ప్రొ-ఛాయిస్: దీని అర్థం ఏమిటి?
10/12/2024
సంస్కరించబడినవారిగా ఉండటానికి ధైర్యము
18/12/2024
ప్రొ-ఛాయిస్: దీని అర్థం ఏమిటి?
10/12/2024
సంస్కరించబడినవారిగా ఉండటానికి ధైర్యము
18/12/2024

దేవుడు సార్వభౌముడు కాబట్టి, మానవులు ఎలా స్వేచ్ఛ కలిగి ఉంటారు?

xr:d:DAFXk0WDSFg:25,j:45162075609,t:23011320

దేవుడు అత్యంత స్వేచ్చాపరుడు; అంటే, ఆయన స్వేచ్ఛ అపరిమితమైనది. ఆయన సార్వభౌముడు. ఆయన సార్వభౌమాధికారానికి తరచుగా వచ్చే అభ్యంతరమేమిటంటే, దేవుడు నిజంగా సార్వభౌముడు అయితే, అప్పుడు మానవుడు స్వేచ్ఛగా ఉండలేడు. మన మానవ స్థితిని రెండు విభిన్న మార్గాల్లో వర్ణించడానికి స్వేచ్ఛ అనే పదాన్ని లేఖనం ఉపయోగిస్తుంది: బలవంతం నుండి స్వేచ్ఛ, దీని ద్వారా మానవుడు బలవంతం లేకుండా ఎంపికలు చేసుకునే స్వేచ్చాపరుడు, మరియు మన శరీరం యొక్క చెడు ప్రేరణలకు మమ్మల్ని బానిసలుగా చేసిన పతనంలో మనము కోల్పోయిన నైతిక స్వేచ్ఛ. మానవుడు బలవంతం చేయకుండానే కాకుండా చెడు వైపు సహజంగా మొగ్గు చూపకుండా కూడా ఎంపికలు చేయగలడని మానవతావాదులు నమ్ముతారు. మానవ స్వేచ్ఛకు సంబంధించిన ఈ మానవతావాద లేదా అన్యమత దృక్పథానికి వ్యతిరేకంగా క్రైస్తవులమైన మనము జాగ్రత్తగా ఉండాలి.

దేవుడు మనలను సంకల్పాలతో, ఎంచుకునే సామర్థ్యంతో సృష్టిస్తాడని క్రైస్తవ దృక్పథం. మనం స్వేచ్చాయుత జీవులం. కానీ సృష్టిలో ఇచ్చిన స్వేచ్ఛ పరిమితం. అంతిమంగా మన స్వేచ్ఛను పరిమితం చేసేది దేవుని స్వేచ్ఛ. ఇక్కడే మనము దైవ సార్వభౌమాధికారానికి, మానవ స్వేచ్ఛకు మధ్య సంఘర్షణకు గురవుతాం. కొ౦దరు దేవుని సార్వభౌమాధికారము మానవ స్వేచ్ఛచే పరిమితము చేయబడుతుందని చెబుతారు. అదే నిజమైతే మనిషి సార్వభౌముడు, దేవుడు కాదు. రిఫార్ముడ్ విశ్వాసం మానవ స్వేచ్ఛ నిజమైనది కాని దేవుని సార్వభౌమాధికారం ద్వారా పరిమితం అని బోధిస్తుంది. దేవుని సార్వభౌమ నిర్ణయాలను మన స్వేచ్చతో తోసిపుచ్చలేము, ఎందుకంటే దేవుని స్వేచ్ఛ మన స్వేచ్ఛకన్నా గొప్పది.

మానవ కుటుంబ సంబంధాలు ఒక సారూప్యతను అందిస్తాయి. తల్లిదండ్రులు పిల్లలపై అధికారాన్ని చెలాయిస్తారు. పిల్లలకి స్వేచ్ఛ ఉంది, కానీ తల్లిదండ్రులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది. తల్లిదండ్రుల స్వేచ్ఛ పిల్లల స్వేచ్ఛను పరిమితం చేసే విధంగా పిల్లల స్వేచ్ఛ తల్లిదండ్రుల స్వేచ్ఛను పరిమితం చేయదు. దేవుని లక్షణాల విషయానికి వస్తే, దేవుడు అత్యంత స్వేచ్చాపరుడని మనం అర్థము చేసుకోవాలి.

సార్వభౌమాధికారం అంటే స్వేచ్ఛకు భిన్నమైనది అని మనం అనుకునప్పటికీ, దేవుడు సార్వభౌమాధికారి అని మనం చెప్పినప్పుడు, మనం అతని స్వేచ్ఛ గురించి ఏదో చెబుతున్నాము. దేవుడు సంకల్ప జీవి; ఆయనకు సంకల్పం ఉంటుంది, నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరియు తన చిత్తాన్ని అమలు చేస్తున్నప్పుడు, ఆయన దానిని సార్వభౌమంలా ఒక అంతిమ అధికారిగా చేస్తాడు.  ఆయన స్వేచ్ఛ అత్యంత స్వేచ్ఛగా ఉంటుంది. ఆయనకు మాత్రమే సర్వోన్నత స్వయంప్రతిపత్తి ఉంది. ఆయన తనకు తానుగా ఒక చట్టం.

మానవులు స్వయంప్రతిపత్తిని, అపరిమిత స్వేచ్ఛను కోరుకుంటారు, ఎవరికీ జవాబుదారీగా ఉండకూడదని కోరుకుంటారు. అసలు చెప్పాలంటే పతనంలో అదే జరిగింది. స్వయంప్రతిపత్తిని సాధించడానికి, దేవుని వలె మారడానికి, వారు కోరుకున్నదాన్ని నిర్భయంగా చేయమని సాతాను ఆదాము హవ్వలను ప్రలోభపెట్టాడు. మానవులను దోషం నుండి, దేవునికి జవాబుదారీతనం నుండి విడుదల చేయడానికి సాతాను ఆ తోటలో ఒక విముక్తి ఉద్యమమును పరిచయం చేస్తున్నాడు. కానీ దేవునికి మాత్రమే స్వయంప్రతిపత్తి ఉంది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.