడనే విషయాన్ని వారు తిరస్కరించడం. కానీ ఈ సమస్య ఎందుకు? క్రీస్తు మానవ రూపం ధరించడంలో అంత అభ్యంతరకరమైన విషయం ఏముంది?
ప్లేటో యొక్క ఆలోచనలు మొదటి శతాబ్దపు సంస్కృతిపై గణనీయమైన ప్రభావం చూపాయి. ముఖ్యంగా పదార్థం(శరీరం) గురించిన అతని దృక్పథం. ప్లేటో సిద్ధాంతం ప్రకారం, పదార్థం స్వభావంలో చెడ్డదని, అది శరీరంతో సంబంధం కలిగి ఉంటుందని భావించాడు. దీనికి విరుద్ధంగా, మంచితనం దేవునితో ముడిపడి ఉంటుందని, అది చెడుతో కలవదని అతను నమ్మాడు. ఈ ఆలోచనల ప్రభావంతో, కొందరు అబద్ధ బోధకులు క్రీస్తు నిజమైన మానవ శరీరంతో జన్మించలేదని, కేవలం మానవ రూపంలో “కనిపించాడు” మాత్రమేనని ప్రతిపాదించారు.
కొత్త నిబంధనలో కనుగొన్నవి ఈ ఆలోచనను నేరుగా ఖండిస్తుంది. యేసు అలసిపోయాడని, ఆకలితో, దాహంతో ఉన్నాడని మనం చూస్తాము. ఆయనకు స్థల పరిమితులు ఉన్నాయి. ఆయన బాధపడ్డాడు, శ్రమ కూడా అనుభవించాడు. ఆయన మానవ భావోద్వేగాలు, తెలివితేటలు మరియు సంకల్పాన్ని ప్రదర్శించాడు. ఆయన మరణించాడు. క్రీస్తు అప్పటికీ – ఇప్పటికీ నిజమైన మానవుడే. ఇది ఎందుకు ముఖ్యమైనది?
లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టాలజీ ఈ విధంగా ప్రకటిస్తోంది:
“ఆయన నిజమైన మానవుడిగా మారాడు…
…మరియు మన మధ్య నివసించాడు.”
అలాగే, ఆర్టికల్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ డినయల్లోని 7వ ఆర్టికల్‌లో ఇలా చెబుతున్నాం:
నిజమైన మానవుడిగా, క్రీస్తుకు మానవ స్వభావం యొక్క అన్ని సహజ పరిమితులు మరియు సాధారణ బలహీనతలు ఉన్నాయని మరియు పాపం తప్ప అన్ని విధాలుగా ఆయన మనలాంటివాడని మేము ధృవీకరిస్తున్నాము.
“సాధారణ బలహీనతలు” అనే పదబంధం వెస్ట్‌మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ (Westminster Confession of Faith) నుండి తీసుకోబడింది. ఇది కఠినమైన వాస్తవాలను ప్రస్తావించినప్పటికీ, ఇది ఒక చక్కని పదబంధం. సువార్తలలో మన సాధారణ బలహీనతల పట్ల క్రీస్తు చూపిన సహానుభూతికి ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక సన్నిహిత స్నేహితుడు లేదా నమ్మకస్థుడిచే మోసగించబడ్డారా? క్రీస్తు మోసగించబడ్డాడు. మీరు ఎప్పుడైనా ఒక సన్నిహిత స్నేహితుడిని కోల్పోయారా? క్రీస్తు కోల్పోయారు. మీరు ఎప్పుడైనా తీవ్రమైన, బాధాకరమైన నొప్పిని అనుభవించారా? క్రీస్తు అనుభవించాడు. మీరు ఎప్పుడైనా నిందించబడ్డారా, ఎగతాళి చేయబడ్డారా, తిరస్కరించబడ్డారా? క్రీస్తు అనుభవించాడు.
గెత్సేమనే తోటలో గడిపిన బాధాకరమైన రాత్రి (మత్తయి 26:36–46) కంటే క్రీస్తు అనుభవించిన సాధారణ లేదా అంతగా సాధారణం కాని బలహీనతలను మరే ఒక్క సంఘటన కూడా ఈ స్థాయిలో వివరించలేదు. “ఆయన నిజంగా మానవుడయ్యాడు” అనే మాటలను మనం ఒప్పుకున్నప్పుడు, క్రీస్తు నిజమైన మానవుడని – ఇంకా అదే విధంగా ఉన్నాడని – మనం అంగీకరిస్తున్నాం. అది మన హృదయాలకు ఓదార్పునిస్తుంది.
అయితే, మనం క్రీస్తు యొక్క అవమానకరమైన స్థితికి(state of humiliation) మరియు ఆయన ప్రస్తుత ఉన్నత స్థితికి (state of exaltation) మధ్య తేడాను స్పష్టంగా మనం గుర్తించాలి. క్రీస్తు అవతరణలో దైవ-మానవుడు అయ్యాడు. వేదాంతవేత్తలు భూమిపై ఆయన జీవితాన్ని, జననం నుండి మరణం మరియు సమాధి వరకు, “అవమానకరమైన స్థితి” (ఫిలి. 2:5–8) అని పిలుస్తారు. ఆ సమయంలో ఆయన దైవ-మానవుడిగా ఉన్నాడు. క్రీస్తు పునరుత్థానం నుండి ఆయన ఆరోహణం, ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో ఉండడం మరియు భవిష్యత్తులో తిరిగి వచ్చే సమయాన్ని అంతాకూడా వేదాంతవేత్తలు ఆయన “ఉన్నత స్థితి” అని పిలుస్తారు (ఫిలి. 2:9–11). ఈ సమయంలో కూడా, ఆయన దైవ-మానవునిగానే ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నందున, ఆయన నిజంగా మానవుడు మరియు నిజంగా దేవుడు. క్రీస్తు సాధారణ బలహీనతలను భరించడం గురించి మనం మాట్లాడేటప్పుడు, ఆయన అవమానకరమైన స్థితికి మరియు ఆయన ఉన్నత స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి – కానీ రెండింటిలోనూ ఆయన దైవ-మానవుడు మరియు రెండింటిలోనూ ఆయన నిజంగా మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన మధ్య నివసించినప్పుడు ఆయన మనకు దూరంగా లేడు, ఇప్పుడు కూడా ఆయన మనకు దూరంగా లేడు. ఇది మనకు, మన న్యాయవాది మరియు మధ్యవర్తి అయిన క్రీస్తును మనం ఎలా చూస్తామనే విషయానికి గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.
అవమానకరమైన స్థితి మరియు ఉన్నత స్థితి మధ్య ఈ వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఉద్దేశ్యం, ఆర్టికల్స్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ డినయల్లోని 7వ ఆర్టికల్‌లో ఉన్న “కలిగి ఉండు” అనే వర్తమాన కాల పదాన్ని గురించి వచ్చిన విమర్శలకు స్పష్టత ఇవ్వడం కోసమే. “ఈ ప్రారంభ బ్లాగ్ పోస్ట్‌కు వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, ‘సాధారణ బలహీనతలు’ మరియు క్రీస్తు స్థితుల విషయంలో ఇంకా ఎక్కువ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.” క్రీస్తు అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆయన “సాధారణ మానవ బలహీనతలు” కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఉన్నత స్థితిలోకి వెళ్లినప్పుడు, ఈ బలహీనతలను ఆయన అధిగమించి జయించాడు. 7వ ఆర్టికల్‌లో వర్తమాన కాలాన్ని ఉపయోగించడంలోని అసలు ఉద్దేశ్యం, క్రీస్తు నిజమైన దేవుడిగా మరియు నిజమైన మానవుడిగా ఉన్నాడని చూపించడమే. శాశ్వతమైన దేవుని కుమారుడు అవతారంలో మానవుడిగా మారినప్పుడు, ఆయన మానవ స్వభావాన్ని తనతో ఐక్యం చేసుకున్నాడు. అలా దేవుడి స్వభావం మరియు మానవ స్వభావం యేసుక్రీస్తు అనే ఒకే వ్యక్తిలో అప్పటి నుండి శాశ్వతంగా కలిసిపోయాయి.
ఈ విషయాల్లో మాకు మరింత స్పష్టత ఇవ్వడానికీ సహాయం చేసిన విమర్శకులకు మేము కృతజ్ఞులం. ఈ ప్రకటన ఆరోగ్యకరమైన మరియు బలమైన క్రీస్తుశాస్త్రంపై చర్చకు మార్గం కావాలని మా ఉద్దేశం. ఆ లక్ష్యం నెరవేరుతుండటం వల్ల మేము చాలా కృతజ్ఞులముగా ఉన్నాము.
ధృవీకరణ మరియు తిరస్కరణ కథనాల నుండి ప్రకటనకు వెళ్లడం ద్వారా, ప్రకటన యొక్క మూడవ పేరా లేదా చరణంలో, మేము క్రీస్తు అవతారం యొక్క చారిత్రక వాస్తవాలను పునరావృతం చేస్తాము. ఇక్కడ ఈ ప్రకటన పురాతన విశ్వాస ప్రమాణాలను సమీపంగా అనుసరిస్తుంది. అపొస్తలుల విశ్వాస ప్రమాణం ప్రకారం, క్రీస్తు “కన్య మరియ ద్వారా జన్మించాడు, పొంతి పిలాతు అధికారంలో శ్రమపడ్డాడు, సిలువవేయబడ్డాడు, మరణించాడు మరియు సమాధి చేయబడ్డాడు” అని ప్రకటిస్తుంది.
అయితే, మేము ఇందులో ఈ పదబంధాన్ని జోడించాము:”
ఆయన కన్య మరియకు జన్మించి,
మన మధ్య నివసించాడు .
“మరియు ఆయన మన మధ్య నివసించాడు” అనే పదబంధం వెంటనే “సేలా” అనే పదంతో కొనసాగాలి ఇది కీర్తనలలో కనిపించే ఒక అర్ధవంతమైన సంగీత సంకేతం. సెలా అనే పదం మనకు ఆగు, దృష్టిపెట్టు, ఆలోచించమని చెబుతుంది. కాబట్టి, మనం ఆగి, నిజంగా మానవుడైన క్రీస్తు మన మధ్య జీవించాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించాలి. హెబ్రీయుల రచయిత అలాగే చేశాడు. హెబ్రీయులు 2:14–18 మరియు 4:14–16 చూడండి. ఆ భాగాలను చదివి ఆలోచించండి.
మనము ఈ వచనాలను మరియు క్రీస్తు యొక్క నిజమైన మానవత్వం సిద్ధాంతాన్ని ఆలోచించినప్పుడు కనుగొనేది ఏమిటంటే, క్రైస్తవం అన్ని ఇతర మతాలు, తత్వశాస్త్రాలు, మరియు ప్రపంచ దృక్పథాలను మించిపోతుంది. ప్లేటో ఆసక్తికరమైనవాడు. అతని సంభాషణలు ప్రేరేపించేవి. అయితే, పదార్థం చెడ్డది మరియు భౌతిక ప్రపంచం తప్పించుకోవడానికి మాత్రమే ఉందనే భావనలపై నిర్మించబడిన మొత్తం తత్వశాస్త్రం ఒకరు జీవించడానికి సహాయపడదు. ఇది పనిలో లేదా పిల్లలను పెంచడంలో ఎవరికీ అర్థాన్ని కనుగొనడంలో సహాయపడదు. ప్లేటో యొక్క అంతిమ సమాధానాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో మన జీవితాలను బాగా గడపడానికి ఇది సహాయపడదు.
ఇస్లాంను పరిశోధించండి, మీరు చంచలమైన ఉనికిని, నిరంకుశ మరియు అస్థిరమైన దేవుణ్ని కనుగొంటారు. ఇస్లాం ప్రకారం, యేసు మీకు ఈ దేవుని గురించి చెబుతాడు, కానీ ఇస్లాం యొక్క యేసు మీ కోసం మధ్యవర్తిత్వం చేసే సానుభూతిపరమైన ప్రధాన యాజకుడు కాదు.
దీని గురించి పొరపాటు పడకండి: “నిజంగా దేవుడు, ఆయన నిజంగా మానవుడయ్యాడు” అనే వాక్యాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, యేసు దైవ-మానవుడు కాబట్టి, ఆయనే మన ఏకైక నిరీక్షణ అని చెబుతున్నాము. ఆయన “మన మధ్య నివసించాడు” అని మనం ఒప్పుకున్నప్పుడు, ఈ జీవితంలో మరియు రాబోయే జీవితంలో ఆయనే మన ఏకైక నిరీక్షణ మరియు ఆదరణ అని మనం ఒప్పుకుంటున్నాము.
కొంతమందికి ఓదార్పు మరియు ఆనందాన్ని కలిగించే విషయం మరికొందరికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నివారించాల్సిన చాలా భయానకమైన అంశం. నిజంగా దేవుడైన కుమారుడు నిజంగా మానవుడు అయ్యాడనే వాస్తవం కొంతమందికి పూర్తిగా భయానకంగా ఉంటుంది. సి.ఎస్. లూయిస్ తన పుస్తకం అద్భుతాలులో ఈ భయానకతను ఉత్తమంగా వివరించాడు:
మనుషులు ఒక నిర్దిష్టతలేని, ప్రతికూలతతో కూడిన దైవం భావన నుండి సజీవుడైన దేవుని వైపు మారడానికి ఇష్టపడరు. నాకు ఆశ్చర్యం లేదు… సర్వదేవతారాధకుల దేవుడు ఏమీ చేయడు, ఏమీ కోరడు. మీరు కోరుకుంటే అతను అక్కడ ఉంటాడు, అల్మారాలో ఒక పుస్తకం లాగా…. ఒక “వ్యక్తిత్వం లేని దేవుడు” – మంచిది. మన మనస్సులో సౌందర్యం, సత్యం, మరియు మంచితనం యొక్క ఆత్మాశ్రయ దేవుడు – ఇంకా మంచిదే. . . . కానీ స్వయంగా దేవుడు, సజీవుడు, త్రాడు యొక్క మరొక చివరన లాగుతూ, బహుశా అనంతమైన వేగంతో సమీపిస్తున్నాడు, వేటగాడు, రాజు, భర్త – అది పూర్తిగా వేరే విషయం.
దేవుడు త్రాడు యొక్క మరొక చివరను లాగుతున్నవాడు మాత్రమే కాదు; ఆయన అంతకంటే ఎక్కువ. ప్రకటనలోని రెండవ చరణము త్రిత్వాన్ని నిర్ధారిస్తుంది: దైవత్వము యొక్క సమాన సభ్యులు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు సారంలో లేదా స్వభావంలో ఒకటే. అంటే క్రీస్తు నిజంగా దేవుడని అర్థం. త్రియేక దేవుడు భౌతిక విషయాలను తిరస్కరించడని కూడా మనకు తెలుసు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఆయన ఆదామును “నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ” (ఆదికాండము 2:7). అది భయకంపితులను చేసే సన్నిహిత దేవుడు.
మరియు కాలం సంపూర్ణమైనప్పుడు, దేవుడు తన కుమారుణ్ని పంపించాడు, కన్య మరియకు జన్మించాడు. ఆ శిశువు సాధారణ పశువుల తొట్టిలో పడుకొని ఉన్నప్పటికీ, ఆయన నిజంగా దేవుడు మరియు నిజంగా మానవుడు. ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన సన్నిహితత్వం.
“నిజంగా దేవుడు, ఆయన నిజంగా మానవుడయ్యాడు.” ఇవి చిన్న మరియు సరళమైన మాటలు. అవి అద్భుతమైన మాటలు కూడా. గంభీరమైన మాటలు. ఆదరణ కలిగించే మాటలు. సెలా.
ఈ వ్యాసం ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీ సేకరణలో భాగం.
ఇంతకు ముందు ది వర్డ్ మేడ్ ఫ్లెష్: ది లిగోనియర్ స్టేట్మెంట్ ఆన్ క్రిస్టోలజీ లో లిగోనియర్ మినిస్ట్రీస్ చేత ప్రచురించబడింది.
- మనం కొత్త నిబంధన పేజీల నుండి బయటకు రాకముందే, దేవుని కుమారుడు శరీరధారియై వచ్చాడని తిరస్కరించే వారిని కలుస్తాము. అంటే మొదటి శతాబ్దపు సంఘాలలో, అపొస్తలుల సంఘాలలో, అబద్ధ బోధకులు ఉనికిని కలిగి ఉన్నారు. మరియు వారు వ్యాప్తి చేసిన అత్యంత సాధారణ తప్పుడు బోధలలో ఒకటి దేవుని కుమారుడు మానవ రూపాన్ని ధరించాడనే విషయాన్ని వారు తిరస్కరించడం. కానీ ఈ సమస్య ఎందుకు? క్రీస్తు మానవ రూపం ధరించడంలో అంత అభ్యంతరకరమైన విషయం ఏముంది?