అపొస్తలుల విశ్వాస ప్రకటన
ఆకాశమును భూమిని సృష్టించిన, సర్వశక్తిగల తండ్రిఆయిన దేవునిలో
మరియు తన అద్వితీయ కుమారుడు, మన ప్రభువైన, యేసు క్రీస్తులో
నేను విశ్వసించుచున్నాను
ఆయన (యేసు క్రీస్తు) పరిశుద్దాత్మ ద్వారా జన్మించి, కన్య మరియకు పుట్టెను,
పొ౦తి పిలాతు కింద శ్రమపడేను; సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడెను. మూడవ రోజు మృతులలోనుండి లేచెను
పరలోకానికి ఆరోహణుడై, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను
అక్కడనుండి సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు ఆయన వచ్చును
పరిశుద్దాత్మలో నేను విశ్వసించుచుచున్నాను
పరిశుద్ధుల సమాజమైన, పరిశుద్ధమైన సార్వత్రిక సంఘములో నేను విశ్వసించుచున్నాను
పాపక్షమాపణలో, శరీరం యొక్క పునరుత్థానంలో, నిత్యజీవితంలో నేను విశ్వసించుచున్నాను.
ఆమెన్.